Pig Attack
-
అడవి పందిని చంపితే రూ.5 లక్షలు జరిమానా!
మహబూబ్‌నగర్: అడవి జంతువులను ఏ రకంగా చంపినా అటవీ శాఖ కొత్త చట్టం ప్రకారం పట్టుబడితే కేసుతో పాటు రూ. 1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు అటవీశాఖ వారు పేర్కొన్నారు. ఇటీవల మండల పరిధిలోని అంబట్పల్లికి చెందిన వ్యక్తి అడవి పందిని చంపడంతో అటవీశాఖ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుని అతనితో రూ.లక్ష జరిమానా వసూలు చేసిన విషయం ఆలస్యంగా తెలిసింది. పెద్దకొత్తపల్లి మండలం ఆదిరాల దగ్గర రైతు పంట పొలాన్ని రక్షించుకోవడానికి పొలం చుట్టూ విద్యుత్ తీగలతో షాక్‌ను ఏర్పాటు చేశాడు. తీగలకు తగిలిన పంది చనిపోయింది. దాన్ని అంబట్పల్లికి చెందిన వ్యక్తి కొనుగోలు చేసి తీసుకొస్తున్న క్రమంలో అటవీశాఖ స్పెషల్ పార్టీ వారు పట్టుకున్నారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి రూ.లక్ష జరిమానా వసూల్ చేశారు. ఈ విషయాన్ని అటవీ శాఖకు చెందిన ఓ అధికారి ధృవీకరించారు. ప్రస్తుతం పంట సాగు సీజన్ కావడంతో పొలాల రైతులు అడవిపందుల నుంచి పంటలను రక్షించుకోవడానికి విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తున్నారు. మరి కొందరు వేటగాళ్లు వేటనే తమ వృత్తిగా ఎంచుకొని కొనసాగిస్తుంటారు. అటవీ శాఖ కొత్తగా రూపొందించిన చట్టం కఠినంగా ఉండడంతో రైతులు, వేటగాళ్లు అడవి జంతువులను చంపే ప్రయత్నాలు మానుకోవాలి. లేదంటే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. -
పంది దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు
విజయనగరం మున్సిపాలిటీ : పందుల నియంత్రణ చర్యల్లో అధికారుల నిర్లక్ష్య వైఖరి ఓ బాలుడి నిండు ప్రాణాల మీదకు తెచ్చింది. జిల్లా కేంద్రమైన విజయనగరం మున్సిపాలిటీలో ఆదివారం పట్టణ శివారు ప్రాంతమైన సింగపూర్ సిటీ ప్రాంగణంలో జరిగిన సంఘటనతో ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. అదే ప్రాంతానికి టి.సాయి (9) నిత్యావసరాల కోసం దుకాణానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో పిల్లల పంది అనూహ్యంగా దాడి చేసింది. సమీపంలో ఎవ్వరు లేకపోవడంతో సాయిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీంతో సాయి ముఖంతో పాటు కడుపు, రెండు చేతులు, తొడ భాగంపై తీవ్ర గాయలపాలయ్యాయి. విషయం తెలుసుకుని తల్లిదండ్రులు, స్థానికులు సాయిని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించి 40 కుట్లు వేశారు. మెరుగైన శస్త్ర చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఉలిక్కిపడిన సింగపూర్ కాలనీ వాసులు.. బాలుడిపై పంది దాడి చేయడంతో సింగపూర్ సిటీ ప్రాంతంలో నివసిస్తున్న వారంతా ఉలిక్కిపడ్డారు. నిత్యం వందలాది మంది చిన్నారులు ఈ ప్రాంతంలో పాఠశాలలకు వస్తుంటారు. అయితే ఆదివారం జరిగిన సంఘటనతో పిల్లలను బడికి పంపించేందుకు కూడా భయపడాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిపై పంది తీవ్ర స్థాయిలో దాడి చేసినా మున్సిపల్ యంత్రాంగం స్పందించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం చేశారు. పందులు, కుక్కల దాడిలో నిత్యం ఎవరో ఒకరు గాయపడుతున్నా మున్సిపల్ పాలకవర్గం, యంత్రాంగం పట్టించుకోకపోవడం పట్ల దారుణమంటూ పట్టణవాసులు మండిపడుతున్నారు. -
ఘోరం.. పసికందు ప్రాణం తీసిన పంది
సాక్షి, న్యూఢిల్లీ : నిర్లక్ష్యం ఎవరిదైనా 20 రోజల ఓ పసికందు ప్రాణం బలైంది. తల్లి చూస్తుండగానే చిన్నారిని లాక్కెల్లిన పంది పీక్కుతింది. తల్లి, స్థానికులు అప్రమత్తం అయ్యేలోపే ఘోరం జరిగిపోయింది. ఆపై తీవ్రంగా గాయపడ్డ ఆ పసికందు చికిత్స పొందుతూ మరణించింది. దక్షిణ ఢిల్లీలోని భాటి మైన్స్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నాం ఈ ఘటన చోటు చేసుకుంది. పుష్ప అనే మహిళ తన బిడ్డకు పాలు ఇస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ఓ పంది శిశువును పట్టుకుని పరిగెత్తింది. అది గమనించిన పుష్ప తల్లి అరుచుకుంటూ పంది వెంటపడింది. కానీ, అప్పటికే కాస్త దూరంగా వెళ్లిన పంది చిన్నారి తలను కొరిసేంది. కేకలు విని పరిగెత్తుకుంటూ వచ్చిన చుట్టుపక్కల వాళ్లు రాళ్లు విసిరి పందిని బెదరగొట్టారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. విమర్శలు... ఈ ఘటన బోలెడు విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు జాప్యం చేయటం వల్లే సకాలంలో చిన్నారికి వైద్యం అందలేని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న చాలా సేపటికి పోలీసులు అక్కడికి చేరుకున్నారని.. చిన్నారిని 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎయిమ్స్‌కు తీసుకెళ్లారని... పైగా ట్రాఫిక్ జామ్ ఉంటుందని చెబుతున్నా కూడా వినకుండా ఆ మార్గంలో తీసుకెళ్లారని వారు ఆరోపిస్తున్నారు. ఇక ఆ ప్రాంతంలో యధేచ్ఛగా పందుల పెంపకం చేపడుతున్న కొందరు వాటిని స్వేచ్ఛగా వదలటంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. తరచూ అవి తమ పిల్లలపై దాడులు కూడా చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పంది యజమానిని గుర్తించే పనిలో ఉన్నామని అదనపు డీసీపీ చిన్మయి బిస్వాల్ వెల్లడించారు. పుష్ప, ఆమె భర్త -
పంది దాడిలో బాలికకు గాయాలు
రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు సోమందేపల్లి : పంది దాడిలో బాలికకు గాయాలయ్యాయి. మండల కేంద్రంలోని సప్తగిరి కాలనీకి చెందిన గీత (16) సోమవారం సరుకుల కోసం దుకాణానికి వెళ్లి వస్తుండగా అక్కడే ఉన్న ఓ పంది దాడిచేసింది. ఎడమ చెయ్యి, కుడివైపు ముఖ భాగంలో గాయపరిచింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్షించారు. అనంతరం ఆమెను తల్లి అంజినమ్మ స్థానికుల సాయంతో పెనుకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు : పందుల బెడద నుంచి కాపాడాలని గ్రామస్తులు కొత్తపల్లి క్రాస్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ఎస్ఐ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులతో చర్చించారు. పెంపకందారులను పిలిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు. -
పంది దాడిలో తండ్రీ కొడుకులకు గాయాలు
పెద్దాపురం రూరల్, న్యూస్‌లైన్ : పెద్దాపురం పట్టణంలోని కంచర్లవారి వీధికి చెందిన తండ్రీ కొడుకులపై గురువారం రాత్రి పంది దాడిచేసి గాయపరిచింది. స్థానికుల కథనం మేరకు కంచర్ల వారి వీధిలో నివాసం ఉంటున్న గెడ్డం సురేష్ కుమారుడు ఐదేళ్ల కైలాస్ ఇంటి అరుగుపై ఆడుకుంటున్నాడు. ఇంతలో ఓ పంది అక్కడకు వచ్చి కైలాస్ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ పరుగులు తీసింది. ఇది గమనించిన బాలుడి తండ్రి సురేష్ దానిని వెంబడించాడు. అతడిని కూడా గాయపర్చింది. కైలాస్‌కు తలపైన, సురేష్‌కు మెడ కింద భాగంలో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి పందిని తరిమివేశారు. అనంతరం ఆర్డీవో కూర్మనాథ్‌కు ఫిర్యాదు చేశారు.