south Delhi
-
విధ్వంసం.. టీ20ల్లో 308 పరుగులు! సన్‌రైజర్స్ రికార్డు బద్దలు
ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో సిక్సర్ల మోత మోత మోగింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నార్త్ ఢిల్లీ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ బ్యాటర్లు ఆయుష్ బదోని, ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి విధ్వంసానికి అరుణ్ జైట్లీ స్టేడియం దద్దరిల్లిపోయింది.ఈ ఇద్దరూ యువ ఆటగాళ్లు మెరుపు సెంచరీలతో చెలరేగారు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశారు. ఆయుష్ బదోని 55 బంతుల్లో 8 ఫోర్లు, 19 సిక్స్‌లతో 165 పరుగులు చేయగా.. ప్రియాన్ష్ ఆర్య 50 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌ల సాయంతో 120 పరుగులు చేశాడు. ఇక వీరిద్దరి సంచలన ఇన్నింగ్స్‌ల ఫలితంగా సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీస్కోరు చేసింది.అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసిన సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ జట్టు ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది. టీ20 క్రికెట్లో అత్యధిక స్కోర్ సాధించిన రెండో జట్టుగా సౌత్ ఢిల్లీ రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉండేది. ఐపీఎల్-2024లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీపై 283 పరుగుల భారీ స్కోర్ చేసింది. తాజా మ్యాచ్‌లో 308 పరుగులు చేసిన సౌత్ ఢిల్లీ.. సన్‌రైజర్స్ రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఈ జాబితాలో నేపాల్ అగ్రస్ధానంలో ఉంది. 2023లో మంగోలియాపై నేపాల్ 3 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. 6️⃣ 𝐒𝐈𝐗𝐄𝐒 𝐢𝐧 𝐚𝐧 𝐨𝐯𝐞𝐫 🤩There’s nothing Priyansh Arya can’t do 🔥#AdaniDPLT20 #AdaniDelhiPremierLeagueT20 #DilliKiDahaad | @JioCinema @Sports18 pic.twitter.com/lr7YloC58D— Delhi Premier League T20 (@DelhiPLT20) August 31, 2024 -
యమునా ఉగ్ర రూపం.. వరద గుప్పిట్లో సీఎం కేజ్రీవాల్ నివాసం
ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు లేకపోయినా యమునా నది ఉప్పొగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే హర్యానాలోని హత్నికుండా బ్యారేజీ నుంచి నీటిని విడుదల కొనసాగుతుండటంతో యమున నది గరిష్ట నీటి మట్టంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. 45 ఏళ్ల రికార్డును తుడిచిపెడుతూ 208.66 మీటర్ల గరిష్ట నీటి మట్టంతో ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎగువన ప్రవహిస్తోంది. అయితే గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చదవండి: Video: ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన వరద బాధితురాలు Rivers keeps reminding us that how powerful they are as Yamuna Ji flowing at its Record Levels#Delhi - #Noida pic.twitter.com/lzxw0JJBY9 — Weatherman Shubham (@shubhamtorres09) July 13, 2023 వరద గుప్పిట్లో కేజ్రీవాల్ నివాసం యమునా నది మహోగ్ర రూపంతో సెంట్రల్ ఢిల్లీ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. సీఎం కేజ్రీవాల్ నివాసం, ఢిల్లీ అసెంబ్లీని వరద నీరు చుట్టుముట్టింది. సివిల్ లైన్స్ ప్రాంతంలోని రింగ్ రోడ్ వరదలు చేరాయి. దీంతో మజ్ను కా తిలాను కశ్మీరీ గేట్ ఐఎస్బీటీతో కలిపే మార్గంపై రాకపోకలు నిలిపివేశారు అధికారులు. #WATCH | Civil Lines area of Delhi flooded, latest visuals from the area. Several areas of the city are reeling under flood and water-logging as the water level of river Yamuna continues to rise following heavy rainfall and the release of water from Hathnikund Barrage. pic.twitter.com/UecZsfIBwb — ANI (@ANI) July 13, 2023 ఇళ్లు జలమయం, పాఠశాలలకు సెలవులు యమునా నది ప్రళయంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో స్థానిక ప్రజలను ఖాళీ చేశారు. వారిని సహాయక శిబిరాలకు తరలించారు. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. వరదల ప్రభావంతో మరో రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నది ఒడ్డున ఉన్న ప్రాంతాలు యమునా బజార్, ప్రసిద్ధ టిబెటన్ మొనాస్టరీ మార్కెట్, నిగంబోధ్ ఘాట్‌లో దహన సంస్కారాలను నిలిపివేశారు. చదవండి: Delhi Floods: దేశ రాజధానికి ఈ దుస్థితి దేనికి? Flood has caused massive devastation in northern India, now has reached Delhi - Modi left for Paris! pic.twitter.com/I8eTMulhmo — Ashok Swain (@ashoswai) July 13, 2023 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల మూసివేత 'యమునా నది నీటిమట్టం పెరగడంతో వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లాలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. దీని వల్ల ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తుతుంది. నది నీటిమట్టం తగ్గిన వెంంటనే ఈ ప్లాంట్లను మళ్లీ రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. అదే విధంగా ఈ క్రమంలో హత్నికుండా బ్యారేజ్ నుంచి నీటి విడుదల నిలిపివేయాలని కేంద్రాన్ని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. అయితే పూర్తిస్థాయి నీటి మట్టం దాటేయడంతో, అదనపు నీటిని విడుదల చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. #WATCH | Delhi CM Arvind Kejriwal says, "We are at the Wazirabad Water Treatment Plant. For the first time in Delhi, Yamuna has touched this level. Three Water Treatment Plants have been shut down due to this as the water has entered pumps & machines...25% of the water supply in… pic.twitter.com/SAAhguqo45 — ANI (@ANI) July 13, 2023 -
ఐశ్వర్యం వస్తుందని.. బాలుడి నరబలి
న్యూఢిల్లీ: మూఢనమ్మకం అభంశుభం తెలియని ఓ ఆరేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. సంపద వస్తుందనే అంధ విశ్వాసంతో మానవత్వం మరిచి పసివాడిని నరబలి ఇచ్చారు. దేశ రాజధానిలో∙ఈ ఘోరం చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన అజయ్ కుమార్, అమర్ కుమార్ దక్షిణ ఢిల్లీ లోధి కాలనీలోని మురికివాడలో ఉంటున్నారు. అక్కడే యూపీకి చెందిన బాధిత బాలుడి కుటుంబం ఉంటోంది. వీరంతా భవన నిర్మాణ కార్మికులు. అజయ్, అమర్ శనివారం రాత్రి తమ గుడిసెలో పాటలు పాడుతూ పూజలు మొదలుపెట్టారు. అది చూసేందుకు బాలుడు వెళ్లాడు. పూజలు ముగిశాక అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ, తన కుమారుడు ఎంతకీ రాకపోయేసరికి వెతుక్కుంటూ తండ్రి వెళ్లాడు. ఆ గుడిసెలో నుంచి రక్తం చారికలుగా ప్రవహిస్తూ కనిపించింది. లోపల మంచం కింద తన కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో హతాశుడయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు వస్తుందనే మూఢ నమ్మకంతోనే తమ వద్దకు వచ్చిన బాలుడి తలపై మోది, చాకుతో గొంతుకోసి చంపినట్లు అజయ్, అమర్ పోలీసుల విచారణలో వెల్లడించారు. -
Harsh Mander: హర్ష్ మాండర్, ఈడీ సోదాలు ఎందుకంటే..
మాజీ ఐఏఎస్ అధికారి, సామాజిక కార్యకర్త హర్ష్ మాండర్(66) ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ తనీఖీలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇదంతా కేంద్రం కుట్రగా ఆరోపిస్తూ.. సుమారు 600 మంది ఉద్యమకారులు, మేధావులు.. ఈ దాడుల్ని ఖండిస్తూ సంతకాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు సయ్యద్ హమీద్, ఆర్థికవేత్త జీన్ డ్రెజె, మేధా పాట్కర్ తదితరులు సంతకాలు చేసిన వాళ్లలో ఉన్నారు. సోషల్ యాక్టివిస్ట్ హర్ష్ మాండర్‌కు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ గురువారం హడావిడిగా తనిఖీలు నిర్వహించింది. మాండర్ డైరెక్టర్‌గా ఉన్న సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్(CES) మీద ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేపటినట్లు సమాచారం. బెర్లిన్ రాబర్ట్ బోస్చ్ అకాడమీలో జరిగే ఓ కార్యక్రమం కోసం మాండర్ గురువారం జర్మనీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని గంటలకే ఈడీలు సోదాలు నిర్వహించడం విశేషం. మాండర్‌కు సంబంధించిన ప్రాంతాల్లో ఈడీ ఏజెన్సీ సోదాలు నిర్వహించగా, దర్యాప్తునకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఈడీ అధికారులు ఇష్టపడలేదు. దక్షిణ ఢిల్లీలోని అడ్చిని, మెహ్రౌలీ, వసంత్ కుంజ్ ప్రాంతాల్లోని మాండర్ ఆఫీసుల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. అయితే తనిఖీలకు పూర్తిగా సహకరించినట్లు సీఈఎస్ ప్రకటించుకుంది. ఉదయం ఉద్యోగుల్ని బయటే ఆపేసి ఈడీ తనిఖీలు కొనసాగించింది. ఇదిలా ఉంటే కిందటి ఏడాది అక్టోబర్‌లో జాతీయ బాలల పరిరక్షణ కమిషన్.. సీఈఎస్ నిర్వహించే రెండు బాలల గృహాలను సందర్శించింది. సక్రమంగా నడిపించకపోవడంతో పాటు ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు ఉన్నట్లు గుర్తించింది. ఆ వెంటనే ఢిల్లీ పోలీసులు సీఈఎస్ మీద జువైనల్ జస్టిస్ యాక్ట్ మీద ఓ కేసు, లావాదేవీల అవకతవకలకు సంబంధించి మరో కేసు నమోదు చేశారు. హాట్ న్యూస్: సోనూసూద్‌పై ఐటీ దాడులు -
ఢిల్లీకి మరో ముప్పు.. అటు కరోనా.. ఇటు
సాక్షి, న్యూఢిల్లీ: ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. మరోవైపు దోమకాటు కారణంగా వచ్చే డెంగ్యూ వైరల్ జ్వరాల కేసులు ఢిల్లీలో పెరగడం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మూడేళ్ల రికార్డును డెంగ్యూ బద్దలు కొట్టింది. జనవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ మధ్య నమోదైన డెంగ్యూ కేసులు 2018 నుండి వస్తున్న కేసులను అధిగమించాయి. అధికారిక గణాంకాల ప్రకారం గత వారంలో, కొత్తగా నలుగురు డెంగ్యూ రోగులతో మొత్తం రోగుల సంఖ్య ఈ ఏడాది 13కి చేరుకుంది. అయితే జనవరి 1 నుంచి ఏప్రిల్ 17 మధ్య సమయంలో 2017 సంవత్సరంలో 18 మంది, 2018 సంవత్సరంలో 12 మంది, 2019 లో 8 మంది, 2020 లో 7గురు డెంగ్యూ రోగులను గుర్తించారు. అధికార గణాంకాల ప్రకారం మొత్తం 13 మంది డెంగ్యూ రోగుల్లో నలుగురు సౌత్ ఢిల్లీ కార్పోరేషన్ పరిధికి చెందిన వారుగా గుర్తించారు. అదే సమయంలో, ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన 22మంది రోగులు డెంగ్యూ చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. అయితే డెంగ్యూ అనేది నిర్దిష్ట చికిత్స లేదా వ్యాక్సిన్ లేని వైరల్ వ్యాధి కాబట్టి ప్రతీ ఒక్కరు దోమలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధిని కలిగి ఉన్న దోమలు ముఖ్యంగా పట్టణ వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయని, వాటి పరిధి సమశీతోష్ణ ప్రాంతాల వైపు ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు సైతం తెలిపారు. 1996 నుంచి ప్రతీ సంవత్సరం జూలై, నవంబర్ మధ్య ఢిల్లీ డెంగ్యూ మహమ్మారి బారిన పడుతోంది. ఈ అంటువ్యాధులను బాగా ఎదుర్కోవటానికి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోవడానికి భౌగోళిక శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, కీటక శాస్త్రవేత్తలు, ఎపిడెమియాలజిస్టుల బృందం గతంలో ఒక అధ్యయనం చేసింది. ఢిల్లీలో దోమ–లార్వా పెంపకాన్ని నివారించడానికి సుమారు 15వేలకు పైగా ఇళ్లను పురుగుమందులతో పిచికారీ చేశారు. బహిరంగ ఉష్ణోగ్రత తగ్గడంతో, దోమలు సాయంత్రం వేళల్లో ఇళ్ళలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి సూర్యాస్తమయం అనంతరం తలుపులు / కిటికీలు మూసివేసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చదవండి: కరోనా టీకా సంస్థలకు బూస్ట్ లాక్డౌన్ భయం.. విచ్చలవిడిగా షాపింగ్ -
భర్తను హతమార్చిన భార్య.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: తాగుడుకు అలవాటు పడితే ఆ మైకంలో ఏం చేస్తారో వారికే తెలియదు. తాగుడుకు బానిసై తమను అశ్రద్ధ చేస్తున్నాడని భార్య కట్టుకున్న భర్తనే చంపగా, తాగటానికి డబ్బులివ్వలేదని ఓ వ్యక్తి కన్నతల్లినే కడతేర్చాడు. ఈ రెండు వేర్వేరు ఘటనలు దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఫతేపూర్‌కు చెందిన సరితాదేవి, సికిందర్ సహని భార్యాభర్తలు. సికిందర్‌కు పూటుగా మద్యం తాగే అలవాటు ఉంది. ప్రతి రోజు తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. పిల్లలముందే నోటికొచ్చినట్లు తిట్టేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అతడు మరోసారి తాగి ఇంటికి వచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. భర్త తీరుతో విసిగిపోయిన సరిత, చీర తీసుకుని మత్తులో ఉన్న భర్త మెడకు బిగించింది. దీంతో అతడు ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. ఆమె వెంటనే తన భర్తను సఫ్దార్జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే మెడపై కొన్ని గుర్తులు ఉండటంతో హత్య అని భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డీసీపీ అతుల్ ఠాకుర్ ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని ప్రశ్నించారు. ఆమె పొంతన లేని మాటలు మాట్లాడటంతో ఇది హత్యేనన్న అనుమానం మరింత బలపడింది. దీంతో మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులతో పరీక్షలు చేయించారు. ఆ తర్వాత సరితను తమదైన శైలిలో విచారించగా, భర్త తాగుడుకు బానిసవ్వడం, ఏ పని చేయకపోవడం వల్లే హత్య చేసినట్లు అంగీకరించింది. తాగడానికి డబ్బులివ్వలేదని.. ఢిల్లీలోని నార్త్ ఈస్ట్‌లో 64 ఏళ్ళ వృద్దురాలిని ఆమె కొడుకు హత్యచేశాడు. తాగడానికి డబ్బులివ్వాలని సుశీల్ పాండే తన తల్లి లల్లిదేవిని బలవంతపెట్టాడు. ఆమె డబ్బులివ్వడానికి నిరాకరించడంతో విచక్షణ కోల్పోయిన అతడు స్ర్కూడ్రైవర్ తీసుకొని తల్లిని క్రూరంగా హత్యచేశాడు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు సుశీల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. చదవండి: దాబాకు వెళ్లి.. వెంటనే వచ్చేస్తామని చెప్పి -
సాయం చేసిన అతనిపైనే ఫిర్యాదు!
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్లో ఉంటున్న ఒక వృద్ధ జంట కరోనా టైంలో తమ ధాబా బిజినెస్ సరిగా జరగడం లేదంటూ కంటతడి పెట్టుకున్న వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు సైతం‘బాబా కా ధాబా కు వెళ్లి తినండి అంటూ ట్వీట్లు చేశారు. దీంతో ఆ ధాబా పేరు దేశమంతా మారుమ్రోగి పోయింది. చాలా మంది అక్కడి వెళ్లి రోటి, కూర్మ కూర రుచి చూసి వచ్చారు. దీంతో పాటు ఆ ధాబా నడుపుతున్న వృద్ధ జంట కాంతా ప్రసాద్, అతని భార్య బాదామి దేవి ఆవేదన చూసి చలించిపోయిన చాలా మంది నెటిజన్లు వారికి ఆర్ధిక సాయం కూడా చేశారు. ఈ వీడియోను ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతనే వీరి కోసం విరాళాలు సేకరించాడు. అయితే సాయం చేసిన అతనిపైనే ఇప్పుడు కాంతా ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు సాయం చేయడం కోసం చాలా మంది పంపిన డబ్బును వాసన్ తప్పుదోవ పట్టించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు కేవలం రూ. 2.3 లక్షలు మాత్రమే ఇచ్చాడని మిగిలిన డబ్బును అతనే తీసుకున్నాడని ఆరోపించాడు. వాసన్ విరాళాలు సేకరించడానికి తన బ్యాంక్ ఖాతాలతో పాటు వారి కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు కూడా ఇచ్చాడని కాంతా ప్రసాద్ తెలిపారు. వచ్చిన విరాళాలు మొత్తాన్ని తమకు అందించకుండానే.. ‘ఇచ్చాను అంటూ’ అబద్ధాలు చెబుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాసన్ మాత్రం తనకు వచ్చిన ఫండ్స్ అన్నింటిని కాంతా ప్రసాద్‌కు ఇచ్చానని బ్యాంక్ స్టేట్మెంట్లు చూపిస్తూ మరో వీడియో విడుదల చేశాడు. చదవండి: కొన్ని లైకులు... కాస్త వెలుతురు -
ఘర్షణ: యువకుడి దారుణ హత్య
న్యూఢిల్లీ: మనుషుల్లో నేర ప్రవృత్తి రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోయి హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ఏరియాలో వాగ్వాదంతో మొదలైన ఘర్షణ ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్(21) అనే వ్యక్తి బుధవారం రాత్రి పాల ప్యాకెట్ కొనేందుకు బయటకు వచ్చాడు. ఈ క్రమంలో విక్కీ, అతడి స్నేహితులు పీయూష్, వివేక్ సతీష్‌ను అటకాయించగా, ఇంకెప్పుడూ తమ ఏరియాలో కనిపించవద్దని అతడు హెచ్చరించాడు. (చదవండి: వివాహేతర సంబంధం.. ట్రాక్టర్‌తో తొక్కించి ) దీంతో కోపోద్రిక్తులైన స్నేహబృందం సతీష్‌పై దాడి చేసింది. కాలర్ పట్టుకుని అతడిపై పిడిగుద్దులు కురిపించారు. ఆ తర్వాత కత్తితో పొడిచి పరారయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన సతీష్ ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్లో ఒకడైన విక్కీని అరెస్టు చేశామని, మిగిలిన వాళ్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఘటనపై లోతుగా విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.(చదవండి: షాకింగ్: రోడ్డుపై దారుణ హత్య.. ఆపై) -
అశ్లీల ఫొటోలు షేర్ చేసి.. ఆపై..
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజల్లో అధిక శాతం మంది సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే దాకా జరిగిన ప్రతీ విషయాన్ని పంచుకుంటూ ఆత్మీయులకు దగ్గరగా ఉంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇందుకు భిన్నంగా అసాంఘిక చర్చలు, అశ్లీల ఫొటోల షేర్లతో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారు. దక్షిణ ఢిల్లీకి చెందిన కొంతమంది బాలురు ఇదే బాటలో నడిచారు.‘‘ బాయ్స్ లాకర్ రూం’’ పేరిట గ్రూప్ క్రియేట్ చేసి.. అమ్మాయిలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడాలంటూ ఇతరులను రెచ్చగొడుతూ కామెంట్లు చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేసి షేర్ చేశారు. వీరి బాగోతాన్ని ఓ బాలిక ట్విటర్ వేదికగా బహితర్గంతం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.(ఐసీయూలోని కరోనా పేషెంట్‌తో డాక్టర్ అసభ్య ప్రవర్తన) ఓ జాతీయ మీడియా వివరాల ప్రకారం... 17-18 ఏళ్ల వయస్సున్న అబ్బాయిలు కొంతమంది బృందంగా ఏర్పడ్డారు. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇన్స్టాగ్రామ్, స్పాన్‌చాట్‌లలో షేర్ చేస్తున్నారు. తన స్కూలుకు చెందిన అబ్బాయి ఒకరు ఈ బృందంలో సభ్యుడిగా ఉన్న విషయం తెలుసుకున్న ఓ బాలిక.. ఆ గ్రూపు వివరాలను తెలుపుతూ ట్విటర్లో ఓ పోస్టు పెట్టింది. వారి సంభాషణకు సంబంధించిన స్క్రీన్షాట్లు షేర్ చేసింది. ఇటువంటి వాళ్లు ఉంటారు కాబట్టే తనను సోషల్ మీడియా వాడొద్దని అమ్మ చెప్పిందని.. తన ఇన్‌స్టా అకౌంట్ తొలగించాలంటూ ఒత్తిడి చేస్తోందని రాసుకొచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ కావడంతో సదరు గ్రూపును గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటే ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుందని.. ఇప్పటికే చాలా మందిని ఈ వేదిక స్టార్లను చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.(చావులో ఒక్కటయ్యారు..) -
హమ్మయ్య.. వారికి కరోనా నెగెటివ్
సాక్షి న్యూఢిల్లీ: పిజ్జా డెలివరీ బాయ్(19)కు కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగిన దక్షిణ ఢిల్లీకి ఊరట లభించింది. పిజ్జా డెలివరీ బాయ్‌తో క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉన్న 16 మందికి కరోనా లేదని తేలడంతో అధికారులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న ఈ 16 మందికి నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని దక్షిణ ఢిల్లీ మేజిస్ట్రేట్ బ్రిజ్ మిశ్రా సోమవారం వెల్లడించారు. మాలవీయ నగర్‌లోని సావిత్రి నగర్‌కు చెందిన పిజ్జా డెలివరీ బాయ్(19)కు కరోనా వైరస్ సోకినట్లు ఈనెల 14న నిర్ధారణ కావడంతో 72 కుటుంబాలను ప్రభుత్వ అధికారులు క్వారంటైన్లో ఉంచారు. అతడితోపాటు పనిచేసే మరో 17 మంది పిజ్జా డెలివరీ బాయ్‌లను కూడా క్వారంటైన్‌కు తరలించారు. అతడు పనిచేస్తున్న పిజ్జా ఔట్‌లెట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. పిజ్జా డెలివరీ బాయ్ డయాలిసిస్ కోసం ఆసుపత్రికి వెళ్లాడని, అక్కడే కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం.. ఢిల్లీలో ఇప్పటివరకు 2003 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 45 మంది మృతి చెందారు. హైవే ఎక్కుతున్నారా.. ఆలోచించండి! -
పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా..
