ఎంపీలు బాధ్యత తెలుసుకోవాలి
పార్లమెంటులో ఎంపీల పనితీరుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ పార్లమెంటేరియన్గా అపార అనుభవం ఉన్న ప్రణబ్ ముఖర్జీ, ప్రస్తుతం పార్లమెంటు పనిచేస్తున్న తీరు పట్ల తన అసంతృప్తిని తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని వివిధ అంశాలు, సమస్యలపై చర్చించాలని, అప్పుడే వారికి తమ అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ఏ అంశం మీద అయినా చర్చించడానికి, అభ్యంతరాలు తెలియచేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి అసలు పార్లమెంటు అంటూ పనిచేయాలని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పార్లమెంటును అడ్డుకోవడం తగదని, ఎంపీలు తమ బాధ్యతలను గుర్తెరగాలని ప్రణబ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పార్లమెంటు నడుస్తున్నతీరుపై ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన తెలిపారు.