లోకేష్ బాబు
ప్రభుత్వం, పార్టీ వ్యవహారాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు జోక్యం పెరిగిపోవడంతో మంత్రులు తీవ్ర అసంతృకి లోనవుతున్నట్లు తెలుస్తోంది. షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని కొందరు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చినబాబు వ్యవహార శైలిపై మంత్రులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రతి శాఖలో లోకేష్ జోక్యం పెరిగిపోయిందని కొందరు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. సీసీ కెమారాలు, గన్ మెన్లు , ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా తమపై నిఘా పెడుతున్నారని వారు అవమానంగా భావిస్తున్నారు. వారు చేస్తున్న పనులను, ప్రతి కదలికలను అనుమానించడమే వారి ఆగ్రహానికి కారణమని ప్రచారం జరుగుతోంది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రులను అనుమానించే రీతిలో లోకేష్ వ్యవహరిస్తున్నడని లోలోపల రగిలిపోతున్నట్లు సమాచారం. అధికారుల బదీలీలు, ఐఎఎస్‌ల పోస్టింగ్‌ల్లో లోకేష్ పెత్తనం పెరిగిపోయిందని తెలుస్తోంది.
మంత్రులను ప్రతి రోజు ఎవరు కలుస్తున్నారు? ఎందుకు కలుస్తున్నారు? మంత్రి పేషీల నుంచి ఏఏ ఫైళ్లు ముందుకు కదులుతున్నాయి? ప్రతి క్షణం చినబాబు తన వేగుల ద్వారా సమాచారం సేకరిస్తుండటంతో వారు చాలా అసౌకర్యంగా ఫీలవుతున్నారు. ఇదెక్కడి నిఘారా బాబు అని అనుకొంటున్నారు. మంత్రులు పేషీలలో వారికి ఇష్టమైన వారిని కాదని, లోకేష్ తనకు నచ్చిన అధిరాలను నియమించడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటీ కప్పుడు సీసీ కెమారాల ద్వారా వారి సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా జిల్లాల్లో కూడా మంత్రుల వ్యవహరిస్తున్న తీరుపై లోకేష్ ఎప్పుడికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు. మీడియా లైజనింగ్ ఆఫీసర్ల పేరుతో మరి కొంత మంది అనుచరులను తమ పేషీల్లో నియమించాలనే ఆలోచనలో లోకేష్ ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడు పరిస్థితి మరీ దిగజారుతుందని వార ఆందోళ చెందుతున్నట్లు తెలుస్తోంది.
ఇవన్నీ చేయడానికి లోకేష్‌కున్న అర్హతలు ఏమిటని కొందరు వారిలో వారు ప్రశ్నించుకున్నట్లు వినిపిస్తోంది. ప్రభుత్వంలో పని చేస్తున్న మంత్రులకు లోకేష్ గ్రేడింగ్ ఇవ్వడమేమిటని కొందరు మండిపడుతున్నారు. ఏ ప్రాతిపదికన మంత్రుల పనితీరను ఆయన బేరీజు వేస్తున్నారని అడుగుతున్నారు. మంత్రులను ఇంటికి రప్పించుకొని వారి పనితీరుపై నివేదికలు ఏలా కోరుతారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంలో ఎటు వంటి బాధ్యతలు లేని లోకేష్ మంత్రులతో జరిగే సమీక్షలు, సమావేశాలలో ఎందుకు పాల్గొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ మంత్రులపై అజమాయిషీ చెలాయిస్తున్నాడని కొందరు వాపోతున్నారు.
తమకు చినబాబు గ్రేడింగ్ మార్కులు అక్కరలేదని, తమ విషయాల్లో జోక్యం చేసుకోకుండా తమ పనిని తాము చేసుకోనిస్తే చాలని వారు ఆశిస్తున్నారు. అధికారుల బదీల్లో తాము సిపార్సు చేసిన వారి కంటే లోకేష్ చెప్పిన వారికే బదీలు జరుగుతున్నాయని, తమ జిల్లాల్లో తమకు నచ్చిన అధికారులను నియమించుకొనే స్వేచ్చ కూడా లేదని వాపోతున్నారు.