ఘర్షణ: యువకుడి దారుణ హత్య | Man Stabbed Multiple Times Deceased In Delhi | Sakshi
Sakshi News home page

రాజధానిలో యువకుడి దారుణ హత్య

Published Fri, Oct 30 2020 3:34 PM | Last Updated on Fri, Oct 30 2020 4:05 PM

Man Stabbed Multiple Times Deceased In Delhi - Sakshi

సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు (కర్టెసీ: ఎన్డీటీవీ)

న్యూఢిల్లీ: మనుషుల్లో నేర ప్రవృత్తి రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోయి హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ఏరియాలో వాగ్వాదంతో మొదలైన ఘర్షణ ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్‌(21) అనే వ్యక్తి బుధవారం రాత్రి పాల ప్యాకెట్‌ కొనేందుకు బయటకు వచ్చాడు. ఈ క్రమంలో విక్కీ, అతడి స్నేహితులు పీయూష్‌, వివేక్‌ సతీష్‌ను అటకాయించగా, ఇంకెప్పుడూ తమ ఏరియాలో కనిపించవద్దని అతడు హెచ్చరించాడు. (చదవండి: వివాహేతర సంబంధం.. ట్రాక్టర్‌తో తొక్కించి )

దీంతో కోపోద్రిక్తులైన స్నేహబృందం సతీష్‌పై దాడి చేసింది. కాలర్‌ పట్టుకుని అతడిపై పిడిగుద్దులు కురిపించారు. ఆ తర్వాత కత్తితో పొడిచి పరారయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన సతీష్‌ ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్లో ఒకడైన విక్కీని అరెస్టు చేశామని, మిగిలిన వాళ్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఘటనపై లోతుగా విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.(చదవండి: షాకింగ్‌: రోడ్డుపై దారుణ హత్య.. ఆపై)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement