అంగన్ వాడీల వేతనాల పెంపుపై శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై అంగన్ వాడీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
విజయవాడ: అంగన్ వాడీల వేతనాల పెంపుపై శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై అంగన్ వాడీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా.. 2015 సెప్టెంబర్ 1 నుంచి వేతనాలు పెంచూ జీవో జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
2016 ఎప్రిల్ నుంచి వేతనాలు పెంచుతూ జీవోను అమలు చేస్తామంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు అంగన్ వాడీలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.