న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజల్లో అధిక శాతం మంది సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే దాకా జరిగిన ప్రతీ విషయాన్ని పంచుకుంటూ ఆత్మీయులకు దగ్గరగా ఉంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇందుకు భిన్నంగా అసాంఘిక చర్చలు, అశ్లీల ఫొటోల షేర్లతో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారు. దక్షిణ ఢిల్లీకి చెందిన కొంతమంది బాలురు ఇదే బాటలో నడిచారు.‘‘ బాయ్స్ లాకర్ రూం’’ పేరిట గ్రూప్ క్రియేట్ చేసి.. అమ్మాయిలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడాలంటూ ఇతరులను రెచ్చగొడుతూ కామెంట్లు చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేసి షేర్ చేశారు. వీరి బాగోతాన్ని ఓ బాలిక ట్విటర్ వేదికగా బహితర్గంతం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.(ఐసీయూలోని కరోనా పేషెంట్‌తో డాక్టర్ అసభ్య ప్రవర్తన)
ఓ జాతీయ మీడియా వివరాల ప్రకారం... 17-18 ఏళ్ల వయస్సున్న అబ్బాయిలు కొంతమంది బృందంగా ఏర్పడ్డారు. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్, స్పాన్‌చాట్‌లలో షేర్ చేస్తున్నారు. తన స్కూలుకు చెందిన అబ్బాయి ఒకరు ఈ బృందంలో సభ్యుడిగా ఉన్న విషయం తెలుసుకున్న ఓ బాలిక.. ఆ గ్రూపు వివరాలను తెలుపుతూ ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టింది. వారి సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు షేర్ చేసింది. ఇటువంటి వాళ్లు ఉంటారు కాబట్టే తనను సోషల్ మీడియా వాడొద్దని అమ్మ చెప్పిందని.. తన ఇన్‌స్టా అకౌంట్ తొలగించాలంటూ ఒత్తిడి చేస్తోందని రాసుకొచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ కావడంతో సదరు గ్రూపును గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటే ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుందని.. ఇప్పటికే చాలా మందిని ఈ వేదిక స్టార్లను చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.(చావులో ఒక్కటయ్యారు..)
Comments
Please login to add a commentAdd a comment