విధ్వంసం.. టీ20ల్లో 308 పరుగులు! స‌న్‌రైజ‌ర్స్ రికార్డు బ‌ద్దలు | South Delhi Superstarz Surpass SRHs IPL Record With Six-Hitting Show In DPL 2024, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

DPL 2024: విధ్వంసం.. టీ20ల్లో 308 పరుగులు! స‌న్‌రైజ‌ర్స్ రికార్డు బ‌ద్దలు

Published Sun, Sep 1 2024 10:33 AM | Last Updated on Sun, Sep 1 2024 2:32 PM

South Delhi Superstarz Surpass SRHs IPL in Dpl 2024

ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌-2024లో సిక్స‌ర్ల మోత మోత మోగింది. ఈ లీగ్‌లో భాగంగా శ‌నివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నార్త్‌ ఢిల్లీ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌత్‌ ఢిల్లీ సూపర్‌స్టార్స్ బ్యాట‌ర్లు ఆయుష్‌ బదోని,  ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి విధ్వంసానికి అరుణ్ జైట్లీ స్టేడియం దద్దరిల్లిపోయింది.

ఈ ఇద్దరూ యువ ఆటగాళ్లు మెరుపు సెంచరీలతో చెలరేగారు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశారు. ఆయుష్‌ బదోని 55 బంతుల్లో 8 ఫోర్లు, 19 సిక్స్‌లతో 165 పరుగులు చేయగా.. ప్రియాన్ష్‌ ఆర్య 50 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌ల సాయంతో 120 పరుగులు చేశాడు. ఇక వీరిద్దరి సంచలన ఇన్నింగ్స్‌ల ఫలితంగా సౌత్‌ ఢిల్లీ సూపర్‌స్టార్స్ నిర్ణీత‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీస్కోరు చేసింది.

అరుదైన రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసిన సౌత్‌ ఢిల్లీ సూపర్‌స్టార్స్  జ‌ట్టు ఓ అరుదైన ఘ‌న‌తను త‌మ పేరిట లిఖించుకుంది. టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక స్కోర్ సాధించిన రెండో జట్టుగా  సౌత్‌ ఢిల్లీ రికార్డుల‌కెక్కింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు ఐపీఎల్ ఫ్రాంచైజీ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పేరిట ఉండేది. 

ఐపీఎల్‌-2024లో ఎస్ఆర్‌హెచ్ ఆర్సీబీపై 283 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. తాజా మ్యాచ్‌లో 308 ప‌రుగులు చేసిన సౌత్ ఢిల్లీ.. స‌న్‌రైజర్స్ రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఈ జాబితాలో నేపాల్ అగ్ర‌స్ధానంలో ఉంది. 2023లో మంగోలియాపై నేపాల్ 3 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement