
ఏపీ కేబినెట్ భేటీ(ఫైల్)
హైదరాబాద్: తమ మంత్రుల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. శుక్రవారం సుదీర్ఘంగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మంత్రులతో ప్రత్యేకంగా విడిగా మాట్లాడతానని చెప్పినట్టు తెలిసింది. మంత్రులు పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించినట్టు సమాచారం.
కాగా, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ వ్యవహారాలు చూసేందుకు ప్రత్యేకంగా నలుగురు అధికారులను నియమించాలని కేబినెట్ నిర్ణయించింది.