సాక్షి, న్యూఢిల్లీ : నిర్లక్ష్యం ఎవరిదైనా 20 రోజల ఓ పసికందు ప్రాణం బలైంది. తల్లి చూస్తుండగానే చిన్నారిని లాక్కెల్లిన పంది పీక్కుతింది. తల్లి, స్థానికులు అప్రమత్తం అయ్యేలోపే ఘోరం జరిగిపోయింది. ఆపై తీవ్రంగా గాయపడ్డ ఆ పసికందు చికిత్స పొందుతూ మరణించింది. దక్షిణ ఢిల్లీలోని భాటి మైన్స్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నాం ఈ ఘటన చోటు చేసుకుంది.
పుష్ప అనే మహిళ తన బిడ్డకు పాలు ఇస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ఓ పంది శిశువును పట్టుకుని పరిగెత్తింది. అది గమనించిన పుష్ప తల్లి అరుచుకుంటూ పంది వెంటపడింది. కానీ, అప్పటికే కాస్త దూరంగా వెళ్లిన పంది చిన్నారి తలను కొరిసేంది. కేకలు విని పరిగెత్తుకుంటూ వచ్చిన చుట్టుపక్కల వాళ్లు రాళ్లు విసిరి పందిని బెదరగొట్టారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది.
విమర్శలు...
ఈ ఘటన బోలెడు విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు జాప్యం చేయటం వల్లే సకాలంలో చిన్నారికి వైద్యం అందలేని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న చాలా సేపటికి పోలీసులు అక్కడికి చేరుకున్నారని.. చిన్నారిని 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎయిమ్స్‌కు తీసుకెళ్లారని... పైగా ట్రాఫిక్ జామ్ ఉంటుందని చెబుతున్నా కూడా వినకుండా ఆ మార్గంలో తీసుకెళ్లారని వారు ఆరోపిస్తున్నారు.
ఇక ఆ ప్రాంతంలో యధేచ్ఛగా పందుల పెంపకం చేపడుతున్న కొందరు వాటిని స్వేచ్ఛగా వదలటంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. తరచూ అవి తమ పిల్లలపై దాడులు కూడా చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పంది యజమానిని గుర్తించే పనిలో ఉన్నామని అదనపు డీసీపీ చిన్మయి బిస్వాల్ వెల్లడించారు.
పుష్ప, ఆమె భర్త
Comments
Please login to add a commentAdd a comment