అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది  | Taneti Vanitha Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది 

Published Wed, Feb 23 2022 4:57 AM | Last Updated on Wed, Feb 23 2022 4:57 AM

Taneti Vanitha Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు చరిత్రను ఎవరూ మరిచిపోలేదని, నేడు అంగన్‌వాడీలు, ఆశాలకు సీఎం వైఎస్‌ జగన్‌ మేలు చేస్తుంటే ఓర్వలేక వాస్తవాలను వక్రీకరిస్తూ చంద్రబాబు అండ్‌ కో చేస్తున్న దు్రష్పచారాలను ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం. మహిళల జీవన ప్రమాణాలు పెంచడానికి, ఆర్ధికంగా వారికి అండగా నిలవడానికి సీఎం జగన్‌ అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.

అలాంటి ప్రభుత్వం మీద ఈర‡్ష్య, అసూయలతో చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. బాబుతో కుమ్మక్కైన ఎర్ర పార్టీల్లోని కొందరు  ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. వీరిని అదే జాతికి చెందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 సంస్థలు తమ భుజాలపై మోస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాయి.’ అని మంత్రి వనిత పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement