అంతర్జాతీయ మోడల్‌ హఠాన్మరణం.. | Model Dayle Haddon Departed After Suspected Carbon Monoxide Leak | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ మోడల్‌ హఠాన్మరణం..

Published Sun, Dec 29 2024 9:55 AM | Last Updated on Sun, Dec 29 2024 9:55 AM

Model Dayle Haddon Departed After Suspected Carbon Monoxide Leak

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ మోడల్‌ డేల్‌ హడన్‌(Dayle Haddon(76)) అనూహ్యంగా మృతి చెందారు. తన ఇంటిలోని మొదటి అంతస్తులో అచేతనంగా కనిపించారు.   సమాచారం అందుకున్న పోలీసుల హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రి తరలించారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. 

అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. అయితే మోడల్‌ మరణం అనుమానాస్పదం లేక హత్యా అనే అనుమానం రేకెత్తించింది. అయితే పోలీసుల విచారణలో విషపూరిత కార్బన్‌ మోనాక్స్‌డ్‌ని పీల్చడం వల్లే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని భావిస్తున్నారు. ఎందుకంటే ఆమె ఇంటిలోని బాయిలర్‌ హీటింగ్‌ యూనిట్‌లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. 

ఈ హీటింగ్‌ యూనిట్‌ కార్బన్ మోనాక్సైడ్ వాయువు(Carbon Monoxide)కి మూలం. కావున ఈ యూనిట్‌ లీకేజ్‌ లోపం కారణంగానే ఈ కెనడా మోడల్‌(Canadian Model) మరణించినట్లుగా భావిస్తున్నారు పోలీసులు. అలాగే అగ్నిమాపక కంపెనీ నమోదు చేసిన రీడింగ్‌లో ఆ ఇంటిలో కార్బన్‌ మోనాక్స్‌డ్‌ వాయువు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మాంట్రియల్‌లో పుట్టి పెరిగిన డేల్‌ హడన్‌కి ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌ భాషల్లో మంచి నిష్ణాతురాలు.

తొలుత బ్యాలెట్‌(డ్యాన్సర్‌గా) ఈ వృత్తిని కొనసాగించింది. ఆ తర్వాత రెవ్లాన్, ఎస్టీ లాడర్, క్లైరోల్ మరియు మాక్స్ ఫ్యాక్టర్ వంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలకు మోడల్‌గా పనిచేసింది. అంతేగాదు వోగ్‌ మేగజైన్‌ కవర్‌పేజ్‌లో ఆమె ముఖం చిత్రం ప్రచురితమైంది. అలా ఆమె సూపర్‌ మోడల్‌ అనే పేరుని సుస్థిర పరుచుకుంది. అంతేగాదు 15 ఏళ్లకు పైగా లోరియల్‌(L'Or'eal) అనే కాస్మెటిక్‌ కంపెనీకి ప్రతినిధిగా పనిచేసింది. అలాగే యూనిసెఫ్‌కు అంబాసిడర్‌గా బాలికలు, మహిళల విద్య కోసం కృషి చేశారు. 

అందుకోసం స్వచ్ఛంద సంస్థ విమెన్‌వన్‌ని స్థాపించి మహిళలకు మంచి విద్య అందేలా చూశారామె. కేవలం అందంతోనే గాక దయ, మానవత్వం వంటి సేవా కార్యక్రమాలతో మరింత మంది అభిమానులను సంపాదించుకుంది డేల్‌. తన తల్లి జ్ఞాపకాలను తలుచుకుంటూ కుమార్తె ర్యాన్‌ నివాళులర్పించారు. కాగా  కుమార్తె కుమార్తె ర్యాన్ హాడన్ జర్నలిస్ట్‌,  అల్లుడు పెన్సిల్వేనియా ఇల్లు బ్లూకాస్ హాల్‌మార్క్ నటుడు.

(చదవండి: వనితదే చరిత)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement