సాక్షి, అమరావతి: జీతాల కోసం ఆందోళన చేస్తే గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబు నాయుడిది. తను అధికారంలో ఉన్నపుడు నాలుగున్నరేళ్ల పాటు అసలు వారి జీతాలు ఎలా ఉన్నాయో కూడా పట్టించుకోని ఘనత ఆయనది. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయువు పట్టులాంటి చిరుద్యోగులకు అతితక్కువ జీతాలు చెల్లిస్తూ... అవికూడా ఆరు నెలలకో, తొమ్మిది నెలలకో ఇస్తూ వచ్చిన చంద్రబాబు... పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చిరుద్యోగులు ఆశ్రయించటం... తనకు పరిస్థితి చేయిదాటిపోతోందోని గ్రహించటంతో ఎన్నికలకు ఐదారు నెలల ముందు నుంచీ కొందరికి జీతాలు పెంచటం మొదలెట్టారు. దీన్నేమనుకోవాలి? నాలుగున్నరేళ్లపాటు పట్టించుకోకపోవటం మోసం కాదా? చివర్లో జీవోలిచ్చి చేతులు దులుపుకోవటం దుర్మార్గం కాదా? అలాంటి చంద్రబాబు ఇపుడు వివిధ సంఘాలు, కమ్యూనిస్టుల ద్వారా ఉద్యోగులను రెచ్చగొట్టి తమ ఎజెండాను వారిపై రుద్ది ఆందోళనలు చేయిస్తున్నారంటే ఏమనుకోవాలి? అసలు చంద్రబాబుకు చిత్తశుద్ధి అనేది ఉందా?
చిత్తశుద్ధి ఉందో లేదో చెప్పటానికి ఒక్క ఉదాహరణ చాలు. అదేమిటంటే... రాష్ట్రంలో వివిధ శాఖలు, విభాగాల్లో పనిచేస్తున్న చిరుద్యోగులు దాదాపు 3.07 లక్షల మంది ఉండగా... చంద్రబాబు హయాంలో వారికి చెల్లించిన జీతాల బిల్లు ఏడాదికి రూ.1198 కోట్లు. కానీ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఈ ఉద్యోగులందరికీ జీతాలు పెంచటంతో ఈ బిల్లు ఏకంగా రూ.3,187 కోట్లకు చేరింది. అంటే... దాదాపు మూడు రెట్లు పెరుగుదల. ప్రభుత్వంపై ఏకంగా రూ.2వేల కోట్ల మేర భారం పడినా... చిరుద్యోగుల సంక్షేమం అత్యవసరమని మనసా వాచా నమ్మటంతో ముందుకే అడుగేశారు ముఖ్యమంత్రి. మరి ఇవన్నీ చంద్రబాబుకో... టీడీపీ అనుకూల మీడియాకో తెలియవా అంటే... తెలీకేమీ కాదు. వారిదల్లా రాజకీయ ఎజెండా. దానికోసం ఎర్రజెండాతో సహా దేన్నయినా ఆశ్రయించే నైజం వారిది. అందులో భాగమే తప్పుడు రాతలు, ప్రేరేపించిన ఆందోళనలు. కావాలంటే చంద్రబాబు హయాంలో ఎంత జీతాలుండేవో... జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎంత జీతాలున్నాయో ఒకసారి చూద్దాం.
మోసం కాకుంటే ఏంటి బాబూ?
Published Thu, Feb 24 2022 4:31 AM | Last Updated on Thu, Feb 24 2022 3:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment