ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు లేకపోయినా యమునా నది ఉప్పొగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే హర్యానాలోని హత్నికుండా బ్యారేజీ నుంచి నీటిని విడుదల కొనసాగుతుండటంతో యమున నది గరిష్ట నీటి మట్టంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. 45 ఏళ్ల రికార్డును తుడిచిపెడుతూ 208.66 మీటర్ల గరిష్ట నీటి మట్టంతో ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎగువన ప్రవహిస్తోంది. అయితే గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
చదవండి: Video: ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన వరద బాధితురాలు
Rivers keeps reminding us that how powerful they are as Yamuna Ji flowing at its Record Levels#Delhi - #Noida pic.twitter.com/lzxw0JJBY9
— Weatherman Shubham (@shubhamtorres09) July 13, 2023
వరద గుప్పిట్లో కేజ్రీవాల్ నివాసం
యమునా నది మహోగ్ర రూపంతో సెంట్రల్ ఢిల్లీ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. సీఎం కేజ్రీవాల్ నివాసం, ఢిల్లీ అసెంబ్లీని వరద నీరు చుట్టుముట్టింది. సివిల్ లైన్స్ ప్రాంతంలోని రింగ్ రోడ్ వరదలు చేరాయి. దీంతో మజ్ను కా తిలాను కశ్మీరీ గేట్ ఐఎస్బీటీతో కలిపే మార్గంపై రాకపోకలు నిలిపివేశారు అధికారులు.
#WATCH | Civil Lines area of Delhi flooded, latest visuals from the area.
— ANI (@ANI) July 13, 2023
Several areas of the city are reeling under flood and water-logging as the water level of river Yamuna continues to rise following heavy rainfall and the release of water from Hathnikund Barrage. pic.twitter.com/UecZsfIBwb
ఇళ్లు జలమయం, పాఠశాలలకు సెలవులు
యమునా నది ప్రళయంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో స్థానిక ప్రజలను ఖాళీ చేశారు. వారిని సహాయక శిబిరాలకు తరలించారు. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. వరదల ప్రభావంతో మరో రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నది ఒడ్డున ఉన్న ప్రాంతాలు యమునా బజార్, ప్రసిద్ధ టిబెటన్ మొనాస్టరీ మార్కెట్, నిగంబోధ్ ఘాట్‌లో దహన సంస్కారాలను నిలిపివేశారు.
చదవండి: Delhi Floods: దేశ రాజధానికి ఈ దుస్థితి దేనికి?
Flood has caused massive devastation in northern India, now has reached Delhi - Modi left for Paris! pic.twitter.com/I8eTMulhmo
— Ashok Swain (@ashoswai) July 13, 2023
వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల మూసివేత
'యమునా నది నీటిమట్టం పెరగడంతో వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లాలోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. దీని వల్ల ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తుతుంది. నది నీటిమట్టం తగ్గిన వెంంటనే ఈ ప్లాంట్‌లను మళ్లీ రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. అదే విధంగా ఈ క్రమంలో హత్నికుండా బ్యారేజ్ నుంచి నీటి విడుదల నిలిపివేయాలని కేంద్రాన్ని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. అయితే పూర్తిస్థాయి నీటి మట్టం దాటేయడంతో, అదనపు నీటిని విడుదల చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది.
#WATCH | Delhi CM Arvind Kejriwal says, "We are at the Wazirabad Water Treatment Plant. For the first time in Delhi, Yamuna has touched this level. Three Water Treatment Plants have been shut down due to this as the water has entered pumps & machines...25% of the water supply in… pic.twitter.com/SAAhguqo45
— ANI (@ANI) July 13, 2023
Comments
Please login to add a commentAdd a comment