సాక్షి న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్(19)కు కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో 72 కుటుంబాలను ప్రభుత్వ అధికారులు క్వారంటైన్లో ఉంచారు. అతడితోపాటు పనిచేసే మరో 17 మంది పిజ్జా డెలివరీ బాయ్‌లను కూడా క్వారంటైన్‌కు తరలించారు. మాలవీయ నగర్లో ఓ పిజ్జా ఔట్లెట్లో డెలివరీ బాయ్‌గా పనిచేసే యువకుడిలో కరోనా లక్షణాలు గత 20 రోజులుగా ఉన్నాయి. ఏప్రిల్ 14న కరోనా నిర్ధారణ పరీక్ష నివేదిక వచ్చింది. అతడు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆ డెలివరీ బాయ్ నుంచి గత 20 రోజుల్లో పిజ్జాలు అందుకున్న 72 కుటుంబాలను క్వారంటైన్లో ఉంచారు. ఆ పిజ్జా ఔట్‌లెట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. పిజ్జా డెలివరీ బాయ్ డయాలిసిస్ కోసం ఆసుపత్రికి వెళ్లాడని, అక్కడే కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
భారత్ మా మాతృదేశం అవుతుందనుకున్నాం : రోహింగ్యాలు
సాక్షి, ఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లు చట్టంగా రూపుదాల్చడంతో మయన్మార్ నుంచి వలస వచ్చిన రోహింగ్యా ముస్లింలు ఆందోళన చెందుతున్నారు. మయన్మార్‌లో హింస నేపథ్యంలో కట్టుబట్టలతో ఇక్కడికి వలస వచ్చామని, ఇప్పుడు ఇక్కడ కూడా స్థానం లేదంటే మేం ఎక్కడికి వెళ్లాలని వాపోతున్నారు. దేశ రాజధానిలోని క్యాంపుల్లో తలదాచుకుంటున్న రోహింగ్యా ముస్లింలను మీడియా పలకరించింది. 18 ఏళ్ల రహీమా మాట్లాడుతూ.. ‘ఆరు సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ మీదుగా భారత్‌కు వలస వచ్చాం. ఇద్దరు సోదరులతో కలిసి దారుణ పరిస్థితుల నుంచి బయటపడ్డాం. ఇక్కడ ప్రతీరోజు ఉదయం లేచినప్పుడు బతికే ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేవాళ్లం. భారత్‌లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మమ్మల్ని వెనక్కి పంపేస్తామంటున్నారు. కానీ అక్కడికి వెళ్తే మేం చావును కొనితెచ్చుకున్నట్టే’నని వివరించింది. భారతదేశంలో రోహింగ్యాల సంఖ్య దాదాపు 40 వేలు ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరు తలదాచుకున్నారు. వీరంతా ఐక్యరాజ్యసమితి ద్వారా జారీ చేయబడిన శరణార్థి కార్డులు కలిగి ఉన్నారు. 22 ఏళ్ల సలాం మాట్లాడుతూ.. ‘ఒక రోజు ఆర్మీవాళ్లు మా ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యులందరినీ చంపేశారు. తర్వాత చంపేది నిన్నేనంటూ బెదిరించారు. ఈ ఘటనతో మా ఊళ్లో ఉన్న 35 మందితో కలిసి కట్టుబట్టలతో బంగ్లాదేశ్‌కి వచ్చాం. అక్కడ నాలుగు నెలలపాటు రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ ఇండియాకు వచ్చాం. మాకు మయన్మార్‌కు తిరిగి వెళ్లాలని లేదు. అక్కడికి వెళ్తే మమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తారు. కానీ, ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే మమ్మల్ని బలవంతంగా వెళ్లగొట్టేలా కనిపిస్తున్నాయం’టూ వివరించాడు. ఈ నెల ప్రారంభంలో హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడుతూ రోహింగ్యాలకు పౌరసత్వం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. రోహింగ్యాలను ప్రపంచంలోనే తమకంటూ దేశం లేని అతిపెద్ద మైనార్టీ తెగగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. మరో రోహింగ్యా కుల్సుమ్ మాట్లాడుతూ.. ‘ప్రత్యేక దేశమంటూ లేని మేము మళ్లీ అక్కడికి(మయన్మార్) వెళ్తే అది మాకు చాలా ప్రమాదకరం. ఇండియా నాకు, నా పిల్లలకు సురక్షితంగా ఉంది. మమ్మల్ని తిరిగి పంపిస్తారనే ఆలోచనే చాలా భయంకరంగా అనిపిస్తోంద’ని వెల్లడించాడు. కాగా, మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలోని రోహింగ్యాలు తమ దేశ పౌరులు కాదని, వారంతా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన తెగ అంటూ ఆ దేశం వారికి పౌరసత్వం నిరాకరించింది. ఈ నేపథ్యంలో స్థానికంగా నెలకొన్న హింసాత్మక పరిస్థితుల వల్ల రోహింగ్యాలు వలస బాట పట్టారు. -
సీఏఏ నిరసన సెగలు: జర్నలిస్టులపై దాడి
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)కు వ్యతిరేకంగా సోమవారం కూడా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వద్ద నిరసనలు కొనసాగాయి. యూనివర్సిటీ గేట్-1 వద్ద విద్యార్థుల నిరసనలను కవర్ చేస్తుండగా ఇద్దరు జర్నలిస్టులపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఏఎన్ఐ వార్తాసంస్థకు చెందిన రిపోర్టర్ ఉజ్వల్ రాయ్, కెమెరాపర్సన్ సరబ్జీత్ సింగ్‌పై కొందరు దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. దీంతో వారిని ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. జర్నలిస్టులపై దాడిని ఢిల్లీ పోలీసుశాఖ అధికార ప్రతినిధి ఎంఎస్ రాంధ్వా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వద్ద ఉన్న మెట్రో స్టేషన్ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేస్తున్నట్టు ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ ప్రకటించింది. ఆ స్టేషన్ వద్ద మెట్రో రైళ్లను ఆపడం లేదని తెలిపింది. విద్యార్థుల ఆందోళనలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. -
రూ. 20 లక్షల నెక్లెస్.. 3 రాష్ట్రాలు తిప్పి..
న్యూఢిల్లీ : యజమాని నమ్మకాన్ని సంపాదించిన ఓ మహిళ అదును చూసి ఖరీదైన నగలతో ఉడాయించింది. వారం రోజుల తర్వాత పోలీసులకు పట్టుబడి కటకటాలపాలైంది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు... షంషుద్దీన్ మెచెరీ పరాంబ అనే వ్యక్తి భార్యతో కలిసి గ్రేటర్ కైలాష్-2లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఓ మహిళ వాళ్లింట్లో వంట మనిషిగా చేరింది. పరాంబ భార్య గర్భవతి కావడంతో వంట పనులతో పాటుగా అన్ని పనుల్లోనూ ఆమెకు తోడుగా ఉంటూ నమ్మకం చూరగొంది. అయితే వారం రోజుల క్రితం పరాంబ, అతడి భార్యతో కలిసి డిన్నర్‌కు వెళ్లిన సమయంలో నగలు, డబ్బు దొంగిలించి అక్కడి నుంచి పారిపోయింది. దీంతో మోసపోయామని గుర్తించిన పరాంబ దంపతులు పోలీసులను ఆశ్రయించడంతో.. మూడు రాష్ట్రాలు గాలించి ఎట్టకేలకు కిలాడి వంట మనిషిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం గురించి సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘నవంబరు 14న తన ఇంట్లో దొంగతనం జరిగిందని పరాంబ ఫిర్యాదు చేశారు. సుమారు 20 లక్షల విలువ చేసే స్విస్ చోపర్‌్డ నెక్లెస్, రూ. 20 వేల విలువ గల చెవి దుద్దులు, వాచ్ లేబుల్, నగదు పోయిందని కంప్లెంట్ ఇచ్చారు. అదే విధంగా తమ ఇంటి పనిమనిషి కూడా కనిపించకుండా పోయిందని మా దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో విచారణ జరుపగా వంట మనిషే దొంగతనానికి పాల్పడిందన్న విషయం బయటపడింది. ఏజెన్సీ ద్వారా ఆమె చిరునామా కనుగొని తొలుత ఉత్తరప్రదేశ్‌లో ఆమె పుట్టింటికి వెళ్లాం. అక్కడి నుంచి ఆమె బిహార్ వెళ్లినట్లుగా.. అటునుంచి జార్ఖండ్ చేరుకున్నట్లుగా గుర్తించాం’ అని తెలిపారు. ఈ క్రమంలో జంషెడ్‌పూర్‌లో తన భర్త, కొడుకుతో కలిసి ఉన్న తనను అరెస్టు చేసి తీసుకువచ్చామని వెల్లడించారు. ‘విచారణలో భాగంగా 4 లక్షల రూపాయలు తన తల్లికి, రెండు లక్షల రూపాయలు అత్తింటివారికి ఇచ్చినట్లు.. మరికొంత సొమ్ముతో బాకీ తీర్చినట్లు నిందితురాలు నేరం అంగీకరించింది. మిగతా సొమ్మును రికవరీ చేస్తున్నాం’ అని తెలిపారు. కాగా స్విస్ చోపర్‌్డ నెక్లెస్‌లు సాధారణంగా రెడ్ కార్పెట్‌పై నడిచే సినీ సెలబ్రిటీలు మాత్రమే ధరిస్తారన్న సంగతి తెలిసిందే. అత్యంత ఖరీదైన ఈ నగల్ని సామాన్యుల ఇళ్లలో పెట్టుకోరు. ఈ విషయం గురించి పరాంబ మాట్లాడుతూ.. తాను నెక్లెస్‌ను బయోమెట్రిక్ లాకర్లో పెట్టడం మరిచిపోయినందు వల్లే దొంగతనం జరిగిందని వాపోయింది. తనను ఎంతో నమ్మించి వంట మనిషి ద్రోహానికి పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది. -
వితంతువును కొట్టి చంపిన ఇంటి ఓనర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం జరిగింది. ఇంటి ఓనర్, అతని కుటుంబ సభ్యులు విచక్షణా రహితంగా కొట్టిన దెబ్బలకు 44 ఏళ్ల వితంతువు మృతి చెందింది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో జరిగింది. పోలీసుల వివరాలు ప్రకారం.... హతురాలు మంజు గోయల్ (44) భర్త ఏడాది కిందట మరణించాడు. ఆమె ఆరు నెలలుగా మెహ్రౌలీలోని సతీష్ పహ్వా అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో అద్దెకు ఒంటరిగా నివసిస్తున్నారు. రెండు రోజుల కిందట సతీష్ పహ్వా ఇంట్లో కొన్ని వస్తువులు, సుమారు రూ.47వేల నగదు చోరీకి గురయ్యాయి. ఈ దొంగతనం చేసింది మంజు గోయెలేనని అనుమానించిన సతీష్ పహ్వా కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఆమెపై మూకుమ్మడిగా దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. ఈ సమాచారం తెలుసుకున్న మంజు గోయల్ సోదరుడు ఘటనా స్థలానికి రాగా అతడిపైనా దాడి చేశారు. ఈ ఘటనపై హతురాలి సోదరుడు, స్థానికులు మెహ్రౌలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇంటి ఓనర్ సతీష్ పహ్వా (54), అతని కుమారుడు పంకజ్ (29)లపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. -
షాకింగ్: పార్కుల్లో అమ్మాయిలను చూసి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై వేధింపులకు అడ్డే లేకుండాపోయింది. హస్తినలో మహిళలు నిత్యం ఎక్కడో చోట లైంగిక వేధింపులకు, అసభ్య చర్యలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా పార్కులో అమ్మాయిలను చూడగానే.. బహిరంగంగా లైంగిక అసభ్య చర్యలకు పాల్పడుతున్న ఓ కీచకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలోని పలు విలాసవంతమైన ప్రాంతాల్లో ఉన్న పార్కుల్లో అమ్మాయిలను చూడగానే నిందితుడు బహిరంగంగా లైంగిక స్వయం సంతృప్తి చర్యలకు పాల్పడేవాడు. తాజాగా చిత్తరంజన్ పార్కులో వాకింగ్‌కు వెళ్లిన ముగ్గురు అమ్మాయిలకు ఇదే షాకింగ్ అనుభవం ఎదురైంది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదకొండు రోజులు గాలించిన పోలీసులు.. అమ్మాయిలు ఇచ్చిన వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడి పేరు మిథున్ బెనర్జీ. పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాకు చెందిన అతడు గత రెండేళ్లుగా ఢిల్లీలోని గోవింద్‌పురిలో నివాసముంటున్నాడు. స్టెపంబర్ 5వ తేదీన పార్కులో వాకింగ్ చేస్తున్న ముగ్గురు అమ్మాయిలను చూసి.. నిందితుడు బహిరంగంగా లైంగిక అసభ్య చర్యలకు పాల్పడ్డాడు. అంతేకాదు, అతడు గతంలో అలకనంద, గ్రేటర్ కైలాశ్ పార్కుల్లోనూ ఇదే విధంగా అమ్మాయిలు ఎదురుగా అసభ్య చర్యలకు దిగాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతని ఫోన్లో అశ్లీల వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. చదవండి: యువతి ఎదుట ఆటోడ్రైవర్ లైంగిక అసభ్య చర్య! -
దారుణం : 90 ఏళ్ల వృద్ధుడిని ఫ్రిజ్‌లో కుక్కి..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. కనీసం వయస్సుకు విలుక ఇవ్వని దుండగులు 90 ఏళ్ల వృద్దుడిని డబ్బు కోసం కిడ్నాప్ చేశారు. అది కూడ మత్తు మందు ఇచ్చి ఫ్రిజ్‌లో కుక్కి కిడ్నాప్ చేశారు. ఇంట్లో పనిచేసే యువకుడే మత్తు మందు ఇచ్చి కిడ్నాప్‌కు సహకరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 90ఏళ్ల క్రిషన్ కోస్లా అనే రిటైర్ ఉద్యోగి తన భార్యతో కలిసి సౌత్ ఢిల్లీలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వారిఇద్దరు కుమారుల్లో ఒకరు విదేశాల్లో ఉండగా మరో కుమారుడు ఢిల్లీలో పారిశ్రామికవేత్త. వృద్ద దంపతులకు తోడుగా ఇంట్లో పనిచేసేందుకు ఓ యువకున్ని ఏడాది క్రితం నియమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే గత శనివారం సాయంత్రం ఇంట్లోకి వచ్చిన యువకుడు రోజూ మాదిరి టీ తీసుకొచ్చి వృద్ధ దంపతులకు ఇచ్చాడు. అయితే కిడ్నాప్‌కు పథకం పన్నిన యువకుడు ఆ టీలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. దీంతో వారు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. అనంతరం ఆ యువకుడు రాత్రీ ఎనిమిది గంటలకు మరో నలుగురు మిత్రులను ఇంటికి పిలిచాడు. ఐదుగురు కలిసి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను, ఫ్రిజ్‌ను తీసుకెళ్లారు. అయితే అక్కడే ఉన్న వాచ్మెన్ మాత్రం పాత సామాను అమ్మడానికి వెళ్తున్నరనుకోని చూసి చూడనట్లు వదిలేశాడు. అయితే వారు ఫ్రిజ్‌లో క్రిషన్ను కుక్కి కిడ్నాప్ చేశారన్న విషయాన్ని గమనించలేకపోయాడు. మత్తమందుతో నిద్రలోకి జారుకున్న క్రిషన్ భార్య ఆదివారం ఉదయం మేలుకునే సరికి భర్తతో పాటు ఇంట్లో పని చేసే యువకుడు సైతం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే దుండగులు కోస్లాను కిడ్నాప్ చేశారా ఇంకా ఏదైన చేశారా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కదులుతున్న బస్సులోంచి దూకిన యువతి
న్యూఢిల్లీ: ఆకతాయిల వేధింపులు తాళలేక దక్షిణ ఢిల్లీలో ఓ యువతి కదులుతున్న బస్సులో నుంచి కిందకు దూకేసింది. ఈ విషయం బాధితురాలు సోదరి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. రోజు రూట్ నంబర్ 544 ప్రయాణించే తన సోదరిని అకతాయిలు గడిచిన మూడు నెలల కాలంలో ఏడుసార్లు వేధించినట్టు కూడా ఆమె ఆరోపించారు. శనివారం ఈ వేధింపులు మరి ఎక్కువ కావడంతో తన సోదరి అలా చేసిందన్నారు. ‘నా సోదరి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోంది. తను ప్రయాణించే రూట్లో అల్లరిమూకలు అదేపనిగా యువతులపై వేధింపులకు పాల్పడుతున్నారు. గతంలో తనను కొందరు వ్యక్తులు వేధిస్తే ఈ విషయాన్ని బయటకు చెప్పడంతో బస్సులోని అందరు కలిసి అతన్ని కిందకి దించేశారు. కానీ ఆ మరుసటి రోజే ఆ వ్యక్తి మళ్లీ అదే బస్సులో కనబడటం తనలో భయాన్ని పెంచింది. దీంతో తను కొన్ని రోజులు వేరే మార్గాల్లో కళాశాలకు వెళ్లింది. కానీ ఆ రూట్లలో ప్రయాణించడం వల్ల తను కాలేజీకి అలస్యంగా చేరుకునేది.. దీంతో తిరిగి ఇదే మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. ఢిల్లీలోని చాలా మంది విద్యార్థులు ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తారు. దీనిని అదనుగా చేసుకునే ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. శనివారం ఆకతాయిలు తనను లక్ష్యంగా చేసుకుని నీ గురించి మాకు మొత్తం తెలుసు.. నువ్వు చదువుతున్నది ఎక్కడో కూడా మాకు తెలుసు అంటూ వేధించసాగారు. దీంతో భయాందోళనకు గురై కదులుతున్న బస్సులో నుంచి తను కిందకు దూకేసింద’ని బాధితురాలి సోదరి ట్విటర్లో తన ఆవేదనను పంచుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. డీసీపీ విజయ్ కుమార్ దీనిపై స్పందించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియజేస్తే తాము చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇటువంటి ఘటనలు జరుగుతున్న మార్గాలో మఫ్టీ పోలీసులతో నిఘా ఏర్పాటు చేసి.. యువతులకు భద్రత కల్పిస్తామని తెలిపారు. -
18 ఏళ్లుగా ఆ రోడ్డు నిర్మాణం సా..గుతోంది!!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేర్చడం లేదని రాజకీయ పార్టీలపై విమర్శలు రావడం మామూలే. అయితే 18 ఏళ్ల క్రితం మంజూరైన ఓ రోడ్డు నిర్మాణం ఇప్పటివరకు పూర్తికాకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది. వివరాలు.. ఢిల్లీ, నొయిడా, ఫరిదాబాద్ను కలుపుతూ సాగే కాళింద్ కుంజ్ బైపాస్ ప్రాజెక్టు 2000 సంవత్సరంలో మొదలైంది. ఈ ప్రాజెక్టుతో పాటు అదే ఏడాదిలో ఢిల్లీ మెట్రోకు కూడా కాంగ్రెస్ పాలకులు శంకుస్థాపన చేశారు. అయితే 277 కిలోమీటర్ల రైల్వే లైన్‌తో మెట్రో నిర్మాణం పూర్తి చేసుకోగా, 13.7 కిలోమీటర్ల కాళింద్ కుంజ్ బైపాస్ ప్రాజెక్టు మాత్రం అటకెక్కింది. ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించాడానికి 18 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టుని మంజూరు చేయగా, అంతకంతకూ పెరిగిన వాహనాల రద్దీలో దక్షిణ ఢిల్లీ ఊపిరి సలపకుండా ఉంది. అన్నీ ఆటంకాలే..! ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను వివరణ కోరగా.. ప్రాజెక్టు డిజైన్‌లో లోపాల కారణంగా నిర్మాణం ఆగిపోయిందని తెలిపింది. ఓక్లా పరిరక్షణ కేంద్రం(బర్డ్ శాంక్చూరీ) మీదుగా రోడ్డు వేయాల్సి రావడంతో నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడ్డాయని పేర్కొంది. అయితే రీడిజైన్ అనంతరం మట్టి తవ్వకాలు, కొలతలు చేపట్టామని వివరించింది. కానీ, రోడ్డు నిర్మాణానికి అవరసమైన 43 ఎకరాలకు యూపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వనందున 2007లో మరోమారు పనులు నిలిచిపోయాయని తెలిపింది. కాగా, భూ అనుమతుల విషయమై 2017లో ఢిల్లీ ప్రభుత్వం యూపీ సర్కార్‌తో సంప్రదింపులు జరిపింది. -
దద్దరిల్లిన దక్షిణ ఢిల్లీ..
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ భేరీ ప్రాంతం శనివారం మధ్యాహ్నం కాల్పులతో దద్దరిల్లింది. కరుడుగట్టిన నేరస్థుడు రాజేష్ భార్తీ, అతని ముగ్గురు అనుచరులను ప్రత్యేక పోలీసు దళం కాల్చి చంపింది. ఢిల్లీ, చుట్టు పక్కల రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న రాజేష్ చత్తర్‌పూర్ ప్రాంతంలో మరో నేరం చేయబోతున్నాడనే సమాచారంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఫతేపూర్ భేరీ ప్రాంతంలో పాగా వేసింది. అయితే, తమ రాకను పసిగట్టిన రాజేష్ గ్యాంగ్ కాల్పులకు దిగిందని పోలీసులు తెలిపారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు చేయడంతో రాజేష్‌తో పాటు అతని ముగ్గురు అనుచరులు హతమయ్యారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. కాగా, ఓ కేసులో హరియాణాలో అరెస్టయిన రాజేష్ ఇటీవలే పోలీసు కస్టడీ నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. 12 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడి తలపై గతంలో నగర పోలీసు కమిషనర్ లక్ష రూపాయల రివార్డు ప్రకటించడం విశేషం. -
విరాట్ కోహ్లి రెస్టారెంట్లో సరదాగా ఆర్సీబీ జట్టు
-
కోహ్లి రెస్టారెంట్లో పసందైన విందు
న్యూఢిల్లీ : ఇటీవల హైదరాబాద్‌లో మహ్మద్ సిరాజ్ ఇంట్లో సందడి చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు.. గురువారం రాత్రి కెప్టెన్ విరాట్ కోహ్లి రెస్టారెంట్లో సరదాగా గడిపారు. ఐపీఎల్లో భాగంగా బెంగళూరు జట్టు శనివారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో తలపడనుంది. అందుకోసం బెంగళూరు ఆటగాళ్లు నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. కోహ్లికి దక్షిణ ఢిల్లీలో నూయేవా రెస్టారెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇంకేముంది తన హోం టౌన్‌కు విచ్చేసిన ఆటగాళ్లకు కోహ్లి తన రెస్టారెంట్లోనే పసందైన విందు ఏర్పాటు చేశాడు. ఈ విందులో జట్టు సభ్యులు ఏబీ డివిలియర్స్, ఉమేశ్ యాదవ్, సిరాజ్, టిమ్ సౌతి, మోయిన్ అలీ, యుజువేంద్ర చహల్‌తో పాటు బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రా కూడా పాల్గొన్నాడు. రెస్టారెంట్‌కు వచ్చిన ఆర్సీబీ ఆటగాళ్లతో ఫొటోలు దిగేందుకు అక్కడి కస్టమర్లు ఉత్సాహం కనబర్చారు. కోహ్లి సేన కూడా వారితో అంతే సరదాగా గడుపుతూ.. ఫొటోలకు పోజులిచ్చారు. తన జట్టు సభ్యులు తన రెస్టారెంట్‌కు విచ్చేసిన ఫొటోలను కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఏడాది ఐపీఎల్లో కోహ్లి సేన తమ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తూ వస్తోంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. శనివారం ఢిల్లీతో తలపడే మ్యాచ్‌లో గెలిస్తేనే బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. With @abdevilliers17 at @nueva.world 🤙 A post shared by Virat Kohli (@virat.kohli) on May 10, 2018 at 10:26am PDT The RCB boys sure know how to have Fun! #RCBAtNUEVA @RCBTweets @imVkohli @ABdeVilliers17 @yuzi_chahal @nueva_world @mohammadsiraj #AshishNehra @y_umesh @chriswoakes @shammibatra24 #ROYALCHALLENGERSBANGALORE pic.twitter.com/iumiEruC9e — Nueva (@nueva_world) May 10, 2018 -
స్కూల్ బెల్ట్‌తో మిస్టరీ వీడింది
సాక్షి, న్యూఢిల్లీ: స్కూల్ బెల్ట్ సాయంతో తల్లికొడుకుల హత్య కేసును ఢిల్లీ పోలీసులు చేధించారు. తన గురించి చిన్న ఆనవాలు కూడా దొరక్కుండా జాగ్రత్తపడ్డ నిందితుడిని.. అతి కష్టం మీద పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ మాల్దాకు చెందిన బబ్లూ కుమార్ మోందాల్(29) ఢిల్లీ ఓఖ్లా ప్రాంతంలో ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఉండే సావిత్రి ఘోష్ అనే వితంతువుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చుట్టుపక్కల వారిని మాత్రం తానే ఆమె భర్తనని బబ్లూ నమ్మించసాగాడు. ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం బబ్లూకు యాక్సిడెంట్ అయి కాలికి గాయమైంది. అయితే అప్పటి నుంచి సావిత్రి తనను నిర్లక్ష్యం చేస్తూ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. గత నెల 25న ఆమెకు మద్యం తాగించి గొంతుకోసి చంపాడు. ఆపై 8 ఏళ్ల ఆమె కొడుకును కూడా అదే రీతిలో చంపి పరారయ్యాడు. దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు బబ్లూకు సంబంధించిన ఒక్క ఆనవాలు కూడా పోలీసులకు లభించలేదు. దీంతో పోలీసులకు ఈ కేసు మిస్టరీ ఛాలెంజింగ్‌గా మారింది. బెల్ట్ ఆధారంగా... సావిత్రి భర్తగా చెప్పుకున్న బబ్లూపైనే పోలీసులకు అనుమానం మొదలైంది. కానీ, అతనికి సంబంధించి ఒక్క చిన్న క్లూ కూడా లభ్యం కాలేదు. చివరకు అతని పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ కూడా ఎవరికి తెలీకపోవటంతో దర్యాప్తు కష్టతరంగా మారింది. ఇంతలో బాలుడి స్కూల్బెల్ట్ పై స్కూల్ వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్కూల్ వివరాల్లో పిల్లాడి దరఖాస్తు ఫామ్‌లో ఉన్న ఫోటో(తండ్రి స్థానంలో బబ్లూ ఫోటో ఉంది) ఆధారంగా ఆచూకీ కోసం యత్నించారు. చివరకు అతను మాల్దాకు చెందిన వ్యక్తి అన్న సమాచారం దొరకటంతో సౌత్ ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ‘నిందితుడు కనీసం ఫోన్ కూడా వినియోగించేవాడు కాదు. దారినపోయే వారి ఫోన్ అడిగి తన బంధువులకు కాల్స్ చేసేవాడు. దీంతో అసలు అతను ఎక్కడ ఉన్నాడన్నది కనుక్కోవటం కష్టతరంగా మారింది. అయితే ఆ బంధువుల సాయంతోనే చివరకు అతన్ని పట్టుకున్నాం’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బుధవారం జార్ఖండ్‌లోని షహిబ్‌గంజ్ ప్రాంతంలో చివరకు బబ్లూను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
చివరకు న్యాయం గెలిచింది..
సాక్షి, న్యూఢిల్లీ : ఓ క్రేన్ వాహనం కారణంగా తన కాలును శాశ్వతంగా కోల్పోయిన అశోక్ కుమార్ అనే 60 ఏళ్ల వ్యక్తికి భారీ నష్టపరిహారం అందింది. ఆయన కాలు పోవడానికి కారణమైన క్రేన్ వాహనానికి సంబంధించిన వాళ్లు రూ.44.82లక్షలు నష్టపరిహారం చెల్లించాలంటూ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అధికారి రాజ్‌కుమార్ చౌహాన్ ఆదేశించారు. ఈ మేరకు ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ క్రేన్‌కు ఇన్సురెన్స్ అందించేది ఈ సంస్థే కావడంతో నష్టపరిహారం చెల్లించాలంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం అశోక్ కుమార్ తన కాలును పూర్తిగా కోల్పోయాడని, భవిష్యత్తులో కూడా అది తిరిగి మాములు కాలుగా పనిచేయదని, శాశ్వత వైకల్యం ఏర్పడినందున తమ ఆదేశాలు సరైనవేనంటూ సమర్థించుకున్నారు. దక్షిణ ఢిల్లీలో 2017 ఆగస్టు 2న సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఎన్బీసీసీ భవనం వద్ద నడుచుకుంటూ వస్తుండగా నిర్లక్ష్యంగా క్రేన్ వాహనం నడుపుతూ వేగంగా వచ్చిన డ్రైవర్ అతడిని వెనుక నుంచి ఢీ కొట్టాడు. దాంతో అతడు కిందపడిపోగా అతడి ఎడమకాలు మీద నుంచి క్రేన్ వెళ్లిపోయింది. దాంతో 80శాతం ఆ కాలు పనిచేయకుండా అయిపోయింది. దాంతో అతడు కోర్టు మెట్లగా చివరకు అతడికి కొంత మేరకు న్యాయం జరిగింది. -
ఘోరం.. పసికందు ప్రాణం తీసిన పంది
సాక్షి, న్యూఢిల్లీ : నిర్లక్ష్యం ఎవరిదైనా 20 రోజల ఓ పసికందు ప్రాణం బలైంది. తల్లి చూస్తుండగానే చిన్నారిని లాక్కెల్లిన పంది పీక్కుతింది. తల్లి, స్థానికులు అప్రమత్తం అయ్యేలోపే ఘోరం జరిగిపోయింది. ఆపై తీవ్రంగా గాయపడ్డ ఆ పసికందు చికిత్స పొందుతూ మరణించింది. దక్షిణ ఢిల్లీలోని భాటి మైన్స్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నాం ఈ ఘటన చోటు చేసుకుంది. పుష్ప అనే మహిళ తన బిడ్డకు పాలు ఇస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ఓ పంది శిశువును పట్టుకుని పరిగెత్తింది. అది గమనించిన పుష్ప తల్లి అరుచుకుంటూ పంది వెంటపడింది. కానీ, అప్పటికే కాస్త దూరంగా వెళ్లిన పంది చిన్నారి తలను కొరిసేంది. కేకలు విని పరిగెత్తుకుంటూ వచ్చిన చుట్టుపక్కల వాళ్లు రాళ్లు విసిరి పందిని బెదరగొట్టారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. విమర్శలు... ఈ ఘటన బోలెడు విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు జాప్యం చేయటం వల్లే సకాలంలో చిన్నారికి వైద్యం అందలేని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న చాలా సేపటికి పోలీసులు అక్కడికి చేరుకున్నారని.. చిన్నారిని 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎయిమ్స్‌కు తీసుకెళ్లారని... పైగా ట్రాఫిక్ జామ్ ఉంటుందని చెబుతున్నా కూడా వినకుండా ఆ మార్గంలో తీసుకెళ్లారని వారు ఆరోపిస్తున్నారు. ఇక ఆ ప్రాంతంలో యధేచ్ఛగా పందుల పెంపకం చేపడుతున్న కొందరు వాటిని స్వేచ్ఛగా వదలటంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. తరచూ అవి తమ పిల్లలపై దాడులు కూడా చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పంది యజమానిని గుర్తించే పనిలో ఉన్నామని అదనపు డీసీపీ చిన్మయి బిస్వాల్ వెల్లడించారు. పుష్ప, ఆమె భర్త -
గ్యాస్ లీక్.. 110 మంది విద్యార్థులకు అస్వస్థత
-
మరో ఏటీఎంలో నకిలీ నోటు కలకలం
న్యూఢిల్లీ: దేశరాజధానిలో మరో ఏటీఎంలో నకిలీ నోటు వ్యవహారం కలకలం రేపింది. సౌత్ ఢిల్లీ అమర్ కాలనీ ప్రాంతంలోని ఒక ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో నకిలీ రూ.2 వేల నోట్లు దర్శనమిచ్చాయి. గతనెలలో ఈ నకిలీ రూ.2వేల నోట్లు బ్యాంకు ఖాతాదారుల్లో ఆందోళన సృష్టించిన ఘటన మరువకముందే గురువారం మరో నకిలీనోటు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానిక వినియోగదారుడు చందన్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినపుడు చిల్డ్రన్ బ్యాంకు ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నకిలీ నోటు కనిపించడంతో వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు చందన్ ఫిర్యాదు ఆధారంగా, 489 బి, ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని డీసీపీ రోమిల్ బానియా చెప్పారు. దీనిపై లోతుగా పరిశీలన నిమిత్తం ఈ కేసును క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే అత్యధిక విలువ కలిగిన నోట్లలో ఫేక్ నోట్లు వరుసగా వెలుగు చూడడంతో వినియోగదారుల్లో ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఒకనెలరోజుల్లో ఇది రెండవ ఘటన కాగా, ఈ నకిలీ నోట్లపై 'మనోరంజన్ బ్యాంక్ , చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉండడం గమనార్హం. కాగా ఫిబ్రవరి 6 న సంగం విహార్ లో బ్యాంకు ఖాతాదారుడు రోహిత్ కుమార్ ఎస్బీఐ ఏటీ ఏంలో డ్రా చేసినపుడు ఇలాంటి నకిలీ రూ. 2వేల నోటు వెలుగు చూసింది. ఈ సంఘటనలో ఇషాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
కాళ్లు నరికి.. గొంతు కోసి.. దారుణ హత్య
అది తూర్పు ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతం. తెల్లవారుజాము సమయం. రోడ్డు మధ్యలో ఒక తివాచీ మూటకట్టి ఉంది. అందులో ఏముందో మొదట ఎవరికీ తెలియదు. ఏంటా అని చూస్తే.. అందులో ఒక యువకుడి మృతదేహం ముక్కలు ముక్కలుగా ఉంది. అక్కడకు కొన్ని మీటర్ల దూరంలో అతడి కాళ్లు విడిగా పడి ఉన్నాయి. దాంతో ఒక్కసారిగా షాకైన ఆ ప్రాంత వాసులు.. పోలీసులకు ఫోన్ చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజిని తాము పరిశీలించామని, ఇద్దరు వ్యక్తులు ఆ మృతదేహాన్ని, దాని భాగాలను విడివిడిగా పారేయడం కనిపించిందని డీసీపీ రోమిల్ బానియా తెలిపారు. హంతకులు అతడి గొంతు కోసేశారు. అతడి ముఖం మీద ఏదో ఒక బరువైన వస్తువుతో కొట్టారు. ముఖంలో కూడా కొంత భాగాన్ని చెక్కేశారు. మృతదేహాన్ని మూట కట్టడానికి వీలుగానే కాళ్లు నరికేసి ఉంటారని పోలీసులు చెప్పారు. మృతుడి వయసు సుమారు 35 ఏళ్ల ప్రాంతంలో ఉంటుందని, అతడు తెల్ల షర్టు, లుంగీ ధరించి ఉన్నాడని చెప్పారు. హత్య జరిగే సమయానికి అతడు బాగా తాగేసి ఉంటాడని అంటున్నారు. ఆ ప్రాంతం నుంచి ఎవరూ తప్పిపోయినట్లు తమకు ఫిర్యాదు అందలేదని, మృతుడి వివరాలు కూడా ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు. ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చి, తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో అక్కడ ఆ మృతదేహాన్ని పడేసినట్లు సీసీటీవీ ఫుటేజిలో కనిపించింది. అయితే నిందితుల ముఖాలు గానీ, ఆటో నంబరు ప్లేటు గానీ స్పష్టంగా కనిపించలేదు. ముందుగానే ఎక్కడో హత్యచేసి, మృతదేహాన్ని ఇక్కడకు తెచ్చి పారేసి ఉంటారని పోలీసులు చెప్పారు. -
తిరగబడిన మద్యం ట్రక్కు.. జనాలకు పండగ
అది దేశ రాజధాని ఢిల్లీలోని చిరాగ్ దిల్లీ ఫ్లైఓవర్ ప్రాంతం. ఉన్నట్టుండి అక్కడ ఒక్కసారిగా జనం గుంపులు గుంపులుగా చేరారు. చేతికి దొరికింది అందిపుచ్చుకుని అక్కడి నుంచి సంతోషంగా వెళ్తున్నారు. మరికొందరు మళ్లీ మళ్లీ వస్తూ తీసుకుంటున్నారు. ఏంటా అని చూస్తే.. అక్కడ ఓ మద్యం ట్రక్కు తిరగబడింది. దాంతో దొరికిన సీసాలు దొరికినట్లుగా మందుబాబులు వాటిని తీసుకెళ్లి పండగ చేసుకున్నారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే అక్కడున్న మొత్తం స్టాకు అంతా మాయమైపోయింది. మామూలు చొక్కాలు వేసుకున్నవాళ్ల కంటే... చలిగా ఉందని జాకెట్లు వేసుకున్నవాళ్లు మరింత అదృష్టవంతులుగా మిగిలారు. వాళ్లు ఆ లోపల నాలుగైదు బాటిళ్లు తీసుకుని చక్కా వెళ్లారు. హరియాణాలోని ఝజ్జర్ ప్రాంతం నుంచి మద్యం లోడుతో వచ్చిన మినీ ట్రక్కు డివైడర్‌ను ఢీకొని తిరగబడింది. లోపల సరుకును జాగ్రత్తగా కాపాడాల్సిన డ్రైవర్.. అక్కడినుంచి పారిపోయాడు. దాంతో జనం సీసాలు తీసుకుని వెళ్లిపోయారు. బహుశా హరియాణాలో మాత్రమే అమ్మాల్సిన మద్యాన్ని అక్రమంగా ఢిల్లీకి తీసుకొచ్చి ఉంటారని, అందుకే డ్రైవర్ పారిపోయాడేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రక్కు తిరగబడటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని సీసాలు పగిలిపోయి మద్యం అక్కడ ప్రవహించడంతో మందుబాబులు బాధపడ్డారు. వాసన గుర్తించిన ఒకరిద్దరు బైకర్లు మిగిలిన సీసాలు తీసుకెళ్తుండటంతో.. ఇంకా చాలామంది వచ్చి తమకు దక్కింది తీసుకున్నారు. ఈ విషయం సమీప కాలనీల వాళ్లకు తెలిసి వాళ్లు కూడా వచ్చేశారు. కొందరు కార్లలో వచ్చినవాళ్లయితే రెండు మూడు బాక్సులు తీసుకెళ్లిపోయారు. నెహ్రూ పార్కు వైపు నుంచి ఎయిర్‌పోర్టు వైపు ఈ ట్రక్కు వెళ్తోందని పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లాల్సిన బాగా ఖరీదైన విస్కీ అందులో ఉన్నట్లు ప్రచారం జరగడంతో జనం తండోపతండాలుగా వచ్చి పండగ చేసుకున్నారు. -
కారులో భార్యను పొడిచి చంపిన భర్త
న్యూఢిల్లీ: కారులో గొడవపడి భార్యను కిరాతకంగా హత్య చేశాడో భర్త. దక్షిణ ఢిల్లీలోని ఆనంద్ నికేతన్ ప్రాంతంలో బుధవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో తీవ్ర వాగ్వాదం జరగడంతో విచక్షణ కోల్పోయిన భర్త కత్తితో ఆమెను పొడిచి చంపాడు. కారులో వెళుతుండగా మంజు మోంగా(58)కు ఫోన్ వచ్చిందని, ఆమె ఎక్కువసేపు ఫోన్ లో మాట్లాడుతుండగా భర్త ముఖేశ్ అడ్డుచెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైందని పోలీసులు తెలిపారు. కోపోద్రిక్తుడైన ముకేశ్(60) కత్తితో పొడిచి భార్యను హతమార్చాడని చెప్పారు. కారులో పారిపోయేందుకు ప్రయత్నించిన ఆయనను ఛేజ్ చేసి పట్టుకున్నారు. 30 ఏళ్ల క్రితం ముకేశ్, మంజులకు పెళైందని.. కూతురు, కొడుకుతో కలిసి తూర్పు ఢిల్లీలోని హరినగర్ లో నివాసం ఉంటున్నారని పోలీసులు వెల్లడించారు. మరో వ్యక్తితో మంజు చనువుగా ఉండడం, తన సమక్షంలోనే అతడితో ఫోన్ మాట్లాడుతుండడం తట్టుకోలేక ముకేశ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. భార్యను చంపాలని అతడు ముందుగా కుట్ర పన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడికి తాగుడు అలవాటు ఉందని, ఇంట్లోలోనూ భార్యను హించించేవాడని పొరుగింటివారు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తెలిసినవాడే కదా అని వెళ్లినందుకు..
న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న అమ్మాయిపై సామూహిక లైంగిక దాడి జరిగింది. నలుగురు యువకులు కలిసి రెండు రోజులపాటు ఈ దారుణానికి ఒడిగట్టారు. అంతే కాదు.. తమ మొబైల్ ఫోన్లలో లైంగికదాడి దృశ్యాలను వీడియో తీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరణ్ అనే యువకుడు పలరా గ్రామానికి చెందినవాడు. సంజయ్ కుమార్ అనే మరో యువకుడు ధనిష్కపూర్ కు చెందిన వాడు కాగా మహేశ్, కాలా అనే మరో ఇద్దరు కరణ్ ఇంటికి దగ్గర్లో ఉండేవారు. కరణ్‌కు బాధితురాలు ముందే తెలుసు. తొలుత బస్టాండ్‌లో ఉన్న పదో తరగతి చదువుతున్న ఆ అమ్మాయిని కరణ్ తన బైక్‌పై ఓ గుడికి తీసుకెళ్లాడు. అనంతరం మాయమాటలు చెప్పి దక్షిణ ఢిల్లీలోని కాకాజీ ప్రాంతంలోగల ప్లాట్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత మరో ముగ్గురు అక్కడికి వచ్చి చేరారు. ఆ క్రమంలోనే కరణ్, సంజయ్ కుమార్ ఆ యువతిపై లైంగికదాడి చేయగా వారితోనే ఉన్న మహేశ్, కాలా వీడియోలు తీశారు. రెండురోజులపాటు ఇలా ఆ అమ్మాయిని రూములో బంధించి ఈ దారుణం చేశారు. అనంతరం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి విడిచిపెట్టారు. ఇంటికెళ్లిన బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నారు. -
కళ్లెదుటె రెండున్నర కోట్లు బూడిద పాలు
న్యూఢిల్లీ: ఆ కారులో కూర్చుంటే రాకెట్లో కూర్చున్నంత ఫీలింగ్. చూడగానే హత్తుకున్నామంత థ్రిల్లింగ్. వాయువేగంగా సాగే డ్రైవింగ్.. ఇది ఇటలీ కంపెనీకి చెందిన లాంబోర్గిని గల్లార్డో అనే కారును చూస్తే వచ్చి అనుభూతి. ఇంతకీ ఈ కారు ధరంతే తెలుసా అక్షరాల రెండున్నర కోట్లు. అలాంటి కారు దక్షిణ ఢిల్లీలో మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. దీంతో రెండున్నర కోట్ల రూపాయలు బూడిదపాలు చేసినట్లయింది. దక్షిణ ఢిల్లీలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటలీ కంపెనీకి చెందిన లాంబోర్గిని గల్లార్డో అనే కారును దాని యజమాని రూ.2.5 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. దీనికి 5.2 లీటర్ల ఇంధన పరిమాణంతో ఇంజిన్ ఉంటుంది. ఈ కారు డ్రైవర్ సోమవారం ఉదయం దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని బదర్పూర్ నుంచి వస్తుండగా అనూహ్యంగా అందులో మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అతడు అందులో నుంచి ఎలాంటి గాయాలవకుండా సురక్షితంగా బయటపడ్డాడు. కారు వెనుక భాగం నుంచి మధ్యభాగం వరకు పూర్తిగా కాలిపోయింది. ఫైరింగ్ సిబ్బంది వచ్చి దాని మంటలు ఆర్పేయగా సగం కారు మాత్రమే మిగిలింది. ఈ కంపెనీ కారు వేగం దాదాపు గంటలకు 350 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. 2013లో బయటకు వచ్చిన ఈకార్లు పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. -
పిజ్జా డెలివరీకి వెళ్లి.. దారుణం
న్యూఢిల్లీ: ఓ ప్రముఖ కంపెనీకి చెందిన పిజ్జా డెలివరీ మెన్ దారుణానికి పాల్పడ్డాడు. ఆర్డర్ ఇచ్చిన ఇంటికి పిజ్జా ఇచ్చేందుకు వెళ్లి ఐదేళ్ల పాపపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పాప కేకలు వేయడంతో పారిపోయాడు. పోలీసుల సమాచారం ప్రకారం అమిత్ అనే పిజ్జాను డెలివరీ చేసే వ్యక్తి ఆదివారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో దక్షిణ ఢిల్లీలోని ఓ ఇంటికి పిజ్జా ఇచ్చేందుకు వెళ్లాడు. మూడో అంతస్తులో పిజ్జా ఇచ్చి వస్తుండగా అతడికి గ్రౌండ్ ఫ్లోర్లో ఓ ఐదేళ్ల పాప కనిపించింది. వెంటనే అతడు బాల్కనీలో లైట్లు ఆపేసి పాపపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పాప కేకలు వేయడంతో అక్కడ ఉన్న వాచ్మెన్ అలారం మోగించగా అతడు పారిపోయాడు. అనంతరం పాప తన తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని వివరించింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు సదరు కంపెనీకి కూడా సమాచారం అందించారు. -
ఢిల్లీలో క్రిస్టియన్ స్కూలుపై దాడి
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని దక్షిణ ప్రాంతంలో క్రిస్టియన్ స్కూలుపై దుండగులు శుక్రవారం ఉదయం దాడి చేశారు. ఇది గమనించిన పోలీసులు అక్కడికి చేరుకునే లోపే దుండగులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వెంటనే పిల్లలను ఇళ్లకు పంపించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలిస్తే.. గుర్తు తెలియని వ్యక్తులు సమూహంగా వచ్చి మొదట సీసీటీవీని ధ్వంసం చేసినట్టు ఫుటేజ్‌లో రికార్డు అయింది. రాజధాని ప్రాంతంలో చర్చిలపై దాడులు జరగటం ఏడాదిలోపే ఇది ఆరోసారి. ఈ గ్రూపులో ముగ్గురు నుంచి నలుగురు నిందితులు ఉన్నారు. దుండగులు విలువైన సామాన్లు ఏవీ ఎత్తుకుపోలేదు. కేవలం ప్రిన్సిపాల్ గది మాత్రమే ధ్వంసం చేసి రూ. 8 వేలు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఆధారాల కోసం సీనియర్ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. దుండగులపై వసంత్ విహార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని పోలీసులు పేర్కొన్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఈ స్కూల్లోనే చదివారు. -
ఢిల్లీలో చర్చిపై దుండగుల దాడి
దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ చర్చిని ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చర్చిలో ఉన్న ప్రార్థనకు సంబంధించిన వస్తువులను అటూ ఇటూ విసిరేశారు. కొన్ని వస్తువులు పగిలిపోయినట్లు ఎఫ్ఐఆర్ దాఖలైంది. సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని, దాని ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా.. గత సంవత్సరం నవంబర్ నుంచి చర్చిలపై దాడులు జరగడం ఇది ఐదో సారి. -
అత్యాచారం.. కాళ్లు చేతులు కట్టేసి హత్య!
దేశరాజధానిలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో 30 ఏళ్ల మహిళను అర్ధనగ్నంగా చేతులు కాళ్లు కట్టేసి చంపేశారు. ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై అత్యాచారం చేసిన తర్వాతే చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ సెక్యూరిటీ గార్డు ఆమె మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫతేపుర్బేరి ప్రాంతానికి చెందినవారని గుర్తించామని, మిగిలిన వివరాలు పోస్టుమార్టం తర్వాతే తెలుస్తాయని డీసీపీ ప్రేమ్ నాథ్ తెలిపారు. ఆమె శుక్రవారం ఉదయమే ఇంటినుంచి బయటకు 9.30 గంటల ప్రాంతంలో వెళ్లారు. అయితే ఇంటికి మాత్రం సాయంత్రం కూడా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అన్నిచోట్లా గాలించి, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు సెక్యూరిటీ గార్డు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె ధరించిన దుస్తులతోనే ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నాయి. ఆమెపై సామూహిక అత్యాచారంచేసి హతమార్చినట్లు తెలుస్తోందని పోలీసులు చెప్పారు. -
రాజధానిలో యువతి గ్యాంగ్ రేప్!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో యువతి గ్యాంగ్ రేప్ కు గురైంది. యువతి స్నేహితుడు మరో ఇద్దరు మిత్రులతో కలిసి కదులుతున్న కారులోనే గ్యాంగ్ రేప్ చేసినట్టు సమాచారం. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ఏరియాలో చోటు చేసుకుంది.ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. అత్యాచారానికి గురైన యువతి ఢిల్లీలోని ఓ మహిళా కానిస్టేబుల్ కుమార్తె అని, కూల్ డ్రింక్ లో మత్తు పదార్థాలు కలిపి ఈఘటనకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కూల్ డ్రింక్ సేవించిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతిపై సామూహిక అత్యారానికి పాల్పడి.. నెహ్రూ ప్లేస్ ఫ్లైఓవర్ వద్ద వదిలి వెళ్లారని పోలీస్ అధికారి తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని గమనించిన ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందిచారని పోలీసులు తెలిపారు. గ్యాంగ్ రేప్ కు గురైనట్టు వైద్య పరీక్షలో తేలిందని పోలీసులు తెలిపారు. -
టెలిఫోన్ కేబుల్ దొంగలముఠా అరెస్టు
భూగర్భంలో వేసిన టెలిఫోన్ కేబుళ్లను చోరీ చేస్తున్న దొంగల ముఠాను దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో కేబుళ్లను వారు తస్కరిస్తుండగా ఎంటీఎన్ఎల్ అధికారులు వాళ్లను పట్టుకున్నారు. వాళ్ల వద్ద ఇలా చోరీ చేసిన దాదాపు 6 లక్షల రూపాయల విలువ చేసే కేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మొయిన్ (24), మంజీర్ ఆలం (25), మహ్మద్ షకీల్ (22), త్రివేణి సింగ్ (40)గా గుర్తించారు. వాళ్లు కేవలం కేబుళ్లను ఎక్కడికక్కడ చోరీ చేయడమే కాదు, ఏకంగా వాటిని భూగర్భం నుంచి బయటకు లాగేందుకు ఉపయోగించే ఐషర్ కాంటర్ ట్రక్కు కూడా సొంతంగా సమకూర్చుకున్నారు. దాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో దక్షిణ ఢిల్లీలోని తొమ్మిది వేర్వేరు పోలీసు స్టేషన్ల పరిధిలో కేబుల్ చోరీ కేసులు పరిష్కారం అయ్యాయని డీసీపీ బీఎస్ జైస్వాల్ తెలిపారు. -
యువతిపై జిమ్ ట్రైనర్ అత్యాచారం
యువతికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి అపై అత్యాచారం చేశాడు ఓ జిమ్ ట్రైనర్. ఆ ఘటన దక్షిణ ఢిల్లీలోని సరోజిని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దాంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా జిమ్ ట్రైనర్ తరుణ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు సరోజిని నగర్ పోలీసులు వెల్లడించారు. బాధితురాలు (30) స్థానికంగా వ్యాపారం చేసుకుంటు జీవనం సాగిస్తుంది. అయితే కొద్ది నెలల క్రితం ఆమె జిమ్‌లో చేరటంతో.... ఆమెకు జిమ్ ట్రైనర్ తరుణ్ శిక్షణ ఇస్తున్నాడు. ఆ క్రమంలో ఆమెకు కూల్ డ్రింక్ ఇచ్చిడు. ఆమె ఆ డ్రింక్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ విషయం ఎక్కడైన చెబితే చంపెస్తానని బెదిరించాడు. దాంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అతడి నివాసంలో అరెస్ట్ చేశారు. -
కొడుకును కొట్టి చంపిన తండ్రి
పనీ పాటా లేకుండా ఖాళీగా తిరుగుతుంటే ఎవరైనా ఎంతకాలం భరిస్తారు? ఏదో ఒక పని చూసుకొమ్మని చెప్పినందుకు తన కన్న కొడుకును కొట్టి చంపాడో తండ్రి. ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగింది. దక్షిణ ఢిల్లీలోని డబ్రి ప్రాంతంలో 21 ఏళ్ల వివేక్ రక్తపు మడుగులో పడి ఉండగా పొరుగున ఉండే మరో వ్య్తక్తి చూసి.. పోలీసులకు తెలిపాడు. వెంటనే వివేక్‌ను ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. వివేక్ తండ్రి కుల్దీప్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే తన కొడుకు తనను కూడా ఏదో ఒక పనిచేసి సంపాదన చూసుకోవాల్సిందిగా పదే పదే ఒత్తిడి చేస్తున్నాడని, దాంతో తాను అసంతృప్తిగా ఉన్నానని అతడు పోలీసులకు చెప్పాడు. కుల్దీప్ను అరెస్టు చేశామని, కొడుకును చావబాదిన ఇనుప రాడ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
విద్యార్థిని నిలువు దోపిడి చేసిన ఆగంతకులు
దేశ రాజధానిలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై దాడులు, దోపిడిలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్ సమీపంలోని మణిపూర్ విద్యార్థి (20)ని ముగ్గురు యువకులు అటకాయించి, అతడి వద్ద నుంచి సెల్ ఫోన్‌తో పాటు రూ. 400 నగదును అపహరించుకుని పోయారు. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సెల్‌ఫోన్‌ను రీఛార్జ్ చేసుకునేందుకు వెళ్తుండగా హజ్రత్ నిజాముద్దీన్ దర్గా సమీపంలో ముగ్గురు యువకులు అతనను బెదిరించి సెల్ ఫోన్, నగదు అపహరించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు ఉన్నతాధికారులు సోమవారం వెల్లడించారు. ఇటీవల న్యూఢిల్లీలోని లజ్‌పత్ నగర్లోమణిపూర్కు చెందిన విద్యార్థి నిడో తానియాను కొంత మంది విద్యార్థులు వేధించారు. దాంతో కొద్ది పాటి ఘర్షణ చోటు చేసుకుంది. ఆ మరసటి దినమే నిడో తానియా మృతి చెందాడు. దాంతో దేశ రాజధాని హస్తినలోని ఈశాన్య రాష్ట్ర వాసులు ఆందోళనకు దిగారు. దాంతో న్యూఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కమిటీ ఏర్పాటుపై ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వివిధ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఏడు రాష్ట్రాలలోని ఏ ఒక్క సంఘాన్ని సంప్రదించకుండా ప్రభుత్వం ఆ కమిటీని ఏర్పాటు చేయడంపై ఆయా సంఘాలు మండిపడుతున్నాయి. -
వివాహితపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అత్యాచారం.. అరెస్టు
న్యూఢిల్లీ: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వివాహితపై అత్యాచారం చేసిన నేరంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. రమణ్ స్వామి అనే ఈ నాయకుడు ఓ మహిళపై జనవరి 25వ తేదీన అత్యాచారం చేసినందుకు అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా, ఈనెల 8వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని హృషికేశ్ నగర్ ప్రాంతంలో తనకు స్వామితో పరిచయం అయ్యిందని, తనకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా ఆయనను కోరానని సదరు మహిళ పోలీసులకు తెలిపింది. తనను ఓఖ్లా ప్రాంతంలో కలవాల్సిందిగా జనవరి 25న అతడు చెప్పడంతో ఆమె అక్కడకు వెళ్లింది. అక్కడినుంచి తన కారులో ఎక్కించుకుని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు వివరించారు. దీ ని గురించి ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా స్వామి ఆమెను బెదిరించాడని తెలిపారు. ఎలాగోలా అదే రోజు ఆమె పోలీసులను ఆశ్రయించింది. దాంతో వారు ఆమెకు వైద్యపరీక్షలు చేయించి, అత్యాచారం జరిగినట్లు నిర్ధారించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన స్వామి, ఓఖ్లా నియోజకవర్గం నుంచి టికెట్ కూడా ఆశించారు. కానీ ఆయనకు అది దక్కలేదు. -
ఆహా అన్పించిన ఆప్
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీవాసులు ఎంతటి చైతన్యవంతులో చెప్పేందుకు ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో ఆదివారం వెలువడిన తీర్పే నిదర్శనం. రాజధాని నగరమైన ఢిల్లీ మినీ భారత్‌ను తలపిస్తుంటుంది. కోటీశ్వరులతో పాటు, పొట్ట నింపుకోవడానికి కోటి కష్టాలు పడే పేదలున్న బస్తీలు కూడా ఇక్కడ అపారం. అన్నింటికి మించి భారత దేశంలోని వివిధ రాష్ట్రాల, ప్రాంతాలవారు ఇక్కడ స్థిరపడిన వారిలో ఉంటారు. ఇలా చూస్తే ఢిల్లీ అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఆయా రాష్ట్రాల, ప్రాంతాల, కులాల సమీకరణాలు పని చేస్తుంటాయి. అయితే వీటన్నింటిని పక్కకు నెడుతూ ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు అన్ని వర్గాలూ బాసటగా నిలిచాయి. 28 స్థానాల్లో ఆప్ గెలవగా, పదిహేనేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కరిష్మా తోడై బీజేపీ 32 స్థానాలు సాధించడం తెలిసిందే. ఢిల్లీ ఓటరు తీర్పును ప్రాంతాలవారీగా ఢిల్లీని సెంట్రల్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, నార్త్‌వెస్ట్ ఢిల్లీ, నార్త్ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, సౌత్‌ఢిల్లీ, సౌత్‌వెస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీగా విభజించి పరిశీలించవచ్చు. సెంట్రల్ ఢిల్లీ: 4 సీట్లలో ఆప్‌కు 3 సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీ ప్రాంతంలో బల్లిమరన్, కరోల్‌బాగ్, న్యూఢిల్లీ, జంగ్‌పురా... ఇలా 4 అసెంబ్లీ స్థానాలుంటాయి. వీటిలో ఎక్కువ మంది ఓటర్లు కేంద్ర ప్రభుత్వోద్యోగులు, మురికివాడల ప్రజలే. వీటిలో న్యూఢిల్లీ సహా మూడింటిని ఆప్ చేజిక్కించుకుంది. బల్లిమరన్ను మాత్రం కాంగ్రెస్ కనాకష్టంగా నిలబెట్టుకుంది. ఉద్యోగులతోపాటు పేదలు, దిగువ మధ్యతరగతి వారు తిరుగులేని మెజారిటీతో ఆప్‌కు పట్టం కట్టారు. ఇన్నాళ్లుగా కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌గా ఉన్న ఇక్కడి జుగ్గీజోపిడీల ఓటర్లు సైతం కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్త్‌వెస్ట్, నార్త్ ఢిల్లీ...: 20 సీట్లలో ఆప్‌కు 7: ఈ ప్రాంతాల్లోని 20 స్థానాల్లో కొన్ని శివారు ప్రాంతాలు. వాటిలో చాలామంది ఓటర్లు కేజ్రీవాల్ స్వరాష్ట్రమైన హర్యానా వారే. దాంతో ఎక్కువ మంది ఆప్ వైపు మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ స్థానాల్లో ఈసారి బీజేపీ, ఆప్ చెరో 7 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ మూడింటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెస్ట్ ఢిల్లీ, సౌత్‌వెస్ట్ ఢిల్లీ: 21 సీట్లలో ఆప్‌కు 9 21 స్థానాలున్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేకపోయింది! ఇక్కడ ఎక్కువగా పంజాబీలు, హర్యానాలతో పాటు దక్షిణాది ఓటర్లుంటారు. వీరంతా ఈసారి కాంగ్రెస్‌కు పూర్తి వ్యతిరేక ఫలితాలిచ్చారు. ఇక్కడ ఆప్ 9 స్థానాలు గెలిచింది. దళితులు,పేదలు ఎక్కువ ఉన్న ప్రాంతాల ఓటర్లంతా ఆప్‌వైపు మళ్లడం గమనార్హం. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో సిక్కులంతా బీజేపీకే మద్దతిచ్చారు. బీజేపీకి 11, దాని మిత్రపక్షం అకాలీదళ్‌కు 1 వచ్చాయి. సౌత్ ఢిల్లీలో...: 10 సీట్లలో ఆప్‌కు 5 ఇక్కడి 10 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువగా తమిళ, మలయాళీ, తెలుగు తదితర దక్షిణాది ఓటర్లతో పాటు ముస్లింల సంఖ్య చాలా ఎక్కువ. వీరిలో చాలామంది ఆప్కే ఓటేశారు. కాంగ్రెస్‌పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ ఆప్ పట్టు నిలుపుకుంది. మురికి వాడల్లోని లక్షలాది ఓట్లు గుండుగుత్తగా దాని ఖాతాలోకి వెళ్లాయి. ఆప్‌కు 5, మధ్యతరగతి ఓటర్లున్న ప్రాంతాల్లో బీజేపీకి 4 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ మాత్రం ముస్లిం ఓటర్లు కాస్త ఎక్కువగా ఉన్న ఆసిఫ్‌నగర్‌తో సరిపెట్టుకుంది. ఈస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీలో...: 15 సీట్లలో ఆప్‌కు 4 ఈస్ట్ ఢిల్లీవాసుల్లో అత్యధికులు ఉత్తరప్రదేశ్‌తో పాటు పర్వత ప్రాంతీయులు. వీరిలో ఢిల్లీ ఓటర్లలో కీలకంగా భావించే పూర్వాంచలీయులు ఉండే ప్రాంతాలు కూడా ఎక్కువే. ఈ ప్రాంతంలో 15 స్థానాల్లో బీజేపీ ఎనిమిది కైవసం చేసుకుంది. అనధికారిక కాలనీలు, బెంగాలీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆప్ 4 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌గా భావించే అనధికారిక కాలనీల్లో, మురికి వాడల్లో ఆప్‌కు భారీ మద్దతు లభించడం విశేషం.