బాబు ఆగడాలు మర్చిపోతే ఎలా రామోజీ? | FactCheck: Eenadu False writings on Anganwadis In AP, Facts Inside - Sakshi
Sakshi News home page

FactCheck: బాబు ఆగడాలు మర్చిపోతే ఎలా రామోజీ?

Published Fri, Sep 1 2023 4:21 AM | Last Updated on Fri, Sep 1 2023 11:56 AM

Eenadu writings on Anganwadi - Sakshi

సాక్షి, అమరావతి: అధికారం తమవారి చేతుల్లో లేకపోతే కడుపుమంట ఎంతలా ఉంటుందో రామోజీని చూస్తే తెలుస్తుంది. అబ­ద్ధాలను అతికి­నట్లు చెప్పడంలోగానీ.. నిజా­లను పాతర వెయ్య­డంలోగానీ ఆయన ఎంతో నేర్పరి. వాస్తవాలు బయటకొ­స్తాయనే భయం కూడా ఆయనకు కొరవడింది.. నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతుంటే పాఠకులు ఎలా స్పందిస్తారో అన్న కనీస స్పృ­హ కూడా కరువైంది. ఎందుకంటే.. అంగన్‌వాడీలను ఉక్కుపాదంతో అణచివేసిన చంద్రబాబును వదిలేసి అధి­కారంలోకి వచ్చీ­రాగానే వారికి ఎన్నో వరాలిచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌పై ‘అంగన్‌వాడీలపై ఉక్కు­పాదం’ అంటూ తాజాగా చేతికొచ్చి­నట్లు రాసి­­­పారేశారు.

ఈ కాకమ్మ ‘కథల్ని’ జనం నమ్మే రోజులు పోయాయని ఇంకెప్పుడు తెలు­సుకుంటారో రామోజీ..? ఎన్ని­కలు సమీ­పి­స్తున్న తరుణంలో అన్ని వర్గా­లను రెచ్చ­­గొట్టి రాజ­కీయ లబ్ధిపొందే ‘పచ్చ’­బ్యాచ్‌ కుట్రలు శృతిమించుతు­న్నాయి. నిజా­నికి.. అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే వర్కర్లు, హెల్పర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక వరాలిచ్చారు. చెప్పి­నట్లు­గానే అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి వేత­నాలు పెంచారు.. పదోన్నతులు కల్పించారు.. పదోన్నతుల్లో వయో పరిమితి పెంచుతూ అనేకమందికి అవకాశం కల్పించారు.. అంతేకాక, పాత స్మార్ట్‌ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్‌ఫోన్లు అందించారు.. మును­పెన్నడూ లేని విధంగా సెలవులు కూడా మంజూరు చేశారు.

బీమా కల్పించారు.. ఇలా చెప్పుకుంటూపోతే ఎంతో మేలుచేసి మనసున్న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ అంగన్‌వాడీల మన్ననలు అందుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, వర్కర్లు, హెల్పర్ల వేతనాల పెంపు వంటి అనేక విషయాల్లో దేశంలోనే ఏపీ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తోంది. అయినా అంగన్‌వాడీలను రెచ్చ­గొట్టి ప్రభు­త్వాన్ని అభాసుపాలు చేసేందుకు ఎల్లో మీడియా కిందామీదా పడుతోంది.

పొరుగు­నున్న తెలంగాణాతో పోల్చి బాబు హయాంలోనే బాగా చేశారని గొప్పలు చాటేలా ఈనాడు ఆ కథనంలో తెగ తాప­త్ర­యపడింది. నిజానికి.. అంగన్‌వాడీల విష­యంలో చంద్రబా­బు­దే ఉక్కు­పాదం.. జగన్‌ ఆపన్న హస్తం అందించారని చెప్పేందుకు అనేకానేక ఉదా­హరణ­లున్నాయి. వారిపట్ల గత ప్రభు­త్వం ఎంత నిర్లక్ష్యం వహించింది? ప్రస్తుత ప్రభుత్వం ఎలా వ్యవహరి­స్తోంది? అనే వాస్తవాలు ఒకసారి పరిశీలించండి.

గుర్రాలతో తొక్కించినది మరిచారా
గత ఎన్నికలకు ఆరునెలల ముందు అంగన్‌వాడీలకు హడావుడిగా జీతాలు పెంచి వాటిని అమలుచేయకుండా బకాయిలు పెట్టిన చంద్రబాబు సంగతిని వారు మర్చిపోలేదు. అలాగే, గతంలో వేత­నాలు పెంచాలని ఆందోళన చేపట్టిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్ప­ర్లను గుర్రాలతో తొక్కించి, లాఠీలతో కొట్టించిన చంద్రబాబు నిరంకుశ పాలననూ ఎలా మర్చిపోగలరు? ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపి­స్తున్న తరుణంలో ‘పచ్చముఠా’ మొసలి­కన్నీరు కారుస్తోంది.

ఇవిగో వాస్తవాలు..
 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ అంగన్‌వాడీ వర్కర్ల జీతం నెలకు రూ.7 వేలు, హెల్పర్లకు రూ. 4,500 మాత్రమే. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన మొదటి మూడు వారాల్లోనే వారికి జీతాలు పెంచారు. అంగన్‌వాడీలకు రూ.11,500కు, హెల్పర్లకు రూ.7 వేలకు పెంచుతూ 2019 జూన్‌ 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.  
   విధి నిర్వహణలో మంచి పనితీరు కనబర్చిన అంగన్‌వాడీ వర్కర్లకు, హెల్పర్లకు ప్రోత్సా­హకంగా నెలకు రూ.500 చొప్పున ప్రభుత్వం అదనంగా అందిస్తోంది. ఇందుకోసం ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు చెల్లిస్తోంది. 
   2013 నుంచి అంగన్‌వాడీలకు పదోన్నతులు లేవు. గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చి 560 గ్రేడ్‌–2 సూపర్‌వైజర్‌ పోస్టులను భర్తీచేసింది. ఈ పోస్టుల వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50కు పెంచారు.
 అంగన్‌వాడీ వర్కర్లకు స్మార్ట్‌ఫోన్లు కూడా ఇచ్చింది. 56,984 స్మార్ట్‌ ఫోన్ల కొనుగోలుకు రూ.85.47 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. అదనంగా 1 జీబీ డేటా కూడా ఇస్తోంది. 
 రూ.16కోట్ల ఖర్చుతో ఒక్కో అంగన్‌వాడీ వర్కర్‌కు, హెల్పర్‌కు 6 చొప్పున యూనిఫాం శారీలు అందిస్తున్నారు.
 అంగన్‌వాడీ కేంద్రాల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి పర్యవేక్షించడంతో పాటు వర్కర్లు, హెల్పర్లకు వార్షిక సెల­వులు, ప్రసూతి సెలవులు, బీమా సౌకర్యం కల్పించి భరోసా ఇస్తు­న్నారు. పదవీ విరమణ సమయంలో ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తోంది. 
    నాడు–నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పి­స్తున్న ప్రభుత్వం.. 
అంగన్‌వాడీలకూ కొత్తరూపు తీసుకొస్తోంది.
10,932 అంగన్‌వాడీ కేంద్రాల్లో (సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లోకి రీలొకేట్‌ అయినవి) మౌలిక సదుపాయాలు, తరగతి గదుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మరో రూ.500 కోట్లతో మిగిలిన 45,000 అంగన్‌వాడీ భవనాలకు రిపేర్లు, కొత్త మరుగు­దొడ్ల నిర్మాణం, విద్యుత్‌ ఉపకర­ణాలు, రంగులు, రక్షిత తాగునీరు, గోడలపై బొమ్మలు తదితర పనులు చేపడుతున్నారు.
 స్మార్ట్‌ టీవీల ఏర్పాటుతో పాటు నేర్చుకునే విధానాలను మెరు­గుపరచడానికి 8.5లక్షల మంది పిల్లలకు ప్రత్యేక కిట్లు అంది­స్తు­న్నారు. దీంతోపాటు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ పాఠ్యపుస్తకా­లనూ అం­దిస్తోంది.  
 పిల్లల ఎదుగుదలను పరిశీలించేందుకు రూ.16.04 కోట్లతో 19,236 గ్రోత్‌ మానిటరింగ్‌ పరికరాలను అందిస్తోంది. 
 ఇక గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు గతంలో మాదిరిగా వండి ఇచ్చే ఇబ్బంది లేకుండా టేక్‌ హోం రేషన్‌ పద్ధతిని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 
గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారు­లకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ ద్వారా పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వైద్య­సేవలు కూడా అందుబాటులోకి తెచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement