నామినేటెడ్ పోస్టులకు గడువుపై సిద్ధును ప్రశ్నించిన శంకర్
బెంగళూరు : నామినేటెడ్ పోస్టుల భర్తీ నేపథ్యంలో పలువురు నేతల్లో నెలకొన్న అసంతృప్తి విమర్శల రూపంలో భగ్గుమంటోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ సమయంలో అవకాశం దక్కని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా గురువారమిక్కడ ఓ విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో కేపీసీసీ సభ్యుడు శంకర్ మునవళ్లి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు క్షీణిస్తోందని, ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే ప్రధాన కారకులని ఆరోపించారు. మొదటి నుంచే కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలను సిద్ధరామయ్య తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇక పార్టీలోని లింగాయత్ వర్గానికి చెందిన నాయకులను సైతం పార్టీలో లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నామినేటెడ్ పోస్టులను 18 నెలల గడువుతో పంచిపెట్టిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన సీఎం కుర్చీకి కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారా అంటూ శంకర్ ప్రశ్నించారు. ఁనామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేసిన వారికి 18 నెలల గడువును కేటాయిస్తూ పదవులను అప్పగించారు. మరి మీ సీఎం కుర్చీ విషయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారా? 18 నెలలు పూర్తయిన తర్వాత సీఎం కుర్చీని ఎందుకు విడిచిపెట్టలేదు* అని విమర్శలు గుప్పించారు.
మీకో న్యాయం... మాకో న్యాయమా?
Published Fri, Nov 28 2014 2:18 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement