అది పెత్తందార్ల కూటమి: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

అది పెత్తందార్ల కూటమి: సీఎం జగన్‌

Published Fri, May 10 2024 4:33 AM

మధ్యాహ్నం 1.50 గంటలకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచార సభకు ఎండను సైతం  లెక్కచేయకుండా హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం

 కర్నూలు, కళ్యాణదుర్గం, రాజంపేట ఎన్నికల సభల్లో సీఎం జగన్‌ ధ్వజం

దుష్ట చతుష్టయానికి ఏం కావాలో మోదీ, అమిత్‌షా అదే మాట్లాడుతున్నారు 

పదేళ్ల క్రితం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు 

ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చి.. మనపై నాలుగు రాళ్లేసి వెళ్లారు 

చంద్రబాబు అంత అవినీతిపరుడు దేశ చరిత్రలోనే లేడన్న నోటితోనే పొగడ్తలా? 

మీ రాకతో రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలకు, పిల్లలు, సామాజిక వర్గాలకు ఏమైనా ఒరిగిందా?.. పెత్తందారీ 
భావజాలంతో ఓట్లు అడుగుతున్నారు.. 

రూపం మార్చుకున్న అంటరానితనంపై యుద్ధం ఇంకా మిగిలే ఉంది.. 

ఇదే ముగ్గురి ఫొటోలతో 2014లో మేనిఫెస్టో.. హామీలిచ్చి విస్మరించడమే ఆనవాయితీ  

మీరు ఇక్కడ నొక్కే బటన్‌ సౌండ్‌ ఢిల్లీ దాకా వినిపించాలి.. ఆరునూరైనా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగి తీరాల్సిందే 

వాటిని మత ప్రాతిపదికన ఇవ్వలేదు.. వెనకబాటుతనం ఆధారంగానే ఇచ్చారు 

ఎన్‌ఆర్‌సీ, సీఏఏతో పాటు మైనార్టీల ఇజ్జత్, ఇమాన్‌కు అండగా నిలబడతా 

7 అసెంబ్లీ సీట్లు మైనార్టీలకు ఇచ్చి పొలిటికల్‌ రిజర్వేషన్లు సైతం కల్పించిన ఏకైక పార్టీ మీ బిడ్డదే 

మైనార్టీలకు మంచి చేసిన చరిత్ర బాబుకు ఉందా? ఎన్ని జన్మలకైనా వస్తుందా?

ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆప్యాయత చూపిస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఆత్మస్థైర్యం పెరుగు తుంది. గుండెల్లో పెట్టుకుని ప్రేమ చూపిస్తే గ్రామాలు, రాష్ట్రంలో వారికిచ్చే గౌరవం పెరుగుతుంది. వారి ఆత్మగౌరవం ఇనుమడిస్తుంది.

ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో చంద్రబాబు కొనసాగుతున్నారు. ఆరు నూరైనా ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగాల్సిందే. ప్రధాని మోదీ సమక్షంలో ఇలా మాట్లాడే ధైర్యం చంద్రబాబుకు ఉందా? ఒక్క రిజర్వేషన్లే కాదు.. ఎన్‌ఆర్‌సీ, సీఏఏతో పాటు ఏ అంశంమైనా సరే ముస్లిం మైనార్టీల మనోభావాలకు, ఇజ్జత్, ఇమాన్‌కు అండగా నిలబడతాం. 175 అసెంబ్లీ సీట్లకుగానూ 4 శాతం అంటే ఏడు అసెంబ్లీ సీట్లు ముస్లింలకు ఇచ్చి పొలిటికల్‌ రిజర్వేషన్లు కూడా కల్పించిన ఏకైక పార్టీ మీ బిడ్డది మాత్రమే. మైనార్టీలకు ఏనాడైనా మంచి చేసిన చరిత్ర చంద్ర బాబుకు ఉందా? ఎన్ని జన్మలకైనా వస్తుందా? చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

సాక్షి ప్రతినిధి కర్నూలు/సాక్షి, అనంతపురం/సాక్షి ప్రతినిధి, కడప: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కోరుకున్న వాటి గురించి కాకుండా కేవలం చంద్రబాబు, దత్తపుత్రుడు, వది­నమ్మ, రామోజీరావు లాంటి దుష్ట చతుష్ట­యానికి ఏం కావాలి? అని మాత్రమే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా ఆలోచిస్తున్నారని ముఖ్య­మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఏపీకి వచ్చిన ఢిల్లీ పెద్దలంతా మన రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పించేలా ఎలాంటి ప్రకటన చేయకుండా నాలుగు రాళ్లేసి వెళ్లారని వ్యాఖ్యానించారు. 

అక్కచెల్లెమ్మల అభ్యు­న్నతి, అవ్వాతాతల చిరునవ్వులు, సామాజిక వర్గాల వికాసానికి పాటుపడతామని కూటమి నేతలు చెప్పడం లేదని, చంద్రబాబుది పెత్తందార్ల కూటమి అని ధ్వజమెత్తారు. గురువారం కర్నూలులోని వైఎస్సార్‌ సర్కిల్, అనంతపురం జిల్లా కళ్యాణ­దుర్గంలోని కొల్లాపురమ్మ టెంపుల్‌ రోడ్డు వాల్మీకి సర్కిల్, అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆ వివరాలివీ..

దేశంలోనే అంత అవినీతిపరుడు లేడన్న నోటితోనే..
చంద్రబాబు ఈమధ్య ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో ఏపీలో ఉమ్మడి సభలు పెట్టిస్తున్నాడు. చంద్రబాబు ఉమ్మడి సభలు పెట్టిస్తున్నప్పుడు ప్రజలంతా ఏం ఆశించారంటే.. పదేళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదాను ఇప్పటికైనా ఇస్తారేమో! ఈ మాట వారి నోటి నుంచి వస్తుందేమోనని ఆశగా ఎదురు చూశారు. ఆ ప్రకటన చేస్తారేమోనని ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. 
 


రాష్ట్ర ప్రజలకు కావాల్సిన మాట ఒక్కటీ మాట్లాడకుండా... చంద్రబాబు నాయుడుకి ఏం కావాలి? దత్తపుత్రుడికి ఏం కావాలి? వదినమ్మకు ఏం కావాలి? దుష్ట చతుష్టయానికి ఏం కావాలి? అని వీళ్లకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడి, మన మీద నాలుగు రాళ్లు వేసి వెళ్లారు. అదే మోదీ గారు మొన్నటిదాకా ఇదే చంద్రబాబును ‘ఇంతటి అవినీతిపరుడు దేశ చరిత్రలోనే ఉండడు’ అని చెప్పిన నోటితోనే ఇవాళ వారి కూటమిలో చేరినందుకు పొగిడి వెళ్లిపోయారు! మరి దీనివల్ల రాష్ట్రంలో రైతులకుగానీ, అక్కచెల్లెమ్మలకుగానీ, అవ్వా­తాతల­కుగానీ, పిల్లలకుగానీ, ఏ ఒక్కరికైనా లాభం జరిగిందా? 

2014 హామీలపై మాట్లాడని కూటమి నేతలు
మరి దేశ ప్రధాని, కేంద్ర హోంమంత్రి, చంద్ర­బాబు, దత్తపుత్రుడు, వదినమ్మ వీరంతా 2014లో ఇచ్చిన మేనిఫెస్టోను చూపించి ఇదిగో ఇవన్నీ చెప్పాం.. ఆ ముఖ్యమైన హామీలను నెరవేర్చాం!! అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? కూటమి అంటారు.. డబుల్‌ ఇంజన్‌ అంటారు! 2014లో ఇదే ముగ్గురి ఫొటోలతో, చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికీ పంపిన పాంప్లెట్, మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలనే అమలు చేయలేకపోతే ఇక డబుల్‌ ఇంజనూ... డబుల్‌ ఇంజనూ! అని ఎందుకు అంటున్నారు? 

అంటరానితనంపై యుద్ధం మిగిలే ఉంది!
ఈ పెత్తందార్ల కూటమి అంతా పేద పిల్లలకు గవర్న­మెంట్‌ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం చదువులు చెప్పి­స్తుంటే తట్టుకోలేకపోతున్నారు. మొన్న వచ్చి చంద్ర­బాబును పక్కన పెట్టుకుని మాట్లాడిన అమిత్‌ షా, ఢిల్లీ పెద్దలను అడుగుతున్నా. బాబును, దత్తపుత్రు­డినీ అడుగుతున్నా. వీళ్లకు మద్దతు ఇస్తున్న ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5నూ అడుగుతున్నా. 

మీ పిల్లలు, మీ మనవళ్లు.. మీవాళ్ల­లో ఏ ఒక్కరినైనా కూడా ఇంగ్లిష్‌ మీడియం బడుల్లో కాకుండా తెలుగు మీడియంలోగానీ లేదా మీ స్థానిక భాషలోగానీ చదివిస్తున్నారా? మన గవర్నమెంట్‌ స్కూళ్ల పిల్లలకు మాత్రం తెలుగు మీడియం అట! ఇటువంటి పెత్తందారీ భావజాలంతో వాళ్లు మన ప్రజల ముందుకు వచ్చి ఓటు వేయమని అడుగు­తున్నారు. ఇలాంటి వారికి ఓటు వేస్తే పేద పిల్లలకు, గవర్నమెంట్‌ బడుల్లో చదువుతున్న ఆ పిల్లలకు ఒక్కరికైనా ఇంగ్లీష్‌ మీడి­యం నేర్పుతారా? అందుకే ఆలోచన చేయండి. ఈ రూపం మార్చుకున్న అంట­రానితనం మీద మనం చేయా­ల్సిన యుద్ధం ఇంకా ఎంత ఉందో గుర్తుపెట్టుకోమని కోరుతున్నా.

మోసపూరిత హామీలతో బాబు మేనిఫెస్టో
మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. రాబోయే ఐదేళ్లూ ఇంటింటి అభివృద్ధి, పథ­కాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివి. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు, మళ్లీ మోసపోవ­డమే! చంద్రబాబుకు ఓటు వేయడం అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే. ఆయన జీవిత­మంతా మోసాలు, అబద్ధాలే. అధికారం దక్కిన ప్రతిసారీ పేదలను మోసం చేశాడు. 

ఇది చరిత్ర చెబు­తున్న సత్యం. సాధ్యం కాని హామీలతో చంద్ర­బాబు మోసపూరితంగా ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం లేదు. ఎన్నికల తరువాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాలను మారుస్తూ 99 శాతం వాగ్దానా­లను చిత్తశుద్ధితో అమలు చేశాం. గతంలో రాష్ట్రంలో కేవలం నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యో­గాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఏకంగా మరో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాడు. రాష్ట్ర చరిత్ర­లో ఎప్పుడూ చూడని విధంగా రూ.2.70 లక్షల కోట్లు బటన్‌ నొక్కి వివిధ పథకాల ద్వారా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు పారదర్శకంగా అందించాం.

వ్యవస్థల్లో సమూల మార్పులు..
నాడు–నేడుతో బాగుపడిన ప్రభుత్వ పాఠశాలలు, ఇంగ్లిష్‌ మీడియం, ఆరో తరగతి నుంచి డిజిటల్‌ బోధన, 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్‌లు, తొలిసారిగా బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్లు, సీబీఎస్‌ఈ నుంచి ఐటీ దాకా ప్రయాణం, బడులు తెరవగానే విద్యా­కానుక, గోరుముద్ద, అమ్మ ఒడి, పూర్తి ఫీజులు చెల్లిస్తూ విద్యాదీవెన, వసతి దీవెన, కరిక్యులమ్‌లో సమూల మార్పులు, అంతర్జాతీయ వర్సిటీల నుంచి సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ కోర్సులు, తప్పనిసరి ఇంటర్న్‌­షిప్‌.. ఇలాంటి విద్యా విప్లవాలను గతంలో ఎప్పు­డైనా చూశారా? ఇంజనీరింగ్, డాక్టర్, డిగ్రీ లాంటి ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థుల్లో ఏకంగా 93% మంది జగనన్న విద్యా దీవెన అందుకుంటు­న్నారు. నా అక్క చెల్లెమ్మలు వారి కాళ్లపై నిలబడేలా ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తంతోపాటు 31లక్షల ఇళ్లపట్టాలు వారి పేరుపై రిజిస్ట్రేషన్‌ చేశాం. ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం గతంలో ఎప్పుడైనా జరిగిందా?

