న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)–2005లో తీసుకురావాలని సంకల్పించిన సవరణలపై కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సమాచార హక్కు చట్టాన్ని బలహీనపర్చేలా ప్రభుత్వం తీసుకురానున్న బిల్లుపై చర్చించేందుకు అందరు కమిషనర్లతో వెంటనే సమావేశాన్ని ఏర్పాటుచేయాలని కేంద్ర సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు అత్యంత సీనియర్ కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్‌కు లేఖ రాశారు. ఈ వివాదాస్పద బిల్లును వెనక్కి తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని కమిషనర్లందరికీ లేఖలో విజ్ఞప్తి చేశారు. కొత్త సవరణ బిల్లుతో సమాచార హక్కు చట్టం మౌలిక ఉద్దేశం దెబ్బతింటుందని శ్రీధర్ ఆందోళన
వ్యక్తం చేశారు.
ఆర్టీఐ సవరణ బిల్లుపై సీఐసీ అసంతృప్తి
Published Mon, Jul 23 2018 5:00 AM | Last Updated on Mon, Jul 23 2018 5:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment