Right to Information Act (RTI)
-
ఆర్టీఐని బతకనివ్వరా?!
విధాన నిర్ణయాలపై అనవసర గోప్యత పాటించటం, నిజాలు రాబట్టే ప్రయత్నాలకు పాతరేయటం ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుంది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పుట్టి దాదాపు రెండు దశాబ్దాలు గడిచింది. లోటుపాట్లు సరిదిద్దుకుంటూ మరింత పదునెక్కాల్సిన ఆ చట్టం కాస్తా ప్రభుత్వాల పుణ్యమా అని నానాటికీ నీరుగారుతోంది. తాజాగా ఆ చట్టం తమకు వర్తించదంటూ జవాబిచ్చి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ జాబితాలో చేరింది. షోపూర్ జిల్లా కునోలో ఉన్న వన్యప్రాణి సంరక్షణకేంద్రం, మాందసార్ జిల్లాలో నెలకొల్పబోయే మరో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల గురించి, ముఖ్యంగా చిరుతల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి సమాచారం కావాలంటూ అడిగిన సమాచార హక్కు కార్యకర్త అజయ్ దూబేకు కళ్లు తిరిగి కింద పడేలా ప్రభుత్వ అటవీ విభాగం సమాధానమిచ్చింది.అలాంటి సమాచారం వెల్లడిస్తే దేశ భద్రతకూ, సార్వభౌమత్వానికీ ముప్పు ఏర్పడుతుందట. దేశ సమగ్రత, వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయట. వేరే దేశంతో సంబంధాలు కూడా దెబ్బతినవచ్చట. కాబట్టి చట్టంలోని సెక్షన్ 8(1)(ఏ) ప్రకారం ఇవ్వడం కుదర దట. ఒక చిరుత కూన కాలికి కట్టు కట్టినట్టున్న ఫొటో చూసి మొన్న ఫిబ్రవరిలో పులుల జాతీయ సంరక్షణ ప్రాధికార సంస్థకు దూబే ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు అటవీశాఖ స్పందించింది. కానీ ఆ సమాచారం వెల్లడిస్తే మిన్ను విరిగి మీదపడుతుందన్న స్థాయిలో సమాధానమిచ్చింది. ప్రభుత్వాల పనితీరుపై అవధుల్లేని సమాచారం పౌరులకు లభ్యమైనప్పుడే ప్రజాస్వామ్యానికి పునాదిగా భావించే స్వేచ్ఛ, సమానత్వాలు సాధించుకోవటం, వాటిని కాపాడుకోవటం సాధ్యమవు తుందని జగజ్జేత అలెగ్జాండర్‌కు గురువైన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చెబుతాడు. అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం రెండో శతాబ్దినాటివాడు. సమాచారం ఇవ్వటానికి ససేమిరా అంటున్న మన ప్రభుత్వాలు మానసికంగా తాము ఏకాలంలో ఉండిపోయామో తెలుసుకోవటం ఉత్తమం. ఇప్పుడే కాదు... 2005లో ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడే దేశభద్రత పేరు చెప్పి 22 సంస్థలకు మినహాయింపు ఇచ్చి దాని స్ఫూర్తిని దెబ్బతీశారు. తర్వాత కాలంలో ఆ జాబితా పెరుగుతూ పోయింది. ఆర్టీఐ పరిధి లోకి రాబోమని వాదించే వ్యవస్థలు, విభాగాలు ఎక్కువవుతున్నాయి. రాజకీయ పార్టీలు మొదలు కొని న్యాయవ్యవస్థ వరకూ ఇందులో ఎవరూ తక్కువ తినలేదు. పారదర్శకత తమవల్ల కాదని అందరికందరూ నిర్మొహమాటంగా చెబుతున్నారు. అసలు ఏ సమాచారమైనా కోరితే 30 రోజుల్లో దాన్ని అందజేయాలని ఆర్టీఐ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అది ఎక్కడా అమలవుతున్న దాఖలా లేదు. అప్పీల్ కోసం వెళ్తే అక్కడ మరో కథ. చాలా రాష్ట్రాల్లో సమాచార కమిషనర్లు, ఇతర సిబ్బంది తగినంతమంది ఉండటం లేదు. కొన్నిచోట్ల ప్రధాన కమిషనర్ల జాడలేదు. అయిదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ల, కమిషనర్ల పదవీకాలం, వారి జీతభత్యాలు, సర్వీసు నిబంధనలు రూపొందించే నిర్ణయాధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఆర్టీఐకి సవర ణలు తెచ్చింది. ఈ సవరణలు సహజంగానే సమాచార కమిషన్ వ్యవస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బ తీశాయి. పార్లమెంటులో తగిన సంఖ్యాబలం ఉన్నది కనుక చట్ట సవరణలకు సులభంగానే ఆమోదం లభించింది. కానీ సంబంధిత వర్గాలతో మాట్లాడాకే ఆ సవరణలు తీసుకురావాలన్న కనీస సంప్రదాయాన్ని పాలకులు విస్మరించారు. పౌరులు ప్రధానంగా ప్రభుత్వాల నుంచే సమాచారం రాబట్టాలని కోరుకుంటారు. ఆ ప్రభుత్వమే రకరకాల ప్రయత్నాలతో దానికి అడ్డుపుల్లలు వేయ దల్చుకుంటే ఇక ఆ చట్టం ఉండి ప్రయోజనమేమిటి? ఆర్టీఐ తీసుకొచ్చిన ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగే తర్వాత కాలంలో దాన్ని ‘మితిమీరి’ వినియోగిస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా పాలకులందరిదీ ఇదే బాణీ. పాలనలో పారదర్శకత కోసం, ప్రభుత్వాలకు జవాబుదారీతనం పెంచటం కోసం వచ్చిన చట్టం హద్దులు దాటుతున్నదని పాలకులతోపాటు ఉన్నతాధికార గణం కూడా విశ్వసిస్తోంది. ఆర్టీఐని వమ్ము చేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కనుకనే సమాచారం కోరినవారి ఆనుపానులు క్షణాల్లో అవతలివారికి వెళ్తున్నాయి. సమాచార హక్కు ఉద్యమకారుల ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నాయి. ఇప్పటివరకూ వందమందికి పైగా కార్యకర్తలను దుండగులు హత్యచేశారు. ఈ ఏడాది మొదట్లో ఎలక్టోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పౌరుల సమాచార హక్కు ప్రాధాన్యతనూ, ప్రజాస్వామ్యంలో అది పోషించే కీలకపాత్రనూ తెలియజెప్పింది. రాజ్యాంగదత్తమైన ప్రాథమిక హక్కుల్లో దాన్నొకటిగా గుర్తించింది. ఏదైనా చట్టం వచ్చిన ప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే వారున్నట్టే దుర్వినియోగం చేద్దామనీ, స్వప్రయోజనాలు సాధించు కుందామనీ ప్రయత్నించేవారు ఉంటారు. అంతమాత్రంచేత ఆ చట్టాన్ని నీరుగార్చ కూడదు. కార్గిల్ అమర జవాన్ల కుటుంబాలకు ఉద్దేశించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలోకి రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చొరబడి ఫ్లాట్లు కొట్టేసిన వైనం ఆర్టీఐ చట్టం లేకపోయివుంటే బయటి కొచ్చేదే కాదు. అలాగే మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ కుంభకోణం, పశ్చిమ బెంగాల్లో టీచర్ రిక్రూట్ మెంట్ల అక్రమాలు ఎప్పటికీ వెలుగుచూసేవి కాదు. వ్యక్తులుగా ఎవరైనా దుర్వినియోగానికి పాల్పడితే శిక్షించే విధంగా నిబంధనలు తెస్తే తప్పులేదు. కానీ ఆ సాకుతో మొత్తం చట్టాన్నే నీరుగార్చాలని చూడటం, దేశ భద్రత పేరు చెప్పి అందరినీ బెదరగొట్టడం ప్రమాదకరమైన పోకడ. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్నీ, జవాబుదారీతనాన్నీ దెబ్బతీస్తాయి. నిరంకుశత్వానికి బాటలు పరుస్తాయి. -
రైల్వేలో ఖాళీల సంఖ్య 2.74 లక్షలు
న్యూఢిల్లీ: రైల్వేలో 2.74 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. ఇందులో ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఖాళీలే 1.75 లక్షల వరకు ఉన్నాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నలకు రైల్వే శాఖ వివరంగా సమాధానమిచి్చంది. రైల్వే శాఖలో మొత్తంగా 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసింది. ఇందులో భద్రత కేటగిరీకి సంబంధించిన ఖాళీలు 1,77,924గా ఉన్నాయి. జూన్ 1 తేదీ నాటికి నాన్ గెజిటెడ్ గ్రూప్ సిలో 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు రైల్వే శాఖ చెప్పింది. ఇక రైల్వేల భద్రతకు సంబంధించి 9.82 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే 8.04 లక్షల భర్తీ చేసినట్టు వివరించింది. భద్రత కేటగిరీలో లోకో పైలెట్లు, ట్రాక్ తనిఖీలు చేసే వ్యక్తులు, పాయింట్స్‌మెన్, ఎలక్ట్రీషియన్లు, ఇంజనీర్లు, సిగ్నల్ అసిస్టెంట్లు, ఇంజనీర్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, టికెట్ కలెక్టర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఒడిశాలో బాలాసోర్ వద్ద ఘోరమైన రైలు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఐ కింద పోస్టుల ఖాళీలపై ఆర్టీఐ కింద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
'గతంతో పోలిస్తే త్వరితగతిన స.హ చట్టం కేసుల పరిష్కారం'
న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం కింద దాఖలయ్యే కేసులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు పీఎంవో కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వంలోని కేంద్ర ఇన్ఫర్మేషన్ కమిషన్, రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్లతోపాటు ఇన్ఫర్మేషన్ అధికారులు, అప్పిలేట్ అథారిటీలో సభ్యుల సంఖ్య పెరగనందున కేసుల పరిష్కారంలో విపరీతమైన జాప్యంతోపాటు పెండింగ్ కేసుల జాబితా పెరిగిపోతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటని గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి మౌఖికంగా జవాబిచ్చారు. కేసుల పరిష్కారంలో జాప్యం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇన్ఫర్మేషన్ కమిషన్లలో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేస్తూ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసినట్లు తెలిపారు. ఆర్టీఐ ఫైలింగ్ ప్రక్రియను సరళతరం చేసే ప్రయత్నం జరిగింది. తొలి అపీల్, మలి అపీల్, మడో అపీల్‌కు కాలవ్యవధిని నిర్ణయించాం. సమాచార హక్కు చట్టం కింద 24 వేల మంది ప్రభుత్వ అధికారులు పని చేస్తున్నారని మంత్రి తెలిపారు. గతంలో మాదిరి కాకుండా వార్షిక రిటర్న్స్ ఫైలింగ్ 92 శాతం దాటింది. గడచిన ఎనిమిదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతున్నట్లు రుజువు చేస్తున్నాయని చెప్పారు. చదవండి: (తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా) -
సుప్రీంకోర్టు ఆర్టీఐ పోర్టల్ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు గురువారం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)పోర్టల్‌ను ప్రారంభించింది. ‘‘సుప్రీంకోర్టు ఆర్టీఐ పోర్టల్ సిద్ధమైంది. ఒక వేళ ఏమైనా సమస్యలు ఉంటే సరిచేస్తాం’’అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్టీఐ దరఖాస్తుల ఫీజును ఇంటర్నెట్ బ్యాంకింగ్, మాస్టర్/వీసా క్రెడిట్ డెబిట్ కార్డు లేదా యూపీఐ ద్వారా చెల్లించొచ్చు. దరఖాస్తు ఖరీదు రూ.10. భారతీయ పౌరులు మాత్రమే దీనిని వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. మరోవైపు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అపారమైన పని భారంతో సతమతమవుతున్నారని ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. వచ్చే వారంలో 13 బెంచ్‌ల ముందు 525 అంశాలు జాబితా చేయాల్సి ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. ‘‘న్యాయమూర్తులు ఒత్తిడికి లోనవుతున్నారనే విషయాన్ని నమ్మాలి. ప్రతి బెంచ్ ముందు సుమారు 45 నుంచి 50 కేసులు ఉంటున్నాయి’’అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. -
మూడేళ్లలో 67% తగ్గిన పీఎం కిసాన్ లబ్ధిదారులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకం లబ్ధిదారులు ఏటికేడు తగ్గిపోతున్నారు. 2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైన సమయంలో మొదటి విడత లబ్ధిదారుల సంఖ్య 11.84 కోట్ల మంది కాగా, ఈ ఏడాది జూన్‌లో మొదటి ఇన్స్టాల్మెంట్ 3.87 కోట్ల మంది ఖాతాల్లోనే జమ అయింది. అంటే, దాదాపు 8 కోట్ల మంది రైతులను ఈ జాబితా నుంచి తొలగించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఏ) కింద అడిగిన ప్రశ్నకు సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది. లబ్ధిదారుల సంఖ్య 67% తగ్గిపోవడానికి దారితీసిన కారణాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. పీఎం–కిసాన్ పథకం ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.2 లక్షల కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఏడాదికి రూ.6 వేలను రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా ఏడాదిలో రైతులకు అందించేందుకు పీఎం–కిసాన్‌ను కేంద్రం 2019 ఫిబ్రవరిలో లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో తాజాగా 12వ విడత ఇన్‌స్టాల్‌మెంట్‌ను చెల్లించింది. మొదటి విడతలో 11.84 కోట్ల రైతులు లబ్ధిదారులుగా ఉండగా, ఆరో విడత వచ్చే సరికి ఈ సంఖ్య 9.87 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లబ్ధిదారుల సంఖ్య 55.68 లక్షల నుంచి 28.2 లక్షలకు, మహారాష్ట్రలో 1.09 కోట్ల నుంచి 37.51 లక్షలకు, గుజరాత్లో 63.13 లక్షల నుంచి 28.41 లక్షలకు రైతు లబ్ధిదారుల సంఖ్య పడిపోయింది. దేశంలోని మూడొంతుల మంది రైతుల్లో రెండొంతుల మందికి కూడా పీఎం–కిసాన్ అందకపోవడం దారుణమని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రెసిడెంట్ అశోక్ ధావలె అంటున్నారు. ఈ పథకాన్ని క్రమేపీ కనుమరుగు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. -
కలికాలం అంటే ఇదేనేమో భయ్యా.. నా భర్త జీతం ఎంతో చెప్పండి!
భారత సాంప్రదాయ పద్దతుల్లో భార్యాభర్తల బంధం ఎంతో విలువైంది. ఈ బంధం దృఢంగా ఉండాలంటే కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే లక్షణం ఉండాలని పెద్దలు చెబుతుంటారు. భార్యభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా.. నాలుగు గోడల మధ్యే తేల్చుకోవాలని కానీ.. బయటకు రాకుండా చూసుకోవాలంటారు. అయితే, ఇక్కడ ఓ జంట మధ్య ఏ సమస్య వచ్చిందో ఏమో కానీ.. తన భర్త జీతం ఎంతో తెలుసుకునేందో ఓ భార్య ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. జీతం వివరాల కోసం ఏకంగా ఆర్టీఐRight To Information (RTI)నే ఆశ్రయించింది. వివరాల ప్రకారం.. సంజూ గుప్తా అనే మహిళ తన భర్త జీతం వివరాలు కోరుతూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఆర్టీఐ అధికారులు ఊహించని విధంగా షాకిచ్చారు. కాగా, భర్త అంగీకారం లేకుండా ఆదాయ పన్ను శాఖలోని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(సీపీఐఓ) వివరాలు ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆగ్రహం వ్యక్తపరిచిన సంజూ గుప్తా.. ఫస్ట్ అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించింది. వివరాల కోసం అక్కడ అప్పీల్ చేసుకుంది. అనూహ్యంగా అక్కడ కూడా ఆమె చేదు అనుభవమే ఎదురైంది. ఎఫ్ఏఏ కూడా సీపీఐఓ చెప్పిన సమాధానాన్నే సమర్థించింది. ఆ వివరాలు ఇచ్చేలా చూడాలంటూ ఈసారి ఆమె.. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్(సీఐసీ)కు దరఖాస్తు చేసుకుంది. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన ఆమెకు ఎట్టకేలకు సీఐసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న సీఐసీ ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. 15 రోజుల్లోగా ఆమె భర్తకు సంబంధించిన జీతం వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉన్నప్పటికీ.. సంజూ గుప్తా ఇలా భర్త జీతం వివరాలు ఎందుకు అడగాల్సి వచ్చిందో అనేది మాత్రం తెలియరాలేదు. బహుషా వారి మధ్య ఆర్థికపరమైన విషయాల్లో గొడవలు వచ్చినట్టు తెలుస్తోంది. Sanju Gupta filed an RTI application to acquire the details of her husband’s gross and taxable income for two financial years.https://t.co/SwwjXedxZc — News18.com (@news18dotcom) October 3, 2022 -
సమాచారం అడిగితే.. తెల్లకాగితాలు పంపారు
జడ్చర్ల: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద సమాచారం అడిగిన ఓ వ్యక్తికి అధికారులు వివరాలేమీ లేని తెల్లకాగితాలు పంపారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక రంగారావుతోటలో నివాసం ఉంటున్న సామాజికవేత్త అనిల్‌కుమార్ 40 రోజుల క్రితం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని మిషన్ భగీరథ, సీసీ రోడ్లు తదితర సమస్యలపై పూర్తి వివరాలు అందించాలని ఆర్టీఐ కింద మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేశారు. ఈ క్రమంలో అనిల్‌కుమార్‌కు సంబంధిత అధికారులు పోస్టులో ఓ కవర్ పంపారు. దాన్ని విప్పి చూసిన అనిల్‌కుమార్ ‘తెల్ల’బోయారు. అందులో ఎలాంటి వివరాలు లేకుండా తెల్లకాగితాలు మాత్రమే ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయన వెంటనే స్థానిక విలేకరుల దృష్టికి తెచ్చారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ మహ్మద్ షేక్‌ను వివరణ కోరగా తాము పూర్తి సమాచారాన్ని కవర్లో పెట్టి పోస్టు చేశామని, ఇందుకు సంబంధించిన కాపీ ఒకటి తమ దగ్గర ఉందని పేర్కొన్నారు. అయితే మున్సిపల్ అధికారుల నిర్వాకాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అనిల్‌కుమార్ చెప్పారు. -
సర్కార్‌పై ‘వార్’టీఐ! దరఖాస్తుల ద్వారా యుద్ధానికి రాష్ట్ర బీజేపీ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కార్‌పై సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తుల ద్వారా యుద్ధానికి రాష్ట్ర బీజేపీ సిద్ధమైంది. ప్రభుత్వ లెక్కలు, సమాచారం ఆధారంగా సర్కారును ఎండగట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు కొత్త అస్త్రాన్ని ఎంచుకుంది. సీఎం కేసీఆర్ చట్టసభల్లో, జిల్లా పర్యటనల్లో ఇచ్చిన హామీలు మొదలు.. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోల్లో చేసిన వాగ్దానాలు, ఆర్థిక, రెవెన్యూ, విద్య, వైద్యం, సంక్షేమ, నీటిపారుదల తదితర శాఖల్లో చేపట్టిన కార్యక్రమాలు, ప్రస్తుత పరిస్థితిపై దాదాపు వంద దాకా ఆర్టీఐ దరఖాస్తులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమర్పించారు. ఈ మేరకు సీఎంవోతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ ప్రభుత్వ శాఖల స్పెషల్ సీఎస్‌లు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు ఈ పిటిషన్లను పంపారు. ఇదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల స్థాయిల్లో కూడా పార్టీ జిల్లా కమిటీలు, వివిధ మోర్చాలు, రాష్ట్రస్థాయి నాయకుల ద్వారా పెద్దఎత్తున ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. గత నెల 28 నుంచి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్లలో ముఖ్యమైనవి... ►2014 జూన్‌న్2 నుంచి 2022 జూన్2 వరకు జిల్లా పర్యటనలు, వివిధ సమావేశాలు, సభల్లో సీఎం ఇచ్చిన హామీలేంటి? ఎన్ని నెరవేర్చారు? ►సీఎం కేసీఆర్ అసెంబ్లీ, మండలిలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలేంటి? ఎన్ని నెరవేరాయి? ►ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చారు? ►ఎనిమిదేళ్లలో సీఎం ఎన్నిరోజులు హైదరాబాద్‌లోని అధికార నివాసంలో ఉన్నారు ? ఎన్నిరోజులు ఫామ్‌హౌజ్‌లో బసచేశారు? ►2014 జూన్ 2 నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులు ఎంత? ఆదాయం ఎంత? 2022 మే 30 వరకు చేసిన అప్పులెంత? వీటికి నెలకు వడ్డీ ఎంత చెల్లిస్తున్నారు? ►8 ఏళ్లలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతి నిధుల భూకబ్జాలపై సీఎంకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? వీటిపై మీడియాలో వచ్చిన వార్తలు, ఫిర్యాదులపై కలెక్టర్లు, ఏసీబీ, విజిలె¯న్స్ ద్వారా దర్యాపు చేయించారా? ►హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూ ఆక్రమణలపై మాజీ ఐఏఎస్ ఎస్కే సిన్హా టాస్క్‌ఫోర్స్ నియామక జీవో ఇప్పించండి. ఈ కమిటీపై చేసిన ఖర్చెంత? ఈ నివేదికపై తీసుకున్న చర్యలేమిటి? ►ఎనిమిదేళ్లలో కొత్తగా ఎన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఎన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభించారు? కొత్తగా ఎన్ని మండలాల్లో 30 పడకల ఆసుపత్రులు, ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 పడకల ఏరియా ఆసుపత్రులు ప్రారంభించారు? ►గత 8 ఏళ్లలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్లు జారీచేసింది? ఎన్ని ఖాళీలు భర్తీచేశారు? ►ఎనిమిదేళ్లలో ఎంత మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు? ►బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం వివిధ శాఖల్లో ఎన్ని ఖాళీలున్నాయి? ఈ నివేదిక ఆధారంగా తీసుకున్న చర్యల నివేదిక ఇప్పించగలరు. ►8 ఏళ్లలో సీఎం వివిధ రాష్ట్రాల పర్యటనలకు ఎంత ఖర్చు అయింది? వీటికి ప్రైవేట్ విమానాలను వినియోగించారా లేక రెగ్యులర్ విమానాల్లోనే ప్రయాణించారా? ►ఇప్పటివరకు సీఎం కేసీఆర్ పొందిన జీతభత్యాలు ఎంత? ►వీటితోపాటు రైతులకు రూ.లక్ష రుణమాఫీ, బీసీలకు కేటాయించిన నిధులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎంతమందికి ఇచ్చారు, ఎస్సీ, ఎస్టీలకు భూపంపిణీ, రేషన్ కార్డులు, కస్టమ్ మిల్లింగ్ రైస్ మిల్లులకు తరలింపు, 57 ఏళ్లకు కొత్త వృద్ధాప్య పింఛన్లు, ధరణి పోర్టల్ సమస్యలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, పంచాయతీలకు 8 ఏళ్లలో ఇచ్చిన నిధులు, పోడుభూముల సమస్య, తీసుకున్న చర్యలు వంటి వాటిపైనా ఆర్టీఐ పిటిషన్లు దాఖలు చేశారు. -
ఖర్చవుతుంది మరి.. సహ’ దరఖాస్తుదారుడికి షాకిచ్చిన ఏపీవో ఆశారాణి
ఎర్రావారిపాళెం: ఉపాధి పనులకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి రూ.4.53 లక్షల డీడీ పంపాలంటూ ఏపీవో తిరుగుటపా పంపారు. చిత్తూరు జిల్లా చింతగుంట పంచాయతీ పసుపులేటివారిపల్లికి చెందిన చెన్నయ్య తమ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి 2009వ సంవత్సరం నుంచి వివరాలు కావాలని ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశారు. సదరు వ్యక్తికి ఏపీవో ఆశారాణి.. సమాచారం పంపేందుకు రూ.4.53 లక్షలు డీడీ పంపాలని తిరుగుటపా పంపడంతో దరఖాస్తు దారుడు నివ్వెరపోయాడు. దీనిపై ఏపీవోను వివరణ కోరగా.. 2009 నుంచి అన్ని ప్రింట్ల జిరాక్స్‌లు తీసి ఇవ్వాలంటే అంతే అవుతుందని సూపరింటెండెంట్ లెక్కించినట్టు చెప్పారు. చెన్నయ్యకు ఏపీవో నుంచి అందిన నోటీసు -
వ్యాక్సిన్ కొనుగోలులో కేంద్రం వైఖరి బట్టబయలు
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎంత నత్తనడకన వ్యవహరించిందో సమాచార హక్కు చట్టం కింద బట్టబయలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్‌లో ఆర్భాటంగా ప్రారంభించిన టీకా ఉత్సవ్ సమయంలో ప్రభుత్వం కేవలం 18.60 కోట్ల డోసుల్ని మాత్రమే కొనుగోలు చేసింది. రిటైర్డ్ కమాండర్ లోకేష్ బాత్రా టీకా డోసులపై సమగ్ర వివరాలను సమాచార హక్కు చట్టం కింద అడిగి తెలుసుకున్నారు. దీనికి సమాధానమిచ్చిన కేంద్రం జనవరి 11, 2021న మొట్టమొదటి కొనుగోలు ఆర్డర్ పంపినట్టు తెలిపింది. జూన్ 8, 2021 నాటికి మొత్తంగా 78.6 కోట్ల డోసులకి ఆర్డర్లు పంపినట్టు వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 18 ఏళ్ల వయసుకి పైబడిన వారు 90– 95 కోట్ల మంది ఉన్నారు. వీరందరికీ 190 కోట్ల టీకా డోసులు అవసరమవుతాయి. అంటే ఇంకా 111.4 కోట్ల డోసులు తక్కువున్నట్టు ఈ వివరాలను బట్టి తెలుస్తోంది. మందకొడిగా వ్యాక్సినేషన్‌దా కోవిన్ పోర్టల్ డేటా ప్రకారం 5 నుంచి 10 జులై మధ్య కాలంలో వ్యాక్సినేషన్ సగటున రోజుకి 37.2 లక్షలు మాత్రమే జరిగింది. అంతకు ముందు వారం రోజుకు సగటున 42 లక్షల డోసులు ఇచ్చారు. జూలైలో రోజుకు 40–45 లక్షల డోసుల్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలా జరగాలంటే 12 కోట్ల డోసులు చేయాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రాలు, ప్రైవేటు ఆస్పత్రుల వద్ద 1.54 కోట్ల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
ఆర్టీఐ కార్యకర్త అంజలికి అంతర్జాతీయ గుర్తింపు
వాషింగ్టన్: భారత్‌లోని సమాచార హక్కు ఉద్యమంపై గత రెండు దశాబ్దాలుగా పోరాడుతూ, వ్యవస్థల్లో పారదర్శకత, జవాబు దారీతనం కోసం కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్‌కు అంతర్జాతీయ అవార్డు లభించింది. అగ్రరాజ్యం అమెరికా లోని జో బైడెన్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక చాంపియన్స్ అవార్డుకి ఆమె ఎంపికయ్యారు. అంజలి భరద్వాజ్‌తో పాటుగా మరో 12 మంది ఈ అవార్డుని అందుకోనున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో వ్యవస్థల్ని దారిలో పెట్టడానికి, అవినీతి వ్యతిరేక పోరా టంలో వ్యక్తిగతంగా భాగస్వాములవుతూ అలుపెరుగని కృషి చేసిన వారికి తగిన గుర్తిం పు ఇవ్వడానికే ఈ అవార్డుని ప్రవేశపెట్టినట్టు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి టోని బ్లింకెన్ చెప్పారు. అంతర్జాతీయంగా వచ్చే ఇలాంటి గుర్తింపులు తాను చేస్తున్న ఉద్యమానికి స్ఫూర్తినిస్తాయని అమెరికా అవార్డుకి ఎంపికైన అంజలి భరద్వాజ్ ఆనందం వ్యక్తం చేశారు. -
ఆరోగ్య సేతుని ఎవరు క్రియేట్ చేశారు?
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి మాస్క్, శానిటైజర్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్ కూడా తప్పనసరిగా మారింది. మిలియన్ల మంది భారతీయులు తమ మొబైల్ ఫోన్లలో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సేతు యాప్‌ని ఎవరు క్రియేట్ చేశారనే ప్రశ్న తలెత్తింది. అయితే ఆరోగ్య సేతు వెబ్సైట్లో దీనిని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిందని చూపెడుతుంది. అయితే ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా ఈ రెండు శాఖలు యాప్‌ని ఎవరు సృష్టించారో తెలియదనే సమాచారం ఇచ్చాయి. ఈ క్రమంలో కేంద్ర సమాచార కమిషన్ యాప్‌ని ఎవరు సృష్టించారనే దానిపై "తప్పించుకునే సమాధానాలు" ఇవ్వడంతో ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. అధికారులు సమాచారాన్ని తిరస్కరించడాన్ని అంగీకరించము అని స్పష్టం చేసింది. ‘యాప్‌ని ఎవరు క్రియేట్ చేశారు.. ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి అనే దాని గురించి సంబంధిత శాఖ అధికారులు ఎవరూ వివరించలేకపోయారు. ఇది సరైన పద్దతి కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత విభాగాలు నవంబర్ 24న కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించిది. (చదవండి: ఆరోగ్య సేతుకు మరో ఘనత) ఆరోగ్య సేతు యాప్‌ని ఎవరు క్రియేట్ చేశారనే విషయం తెలుసుకోవడం కోసం సౌరవ్ దాస్ అనే కార్యకర్త ప్రయత్నం చేశాడు. యాప్ ప్రతిపాదన మూలం, దాని ఆమోదం వివరాలు, పాల్గొన్న కంపెనీలు, వ్యక్తులు, ప్రభుత్వ విభాగాలు, యాప్‌ని అభివృద్ధి చేయడంలో పాల్గొన్న ప్రైవేట్ వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ల కాపీలు వంటి వివరాలను ఆయన అడిగారు. రెండు నెలల పాటు ఇది వివిధ విభగాలలో చక్కర్లు కొట్టింది కానీ సరైన సమాధానం మాత్రం లభించలేదు. దాంతో యాప్ క్రియేషన్ గురించి సమాచారం ఇవ్వడంలో వివిధ మంత్రిత్వ శాఖలు విఫలమయ్యాయని సౌరవ్ దాస్ సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. (చదవండి: ఆర్టీఐ పరిధిలోకి ‘సీజేఐ’) నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ "యాప్ సృష్టికి సంబంధించిన మొత్తం ఫైల్ ఎన్ఐసీ వద్ద లేదు" అని తెలిపింది. ఐటీ మంత్రిత్వ శాఖ ఈ ప్రశ్నను జాతీయ ఇ-గవర్నెన్స్ విభాగానికి బదిలీ చేసింది. అది "కోరిన సమాచారం (మా విభాగానికి) సంబంధించినది కాదు" తెలిపింది. ఈ క్రమంలో ఆర్టీఐ బాడీ.. చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, నేషనల్ ఇ-గవర్నెన్స్ విభాగానికి షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. తప్పించుకునే సమాధానం ఇస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలని కమిషన్ తన నోటీసులో కోరింది. -
స.హ.చట్టం.. అధికారులే అడ్డుగోడలు..
సాక్షి, సిరికొండ: పాలనలో పారదర్శకతకు బాటలేయాలి.. అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించాలి.. అవినీతిని కాగడపెట్టి తరిమేయాలి.. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పరిరక్షించాలి.. అనే సంకల్పంతో అమలులోకి వచ్చిన ఏకైక చట్టం సమాచార హక్కు చట్టం. కానీ దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో స.హ చట్టం అమలుకోసం ఏర్పడిన సమాచార కమిషన్ సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానాలు విధిస్తున్నా తీరు మారడం లేదు. సాధారణ సమాచారం అయితే ఇస్తున్నారు కానీ అవినీతి గల సమాచారం లోపాలు గల సమాచారం ఇవ్వడం లేదు. స.హ చట్టం దరఖాస్తుదారుడు తమకు శత్రువైనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పాలన పారదర్శకత కొరవడి ప్రజలకు న్యాయం జరగడం లేదనేది నగ్నసత్యం. చదవండి: (నిఘా నీరసిస్తే ‘సమాచారం’ సమాధే!) ఉమ్మడి జిల్లాలో రూ.68,500 జరిమానా.. సమాచారం తెలుసుకోవడం పౌరుల హక్కు, కానీ స.హ.చట్టం కింద రుసుములు చెల్లించి సమాచారం అడిగే వారికి సెక్షన్ 7(1) ప్రకారం నిర్ణీత గడువులో సమాచారం ఇవ్వడం లేదు. మొదటి అప్పీలు చేసిన స్పందన లేకపోవడంతో సమాచార కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. సదరు అధికారులకు కమిషన్ నోటీసులు పంపించి విచారించి దురుద్దేశ్యపూర్వకంగా సమాచారం ఇవ్వకపోతే జరిమానాలు విధిస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి గత ఎనిమిదేండ్లలో 1131అప్పీళ్లు, 773ఫిర్యాదులు అందగా.. 983అప్పీళ్లు, 599 ఫిర్యాదులు పరిష్కరించి 20మంది అధికారులకు రూ. 68,500 జరిమానాలు విధించారు. మున్సిపాల్టీలు, విద్యాశాఖ, నిజామాబాద్ నగరపాలక సంస్థ, జిల్లా పంచాయతీ కార్యాలయాలకు ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వస్తున్న సమాచారం ఇవ్వడం లేదు. అధికారులే అడ్డుగోడలు.. స.హ.చట్టం సెక్షన్7(1) ప్రకారం 30 రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారం కోసం అధికారులు కుంటిసాకులు వెతుక్కుంటున్నారు. అవగాహన లేమితో సహాయ నిరాకరణ చేస్తున్నారు. తమ కార్యాలయంలో సమాచారం లేకపోతే సెక్షన్ 6(3) కింద ఆ దరఖాస్తును 5రోజుల్లో సమాచారం గల కార్యాలయానికి పంపాలి. కాని తీరిగ్గా 30 రోజుల తరువాత దరఖాస్తును బదిలీ చేస్తున్నారు. మరికొందరు ప్రజా సమాచార అధికారులకు దరఖాస్తు చేస్తే ఇది సెక్షన్ 2(ఊ) ప్రకారం సమాచారం కిందకు రాదని దరఖాస్తును తిరిగి పంపిస్తున్నారు. సదరు జిల్లా పంచాయతీ అధికారులు ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. మరికొందరు అధికారులు సమాచారం కావాలంటే అధిక మొత్తంలో రుసుములు కట్టాలని ఆదేశిస్తున్నారు. కొందరు అధికారులు సమాచారం కోసం దరఖాస్తు చేస్తే నెలలు గడుస్తున్న సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. మరికొందరు అధికారులు ఒక అడుగు ముందుకేసి మొదటి అప్పీలు వేసిన తరువాత రుసుములు కట్టమని అడుగుతున్నారు. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్షన్ 4(1) బి ప్రకారం 17అంశాల సమాచారం ప్రతి ఏడాది అప్డేట్ చేసి ఉంచాలి. కానీ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో స.హ.చట్టం అమలు తీరు నామమాత్రంగా మారింది. ప్రభుత్వ కమిటీలు ఎక్కడ?.. ఉమ్మడి జిల్లా పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సమాచార కమిషన్ ఆదేశాల మేరకు ఉత్తర్వు నెంబరు 1185 అనుసరించి ప్రభుత్వ అధికారులు, ఇద్దరు ఉద్యమకారులతో కలిసి స.హ. చట్టం అమలు కోసం ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేయాలి. కానీ నూతన జిల్లాలు ఏర్పడి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా కమిటీలను ఏర్పాటు చేయలేదు. నిజామాబాద్ జిల్లాలో కమిటీ కాలపరిమితి 2014 నవంబర్‌లో ముగిసిన ఇంతవరకు కొత్త కమిటీ ఏర్పడలేదు. -
పనికిరాని పీఐఓలను పంపించాల్సిందే
సెప్టెంబర్ ఏడో తేదీన మద్రాస్ హైకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చింది. యాంత్రికంగా ఆర్టీఐ దరఖాస్తులను తిరస్కరించే పీఐఓలను ఉద్యోగం నుంచి పంపించేయాలని సూచించింది. అటువంటి పీఐఓలు ఆ పదవుల్లో ఉండడానికి అర్హులు కాదని వ్యాఖ్యానించింది. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, 2006, 07, 08 సంవత్సరాలలో ఎన్ని ఖాళీలు, వాటిలో ఎన్ని వెనుకబడిన వర్గాలకు కేటాయించారు. అలాగే బీసీలకు, చాలా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన స్థానాలలో ఎంపికైన వన్నియకుల శత్రియర్ జాబితా ఇవ్వండి అని ముత్యన్ ఒక ఆర్టీఐ దరఖాస్తు దాఖలుచేశారు. పీఐఓ ఈ దరఖాస్తును తిరస్కరించారు. చివరి రెండు పాయింట్ల సమాచారం ఇవ్వడానికి వీలే లేదట. ఆ సమాచారం వెల్లడిస్తే ఆయా ఉద్యోగుల ప్రైవసీని భంగపరిచినట్టు అవుతుందని, అంతేగాకుండా విభిన్న కులాల మధ్య చిచ్చుపెట్టినవారమవుతామని వారు వాదించారు. దీన్ని సవాలుచేస్తూ రెండో అప్పీలు తమిళనాడు సమాచార కమిషన్ దాకా వెళ్లింది. కమిషన్ ఈ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వును రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్ రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కులాల వారీగా విభజించి పట్టికలు ఇవ్వడం పబ్లిక్ యాక్టివిటీతో సంబంధం లేని పననీ, టీఎన్పీఎస్సీ రాజ్యాంగ విధులు నిర్వర్తించే సంస్థ అనీ, కులాల వివరాలు గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత దీనిపై ఉందని, ఇందువల్ల కుల పోరాటాలు, అల్లర్లు కూడా జరగవచ్చునని నోటికి వచ్చిన కారణాలు అల్లి సమాచారం నిరాకరించారు. ‘‘చాలా ధైర్యంగా కమిషన్ తీసుకున్న అరుదైన నిర్ణయాలలో కెల్లా అరుదైన నిర్ణయం ఇది అయి ఉండాలి. ఈ కేసులో సమాచార కమిషన్ తీర్పును కాదనే అవకాశమే లేదు’’ అని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొనడం విశేషం. రిట్ వేయతగిన తప్పేదీ కనిపించడం లేదని కూడా హైకోర్టు పేర్కొన్నది. కనీసం తాము పేర్కొంటున్న సెక్షన్ 8 క్లాజ్లు వర్తిస్తాయో లేదో ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు సెక్షన్ల నంబర్లు రాసి దరఖాస్తులు తిరస్కరించే ఇటువంటి అధికారులకు గుణపాఠం చెప్పాలి. వారు ఈ పదవుల్లో ఉండేందుకు అర్హులు కాదు. వారిని బయటికి పంపించాల్సిందే. లేదా వారిపైన ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వైద్యనాథన్ సెప్టెంబర్ 7 నాటి తీర్పులో వ్యాఖ్యానించారు. ఈ తప్పు చేసిన అధికారులు ఇంకా సర్వీసులో ఉన్నారా? అని అడిగారు. దానికి వారు జవాబు ఇవ్వలేదు. నెలరోజుల్లోగా పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. రిట్ పిటిషన్‌ని డిస్మిస్ చేసింది. ఈ విధంగా అడిగిన సమాచారం ఇవ్వకపోగా, సమాచార కమిషన్ ఆదేశాలను కూడా తిరస్కరించింది తమిళనాడు పీఎస్సీ. చట్టం ప్రకారం సమాచార కమిషన్ తీర్పు తుది తీర్పు అవుతుంది. తీవ్రమైన ప్రక్రియలోపాలు, సంవి ధాన సంక్లిష్టమైన అంశాలు ఏవైనా ఉంటే రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. మెరిట్ పైన మూడో అప్పీలు ఉండదు. పది రూపాయల ఫీజుతో సమాచారం అడిగే పేదవాడు సామాన్యుడు, సమాచార కమిషన్ దాకా రాగలుగుతాడు, నిలువగలుగుతాడు. హైకోర్టుకు వెళ్లే అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోలేకపోతున్నారు. పబ్లిక్ అథారిటీలు మాత్రం ఈ అధికారాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టంవచ్చినట్టు రిట్లు వేస్తున్నాయి. సమాచార కమిషన్ దాకా వచ్చి గెలిచినా ప్రభుత్వ సంస్థలు డబ్బు, అధికారబలంతో, తమ అనుయాయులయిన లాయర్లకు జనం డబ్బు కట్టబెట్టవచ్చనే లక్ష్యంతో, సమాచార కమిషన్లపైన కోర్టు పోరాటం చేస్తున్నాయి. పగ బట్టిన లిటిగెంట్కు ప్రభుత్వానికి తేడాయే లేదా? రిట్ వేయవచ్చుననే రాజ్యాంగ అవకాశాన్ని నియమాల్ని దుర్విని యోగం చేస్తూ, సమాచార హక్కును సామాన్యుడికి నిరాకరించాలని తద్వారా రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్య్రాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ పేద దరఖాస్తుదారుడిని హైకోర్టుకు లాగుతున్నాయి ప్రభుత్వ సంస్థలు. సమాచార కమిషనర్లు చాలామంది సమాచారం ఇప్పించే హక్కు చట్టానికి వ్యతిరేకంగా నిరాకరిస్తూ ఉంటారు. వారు అవినీతి యంత్రాంగానికి, రాజకీయ ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ సామాన్యుడి హక్కును మట్టిపాలు చేస్తుంటారు. ఆ సామాన్యుడు కమిషన్‌లో గెలిస్తే సంతోషిస్తాడు. కానీ పగబట్టిన ప్రభుత్వం అతన్ని హైకోర్టుకు కూడా లాగుతుంది. ఇంకా మొండి పట్టుదలతో సుప్రీంకోర్టుకు ఈడ్చుతుంది. సమాచార కమిషన్‌లో ఓడిపోతే సామాన్యులలో చాలామంది హైకోర్టులో రిట్ వేయరు. కానీ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడదు. ప్రభుత్వ సంస్థ వేసిన రిట్‌ను హైకోర్టులో వ్యతిరేకించే వారెవరూ ఉండరు. ఎందుకంటే సమాచారం కోరిన వ్యక్తి లాయర్‌ను నియమించుకోలేడు. సమాచార కమిషన్ వాదించడం జరగదు. సామాన్యుడి హక్కును నిలబెట్టే న్యాయమూర్తి ఎవరైనా సహృదయంతో స్పందిస్తే సమాచారం బయటకు వస్తుంది. చాలాకాలం తరువాత ఇటువంటి తీర్పురావడం సంతోషదాయకం. ఇలాంటి సమాచార కమిషనర్లు, హైకోర్టు న్యాయమూర్తులు ఉంటే పీఐఓ నిజాయితీతో సమాచారం ఇస్తే ఆర్టీఐ బతుకుతుంది. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్ , బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
కరోనా: సుప్రీం తీర్పును ఉదహరించిన పీఎంఓ
సాక్షి, న్యూఢిల్లీ: పీఎం కేర్స్ ఫండ్‌కు వస్తున్న విరాళాల వివరాలు ఇవ్వాలని దాఖలైన ఆర్టీఐ దరఖాస్తును ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం గతంలో చేసిన వివాదాస్పద ప్రకటనను ఉదహరిస్తూ.. పీఎం కేర్స్ ఫండ్ వివరాలు నేరుగా బహిరంగపర్చలేమని, దీనికి అనేక కారణాలు ఉన్నాయని పీఎంఓ తెలిపింది. దాంతోపాటు, కోవిడ్ కట్టడికి జరిగిన అత్యున్నస్థాయి సమావేశ వివరాలు బహిరంగం చేయలేమని స్పష్టం చేసింది. సమాచారం హక్కు చట్టం కింద నొయిడాకు చెందిన పర్యావరణ వేత్త విక్రాంత్ తోగాడ్ ఏప్రిల్ 21న పీఎంఓ నుంచి 12 అంశాలతో నివేదిక కోరతూ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అతను సమర్పించిన ఆర్టీఐ దరఖాస్తు సరిగా లేదని, ఒకే దరఖాస్తులో ఇన్ని వివరాలు ఇవ్వలేమని దేనికదే విడిగా అప్లై చేయాలని సూచించింది. కాగా, కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజల నుంచి విరాళాలను సేకరించే లక్ష్యంతో పీఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపుతో సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు సైతం పీఎం కేర్స్ ఫండ్ పెద్ద ఎత్తున విరాళాలు పంపిస్తున్నారు. దీనికి మోదీ ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా ఉండగా, రక్షణ, ఆర్థిక, హోం మంత్రులు ఎక్స్ అఫిషియో ట్రస్టీలుగా ఉన్నారు. ఈ విరాళాలకు పన్ను మినహాయింపును ఇచ్చారు. ఇక విచక్షణారహిత, అసాధ్యమైన డిమాండ్ల మేరకు సమాచారం ఇవ్వాలని చూస్తే.. అది ఆ సంస్థ పనితీరుపైనా, ఫలితంగా సమాచారం సేకరించి, సమకూర్చే ఎగ్జిక్యూటివ్‌పైనా పడుతుందని, అలాంటి సందర్భంలో దరఖాస్తులను స్వీకరించాల్సిన అవసరం లేదని గతంలో సుప్రీం ధర్మాసనం వివాదాస్పద ప్రకటన చేయడం గమనార్హం. (చదవండి: ఇకపై కచ్చితంగా ‘ఆరోగ్య సేతు’!) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1331278836.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సమాచార కమిషనర్ల ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా (ఆర్టీఐ) సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్‌రెడ్డి, మైదా నారాయణరెడ్డి, గిరిజన విద్యార్థి నేత గుగులోతు శంకర్‌నాయక్, న్యాయవాదులు సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్ హుస్సేన్ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో వారితో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఎస్.రాజా సదారాం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఐదుగురు కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వీరు మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బుద్ధా మురళి, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బ్యాంకింగ్ మోసాలు రూ. 1.17 లక్షల కోట్లు!
ఇండోర్: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు సంబంధించి 2019 ఏప్రిల్– డిసెంబర్ మధ్య జరిగిన మోసాల విలువ రూ.1.17 లక్షల కోట్లు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వెల్లడైన అంశమిది. బ్యాంకుల వారీగా చూస్తే... ► 9 నెలల్లో 4,769 కేసుల వల్ల రూ.30,300 కోట్ల నష్టాలు ఎస్బీఐకి ఎదురయ్యాయి. ► పీఎన్బీ విషయంలో కేసుల సంఖ్య 294 అయితే, నష్టం విలువ రూ.14,929 కోట్లు. ► 250 కేసుల్లో రూ.11,166 కోట్ల మోసపూరిత నష్టాలను బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదుర్కొంది. ► ఇక అలహాబాద్ బ్యాంక్ కేసుల సంఖ్య 860 అయితే, విలువ రూ.6,782 కోట్లు. ► బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.6,626 కోట్లకు సంబంధించి 161 కేసులను ఎదుర్కొంది. ► యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 292 కేసులను ఎదుర్కొంది. విలువ రూ.5,605 కోట్లు. ► ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 151 కేసులు (రూ.5,557 కోట్లు) ఎదుర్కొంటే, ఓబీసీ విషయంలో కేసుల సంఖ్య 282 అయితే, వీటి విలువ రూ.4,899 కోట్లు. -
సుప్రీంకోర్టు మరో కీలక తీర్పు
-
ఆర్టీఐ పరిధిలోకి ‘సీజేఐ’
సమాచార హక్కు చట్టం... ఇకపై ఈ చట్టం పరిధిలోకి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయం కూడా వచ్చింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది. 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సమర్థించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను దృష్టిలో ఉంచుకొని పారదర్శకత కొనసాగాలనీ, పారదర్శకత న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగకరంగా మారకూడదని వ్యాఖ్యానించింది. సీజేఐ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చేటప్పుడు పారదర్శకత, గోప్యతల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. న్యూఢిల్లీ: సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రం లాంటి సమాచార హక్కు చట్టం విస్తృతిని మరింత పరిపూర్ణం చేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ) కార్యాలయం సైతం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సంపూర్ణంగా సమర్థించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, కేంద్ర పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను దృష్టిలో ఉంచుకొని పారదర్శకత కొనసాగాలని, పారదర్శకత న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగకరంగా మారకూడదని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా సమాచార హక్కు చట్టాన్ని నిఘా సాధనంగా వాడకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అయితే గోప్యత హక్కు ప్రాధాన్యత కలిగినదని, సీజేఐ కార్యాలయం నుంచి సమాచారం ఇవ్వాలని నిర్ణయించేటప్పుడు పారదర్శకత, గోప్యతల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కిచెప్పింది. కొలీజియం సిఫారసు చేసిన న్యాయమూర్తుల పేర్లను వెల్లడించగలదని స్పష్టం చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇతర సభ్యులుగా ఉన్నారు. హైకోర్టులో ప్రశాంత్ భూషణ్ వినిపించిన వాదనేమిటి? జడ్జీల నియామకాలు అంతుచిక్కని రహస్యంగా ఉన్నాయి. వాటిలో పారదర్శకత అవసరం ఉన్నదని ఆర్టీఐ కార్యకర్త అగర్వాల్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ హైకోర్టులో వాదించారు. జడ్జీలు మరో ప్రపంచంలో జీవిస్తున్నారా? అని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ ప్రజల నిఘాకు మినహాయింపు కాదని, అతీతం అంతకన్నా కాదని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. సమాచార హక్కు చట్టం కింద సమాచారమివ్వడాన్ని వ్యతిరేకించడం ‘దురదృష్టకరం. బాధాకరం’ అని అన్నారు. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది? చీఫ్ జస్టిస్ కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెస్తూ జనవరి 10, 2010లో ఢిల్లీ హైకోర్టు ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత న్యాయమూ ర్తి హక్కు కాదనీ, న్యాయమూర్తి బాధ్యత’అని అభివర్ణించింది. 2010లో నాటి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏపీ షా, జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్, ఎస్.మురళీధర్‌లతో కూడిన ధర్మాసనం 88 పేజీల తీర్పుని వెలువరించింది. చీఫ్ జస్టిస్ కార్యాలయాన్ని సమాచర హక్కు చట్టం పరిధిలోకి తేవడం వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందన్న సుప్రీంకోర్టు వాదనను నాడు ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ తీర్పునిచ్చిన జస్టిస్ సేన్ రిటైరవగా, జస్టిస్ మురళీధర్ ప్రస్తుతం హైకోర్టు సిట్టింగ్ జడ్జిగా ఉన్నారు. సూత్రధారి ఆర్టీఐ కార్యకర్త అగర్వాల్ సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలనే వాదన తొలుత తీసుకొచ్చింది ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్. జడ్జీల ఆస్తుల సమాచారాన్ని అందించాల్సిందిగా కోరుతూ అగర్వాల్ 2007లో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారు. జడ్జీల నియామకాల్లో కొలీజియం, కేంద్రం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల సమాచారం ఇవ్వాలని కోరగా కోర్టు తిరస్కరించింది. దీంతో అగర్వాల్ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)ని ఆశ్రయించారు. సీఐసీ అగర్వాల్‌కు అనుకూలంగా స్పందించింది. సీఐసీ ఉత్తర్వుల్ని ఢిల్లీ హైకోర్టులో సుప్రీంకోర్టు సవాల్ చేయడంతో 2010లో సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకొస్తుందని ఢిల్లీహైకోర్టు తీర్పుచెప్పగా దీన్ని బుధవారం సుప్రీంకోర్టు సమర్థించింది. సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి ఎందుకు చేర్చాలి ► రాజ్యవ్యవస్థ మనుగడకు అవసరమైన అన్ని విభాగాల పనితీరు విషయంలో అత్యంత పారదర్శకతను ప్రదర్శించే సుప్రీంకోర్టు తన సొంత విషయాన్ని సైతం అదే కోణంలో చూడాలి. ► న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత అవసరం ఉంది. ► కొలీజియంలోని న్యాయమూర్తుల అభిప్రాయాలకు విలువనిస్తున్నారా? లేదా? తెలుసుకోవాల్సిన బా«ధ్యత ప్రజలకు ఉంటుంది. ► సీఐసీ ఉత్తర్వుల అనంతరం సమాచారాన్ని వెల్లడించడంలో సుప్రీం కోర్టు సందేహించాల్సిన అవసరం ఏమిటి? ► సీఐసీ ఉత్తర్వులను సుప్రీంకోర్టు తన సొంత కోర్టులోనే సవాల్ చేయడం వల్ల అనుమానానికి తావుంటుంది. అందుకే ఈ కారణాలన్నింటి రీత్యా భారత అత్యున్నత న్యాయ స్థానం సాధారణ ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు సీజేఐ కార్యాలయాన్ని సైతం సమాచార హక్కు చట్టం పరిధిలోనికి తేవాల్సిన అవసరం ఉన్నదని ఆర్టీఐ కార్యకర్త అగర్వాల్‌ని సమర్థిస్తున్న వారి వాదన. ఎప్పుడేం జరిగిందంటే..? ► నవంబర్ 11, 2007: జడ్జీల ఆస్తుల సమాచారాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టుకెళ్లిన అగర్వాల్ ► నవంబర్ 30: సమాచారమిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ ► డిసెంబర్ 8: కోర్టులో తొలి అప్పీల్ దాఖలు ► జనవరి 12, 2008: కొట్టివేసిన కోర్టు ► మార్చి 5: సీఐసీని సంప్రదించిన అగర్వాల్ ► జనవరి 6, 2009: సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందన్న సీఐసీ ► జనవరి 17: సీఐసీ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన సుప్రీంకోర్టు ► ఫిబ్రవరి 26: తమ న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు వ్యక్తిగత సమాచారం కనుక ఆర్టీఐ పరిధిలోకి రావన్న సుప్రీంకోర్టు ► మార్చి 17: తమ జడ్జీలు ఆస్తుల సమాచారాన్ని వెల్లడించేందుకు విముఖత చూపడం లేదనీ, అయితే అందుకు పార్లమెంటులో చట్టం చేయాల్సిన అవసరం ఉన్నదనీ, అయితే ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్య. ► మే 4: సుప్రీంకోర్టు అప్పీల్‌పై ఆర్డర్‌ని రిజర్వులో ఉంచిన హైకోర్టు. ► సెప్టెంబర్ 2: సీఐసీ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు సింగిల్ బెంచ్. ► అక్టోబర్ 5: దీన్ని సవాల్ చేసిన సుప్రీంకోర్టు. ► అక్టోబర్ 7: ముగ్గురు జడ్జీలతో హైకోర్టు ధర్మాసనం ఏర్పాటు ► 2010 జనవరి 10: ఆర్టీఐ పరిధిలోనికి సీజేఐ ఆఫీస్ వస్తుందని హైకోర్టు తీర్పు ► నవంబర్ 26: తీర్పుపై సుప్రీంలో సవాల్చేసిన సుప్రీంకోర్టు ఎస్జీ, సీపీఐఓ ► ఏప్రిల్ 4, 2019: తీర్పుని రిజర్వులో ఉంచిన «సుప్రీంకోర్టు ► నవంబర్ 13, 2019: ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం వస్తుందని సుప్రీంకోర్టు తీర్పు. -
సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు!
-
‘ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ’పై నేడే సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి వస్తుందంటూ ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు తీర్పు వెలువడనుంది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మధ్యాహ్నం 2 గంటలకు తుది తీర్పు వెలువరించనుందని సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్ పేర్కొంది. 2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పును, కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర ప్రజా సమాచార విభాగం అధికారి(సీపీఐవో), సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ పిటిషన్లు వేశారు. వీటిపై ఏప్రిల్ 4వ తేదీతో ధర్మాసనం విచారణ ముగిసింది. ‘గోప్యతా విధానాన్ని ఎవరూ కోరుకోరు. అయితే, దీనికి పరిమితులు ఉండాలి. పారదర్శకత ముసుగులో న్యాయ వ్యవస్థ నాశనం కారాదు’అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది? ‘సమాచార హక్కు చట్టం పరిధిలో సీజేఐ కార్యాలయం కూడా ఉంటుంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనేది న్యాయమూర్తి హక్కు కాదు. అది ఆయనపై ఉంచిన బాధ్యత’అని 2010లో ఢిల్లీ హైకోర్టు 88 పేజీల తీర్పును వెలువరించింది. ఆర్టీఐ కింద జడ్జీలకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలనడాన్ని అప్పటి సీజేఐ కేజీ బాలకృష్ణన్ వ్యతిరేకించారు. సీజేఐ కార్యాలయాన్ని కూడా ఆర్టీఐ పరిధిలోకి తేవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన ఆర్టీఐ కార్యకర్త ఎస్సీ అగర్వాల్ తరఫున ఈ కేసును సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం ఎదుట వాదించారు. ‘ప్రభుత్వానికి చెందిన ఇతర విభాగాలన్నీ పారదర్శకంగా పనిచేయాలని తరచూ చెప్పే అత్యున్నత న్యాయస్థానం తన వరకు వచ్చే సరికి వెనకడుగు వేస్తోంది. జడ్జీలేమైనా వేరే ప్రపంచం నుంచి వచ్చారా?. ఆర్టీఐ నుంచి న్యాయ వ్యవస్థ దూరంగా ఉండటం దురదృష్టకరం, ఆందోళనకరం’ అంటూ వాదించారు. ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే పాలనా వ్యవస్థ జోక్యం నుంచే తప్ప సాధారణ ప్రజల నుంచి కాదు. ప్రభుత్వ విభాగాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునే హక్కు ప్రజల కుంది’ అని ప్రశాంత్ భూషణ్ వాదించారు. -
ఆర్టీఐ కోరలు పీకిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం తన నిరంకుశాధికారాన్ని ప్రకటించింది. కేంద్రంలో, రాష్ట్రాల్లో ఉన్న సమా చార కమిషన్లు ఇక తమ చెప్పు చేతల్లో ఉంటాయని, ప్రభువుల అడుగులకు మడుగులొత్తే విధేయులే సమాచార కమిషనర్లుగా నియమితులవుతారని, అధికారేతరులు ఎంత గొప్ప సేవకులైనా సరే సమాచారాన్ని ఇప్పించే కమిషనర్లుగా నియమితులు కాబోరని పరోక్షంగా స్పష్టపరిచింది. కొద్ది నెలల కిందట సవరణ పేరుతో సమాచార కమిషన్ల స్వయం ప్రతిపత్తి మీద గొడ్డలి వేటు వేసిన విషయం తెలిసిందే. ఆర్టీఐని తుదముట్టించడానికి చేసిన సవరణ చట్టం అమలు కోసం అక్టోబర్ 24వ తేదీని నిర్ణయించి, రాజపత్రంలో ప్రచురించారు. అదే రోజు ఆర్టీఐ నియమాలు అమలులోకి వస్తాయనీ ప్రకటించారు. అక్టోబర్ 12న ఆర్టీఐ అవతరణ దినోత్సవంగా దేశమంతా 14 ఏళ్లనుంచి జరుపుకుంటున్నాం. ఇటీవల 14వ వార్షికోత్సవానికి అమిత్ షా వచ్చి తామే తెచ్చిన ఆర్టీఐ సవరణ మరణ శాసనం గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి వెనుకాడారు. దాన్ని బట్టి అది ఎంత చెప్పుకోకూడని సవరణో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ముఖ్య కమిషనర్‌కు కేబినెట్ సెక్రటరీకి జీతం 2 లక్షల 50 వేలు ఇస్తారు. అదే స్థాయి హోదా సౌకర్యాలు కల్పిస్తారు. కాని ఇంతకు ముందు ఎన్నికల కమిషనర్‌తో సమాన స్థాయి అంటే సుప్రీంకోర్టు జడ్జితో సమానమైన స్థాయి ఉండేది. దాన్ని తగ్గించారన్న మాట. అంటే కేబినెట్ సెక్రెటరీకి మించిన స్థాయి కమిషనర్లకు ఉండకూడదనే కొందరి ఈర్ష్య అసూయలకు ఆర్టీఐ కమిషన్ బలైపోయింది. ఇది వరకు కేంద్ర కమిషనర్లు అందరూ అంటే చీఫ్‌తో సహా సుప్రీంకోర్టు జడ్జి స్థాయి కలిగి ఉండేవారు. ఇప్పుడు చీఫ్ గారికి 2 లక్షల 50 వేల జీతమైతే, కమిషనర్లకు పాతిక వేలు తక్కువ అంటే 2 లక్షల 25 వేల రూపాయలు నిర్ణయించారు. ఇక్కడ డబ్బు సమస్య కాదు. చీఫ్‌ను బాస్‌గా భావించకుండా అందరిలో ప్రథముడిగా గౌర వించి స్వతంత్రంగా వ్యవహరించే కమిషనర్లు ఇక ఈ దేశంలో ఉండరు. వారి బదులు, చీఫ్ గారి కింది స్థాయి అధికారులుగా అస్వతంత్ర కమిషనర్లు నియమితులవుతూ ఉంటారు. ఇదివరకు ఎవరైనా స్వతంత్రంగా వ్యవహరించి కేంద్ర ప్రభుత్వ విభాగాల వారు సమాచారం ఇచ్చితీరాలని ఆదేశాలు జారీ చేస్తే, చీఫ్ నుంచి ఏ ఇబ్బందీ ఉండేది కాదు. చీఫ్‌కు ఇబ్బందులు వస్తే వచ్చి ఉండవచ్చు. ఇబ్బందులు వచ్చి ఉంటే ఛీఫ్‌లే చెప్పాలి. చెప్పగలిగే స్వతంత్రం, ధైర్యం కూడా ఉండాలని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. తక్కువ జీతం, తక్కువ స్థాయితో కమిషనర్లు చీఫ్‌కు అణగి మణగి వ్యవహరించాలన్న సందేశం చట్ట పరంగా జారీ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్టీఐ సమాచార కమిషన్‌కు మరణ శాసనాన్ని జారీ చేసింది. కమిషనర్లకు అయిదేళ్ల పదవీ కాలాన్ని అసలు చట్టం నిర్ధారించింది. ఎవరైనా 5 ఏళ్లు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకూ పదవిలో ఉండే అవకాశం ఉండేది. ఇప్పుడు మూడేళ్లే. దీంతో నష్టం ఏమిటి అని వాదించే వారున్నారు. అయిదేళ్ల పాటు స్వతంత్రంగా ఉండగలిగే వ్యక్తిత్వం ఉన్న కమిషనర్ సమాచారాన్ని ఇప్పించడానికి ఎవరికీ భయపడడు. పదవీ కాలం తగ్గిందంటే ఆ వెసులుబాటు అంతమేరకు తగ్గుతుంది. ఇంకో మూడు నియమాలు కేంద్రం చేతిలో అధికారాలను కేంద్రీకరిస్తున్నాయి. ఏ నియమాన్నయినా సరే సడలించి నీరుకార్చే అధికారాన్ని కేంద్రం రూల్ 22 ద్వారా ఇచ్చుకున్నది. ఇంకా ఏ అలవెన్సులు ఇవ్వాలో, ఏ విలాస సౌకర్యాలు కల్పించాలో నిర్ధారించే అధికారాన్ని 21 వ నియమం ద్వారా కేంద్రం తనకు మిగుల్చుకున్నది. ఇవి చాలవన్నట్టు ఈ నియమాల అర్థాలు ఇంకా ఎవరికైనా తెలియకపోతే, కేంద్రం వివరిస్తుంది. ఆ విధంగా కేంద్రం ఇచ్చిన వివరణ అసంబద్ధంగా ఉన్నా సరైనదనే భావించి తీరాలని రూల్ 23 చెప్పేసింది. శాసనం ద్వారా ఆర్బీఐకి స్థిరమైన హోదాను, పదవీకాలాన్ని, స్వతంత్ర ప్రతిపత్తిని కలి్పంచింది పార్లమెంటు. ఆవిధంగా స్థాయి ఇచ్చే అధికారాన్ని ఈ సవరణ ద్వారా పార్లమెంటు నుంచి లాగేసుకున్నది కేంద్ర ప్రభుత్వం. దాంతో పాటు ఇప్పుడు చేసిన నియమాలు కూడా ఇష్టం వచి్చనట్టు మారుస్తానని, సడలిస్తానని, వాటి అర్థాలు తానే చెబుతానని కేంద్రం చాలా స్పష్టంగా వివరించింది. ఏలిన వారికి అనుకూలంగా తీర్పులివ్వాలని ఇదొక ఆదేశం. ఇవ్వకపోతే నియమాలు మారుస్తాం అని చెప్పే హెచ్చరిక ఈ రూల్స్. కొందరు మిత్రులు ఆర్టీఐలో రెండు సెక్షన్లే కదా సార్ మార్చింది. ఇంత మాత్రానికి ఇల్లెక్కి అరుస్తారెందుకండీ అనే వారూ ఉన్నారు. రెండే సెక్షన్లు మార్చారనడం కరెక్ట్. కాని దాంతో కమిషన్ అనే పులికి కోరలు పీకారని, తిండి పెట్టక మల మల మాడ్చి పులిని జింకగా మార్చారని వారు అర్థం చేసుకోవలసి ఉంటుంది. కేంద్ర కమిషన్ పరిస్థితి ఇది అని ఊరుకోవడానికి వీల్లేకుండా రాష్ట్రాల కమిషన్లకు కూడా ఇదే గతి పట్టించారు. వారి స్థాయి మరీ తక్కువ. అయినా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిషన్లకు కేంద్రం జీతం నిర్ణయించడం ఏమిటి? ఇటువంటి మార్పును ఒప్పుకున్న దివాలాకోరు రాష్ట్రాలనేమనాలి? సిగ్గు చేటు. వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ ఝ్చఛ్చీbజిuటజిజీ.టటజీఛీజ్చిటఃజఝ్చజీ .ఛిౌఝ విశ్లేషణ మాడభూషి శ్రీధర్ -
ఆర్టీఐ కమిషనర్ల పదవి మూడేళ్లే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సమాచార హక్కు కమిషనర్ల పదవీకాలాన్ని మూడేళ్లకు కుదించే ప్రతిపాదన సహా.. సమాచార హక్కు చట్టం నూతన నిబంధనలకు కేంద్రం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఇకపై అన్ని నియామకాలకు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. వేతనం, ఇతర అలవెన్సులు, సర్వీసు నిబంధనల విషయంలో నిర్ణయాధికారం కొత్త నిబంధనల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లభించింది. ఆయా నిబంధనలను మార్చే అధికారం కూడా ఇకపై కేంద్రానికి ఉండనుంది. 2005 చట్టంలో సమాచార హక్కు కమిషనర్ల పదవీ కాలాన్ని కచ్చితంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వచ్చేవరకు అని నిర్ణయించగా, తాజా నిబంధనల్లో దాన్ని మూడేళ్లకు కుదించారు. ప్రధాన సమాచార కమిషనర్ వేతనాన్ని రూ. 2.5 లక్షలుగా, సమాచార కమిషనర్ వేతనాన్ని రూ. 2.25 లక్షలుగా నిర్ణయించారు. ఈ మార్పులు సమాచార హక్కు చట్టం స్ఫూర్తిని కాలరాయడమేనని, తాజా నిబంధనల వల్ల సమాచార కమిషన్లు ప్రభుత్వ విభాగాల స్థాయికి తగ్గిపోతాయని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్టీఐ జాతకం ‘ఇలా ఎలా’ మారింది?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పనితీరులో అవినీతిని, ఆశ్రితపక్షపాతాన్ని అరికట్టేందుకు 2005, జూన్ నెలలో నాటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)’ సవరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ దురదృష్టవశాత్తు ఇటీవల ఆమోదించిన విషయం తెల్సిందే. ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గకుండా స్వతంత్రంగా వ్యవహరించేందుకు వీలుగా ఈ చట్టం కింద సమాచార కమిషనర్లకు ఎన్నికల కమిషనర్ల స్థాయిని కల్పించారు. అంటే జీత భత్యాలు వారితో సమానంగా ఉంటాయి. నిర్దిష్ట పదవీకాలం ఐదేళ్లయినప్పటికీ జీతభత్యాలు మాత్రం ఎన్నికల కమిషనర్లకు మారినప్పుడల్లా మారుతుంటాయి. అలా కాకుండా సమాచార కమిషనర్ల జీత భత్యాలు, వారి పదవీకాల పరిమితిని కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకొస్తూ ఇటీవల ప్రవేశ పెట్టిన సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదించింది. సీబీఐ విషయంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల మాదిరిగా ఇక నుంచి సమాచార కమిషనర్ల వ్యవస్థ కూడా ‘యజమాని పలుకులు పలికే పంజరంలో రామ చిలక’ చందంగా తయారయ్యే ప్రమాదం పొంచి ఉందన్నమాట. వాస్తవానికి 2005లో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీఐ బిల్లును పార్లమెంట్ స్థాయి సంఘానికి పంపించినప్పుడు సమాచార కమిషనర్ల స్వతంత్ర ప్రతిపత్తి కోసం వారికి ఎన్నికల కమిషనర్ల స్థాయి కల్పించాలంటూ సిఫార్సు చేసిందే నాటి బీజేపీ ఎంపీలు. వారిలో ముఖ్యమైన వారు నేటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. మరి ఎందుకు ఇప్పుడు అందులో సవరణ తీసుకరావాల్సి వచ్చింది? ఎన్నికల కమిషన్ రాజ్యాంగం ప్రకారం ఏర్పాటయిందని, ఆర్టీఐ చట్టాన్ని రూపొందించనదేమో పార్లమెంట్ అని, అందుకనే అ చట్టాన్ని సవరిస్తున్నామని పాలకపక్ష బీజేపీ పార్లమెంట్లో సమర్థించుకునేందుకు ప్రయత్నించింది. అసలు ఆర్టీఐ చట్టం వచ్చిందే రాజ్యాంగంలోని 19(1)ఏ అధికరణ కింద. ‘1981 నాటి ఎస్పీ గుప్తా’ కేసులో ప్రభుత్వం నుంచి సమాచారం తెలుసుకునే హక్కు ఉందని మొదటి సారి సుప్రీం కోర్టు ప్రకటించింది. అందుకు రాజ్యాంగంలోకి 19 (1)ఏ అధికరణ దోహదం చేస్తుందని కూడా చెప్పింది. అయినప్పటికీ కొంత గందరగోళం ఉండడంతో 2002లో నాటి కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రీడమ్ ఆఫీ ఇన్ఫర్మేషన్ యాక్ట్’ను తీసుకొచ్చింది. ఇదే 2004, డిసెంబర్ నెలలో ‘రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్’గా రూపాంతరం చెందింది. ఎన్నికల కమిషన్ స్థాయి ‘నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’ లాంటి సంస్థలకు ఉన్నప్పుడు ఆర్టీఐకి ఉంటే తప్పేమిటీ? పార్లమెంట్ ఆమోదించిన ఆర్టీఐ సవరణ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి పరిశీలనకు వచ్చినందున రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాటి తన అభిప్రాయానికి కట్టుబడి బిల్లును తిరస్కరించాలని కోరుతూ కేంద్ర మాజీ సమాచార కమిషనర్ శైలేష్ గాంధీ ఓ వినతి పత్రాన్ని పంపించారు. దానిపై ప్రముఖ సామాజిక కార్యకర్తలు అంజలి భరద్వాజ్, అరుణారాయ్, నికిల్ దేవ్, అమృత జోహ్రి, రాకేష్ దుబ్బుడు సహా 1.27 లక్షల మంది పౌరులు ఆ వినతి పత్రంపై సంతకాలు చేశారు. -
ఆర్టీఐ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టానికి కేంద్రం తీసుకొచ్చిన సవరణల బిల్లును రాజ్యసభ గురువారం ఆమోదించింది. ‘సమాచార హక్కు (సవరణ) బిల్లు–2019’ని లోక్‌సభ సోమవారమే ఆమోదించగా, తాజాగా రాజ్యసభ కూడా ఆమోదించడంతో ఆ బిల్లు పార్లమెంటులో గట్టెక్కింది. అయితే ఈ బిల్లును క్షుణ్నంగా పరిశీలించేందుకు ఎంపిక కమిటీకి పంపాల్సిందేనని రాజ్యసభలో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు పట్టుబట్టడంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరకు బిల్లును ఎంపిక కమిటీకి పంపాలా? వద్దా? అనే విషయంపై ఓటింగ్ నిర్వహించగా, ఆ ఓటింగ్ సమయంలో తమకు అనుకూలంగా ఓటు వేయాల్సిందిగా ఎంపీలను మంత్రులు, అధికార పార్టీ సభ్యులు భయపెట్టేందుకు ప్రయత్నించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేశ్, ఓటు రశీదులను తీసుకెళ్లి సభ్యుల చేత వాటిపై సంతకాలు చేయిస్తుండటం కనిపించడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రతిస్పందించాయి. విపక్ష సభ్యులు సీఎం రమేశ్‌తో గొడవకు దిగి, ఆయన చేతుల్లో నుంచి ఆ రశీదులను లాక్కునేందుకు కూడా ప్రయత్నించారు. అధికార పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లను ఎలా గెలిచిందో మనకు సభలోనే సాక్ష్యం కనిపిస్తోందని రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్ అన్నారు. సీఎం రమేశ్ చర్యను వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులంతా వెల్‌లోకి వచ్చి ఆందోళనలు చేస్తూ నిరసన తెలిపారు. సిబ్బంది, శిక్షణ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఆర్టీఐ చట్టంలో గతంలో ఉన్న లోటుపాట్లను తమ ప్రభుత్వం సరిచేస్తోందని చెప్పుకొచ్చారు. అయితే ఆజాద్ మాట్లాడుతూ ‘మీరు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు. మీ మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి మేం బయటకు వెళ్లిపోతున్నాం’ అని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ మాట్లాడుతూ సమాచార కమిషనర్లు గతంలో ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా పలు తీర్పులు ఇచ్చినందున, ఇప్పుడు మోదీ సమాచార కమిషన్‌పై పగ తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌తోపాటు తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ తదితర ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును, సభలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ బయటకు వెళ్లిపోయాయి. అనంతరం ఓట్లు లెక్కపెట్టగా, బిల్లును ఎంపిక కమిటీకి పంపవద్దని 117 ఓట్లు, పంపాలని 75 ఓట్లు వచ్చినట్లు తెలిసింది. దీంతో విపక్ష సభ్యులెవరూ సభలో లేకపోవడంతో సవరణ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) సహా సమాచార కమిషనర్లందరి పదవీ కాలం, వేతనాలను కేంద్రమే నిర్ణయించేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. -
ఆర్టీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీల తీవ్ర అభ్యంతరాల నడుమ సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం సవరణ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)తోపాటు సమాచార కమిషనర్లందరి పదవీ కాలాన్ని, వేతనాన్ని నిర్ణయించే అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సమాచార కమిషనర్లుగా నియమితులైన వ్యక్తులు ఐదేళ్ల కాలం పాటు లేదా వారికి 65 ఏళ్ల వయసు నిండే వరకు (ఏది ముందైతే అది) ఆ పదవిలో ఉంటున్నారు. అలాగే ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)కు ఇస్తున్నంత వేతనమే సీఐసీకి, ఎన్నికల కమిషనర్లకు ఇస్తున్నంత వేతనమే సమాచార కమిషనర్లకు కూడా ఇస్తున్నారు. ఈ రెండు నిబంధనలను మార్చి, సీఐసీ సహా సమాచార కమిషనర్లందరి పదవీ కాలాన్ని, వేతనాన్ని నిర్ణయించే అధికారాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకునేలా సవరణ బిల్లు ఉంది. దీంతో సమాచార హక్కు చట్టాన్నే నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేసిందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. తాము చెప్పిన మాట వినని సమాచార కమిషనర్లను వెంటనే సాగనంపేందుకు, సమాచార కమిషన్‌ను కూడా తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు, దాని స్వతంత్రతను దెబ్బతీసేందుకే కేంద్రం ఈ సవరణ బిల్లును తీసుకొచ్చిందనీ, లేకపోతే ఇప్పుడు ఈ సవరణలతో పనేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్షాల అభ్యంతరాల కారణంగా లోక్‌సభలో స్పీకర్ ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. 218 మంది సభ్యులు అనుకూలంగా, 79 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. అనంతరం విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంతో మూజు వాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. మోదీ విద్యార్హతలు చెప్పమన్నందుకేనా? బిల్లుపై చర్చను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీఐ వ్యవస్థను నీరుగార్చేందుకు కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఈ బిల్లును తెచ్చిందనీ, కేంద్రం దీనిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాక్షేత్రంలో ఎలాంటి చర్చా జరగకుండానే కేంద్రం ఈ బిల్లును తెచ్చిందనీ, ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హత వివరాలు చెప్పాల్సిందేనని గతంలో ఓ సమాచార కమిషనర్ పీఎంవోను ఆదేశించినందున, వారి అధికారాలకు కోత పెట్టేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారా అని శశిథరూర్ ప్రశ్నించారు. ప్రతిపక్ష డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎంలతోపాటు బిజూ జనతా దళ్ వంటి పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకించాయి. లోక్‌సభలో తనకున్న 303 మంది ఎంపీల బలాన్ని చూసుకుని ఆర్టీఐ స్ఫూర్తినే కేంద్రం చంపేస్తోందని కార్తీ చిదంబరం అన్నారు. ఆర్టీఐ వ్యవస్థ కోరలు పీకి, సమాచార కమినర్లను తమ ఇళ్లలో పని వాళ్లలా మార్చుకోవాలని కేంద్రం చూస్తోందని డీఎంకే ఎంపీ ఎ.రాజా వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఇతర సమాచారం.. ► భారత వైద్య మండలి (ఎంసీఐ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభలో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రవేశపెట్టారు. ► అనేక బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుత పార్లమెంటు సమావేశాలను మరో వారం రోజులపాటు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంగళవారం జరిగే బీఏసీ సమావేశంలో దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం రానున్న శుక్రవారంతో పార్లమెంటు సమావేశాలు ముగియాల్సి ఉంది. బిల్లుపై కేంద్రం మాట.. స్వతంత్ర భారతంలో అత్యంత విజయవంతమైన చట్టాల్లో సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం ఒకటి. తమకు అవసరమైన సమాచారం కోసం ప్రభుత్వాధికారుల్ని ప్రశ్నించగలిగే అధికారాన్ని ఈ చట్టం సామాన్యులకు ఇస్తోంది. ప్రస్తుతం ఈ చట్టం కింద ఏడాదికి దాదాపు 60 లక్షల దరఖాస్తులు దాఖలవుతున్నాయి. అయితే తాజాగా కేంద్రం తెచ్చిన సవరణలతో ఆర్టీఐ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పోయి, అది నిర్వీర్యం అవుతుందని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనికి కేంద్రం సమాధానం చెబుతూ విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా తామేమీ చేయడం లేదనీ, కేవలం ఆ చట్టంలోని కొన్ని లోటుపాట్లను మాత్రమే సరిచేస్తున్నామంటోంది. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్ధ కాగా, ఆర్టీఐ వ్యవస్థ శాసనం ద్వారా ఏర్పాటైంది. అయితే వేతనాలు మాత్రం ఎన్నికల కమిషనర్లు, సమాచార కమిషనర్లకు ఒకేలా ఉండటంతో దానిని తాము హేతుబద్ధీకరిస్తున్నామని అంటోంది. అలాగే ప్రస్తుతం కేంద్ర సీఐసీకి సుప్రీంకోర్టు జడ్జితో సమానమైన హోదా ఇస్తున్నప్పటికీ, సీఐసీ ఇచ్చిన తీర్పులను హైకోర్టులో సవాలు చేసే వీలు ఉండటం సమంజసంగా లేదనీ, ఇలాంటి లోటుపాట్లను సవరించడమే తాజా బిల్లు ఉద్దేశమని ప్రభుత్వం వివరిస్తోంది. -
స్టార్‌కు ఓ న్యాయం... మాకో న్యాయమా?
సాక్షి, చెన్నై: బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు ఓ న్యాయం...తమకు మరో న్యాయమా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని రాజీవ్ హత్యకేసు నింధితులు ప్రశ్నించే పనిలో పడ్డారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు సంజయ్‌దత్‌ను విడుదల చేసినట్టుగానే రాజీవ్ హత్య కేసు నిందితుల్ని కూడా విడుదల చేయాలని న్యాయవాదులు పట్టుబట్టే పనిలో పడ్డారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితులుగా ఉన్న నళిని, మురుగన్, శాంతన్, పేరరివాలన్, రవిచంద్రన్‌తో పాటు ఏడుగురి విడుదల వ్యవహారం రాష్ట్రంలో దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించినా, రాజ్‌భవన్‌లో స్పందన లేని దృష్ట్యా, చివరకు గవర్నర్ బన్వరిలాల్‌ను ప్రశ్నిస్తూ నిందితుల తరఫున రవిచంద్రన్ ఓలేఖ కూడా రాశారు. నిర్ణయం ఏమిటో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో పేరరివాలన్ కొన్నేళ్లుగా చేసిన న్యాయ పోరాటం, తీవ్ర ప్రయత్నాలకు ఫలితంగా ప్రస్తుతం ఓ కేసు విషయంగా కీలక ఆధారాల్ని సేకరించారు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా జైలుశిక్షను సైతం అనుభవించిన బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ విడుదల వ్యవహారాన్ని పేరరివాలన్ గతంలో అస్త్రంగా చేసుకున్నారు. సీబీఐ విచారిస్తున్న, విచారించిన కేసుల్లో ముందస్తు విడుదల వ్యవహారంలో కేంద్రం ఆదేశాలు, నిర్ణయం తప్పనిసరి అన్న వాదనను పరిగణించి సమాచార హక్కు చట్టం మేరకు సంజయ్‌దత్ విడుదలకు వర్తింపచేసిన నిబంధనల వివరాలను పేరరివాలన్ సేకరించారు. ఇందులోని అంశాలన్ని పేరరివాలన్ తరఫు న్యాయవాదులు మీడియా దృష్టికి తెచ్చారు. ఇదేనా న్యాయం.. సంజయ్‌దత్‌ను ముందస్తుగా విడుదల చేసిన వ్యవహారంలో ఎలాంటి కేంద్రం అనుమతుల్ని మహారాష్ట్ర ప్రభుత్వం పొందనట్టుగా సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు తేలాయి. మహారాష్ట్ర జైళ్ల శాఖ నింబంధనలకు అనుగుణంగానే ఆయన్ను విడుదల చేసి ఉండటం గమనార్హం. సంజయ్ దత్‌కు శిక్ష విధించిన సమయంలో కోర్టు తీవ్రంగానే స్పందించిన విషయాన్ని గుర్తు చేస్తూ, మరిన్ని వివరాలను రాబట్టి ఉన్నారు. అలాగే, సంజయ్ దత్ కేసును సీబీఐ విచారించిందని, అది కూడా బాంబు పేలుళ్ల కేసు అని, ఆ కేసులో కేంద్రం అనుమతి అన్నది పొందనప్పుడు, ఈ ఏడుగురి విడుదల విషయంలో మాత్రం ఎందుకు కేంద్రం అనుమతి...? అని పేరరివాలన్ న్యాయవాదులు ప్రశ్నించారు. సంజయ్ దత్‌కు ఓ న్యాయం...రాజీవ్ హత్య కేసు నింథితులకు మరో న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తుండటం విచారకరంగా పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టంలోని అంశాల్ని అస్త్రంగా చేసుకుని న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అదే సమయంలో ఆ సమాచార హక్కు చట్టం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జైళ్ల శాఖ నిబంధనల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు సెక్షన్ 161 మేరకు ఎవ్వరి అనుమతి అన్నది లేకుండా తమిళనాడు ప్రభుత్వానికే ఆ ఏడుగురి విడుదల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఉందన్నారు. అంతే గాని, మంత్రి వర్గం ఆమోదాన్ని రాజ్ భవన్‌కు పంపించి, అక్కడ ఆమోదం కోసం ఎదురు చూడకుండా,త మిళనాడు ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్చేస్తున్నారు. -
సమాచార కమిషనర్లుగా టీడీపీ కార్యకర్తలా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ఐలాపురం రాజా నియామక ప్రతిపాదనపై వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి (జీపీఎం, ఏఆర్)లకు వేర్వేరుగా ఆయన శుక్రవారం లేఖలు రాశారు. టీడీపీ కార్యకర్తలను సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పారదర్శకత లోపించిందని స్పష్టం చేశారు. లేఖలో ఏం రాశారంటే.. చట్టం చెబుతున్నదేమిటి? చేసిందేంటి? ‘సమాచార కమిషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి పేర్లను ప్రతిపాదించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వారిలో ఒకరు విజయవాడకు చెందిన హోటల్ వ్యాపారి ఐలాపురం రాజా కాగా మరొకరు విద్యా శాఖ మంత్రి ప్రైవేట్ కార్యదర్శి, గ్రామాధికారుల సంఘం నాయకుడైన ఇ.శ్రీరామమూర్తి. వీరిద్దరూ టీడీపీ కార్యకర్తలు. ఆర్టీఐ చట్టం (2005) సెక్షన్ 15 ప్రకారం నియామకాలన్నీ సమాచార కమిషన్ నిబంధనావళి ప్రకారమే జరగాలి. చట్టంలోని 5వ సబ్‌సెక్షన్ ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమితులయ్యే వ్యక్తులు ప్రజా జీవనంలో ప్రముఖులై ఉండాలి. న్యాయ, శాస్త్ర, సాంకేతిక, సేవా, యాజమాన్యం (మేనేజ్మెంట్), జర్నలిజం, మాస్ మీడియా, ప్రభుత్వ, పరిపాలనా రంగాలలో విస్తృత పరిజ్ఞానం, అనుభవజ్ఞులై ఉండాలని చట్టం చెబుతోంది. సబ్ సెక్షన్–6 ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్లు ఎంపీలుగా లేదా ఎమ్మెల్యేలుగా ఉండకూడదు. ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు ఉండకూడదు. లాభసాటి పదవులు నిర్వహించి ఉండకూడదు. ఏదైనా వ్యాపారంలో ఉండకూడదని 6వ సబ్ సెక్షన్ స్పష్టం చేస్తోంది. పై నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ఇద్దరూ సమాచార కమిషనర్లుగా అనర్హులు. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వీరిద్దర్నీ ఎలా ప్రతిపాదించింది? ఏ ప్రాతిపదికన ముఖ్యమంత్రి, సీనియర్ క్యాబినెట్ మినిస్టర్ (ప్రతిపక్ష నాయకుడు గైర్హాజరయినపుడు)తో కూడిన కమిటీ వీరి పేర్లకు అనుమతి ఇచ్చింది? వీరిలో ఐలాపురం రాజా పేరును గవర్నర్ ఆమోదించినట్టు, ఇ.శ్రీరామమూర్తి పేరుకు అభ్యంతరం తెలిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతిపక్ష నాయకుడు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆయన రాలేరని తెలిసి కూడా కమిటీ సమావేశాలను నిర్వహించారు. ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకత లోపించింది. రాజకీయ దురుద్దేశపూర్వకంగా జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చేవరకు ఆపండి ఆర్టీఐ కమిషనర్లను నియమించకుండా నాలుగేళ్లు వేచి చూసిన ప్రభుత్వం ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉన్న సమయంలో హడావుడిగా నియమించాల్సిన అవసరం ఏమిటి? వీరి పేర్లను గవర్నర్ ఆమోదం కోసం పంపే ముందు ఎన్నికల కమిషన్ అనుమతి పొంది ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నాం. ఏ పరిస్థితుల్లో గవర్నర్ ఇలా వ్యవహరించారో తెలియడం లేదు. రాష్ట్ర సమాచార కమిషన్‌లో రాజకీయపరమైన నియామకాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. 2017లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆరుగురిని సమాచార కమిషనర్లుగా నియమించినప్పుడు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసి లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో నియామకాలకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఈ నియామకాలను పక్కనపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సంబంధించి సాధ్యమైనంత త్వరలో సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం’ -
ఇదే ఆఖరి అవకాశం
న్యూఢిల్లీ: చట్టపరమైన మినహాయింపులుంటే తప్ప బ్యాంకుల వార్షిక తనిఖీల నివేదికల వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఇచ్చి తీరాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్‌కు సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఇందుకోసం సంబంధిత విధానాలను పునఃసమీక్షించాలని సూచించింది. ఆర్టీఐ చట్టానికి అనుగుణంగా నడుచుకునేందుకు ఆఖరు అవకాశం ఇస్తున్నట్లు హెచ్చరించింది. ‘తదుపరి ఇంకా ఉల్లంఘనలు జరిగితే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది‘ అని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు సారథ్యంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఆర్బీఐపై ఆర్టీఐ కార్యకర్త ఎస్సీ అగ్రవాల్ వేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్‌పై విచారణలో భాగంగా న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది. వివరాల్లోకి వెడితే.. అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని 2015లో ఆర్బీఐకి సుప్రీం కోర్టు సూచించింది. అలాగే ఆర్థిక సంస్థలపై విశ్వాసం దెబ్బతింటుందన్న పేరుతో ఆర్టీఐ చట్ట పరిధిలోకి వచ్చే అంశాలు, డిఫాల్టర్ల వివరాలను దాచిపెట్టి ఉంచడం కుదరదని కూడా స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా.. నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై విధించిన జరిమానాలు, వార్షిక తనిఖీ నివేదికకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐని ఎస్సీ అగ్రవాల్ కోరారు. ఇటువంటి వివరాలు వెల్లడించవచ్చంటూ సుప్రీం కోర్టు ఆదేశాలున్నప్పటికీ .. నిర్దిష్ట విధానం కింద ఆర్టీఐ చట్టం నుంచి వీటికి మినహాయింపు ఉందంటూ, పిటీషనర్ కోరిన సమాచారం ఇవ్వడానికి ఆర్బీఐ నిరాకరించింది. ఈ సమాచారాన్ని ఇవ్వడం కుదరదని పేర్కొంది. దీంతో సుప్రీం కోర్టు సూచనలకు విరుద్ధంగా ఆర్బీఐ నిర్దిష్ట సమాచారానికి మినహాయింపులివ్వడం కోర్టు ధిక్కరణ కిందే వస్తుందంటూ అగ్రవాల్ మరో పిటీషన్ దాఖలు చేశారు. -
దాగుడుమూతలు చెల్లవు!
అప్పు ఇచ్చినవారెవరైనా దాన్ని తిరిగి వసూలు చేసుకోవడానికి చూస్తారు. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తారు. కానీ మన బ్యాంకులు అందుకు విరుద్ధం. చిన్న మొత్తాల్లో అప్పులు తీసు కున్నవారు సకాలంలో చెల్లించకపోతే వారిని కోర్టుకీడ్చడంతోసహా రకరకాల మార్గాలు అనుసరి స్తాయి. కానీ భారీగా రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్నవారి జోలికి మాత్రం వెళ్లవు. సరికదా వారి పేర్లు బయటపెట్టడానికి కూడా ససేమిరా అంటున్నాయి. ఈ విషయంలో రిజర్వ్‌బ్యాంకు వైఖరిని తప్పు బడుతూ తక్షణం ఎగవేతదార్ల జాబితాను బహిరంగపరచాలని, బ్యాంకుల వార్షిక తనిఖీ నివేదికలను వెల్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశించటం హర్షించదగ్గది. అంతేకాదు... బ్యాంకుల గురించి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)కింద ఎవరు ఏ మాదిరి సమాచారం అడిగినా ఇవ్వరాదని నిర్దేశిస్తూ నాలుగేళ్ల క్రితం రూపొందించిన విధానాన్ని ఉపసంహరించుకోవాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లేనట్టయితే కోర్టు ధిక్కార నేరం కింద విచారణ ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించింది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిల్ని బ్యాంకింగ్ పరిభాషలో ‘నిర ర్థక ఆస్తులు’(ఎన్పీఏ) అంటారు. ఈ మొండి బకాయిలు కొండల్లా పెరిగిపోవడంతో బ్యాంకింగ్ వ్యవస్థ చతికిలబడుతోంది. తరచు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని లక్షల కోట్ల రూపాయలిచ్చి ఆదుకుంటే తప్ప రోజులు గడవని స్థితి ఏర్పడుతోంది. నిరుడు మార్చినాటికి వివిధ బ్యాంకులకు రావాల్సిన మొండి బకాయిలు స్థూలంగా 10.35 లక్షల కోట్లని ఒక అంచనా. ఇందులో 85 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించినవే. ఆ అంచనా ప్రకారం ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యాకున్న ఎన్పీఏలే రూ. 2.23 లక్షల కోట్లు! 2008లో మొత్తం రుణాల్లో ఈ మొండి బకాయిల శాతం 2.3 శాతం ఉంటే 2017నాటికి వాటి వాటా 9.3 శాతానికి చేరుకుంది. ఈ మొండి బకాయిల వ్యవ హారంలో తగిన చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 2005లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను విచారించి రూ. 