Fact Check: చంద్రబాబుకోసమే... రామోజీ నేలబారు రాతలు! | Ramoji Rao Eenadu Wrongly Wrote In Support Of Chandrababu Polavaram Project Matter, Facts Inside | Sakshi
Sakshi News home page

Fact Check: చంద్రబాబుకోసమే... రామోజీ నేలబారు రాతలు!

Published Fri, May 10 2024 8:19 AM

Ramoji Wrongly Wrote In Support Of Chandrababu Polavaram Project Matter

నిర్వాసితుల పునరావాసం, భూసేకరణకే రూ.33 వేల కోట్లు అవసరం

అలాంటప్పుడు ప్రాజెక్టును రూ.15 వేల కోట్లతో ఎలా పూర్తి చేస్తారని నిలదీసిన ప్రతిపక్ష నేత జగన్‌

తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రతిసారీ.. సవరించిన వ్యయాన్ని ఇవ్వాలని అడుగుతున్న జగన్‌

బాబు తప్పిదాలను సరిదిద్దుతూ ప్రణాళికాయుతంగా పోలవరం పూర్తికి అడుగులు

నిధుల రీయింబర్స్‌లో విభాగాలవారీ పరిమితులను ఎత్తేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఓకే

ఈ క్రమంలోనే తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్లు ఇస్తామంటూ జూన్‌ 5న ఆర్థిక శాఖ నోట్‌

కొత్తగా నిర్మించే ఏ ప్రాజెక్టులోనైనా ఐఎస్‌ గైడ్‌లైన్స్, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకే నీటి నిల్వ

తొలుత పోలవరం 41.15 మీటర్లులో నీటి నిల్వ.. ఏవైనా లోపాలు ఉత్పన్నమైతే దిద్దుబాటు

ఆ తర్వాత నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ 44.. ఆనక 45.72 మీటర్లలో నీటి నిల్వ

శాసనసభలో సీఎం జగన్‌.. పార్లమెంట్‌లో కేంద్ర జల్‌ శక్తి మంత్రి ఇదే అంశంపై స్పష్టీకరణ

తొలుత 41.15 మీటర్ల కాంటూర్‌ వరకూ పూర్తి చేసి, రైతులకు నీరందించే చర్యలు

అయినా సరే... బాబు పాపాలను జగన్‌కు ఆపాదిస్తూ పదే పదే రామోజీ తప్పుడు రాతలు

అసలింతకీ రామోజీరావుకు ఏం కావాలి? పోలవరం ప్రాజెక్టు పూర్తికావటమా... లేక ఎక్కడికక్కడ పనులు ఆగిపోవటమా? దీనికి ఆగిపోవటమే ఆయనకు కావాలన్న సమాధానం తేలిగ్గానే వచ్చేస్తుంది. ఎందుకంటే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచి్చన దగ్గర్నుంచీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రామోజీరావు ‘ఈనాడు’లో అచ్చోసిన దుర్మార్గపు కథనాలు అన్నీఇన్నీ కావు. ఇంకేముంది ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడే అవకాశం లేదని కొన్నాళ్లు...కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవకాశం లేదని కొన్నాళ్లు... ఎత్తు తగ్గించి కట్టేస్తున్నారని కొన్నాళ్లు... ఇలా పదేపదే విషాన్ని చిమ్ముతూనే వస్తున్నారు.

చిత్రమేంటంటే... రామోజీ అంచనాలకు భిన్నంగా పోలవరం వేగంగా ముందుకెళుతోంది. చంద్రబాబు వీసమెత్తయినా పట్టించుకోని పునరావాసాన్ని కూడా వైఎస్‌ జగన్‌ భుజాలకెత్తుకుని ప్రాజెక్టును నడిపిస్తున్నారు. కేంద్రాన్ని పదేపదే అభ్యఆర్థికస్తూ... రావాల్సిన నిధుల్ని రాబట్టుకుంటున్నారు. ఇదిగో... ఇదే ‘ఈనాడు’ కడుపు మంటను పెంచేస్తోంది. కాంట్రాక్టరుగా తన వియ్యంకుడిని తప్పించేసి మరీ ప్రాజెక్టును పూర్తి చేస్తుండటాన్ని రామోజీరావు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ‘పోలవరం నిధుల కోసం... జగన్‌ నేల చూపులు– బేల మాటలు’ అంటూ సోమవారం ప్రచురించిన కథనం కూడా ఇలాంటిదే!!. మరి దీన్లో నిజానిజాలెంత? ఏది నిజం?

ఏది నిజం..?
ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చేది ఇక రూ.12,911.15 కోట్లనేనని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేంద్ర కేబినెట్‌లో 2017లో ఆమోదించిన మొత్తానికి అదనంగా... రూ.12,911.15 కోట్లే ఇస్తామని పేర్కొంది. దీనికన్నా పైసా ఎక్కువరాదు.

వాస్తవం: వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్‌ శక్తి, ఆఆర్థికక శాఖ మంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్, నిర్మలాసీతారామన్‌లను కలుస్తూనే ఉన్నారు. కలిసిన ప్రతి సందర్భంలోనూ పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం కేంద్ర జలసంఘం ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు నిధులు ఇవ్వాలని కోరుతున్నారు.

ఈ క్రమంలోనే గతేదాది జనవరి 3న ప్రధాని మోదీతో సమావేశమైనపుడు... ప్రాజెక్టు తొలి దశను సత్వరమే పూర్తి చేసి, రైతులకు ముందస్తు ఫలాలు అందించడానికి తాత్కాలికంగా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందించి... జల్‌ శక్తి, ఆర్థిక శాఖలకు తగు ఆదేశాలిచ్చారు. కేంద్ర జల్‌ శక్తి శాఖ సూచన మేరకు తొలి దశ పూర్తికి రూ.10,911.15 కోట్లు అవసరమని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.

వాటిని జల్‌ శక్తి శాఖ ఆమోదించింది. అయితే చంద్రబాబు ఘోర తప్పిదం వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ను సరిదిద్దడానికి, ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటానికి రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందని గత మార్చి 5న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. దాంతో తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్లు (10,911 ప్లస్‌ 2వేలు) విడుదల చేయాలని కేంద్ర జల్‌ శక్తి శాఖ పంపిన ప్రతిపాదనకు కేంద్ర ఆఆర్థికక శాఖ జూన్‌ 5న అంగీకరించింది. అదీ కథ.

వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు 2013–14 ధరల ప్రకారం.. 2014, ఏప్రిల్‌ 1 నాటికి ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ ఖర్చులో మిగిలిన మొత్తం అంటే రూ.15,667.9 కోట్లకు మించి ఇచ్చేది లేదని, ఆ తర్వాత పడే అదనపు భారంతో కేంద్రానికి సంబంధం లేదని 2017 మార్చి 15న కేంద్రం ఒక తీర్మానాన్ని ప్రతిపాదించగా... దాన్ని కేబినెట్‌ ఆమోదించింది కూడా.

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,128.78 కోట్లు ఖర్చు చేయగా.. కేంద్రం రూ.14,418.39 కోట్లు రీయింబర్స్‌ చేసింది. అంటే 2017, మార్చి 15న కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన ప్రకారం పోలవరానికి ఇక విడుదల చేయాల్సింది రూ.1249.51 కోట్లే. ఈ నేపథ్యంలో... తొలి దశ పూర్తిచేయడానికి అవసరమైన రూ.12,911.15 కోట్లు విడుదల చేయాలంటే.. 2017, మార్చి 15 నాటి కేబినెట్‌ తీర్మానాన్ని సవరించాలి.

ఆ మేరకు ప్రతిపాదన పంపాలని కేంద్ర జల్‌ శక్తి శాఖకు కేంద్ర ఆఆర్థికక శాఖ సూచించిందే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వబోమని గానీ.. ఇచ్చేది ఇక ఇంతేననిగానీ ఆర్థిక శాఖ నోట్‌లో ఎక్కడా లేదు. రామోజీరావు మాత్రం ఇచ్చేది ఇక ఇంతేనని కేంద్ర ఆఆర్థికక శాఖ నోట్‌లో పేర్కొన్నట్లు తప్పుడురాతలు రాసేశారు. చంద్రబాబులా రామోజీది కూడా చంద్రబాబు తరహా బ్రీఫ్డ్‌ మీ ఇంగ్లీషే అయితే.. ట్యూషన్‌ పెట్టించుకోవాలి గానీ తనకు అర్థమైనదే వాస్తవమన్న రీతిలో రాసేస్తే ఎలా? అజా్ఞనంతో తప్పుడురాతలు అచ్చేస్తే ఎలా?

ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులివ్వబోమని కేంద్రం చెప్పినా సీఎం వైఎస్‌ జగన్‌ నోరెత్తడం లేదు. లోక్‌సభలో బీజేపీకి కావాల్సినంత బలం ఉన్నా రాజ్యసభలో లేదు. రాజ్యసభలో ఉన్న రాజకీయ బలాన్ని పోలవరం నిధులు, ప్రత్యేక హోదా సాధనకు సీఎం వైఎస్‌ జగన్‌ ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు?

