న్యూఢిల్లీ: డెలివరీ బాయ్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో అతను ఫుడ్ డెలివరీ చేసిన 72 కుటుంబాలను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఈ ఘటన బుధవారం ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాలు.. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రముఖ పిజ్జా సంస్థలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ నిత్యం పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆయనకు తాజాగా పరీక్షలు నిర్వహించగా మంగళవారం పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (ఆదివారం కదా అని పిజ్జా ఆర్డర్ చేస్తే..)
మరోవైపు అధికారులు అతడితోపాటు పనిచేసిన మరో 16 మంది డెలివరీ బాయ్స్‌ను కూడా క్వారంటైన్‌కు తరలించారు. అనంతరం అతను ఫుడ్ డెలివరీ చేసిన ఇళ్ల వివరాలను సేకరించారు. అలా మొత్తంగా 72 కుటుంబాలను గుర్తించి వారిని సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. అయితే డెలివరీ బాయ్స్ ముఖానికి మాస్కులతోనే విధులు నిర్వర్తించారని, కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన పనిలేదని అధికారులు సూచిస్తున్నారు. (కోటి విద్యలు.. ప్రస్తుతం కొన్నే!)
Comments
Please login to add a commentAdd a comment