దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ చర్చిని ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చర్చిలో ఉన్న ప్రార్థనకు సంబంధించిన వస్తువులను అటూ ఇటూ విసిరేశారు. కొన్ని వస్తువులు పగిలిపోయినట్లు ఎఫ్ఐఆర్ దాఖలైంది.
సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని, దాని ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా.. గత సంవత్సరం నవంబర్ నుంచి చర్చిలపై దాడులు జరగడం ఇది ఐదో సారి.
ఢిల్లీలో చర్చిపై దుండగుల దాడి
Published Mon, Feb 2 2015 10:42 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM
Advertisement
Advertisement