వాస్తవం: విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రమే నిరి్మంచాలి. కానీ.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కోసం రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ... దాని నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని 2014, జూన్‌ నుంచి 2016, సెపె్టంబరు 6 వరకూ నాటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. చివరకు కేంద్రం మంజూరు చేశాక యనమల రామకృష్ణుడు బావమరిదికి, రామోజీరావు వియ్యంకుడికి ఈ కాంట్రాక్టు పనులు నామినేషన్‌పై కట్టబెట్టేశారు. భారీగా కమీషన్లు దండుకున్నారు.

  • రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న క్రమంలో చంద్రబాబు చేసిన ఇంకో ఘోరమైన తప్పిదమేంటంటే... 2013–14 నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని 2016, సెపె్టంబరు 7న అంగీకరించడం. మరి ఆ మూడేళ్లలో ధరలు పెరిగి ఉండవా? ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేకుంటే ఎలా?

  • 2016, సెపె్టంబరు 26న పోలవరానికి నాబా­ర్డు నుంచి రూ.1981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్‌ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని.. 2018, డిసెంబర్‌లోగా ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతే.. విడుదల చేసిన నిధులను రుణంగా పరిగణిస్తామంటూ కేంద్రం పెట్టిన మెలికకు సైతం చంద్రబాబు తల ఊపేశారు.

  • 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆఆర్థికక శాఖ.. కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమొరాండంలో 2014, ఏప్రిల్‌ 1 నాటికి నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకు అయ్యే (ఇరిగేషన్‌ కాంపొనెంట్‌) వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది.

  • ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017, మార్చి 15న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. 2014, ఏప్రిల్‌ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని.. ఆ ప్రకారమే నిధులిస్తామని స్పష్టం చేసింది. ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రులు అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరి నోరు మెదపలేదు.

  • 2014, ఏప్రిల్‌ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్‌ చేస్తామని.. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే .. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 2017, మే 8న రాష్ట్ర  ప్రభుత్వానికి కేంద్ర జల్‌ శక్తి శాఖ లేఖ రాసినా సరే... చంద్రబాబు స్పందించలేదు.

  • 2016, సెపె్టంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండం ప్రకారం... 2014, ఏప్రిల్‌ 1 నాటి ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని.. వాటిని ఆమోదించి.. నిధులిస్తే ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2018, జనవరి 12న నాటి సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు.

  • 2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఆమోదించిన నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లు. ఇందులో ఏప్రిల్‌ 1, 2014 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లను మినహాయిస్తే కేవలం రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినా.. చంద్రబాబు దానికి అంగీకరించారు. 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ. 33,168.23 కోట్లు. అలాంటిది కేవలం రూ.15,667.9 కోట్లు ఇస్తే పోలవరాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు ఎలా అంగీకరించారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

  • నిజానికి ఎలాంటి ప్రాజెక్టు అయినా... ఎంత ప్రతిష్టాత్మకమైనది అయినా కాలం గడుస్తున్న కొద్దీ ముందుగా వేసిన అంచనా వ్యయం పెరుగుతుంది. అది నాగార్జున సాగర్‌కైనా.. శ్రీశైలానికైనా కూడా!!. పోలవరానికైనా అంతే. 2013–14లో ఉన్న ధరలు ఇప్పుడెందుకు ఉంటాయి? అన్నిరకాల సామగ్రి, లేబర్‌ చార్జీ­లు అప్పటితో పోలిస్తే రెట్టింపుకన్నా ఎక్కువే పెరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని ఏకంగా లేఖ రాసేయటంతో... ఇప్పుడు తాజా ధరల ప్రకారం నిధులడిగిన ప్రతిసారీ కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. అసలు చంద్రబాబు ఇలా ఎందుకు చేశారంటే... ఆయనకు కమీషన్లు వస్తే చాలనుకున్నారు కనక.

  • చంద్రబాబు నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నిధుల కొరత ఎదురవుతోందన్నది నిజం. ç2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇచ్చి.. నిధులు విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ, జల్‌ శక్తి శాఖ మంత్రులను సీఎం వైఎస్‌ జగన్‌ కోరుతూ వస్తున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. పోలవరం ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌తోపాటు సీఎం వైఎస్‌ జగన్‌ లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి, కేంద్ర ఆర్థిక, జల్‌ శక్తి శాఖ అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ చర్చల వల్ల 2014–15 నాటి రెవెన్యూ లోటు రూ.10,421 కోట్లను ఇటీవల కేంద్రం విడుదల చేసింది. పోలవరం తొలి దశ పూర్తికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేయడానికి అంగీకరించింది. ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాలకు సీఎం వైఎస్‌ జగన్‌ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇవేవీ కని్పంచడం లేదా రామోజీ?


    ఈనాడు ఆరోపణ: రెండో దశ పునరావాసానికి రాష్ట్రం ఏమీ చేయలేదని సీఎం స్వయంగా ప్రకటించారు. రాష్ట్రం నిధులు ఇచ్చే పరిస్థితుల్లో లేదని చెప్పారు.

వాస్తవం: కొత్తగా నిర్మించే ఏ ప్రాజెక్టులోనైనా నీటిని నిల్వ చేయాలంటే.. ఐఎస్‌(ఇండియన్‌ స్టాండర్డ్‌) ఆపరేషన్‌ ఆఫ్‌ రిజర్వాయర్స్‌ గైడ్‌ లైన్స్, కేంద్ర జలసంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒకేసారి గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేయకుండా.. మూడు దఫాలుగా నిల్వ చేసుకుంటూ పోవాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలి ఏడాది 41.15 మీటర్ల వరకూ నీటిని నింపి.. ప్రాజెక్టులో అన్ని భాగాలను పరిశీలిస్తారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుతారు.

ఆ తర్వాత 44 మీటర్ల కాంటూర్‌ వరకూ నీటిని నింపి, లోటుపాట్లు ఏవైనా ఉత్పన్నమైతే వాటిని సరిదిద్దుతారు. ఆనక 45.72 మీటర్లలో అంటే గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తారు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ పలు మార్లు శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. తొలుత 41.15 మీటర్ల వరకూ నిర్వాసితులకు పునరావాసం కలి్పస్తామని.. ఆ తర్వాత దశలవారీగా పునరావాసం కల్పించి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేస్తామని ఉద్ఘాటించారు.

ప్రాజెక్టు ఎత్తు ఏమాత్రం తగ్గదని.. కావాలంటే పూర్తయ్యాక టేపు తెచ్చుకుని కొలుచుకోవాలని చంద్రబాబు, రామోజీరావు ఎల్లో మీడియాకు సవాల్‌ విసిరారు. ఇదే అంశంపై అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పందిస్తూ.. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి ఒక్క ఇంచు కూడా తగ్గదని, నిర్వాసితులు అందరికీ పునరావాసం కల్పించే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.

ఇటీవల నిర్వహించిన లైడార్‌ సర్వేలో పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్‌ పరిధిలో అదనంగా 36 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలటంతో ఆ గ్రామాల ప్రజలకూ పునరావాసం కల్పించడానికి రూ.5,122 కోట్ల నిధులివ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అభ్యఆర్థికంచారు. దీనికీ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌ సానుకూలంగా స్పందించారు. దీన్ని బట్టి చూస్తే ప్రాజెక్టు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టమవుతుంది. అయినా సరే.. రామోజీరావు పదే పదే విషం చిమ్ముతున్నారు.

ఇదే అంశాన్ని నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ శాసనసభలో పలు మార్లు ఎత్తిచూపుతూ.. భూసేకరణ చట్టం 2013 ప్రకారం పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లని.. అలాంటిది కేంద్రం ఇస్తామన్న రూ.15,667.9 కోట్లతో ఎలా పూర్తి చేస్తారని నిలదీస్తే.. నాటి సీఎం చంద్రబాబు వాటిని తోసిపుచ్చుతూ వచ్చారు. అంటే చంద్రబాబుకు కావాల్సింది కమీషన్లు తప్ప ప్రాజెక్టు పూర్తవటం కాదు.

అందుకే రాష్ట్రమే చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ... ప్రత్యేక హోదా అడగబోమని తాకట్టుపెట్టేశారు. అంచనా వ్యయాన్ని సవరించకున్నా నోరు మెదపలేదు. ఆఖరికి పునరావాసం ఊసెత్తకుండా కేవలం ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ మాత్రమే ఇస్తామన్నా... సై అనేశారు.

అసలు పునరావాసం లేకుంటే ప్రాజెక్టు ఉంటుందా? ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే పేదలకు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి, వారికి తగిన పరిహారం ఇవ్వకుంటే వారు అక్కడి నుంచి వెళతారా? వారు వెళ్లకపోతే ప్రాజెక్టు పూర్తి చేసినా నీటిని నిల్వ చేయగలరా? నీటిని నిల్వ చేసే పరిస్థితి లేనపుడు ఎంత ఎత్తు కడితే లాభమేంటి? మరి పునరావాస నిధుల ఊసెత్తకుండా చంద్రబాబు ఎందుకు నోరుమూసుకున్నారు?

Advertisement
 
Advertisement
 
Advertisement