ముస్లింలపై బాబు కపట ప్రేమ..
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ శపథం చేసింది. అలాంటి పార్టీ­తో చంద్రబాబు జత కట్టాడు. మైనార్టీల రిజర్వేష­న్లను రద్దు చేస్తామంటున్న బీజేపీతోనే కొనసాగు­తా­నంటున్నాడు. మైనార్టీలను మోసం చేసేందుకు డ్రామాలాడుతూ కపట ప్రేమ నటిస్తు­న్నాడు. ఇంతకంటే ఊసరవెల్లి రాజకీయాలు ఉంటాయా? ఈ రోజు నేను మీ అందరి సమక్షంలో చెబుతున్నా.. ఆరు నూరైనా నూరు ఆరైనా 4 శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ బిడ్డ జగన్‌ ఇస్తున్న మాట. వైఎస్సార్‌ బిడ్డ మాట. 

 



ఈ మాట ప్రధాని మోదీ సమక్షంలో చంద్రబాబు చెప్పగలరా? మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తా­మని బీజేపీ చెప్పిన తర్వాత కూడా ఎందుకు కొనసాగుతున్నారు? మైనార్టీలపై మీ బిడ్డ జగన్‌­ది నిజమైన ప్రేమ. ఇవాళ ఇక్కడున్న వేలాది మంది­తోపాటు అందరికీ ఒక్క విషయం చెబుతు­న్నా.. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు మతం ప్రాతిప­దికన ఇచ్చినవి కాదు. ముస్లింలలోనూ ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్, సయ్యద్, మొఘల్‌కు రిజర్వేషన్లు వర్తించవు. వారిలో పేదవారికి మాత్రమే ఇచ్చారు. అన్ని మతా­ల్లోనూ బీసీలు, ఓసీలు ఉంటారు. 

అలాంటప్పుడు రాజకీయ స్వార్థంతో మైనార్టీలను వేరేగా చూసి వారి నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత వరకూ ధర్మం? రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాదా? ఎట్టిపరిస్థితు­ల్లోనూ రిజర్వేషన్‌లతో పాటు ఎన్‌ఆర్‌సీ, సీఏఏ లాంటి ఏ అంశంలోనైనా ముస్లింలకు అండగా నిలబడతా. ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటా. వారిపై ప్రేమ చూపుతా. ఇళ్ల పట్టాలు, డీబీటీ, షాదీ తోఫాతో పాటు ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించాం. నలుగురు ఎమ్మెల్సీలు, నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మైనార్టీ సోదరు­డికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఐదేళ్లు నా పక్కనే పెట్టుకున్నా. మైనార్టీ సోదరికి శాసనసభ మండలి ఉపాధ్యక్షురాలిగా అవకాశం కల్పించాం. మైనార్టీ సబ్‌ప్లాన్‌ బిల్లు తేవడంతో పాటు ప్రతీ సందర్భంలోనూ చిత్తశుద్ధి చాటుకున్నాం.

రైతన్నలకు తోడుగా..
గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు పెట్టు­బడి సాయంగా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సీజన్‌ ముగిసేలోపు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పగటి పూట 9గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ లాంటి పథకాలను తీసుకొచ్చాం. రైతన్నలను ఇంతగా ప్రేమించే ప్రభుత్వం కానీ పథకాలు కానీ గతంలో ఉన్నా­యా? స్వయం ఉపాధికి అండగా ఆటోలు, టాక్సీలు నడిపే డ్రైవర్లకు వాహనమిత్ర, నేతన్న­నేస్తం, మత్స్యకార భరోసాతో పాటు చిరువ్యాపారులకు తోడు, చేదోడు అందించాం. లాయర్లకు లానేస్తం ఇచ్చాం.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?

ఆరోగ్యం.. పౌరసేవలు
వైద్యం కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని రూ.25 లక్షల వరకూ ఆరోగ్య­శ్రీని విస్తరించి ఉచితంగా సేవలందిస్తున్నాం. విశ్రాంతి సమ­యంలో ఆరోగ్య ఆసరా ద్వారా అండగా నిలిచాం. గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇం­­టినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష తెచ్చాం. ప్రజల ఆరోగ్యం కోసం ఇంతగా పరితపించిన ప్రభుత్వం గతంలో ఉందా? ఇవాళ ఏ గ్రామానికి వెళ్లి చూసినా 600 రకాల పౌరసేవలు అందిస్తున్న గ్రామ సచివా­లయం కనిపిస్తోంది. 60–70 ఇళ్లకు వలంటీర్ల సేవలు, ఇంటికే రూ.3వేల పింఛన్, రేష­న్, పౌరసేవలు, పథకాలు, గ్రామాల్లో అక్క చెల్లె­మ్మల­కు అండగా మహిళా పోలీసు, దిశ యాప్‌ లాంటివి గతంలో ఎప్పుడైనా అమల­య్యాయా? ఇవాళ మన గ్రామాల్లో ఫైబర్‌ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు కనిపిస్తు­న్నాయి. మరి 14ఏళ్లు ముఖ్య­మంత్రిగా చేశానని చెప్పుకునే చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కటైనా మంచి పని గుర్తుకొస్తుందా? 

బాబు ఇచ్చే డబ్బులన్నీ మీవే..
బటన్లు నొక్కి మీ బిడ్డ మీకు మంచి చేశాడు. ఎలాంటి బటన్లు నొక్కని చంద్రబాబు వద్ద డబ్బులు దండిగా ఉన్నాయి. మీకు ఇవ్వాల్సిన డబ్బులను ఆయన దోచు­­కున్నాడు. ఆ దోచుకున్న డబ్బులో నుంచి ఓ­టు­­కు రూ.2 వేలు, రూ.3 వేలు, కొన్నిచోట్ల రూ.4వేలు కూడా ఇచ్చేందుకు తయారుగా ఉన్నాడు. చంద్ర­బాబు డబ్బులిస్తే వద్దనకుండా తీసుకోండి. ఎందుకంటే.. ఆ డబ్బు అంతా మనదే. మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే అదంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. మీకు ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచించండి. 

మీ కుటుంబ సభ్యులతోనూ చర్చించండి. చిన్నపిల్లల అభిప్రాయం కూడా తీసుకుని నిర్ణయం తీసుకోండి. ఎవరి వల్ల ఈ మంచి కొనసాగుతుందో గమనించి ఓటేయాలని కోరు­™­è ున్నా. మంచి చేసిన ఫ్యాను ఇం­­­ట్లో­¯­ó∙ఉండాలి. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింకులోనే ఉండాలి. చంద్ర­­బాబు ఇచ్చే డబ్బులకు మోసపోకండి. మళ్లీ జగన్‌ ఉంటేనే ప్రతి నెలా కేలండర్‌ ప్రకారం పథకాలు మీ చేతికే  అందుతాయి.  మళ్లీ వలంటీర్లు మన ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు బాగుండాలన్నా, పథకాలన్నీ కొన­సాగాలన్నా, లంచా­­­లు, వివక్ష లేని పాలన కొనసా­గాలన్నా, బడులు, పేద పిల్లల చదువులు బాగుండాలన్నా, వైద్యం, వ్యవసాయం మెరుగ్గా ఉండాలన్నా ఫ్యాన్‌ గుర్తుపై రెండు బటన్లు నొక్కి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానా­ల్లో మన అభ్యర్థులనే గెలిపించాలి.

బాబు హేళన చేస్తే జగన్‌ ఆత్మస్థైర్యం కల్పించాడు
‘నేను ప్రతీ సందర్భంలోనూ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ ప్రేమను బాహాటంగా ఎందుకు చూపిస్తానో తెలుసా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న­ప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ప్రేమ చూపిస్తే గ్రామాలు, రాష్ట్రంలో వారికిచ్చే గౌరవం పెరుగుతుంది. వారిలో ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం ఇనుమడిస్తుంది. ఇది జరగాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ‘నా...’ అనే ఆప్యాయత చూ­పించాలి. చంద్ర­బా­బును చూస్తే ఇలాంటి ప్రేమ, న్యాయం దేవు­డెరుగు! అధికారంలో ఉంటే బడుగు, బలహీన వర్గాలను హేళన చేసి కించపరుస్తూ బెదిరిస్తారు. దారుణమైన మోసాలూ చేస్తారు. 

2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..
⇒ రూ.87,612కోట్ల రైతురుణాల మాఫీ జరిగిందా? 
⇒ రూ.11,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశారా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం ద్వారా రూ.25 వేలు డిపాజిట్‌ దేవుడెరుగు కనీసం రూపాయైనా ఇచ్చాడా?
⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగభృతి ఇచ్చాడా? ఐదేళ్లలో ఏ ఒక్కరికైనా రూ.1.20 లక్షలు ఇచ్చారా? ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు జరిగిందా?
⇒ రూ.10వేలకోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత, పవర్‌­లూ­­మ్స్‌ రుణాలమాఫీ హామీలు అమల­య్యా­యా? 
⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు ఇస్తానని నమ్మబలికి ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్‌ సిటీని నిర్మించారా? కర్నూలు, కళ్యాణ­దుర్గం, రాజంపేటలో ఎవరికైనా కనిపిస్తు­న్నాయా? ప్రత్యేక హోదా తేకపోగా అమ్మే­శా­రు. 
⇒ మళ్లీ కూటమిగా మీ ముందుకొచ్చి సూపర్‌­సిక్స్, సూపర్‌ సెవన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌కారు అంటూ మళ్లీ మోసాలకు తయార­య్యా­రు.

రోడ్డు ప్రమాద బాధితుడికి సీఎం జగన్‌ అభయం
కళ్యాణదుర్గం: కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మంచానికే పరిమితమైన అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెళుగుప్ప మండలం నరసాపురం గ్రామానికి చెందిన బి.శ్రీనివాసులుకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రోడ్‌ షోలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. అక్కడ స్ట్రెచర్‌పై ఉన్న శ్రీనివాసులును చూసి సీఎం జగన్‌ బస్సులో నుంచి దిగారు. 

నేరుగా శ్రీనివాసులు వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గత ఏడాది నవంబర్‌ 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇప్పటికీ చికిత్స పొందుతున్నట్లు బాధితుడు తెలిపాడు. అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని, ఇప్పటికే రూ.7 లక్షలకు పైగా ఖర్చయిందని కుటుంబ సభ్యులు సీఎం జగన్‌కు వివరించారు. ఇందుకు సీఎం వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. శ్రీనివాసులు త్వరలోనే కోలుకొనేలా మెరుగైన వైద్య సేవలకు సిఫారసు చేస్తామని, వైద్య ఖర్చులను భరిస్తామని వారికి భరోసా ఇచ్చారు.

రాజంపేటలో 18వ మెడికల్‌ కాలేజీ.
ఈ ప్రాంతానికి ఒక మెడికల్‌ కాలేజీ మంజూరు చే­యాలని అమరన్న, మిథున్‌ ఇద్దరూ కలసి నాపై ఒత్తిడి తెస్తున్నారు. వచ్చే టర్మ్‌లో అది చేస్తానని మాట ఇస్తు­న్నా. రాష్ట్రంలో ఇప్పటికే 17 మెడికల్‌ కాలేజీలకు శ్రీకా­రం చుట్టగా, 18వ మెడికల్‌ కాలేజీ రాజంపేటలో వస్తుంది.

ఢిల్లీ దాకా సౌండ్‌ వినిపించాలి..
మీరు ఇక్కడ నొక్కే బటన్‌ సౌండ్‌ ఢిల్లీ దాకా వినిపించాలి. మీ బిడ్డ పెన్షన్లు నేరుగా ఇంటికే పంపుతుంటే అడ్డుకున్న వారికి ఆ సౌండ్‌ వినిపించాలి. అంత గట్టిగా సౌండ్‌ వినిపించేలా భారీ మెజార్టీతో మన అభ్యర్థులను గెలిపించాలని ప్రార్థిస్తున్నా.

ఇలాంటి వ్యక్తిని నమ్మొచ్చా?
చంద్రబాబు మన జిల్లాకు వచ్చి మూడు ప్రాంతాల్లో మీటింగులు పెట్టాడు. రాయచోటికి వెళ్తే రాయచోటి జిల్లా హెడ్‌ క్వార్టర్‌గా కంటిన్యూ అవుతుంది అంటాడు. మదనపల్లికి పోతే మదనపల్లి జిల్లా హెడ్‌ క్వార్టర్‌ అంటాడు. రాజం­పేటకు వస్తే రాజంపేట జిల్లా హెడ్‌ క్వార్టర్‌ అంటాడు. మరి ఇలాంటి వ్యక్తిని నమ్మొచ్చా? ఇదే రాజంపేటలో మన గంగిరెడ్డి అన్నకు చెందిన అన్నమయ్య కాలేజీని ప్రపంచంలో టాప్‌ 100 యూనివర్సిటీలతో టైఅప్‌ చేయించి ఒక వర్సిటీగా మీకు అందించాం. పింఛా ప్రాజెక్టు దాదాపు 90 శాతం పనులు పూర్తిచేశాం. అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, గాలేరు నగరి కాలువ పనులు రైల్వేకోడూరు వరకు పూర్తి చేయాలన్నా మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే రావాలి.

మన అభ్యర్థులను ఆశీర్వదించండి
కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బీవై రామయ్య, ఇంతియాజ్, పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద­రెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య, అనంతపురం ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర నారాయణ, రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి అమర్‌నాథ్‌రెడ్డి, నాకు సొంత తమ్ముడు లాంటి ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డిని గొప్ప మెజార్టీతో మీరంతా ఆశీర్వదించాలని కోరుతున్నా.

రాజంపేటలో 18వ మెడికల్‌ కాలేజీ.
ఈ ప్రాంతానికి ఒక మెడికల్‌ కాలేజీ మంజూరు చే­యాలని అమరన్న, మిథున్‌ ఇద్దరూ కలసి నాపై ఒత్తిడి తెస్తున్నారు. వచ్చే టర్మ్‌లో అది చేస్తానని మాట ఇస్తు­న్నా. రాష్ట్రంలో ఇప్పటికే 17 మెడికల్‌ కాలేజీలకు శ్రీకా­రం చుట్టగా, 18వ మెడికల్‌ కాలేజీ రాజంపేటలో వస్తుంది.

వైఎస్సార్‌సీపీకి జూనియర్‌ ఎన్టీఆర్, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మద్దతు
కర్నూలు(సెంట్రల్‌): వైఎస్సార్‌సీపీకి జూనియ­ర్‌ ఎన్టీఆర్, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మద్దతు ప్రకటించారు. గురువారం సీఎం జగన్‌ కర్నూలులోని వైఎస్సార్‌ సర్కిల్‌లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలో జూనియర్‌ ఎన్టీఆర్, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా పాల్గొని తమ మద్దతు సీఎం వైఎస్‌ జగన్‌కే అని ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించారు. వైఎస్‌ జగన్‌ పొలిటికల్‌ హీరో అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి సీఎంగా వైఎస్‌ జగన్‌ గెలుపొందడం ఖాయమన్నారు. వైఎస్‌ జగన్‌తోనే పేద ప్రజల అభివృద్ధి సాధ్యమన్నారు.  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement