పిజ్జా లేటయిందేంటి అన్నందుకు పొడిచేశాడు!
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో డొమినోస్ పిజ్జాకు చెందిన ఓ డెలివరీ ఉద్యోగి వినియోగదారున్ని కత్తితో పొడిచాడు. పిజ్జా ఆలస్యంగా తీసుకురావడంపై గొడవ జరగడంతో అతను దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కాలిఫోర్నియాలోని గ్లెన్ డోరాకు చెందిన మైఖేల్ చార్లెస్ (31)ను పోలీసులు అరెస్టు చేశారు. పిజ్జా డెలివరీ లేట్ అయినందుకు గొడవ జరగడంతో అతను 20 ఏళ్ల వ్యక్తిని పొడిచాడని పోలీసులు తెలిపారు.
దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని, అయితే ప్రాణాపాయం లేదని చెప్పారు. కాలిఫోర్నియాలోని కొవిన్ లో శనివారం ఈ ఘటన జరిగింది. మెడపై, మణికట్టుపై గాయాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అరెస్టైన నిందితుడు 30వేల డాలర్ల పూచీకత్తు బెయిల్ పై విడుదలయ్యాడు. అతనిపై మార్చ్ 21న పోలీసులు అభియోగాలు నమోదుచేయనున్నారు.