వివాహితపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అత్యాచారం.. అరెస్టు | Aam Aadmi Party leader arrested for raping married woman | Sakshi
Sakshi News home page

వివాహితపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అత్యాచారం.. అరెస్టు

Published Wed, Feb 5 2014 9:27 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

వివాహితపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అత్యాచారం.. అరెస్టు - Sakshi

వివాహితపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అత్యాచారం.. అరెస్టు

న్యూఢిల్లీ: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వివాహితపై అత్యాచారం చేసిన నేరంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. రమణ్ స్వామి అనే ఈ నాయకుడు ఓ మహిళపై జనవరి 25వ తేదీన అత్యాచారం చేసినందుకు అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా, ఈనెల 8వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు.

దక్షిణ ఢిల్లీలోని హృషికేశ్ నగర్ ప్రాంతంలో తనకు స్వామితో పరిచయం అయ్యిందని, తనకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా ఆయనను కోరానని సదరు మహిళ పోలీసులకు తెలిపింది. తనను ఓఖ్లా ప్రాంతంలో కలవాల్సిందిగా జనవరి 25న అతడు చెప్పడంతో ఆమె అక్కడకు వెళ్లింది. అక్కడినుంచి తన కారులో ఎక్కించుకుని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు వివరించారు. దీ

ని గురించి ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా స్వామి ఆమెను బెదిరించాడని తెలిపారు. ఎలాగోలా అదే రోజు ఆమె పోలీసులను ఆశ్రయించింది. దాంతో వారు ఆమెకు వైద్యపరీక్షలు చేయించి, అత్యాచారం జరిగినట్లు నిర్ధారించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన స్వామి, ఓఖ్లా నియోజకవర్గం నుంచి టికెట్ కూడా ఆశించారు. కానీ ఆయనకు అది దక్కలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement