ప్రతీకాత్మక చిత్రం
సాక్షి న్యూఢిల్లీ: పిజ్జా డెలివరీ బాయ్(19)కు కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగిన దక్షిణ ఢిల్లీకి ఊరట లభించింది. పిజ్జా డెలివరీ బాయ్‌తో క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉన్న 16 మందికి కరోనా లేదని తేలడంతో అధికారులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న ఈ 16 మందికి నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని దక్షిణ ఢిల్లీ మేజిస్ట్రేట్ బ్రిజ్ మిశ్రా సోమవారం వెల్లడించారు.
మాలవీయ నగర్‌లోని సావిత్రి నగర్‌కు చెందిన పిజ్జా డెలివరీ బాయ్(19)కు కరోనా వైరస్ సోకినట్లు ఈనెల 14న నిర్ధారణ కావడంతో 72 కుటుంబాలను ప్రభుత్వ అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు. అతడితోపాటు పనిచేసే మరో 17 మంది పిజ్జా డెలివరీ బాయ్‌లను కూడా క్వారంటైన్‌కు తరలించారు. అతడు పనిచేస్తున్న పిజ్జా ఔట్‌లెట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. పిజ్జా డెలివరీ బాయ్ డయాలిసిస్ కోసం ఆసుపత్రికి వెళ్లాడని, అక్కడే కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం.. ఢిల్లీలో ఇప్పటివరకు 2003 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 45 మంది మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment