న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న అమ్మాయిపై సామూహిక లైంగిక దాడి జరిగింది. నలుగురు యువకులు కలిసి రెండు రోజులపాటు ఈ దారుణానికి ఒడిగట్టారు. అంతే కాదు.. తమ మొబైల్ ఫోన్లలో లైంగికదాడి దృశ్యాలను వీడియో తీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరణ్ అనే యువకుడు పలరా గ్రామానికి చెందినవాడు. సంజయ్ కుమార్ అనే మరో యువకుడు ధనిష్కపూర్ కు చెందిన వాడు కాగా మహేశ్, కాలా అనే మరో ఇద్దరు కరణ్ ఇంటికి దగ్గర్లో ఉండేవారు.
కరణ్కు బాధితురాలు ముందే తెలుసు. తొలుత బస్టాండ్లో ఉన్న పదో తరగతి చదువుతున్న ఆ అమ్మాయిని కరణ్ తన బైక్పై ఓ గుడికి తీసుకెళ్లాడు. అనంతరం మాయమాటలు చెప్పి దక్షిణ ఢిల్లీలోని కాకాజీ ప్రాంతంలోగల ప్లాట్కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత మరో ముగ్గురు అక్కడికి వచ్చి చేరారు. ఆ క్రమంలోనే కరణ్, సంజయ్ కుమార్ ఆ యువతిపై లైంగికదాడి చేయగా వారితోనే ఉన్న మహేశ్, కాలా వీడియోలు తీశారు. రెండురోజులపాటు ఇలా ఆ అమ్మాయిని రూములో బంధించి ఈ దారుణం చేశారు. అనంతరం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి విడిచిపెట్టారు. ఇంటికెళ్లిన బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నారు.
తెలిసినవాడే కదా అని వెళ్లినందుకు..
Published Thu, Aug 11 2016 3:15 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
Advertisement
Advertisement