
ఎదురు కాల్పుల్లో ధ్వంసమైన వాహనం..
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ భేరీ ప్రాంతం శనివారం మధ్యాహ్నం కాల్పులతో దద్దరిల్లింది. కరుడుగట్టిన నేరస్థుడు రాజేష్ భార్తీ, అతని ముగ్గురు అనుచరులను ప్రత్యేక పోలీసు దళం కాల్చి చంపింది. ఢిల్లీ, చుట్టు పక్కల రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న రాజేష్ చత్తర్‌పూర్ ప్రాంతంలో మరో నేరం చేయబోతున్నాడనే సమాచారంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఫతేపూర్ భేరీ ప్రాంతంలో పాగా వేసింది.
అయితే, తమ రాకను పసిగట్టిన రాజేష్ గ్యాంగ్ కాల్పులకు దిగిందని పోలీసులు తెలిపారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు చేయడంతో రాజేష్‌తో పాటు అతని ముగ్గురు అనుచరులు హతమయ్యారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. కాగా, ఓ కేసులో హరియాణాలో అరెస్టయిన రాజేష్ ఇటీవలే పోలీసు కస్టడీ నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. 12 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడి తలపై గతంలో నగర పోలీసు కమిషనర్ లక్ష రూపాయల రివార్డు ప్రకటించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment