పంది దాడిలో తండ్రీ కొడుకులకు గాయాలు | Pig Attack in Father, son injured | Sakshi
Sakshi News home page

పంది దాడిలో తండ్రీ కొడుకులకు గాయాలు

Published Fri, Feb 28 2014 2:43 AM | Last Updated on Sun, Sep 2 2018 4:41 PM

Pig Attack in Father, son injured

పెద్దాపురం రూరల్, న్యూస్‌లైన్ : పెద్దాపురం పట్టణంలోని కంచర్లవారి వీధికి చెందిన తండ్రీ కొడుకులపై గురువారం రాత్రి పంది దాడిచేసి గాయపరిచింది. స్థానికుల కథనం మేరకు కంచర్ల వారి వీధిలో నివాసం ఉంటున్న గెడ్డం సురేష్ కుమారుడు ఐదేళ్ల కైలాస్ ఇంటి అరుగుపై ఆడుకుంటున్నాడు. ఇంతలో ఓ పంది అక్కడకు వచ్చి కైలాస్ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ పరుగులు తీసింది. ఇది గమనించిన బాలుడి తండ్రి సురేష్ దానిని వెంబడించాడు. అతడిని కూడా గాయపర్చింది. కైలాస్‌కు తలపైన, సురేష్‌కు మెడ కింద భాగంలో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి పందిని తరిమివేశారు. అనంతరం ఆర్డీవో  కూర్మనాథ్‌కు ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement