పిజ్జా డెలివరీకి వెళ్లి.. దారుణం
న్యూఢిల్లీ: ఓ ప్రముఖ కంపెనీకి చెందిన పిజ్జా డెలివరీ మెన్ దారుణానికి పాల్పడ్డాడు. ఆర్డర్ ఇచ్చిన ఇంటికి పిజ్జా ఇచ్చేందుకు వెళ్లి ఐదేళ్ల పాపపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పాప కేకలు వేయడంతో పారిపోయాడు. పోలీసుల సమాచారం ప్రకారం అమిత్ అనే పిజ్జాను డెలివరీ చేసే వ్యక్తి ఆదివారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో దక్షిణ ఢిల్లీలోని ఓ ఇంటికి పిజ్జా ఇచ్చేందుకు వెళ్లాడు.
మూడో అంతస్తులో పిజ్జా ఇచ్చి వస్తుండగా అతడికి గ్రౌండ్ ఫ్లోర్లో ఓ ఐదేళ్ల పాప కనిపించింది. వెంటనే అతడు బాల్కనీలో లైట్లు ఆపేసి పాపపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పాప కేకలు వేయడంతో అక్కడ ఉన్న వాచ్మెన్ అలారం మోగించగా అతడు పారిపోయాడు. అనంతరం పాప తన తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని వివరించింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు సదరు కంపెనీకి కూడా సమాచారం అందించారు.