500 కోట్లకు మించి బకాయిపడ్డ కంపెనీల జాబి తాను తమ ముందుంచాలని రెండేళ్లక్రితం సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతోపాటు ఎగవేతదార్ల జాబితాను సీల్డ్ కవర్లో తమకు అందించాలని, అంత భారీ మొత్తంలో రుణాలెందుకు ఇవ్వాల్సి వచ్చిందో బ్యాంకులు వివరించాలని ఉత్తర్వులిచ్చింది. అయినా మన బ్యాంకింగ్ విధానంలో చెప్పు కోదగిన మార్పు రాలేదు. వాస్తవానికి బ్యాంకుల తీరుతెన్నుల్ని పరిశీలించి అంచనా వేయడం కోసం ఏటా ఆర్బీఐ తని ఖీలు నిర్వహిస్తుంది. నివేదికలు రూపొందిస్తుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని సెక్షన్ 35 కింద దానికి ఆ అధికారం ఉంది. నిబంధనల్ని బ్యాంకులు పాటిస్తున్నాయో లేదో చూడటం దీని ప్రధాన ఉద్దే శం. రుణం కోరుతున్న సంస్థ ఉత్పత్తులకు, వ్యాపారానికి మార్కెట్ ఆదరణ లభిస్తుందా, అది రుణాన్ని తిరిగి చెల్లించగలదా, దాని నిర్వహణా సామర్థ్యం ఎలా ఉంది, వీటన్నిటిలో పొంచి ఉన్న ప్రమా దాలు... తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు రుణాలిస్తాయి. వాటికి ఏపాటి ఆస్తు లున్నాయో చూస్తాయి. ఒక సంస్థకు భారీగా రుణం ఇచ్చినప్పుడు ఇవన్నీ సక్రమంగా పరిశీలించారో లేదో చూడటంతోపాటు మొండి బకాయిల స్థితి, వాటికిగల కారణాలు ఆరా తీయడం ఈ తనిఖీల్లోని ప్రధానాంశం. తనిఖీ అనంతరం సంబంధిత బ్యాంకు చీఫ్‌తో చర్చించి నివేదిక రూపొందిస్తారు. ఏ బ్యాంకైనా ప్రజలు తన దగ్గర కూడబెట్టుకున్న సొమ్ముతోనే వ్యాపారం చేయాలి. ఆ వ్యాపారం లొసు గుల మయమై, బ్యాంకులు దివాళా తీస్తే అంతిమంగా నష్టపోయేది ప్రజలే. కను కనే ఈ తనిఖీలు తప్పనిసరి. కానీ విచిత్రంగా వీటి నివేదికల్ని మాత్రం బయటపెట్టకూడదని ఆర్బీఐ నియమం పెట్టుకుంది. సాధారణ వినియోగదారులు తమ నివేదికల్ని సరిగా అవగాహన చేసుకోలేక తప్పుడు నిర్ధారణలకొచ్చే ప్రమాదం ఉన్నదని వాదిస్తోంది. నివేదిక సారాంశమేమిటో, అది నిర్ధారిస్తున్న అంశా లేమిటో చెప్పడానికి, బ్యాంకింగ్ వినియోగదారులకు అవగాహన కలిగించేందుకు ఆర్థికరంగ నిపుణు లుంటారు. ఈ విషయంలో ఆర్బీఐ ఇంతగా ఆందోళన చెందాల్సిన అవసరమేమిటో అర్ధంకాదు. బ్యాంకులు ఎన్ని అక్రమాలు చేస్తున్నా వినియోగదారులు వాటిని అమాయకంగా నమ్మా లని అది భావిస్తున్నట్టు కనబడుతోంది. పారదర్శకత, జవాబుదారీతనం ఏ వ్యవస్థకైనా ప్రాణం. అవి లోపించి నప్పుడే అక్రమార్కులు పుట్టుకొస్తారు. ఫలితంగా అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది. తమ నిర్వాకం బయటపడటం ఖాయమని అర్ధమైతేనే వారు ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉంటారు. ఎగవేతదార్ల నుంచి బకాయిల్ని త్వరగా వసూలు చేసేందుకు వీలుకల్పిస్తూ రెండేళ్లక్రితం దివాలా కోడ్ తీసుకొచ్చారు. కంపెనీ కోసం రుణాలు తీసుకున్నప్పుడు చూపిన ఆస్తుల్ని అనంతరకాలంలో బదలాయించుకుని, కంపెనీ పేరిట తక్కువ ఆస్తులు చూపి వంచించేవారిని కఠినంగా శిక్షించడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెప్పింది. ఇది అమల్లోకొచ్చాక ఎన్పీఏలు స్వల్పంగానైనా తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయని మొన్న జనవరినాటి ఆర్బీఐ నివేదిక చెబుతోంది. మంచిదే. కానీ అది ఎగవేతదార్ల భరతం పట్టడానికి ఉద్దేశించింది. దాంతోపాటు బ్యాంకుల నిర్వాకం ఎలా ఉంటున్నదో, అవి తమ డబ్బుతో ఎలా వ్యాపారం చేస్తున్నాయో తెలుసుకునే హక్కు కూడా విని యోగదారులకుంటుందని ఆర్బీఐ గ్రహించడం అవసరం. అది బ్యాంకులపై వినియోగదారుల్లో ఉండే విశ్వాసాన్ని సడలింపజేయదు సరిగదా దాన్ని మరింత పటిష్టపరుస్తుంది. మన ఆర్థిక వ్యవస్థ పెను గండాల బారిన పడకుండా కాపాడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ పచ్చగా ఉండాలన్నా, ఉపాధి అవ కాశాలు ముమ్మరం కావాలన్నా బ్యాంకులు రుణాలివ్వడం అవసరమే. అదే సమయంలో కేవలం ఎగ్గొట్టే ఉద్దేశంతో వేలాది కోట్లు అప్పులు చేసే విజయ్ మాల్యా, నీరవ్‌మోదీ లాంటివారిని అరి కట్టడం తప్పనిసరి. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు అందుకు దోహదపడతాయి. ఇప్పటికైనా రిజర్వ్ బ్యాంకు కళ్లు తెరవాలి. -
ఆ దేవస్థానాలు.. చర్చిలు.. మసీదులు ఆర్టీఐ పరిధిలోకి రావు
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం పొందని దేవస్థానాలు, చర్చిలు, మసీదులు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి రావని ఉమ్మడి హైకోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి దేవాదాయ చట్టం కింద కమిషనర్ లేదా ఇతర ఏ అధికారి అయినా కూడా ఆర్టీఐ పరిధిలోకి రాని దేవస్థానాల సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద ఇవ్వాల్సిన అవసరం లేదంది. అయితే తమకు నిర్దిష్టంగా తెలిసిన సమాచారాన్ని మాత్రం వారు ఆర్టీఐ కింద ఇవ్వాలని, ఆ చట్టం కింద వారు పబ్లిక్ అథారిటీ కిందకు వస్తారంది.మతపరమైన సంస్థలు ప్రస్తుతం వివిధ మార్గాల నుంచి విరాళాల రూపంలో భారీ మొత్తాలను అందుకుంటున్న నేపథ్యంలో ఆ నిధుల వినియోగం పారదర్శకంగా జరిగేందుకు, సమాచార హక్కు చట్టం లక్ష్యాలను సాధించేందుకు కనీసం రిజిష్టర్ అయిన దేవస్థానాలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చట్ట సవరణ తేవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల తీర్పునిచ్చారు. సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారాన్ని దరఖాస్తుదారులకు ఇవ్వాలంటూ దేవాదాయశాఖ ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఉభయ రాష్ట్రాలకు చెందిన పలు మతపరమైన సంస్థలు, ధార్మిక సంస్థలు, ధర్మకర్తలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు.ఇలా 2007 నుంచి ఈ ఏడాది వరకు దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ కలిపి విచారించిన న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల వీటన్నింటినీ కలిపి ఉమ్మడి తీర్పునిచ్చారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 2 (హెచ్) ప్రకారం దేవస్థానాలు, ధార్మిక సంస్థలు పబ్లిక్ అథారిటీ నిర్వచన పరిధిలోకి రావన్నారు. కాబట్టి దేవస్థానాల ధర్మకర్తలు, పాలకమండళ్లు, చైర్పర్సన్లు ఆయా దేవస్థానాల సమాచారాన్ని ఆర్టీఐ చట్టం కింద అందించాల్సిన అవసరం లేదన్నారు. కేరళ హైకోర్టు సైతం హిందూ ధార్మిక సంస్థలు, దేవస్థానాలు ఆర్టీఐ చట్టం కింద పబ్లిక్ అథారిటీ నిర్వచనం పరిధిలోకి రావని తీర్పునిచ్చిన విషయాన్ని న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు. దేవస్థానాల్లో కొందరు అధికారులు పనిచేస్తున్నప్పటికీ, వారు ఆర్టీఐ చట్టం కింద పబ్లిక్ అథారిటీ పరిధిలోకి రారన్నారు. దేవస్థానాల కార్యకలాపాల నిర్వహణను చూస్తున్నంత మాత్రాన వాటిని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దేవాలయాలుగా, ప్రభుత్వ సాయం అందుతున్న దేవస్థానాలుగా పరిగణించటం సాధ్యం కాదని స్పష్టం చేశారు.సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారాన్ని దరఖాస్తుదారులకు అందచేయాలంటూ పలు దేవాలయాల ఈవోలు, ట్రస్టీలు తదితరులను ఆదేశిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. -
మాజీల పునరావాసం కోసమా ఆర్టీఐ?
సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసేది ప్రభుత్వ విభాగాలే అయినా, వాటిని అమలు చేయించుకోవలసింది చైతన్యం ఉన్న పౌరులే. ఈ చట్టం నిర్మించిన మరొక వ్యవస్థ సమాచార కమిషన్. ఇది న్యాయస్థానాలతో సమం కాకపోయినా న్యాయమూర్తుల వలె నిష్పాక్షికంగా, న్యాయంగా, స్వతంత్రంగా వ్యవహరించవలసిన ఉన్నత వ్యక్తులను నియమించవలసిన సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాదు. యూనియన్ ఆఫ్ ఇండియాకు చెందిన స్వతంత్ర వ్యవస్థ. హోంశాఖ విస్తృత పరిధిలోకి వచ్చినా ఇది ప్రభుత్వ విభాగం కాదు. ఉద్యోగులు శిక్షణ విభాగం (డిఓపిటి) సమాచార హక్కు అమలు బాధ్యత కలిగిన శాఖ. సీఐసీ దాని అనుబంధ కార్యాలయం కాదు. చట్టం సమాచార కమిషనర్‌కు ఉన్నత హోదా ఇచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌తో సమానమైన స్థాయినిచ్చింది. వీరు స్వతంత్రంగా ఆర్టీఐ చట్టాన్ని అమలు చేస్తేచాలు. ఆర్టీఐ చట్టం కూడా పేద్ద అధికారాలేమీ ఇవ్వలేదు. సమాచారం ఇవ్వండి అని ఆదేశించడమే ఈ కమిషన్ ఇవ్వగలిగిన ప్రభుత్వ వ్యతిరేక ఉత్తర్వు. సమాచారం ఇవ్వకపోయినా, నిరోధించినా గరిష్టం పాతికవేల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించవచ్చు. కేవలం సమాచారం ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినందుకే ప్రభుత్వాలు, నాయకులు, అధికారులు భయపడుతున్నారే? అయినా ఇవ్వతగిన సమాచారాన్ని ప్రభుత్వ శాఖలు తమంత తామే ఎందుకు ఇవ్వవు? వారిపై అధికారి తొలి అప్పీలు స్వీకరించి ఎందుకు ఇప్పించరు? ఇవి సామాన్యుడి ప్రశ్నలు. కొందరు వేధించే వారు ఉన్నారు. అనవసరంగా వందలాది ప్రశ్నలు గుప్పించేవారూ ఉన్నారు. అడిగిందే అడిగి ఎవరి మీదో పగతీర్చుకునే పనిచేసేవారూ ఉన్నారు. కేసును బట్టి నిజానిజాలను బట్టి వ్యవహరించవచ్చు. పిటిషన్ తిరస్కరించవచ్చు. కొన్ని వేధింపు అప్పీళ్లు ఉన్నంత మాత్రాన మొత్తం చట్టాన్ని చట్టుబండలు చేసే అధికారం, అవకాశం ఎవరికీ లేదు. చాలామంది సమాచారం ఇవ్వాలని ఉత్తర్వు వేస్తే ఏం కొంప మునిగిపోతుందో అన్నట్టు భయపడుతూ ఉంటారు. అదే అసలు సమస్య. సమాచారం వెల్లడిస్తే ఏవో సమస్యలువస్తాయని ఊహించి భయపడి, సమాచారం ఇవ్వద్దనడంలో ఎంత న్యాయం ఉంది? చట్టం చేసే ముందు ఇటువంటి అధికారులు, సెక్రటరీలు, మంత్రులు ప్రధాన మంత్రి, పార్లమెంటు సభ్యులు ప్రతిపదాన్ని పరీక్షించి చర్చించి మినహాయింపు సెక్షన్లు రచించి, అన్ని సమస్యలను ఆ మినహాయింపుల పరిధిలో నిరాకరించడం ద్వారా తీరుతాయని నిర్ధారించుకున్న తరువాత ఇంకా అనూహ్యమయిన సమస్యలు ఉంటాయంటే ఆ మాటకు అర్థంపర్థం ఉందా? ఈ విధంగా ఊహాత్మక భయాలతో సమాచారం దాచి పెట్టాలని ప్రయత్నించే మాజీ అధికారులు ఈ చట్టం కింద కమిషనర్లుగా నియమితులు కావడం కరెక్టేనా అని అనుమానం. ప్రభుత్వ ఫైళ్లలో దాగిన సమాచారాన్ని వెల్లడిస్తే నేరుగా అధికారులు, మంత్రులు జైళ్లకి వెళ్లిపోతారా? సమాచారం అటువంటిదే అయితే దాన్ని దాచడం నేరం కాదా? ఈ విధంగా వెల్లడిచేయడానికి భయపడే కమిషనర్లు మనకు అవసరమా? వారినెందుకు నియమిస్తున్నారు? వారినే ఎందుకు నియమిస్తున్నారు? అని అడిగే అధికారం ధైర్యం హక్కు ప్రజలకు ఉందా? లేకపోతే అవన్నీ తెచ్చుకోవాలి. అడగాలి. మాజీ అధికారులను మాత్రమే కమిషన్‌లో నియమించాలని ఆర్టీఐ చట్టం చెప్పలేదు. పార్లమెంటరీ కమిటీలో కూడా చెప్పలేదు. ప్రతి పదంపైన, ప్రతి అక్షరం గురించి జరిగిన చర్చోపచర్చల్లో ఈ హక్కు కోసం పోరాడిన వారు కూడా కమిషన్లు మాజీ అధికారుల భోజ్యభోగ్య పదార్థాలుగా మారతాయని ఊహించలేదు. మాజీ రాజకీయ నాయకులు, మాజీ జడ్జిలకు వృద్ధాశ్రమాలుగా కమిషన్లు మారకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈ పదవులను ఎక్కువగా మాజీ అధికారులే ఎగరేసుకు పోతారని, తమ అనుంగు సహచరులుగా మెలగి, అనుయాయులుగా> ఉంటారని, వెన్నెముకను మేధస్సును తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాడబోరని పూర్తి నమ్మకం కుదిరిన తరువాత అటువంటి వారినే ఎంపిక చేయాలని ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని కూడా ఆర్టీఐ చట్టాన్ని కోరుకున్న వారు అనుకోలేదు. ఎవరికోసం అనుకున్న ఈ కమిషన్లు ఎవరికి దక్కాయి? మాజీ బ్యూరోక్రాట్లు హైజాక్ చేయడానికా ఈ చట్టం వచ్చింది? బడాబాబుల డాబుసరి బడాయికోసమా? కానే కాదు. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఆర్టీఐ సవరణ బిల్లుపై సీఐసీ అసంతృప్తి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)–2005లో తీసుకురావాలని సంకల్పించిన సవరణలపై కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సమాచార హక్కు చట్టాన్ని బలహీనపర్చేలా ప్రభుత్వం తీసుకురానున్న బిల్లుపై చర్చించేందుకు అందరు కమిషనర్లతో వెంటనే సమావేశాన్ని ఏర్పాటుచేయాలని కేంద్ర సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు అత్యంత సీనియర్ కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్‌కు లేఖ రాశారు. ఈ వివాదాస్పద బిల్లును వెనక్కి తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని కమిషనర్లందరికీ లేఖలో విజ్ఞప్తి చేశారు. కొత్త సవరణ బిల్లుతో సమాచార హక్కు చట్టం మౌలిక ఉద్దేశం దెబ్బతింటుందని శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
సమాచార హక్కుపై కేంద్రం దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో సమాచార హక్కు చట్టంలో సవరణలు తీసుకొచ్చే బిల్లును ప్రవేశ పెడుతుందన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. అయితే ఆ బిల్లులో ఏముంటుందన్న విషయం నిన్నటి వరకు వెల్లడి కాలేదు. ఈ చట్టంలోని సవరణ ప్రతిపాదనల గురించి కేంద్రం మంగళవారం పార్లమెంట్ సభ్యులకు ఓ సర్కులర్ జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్లతోపాటు, సమాచార కమిషనర్ల జీత భత్యాలను, వారి పదవీకాలాన్ని నిర్ణయించే అధికారం ఇక కేంద్రానికి దఖలు పడుతుందని అందులోని సారాంశం. తద్వారా కేంద్ర ప్రభుత్వం సమాచార కమిషనర్లందరిని తన గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తోంది. ఈ అధికారాలు కేంద్రానికి సిద్ధించినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సమాచార కమిషనర్లు భయపడాల్సి వస్తుందని, లేదంటే జీత, భత్యాల విషయంలో కోత పెట్టడం, పదవి నుంచి తొలగింపు లాంటి బెదిరింపులతో లొంగదీసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఆర్టీఐ చట్టం ఆవశ్యకత గురించి విస్తృతంగా ప్రచారం చేసిన మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ నిఖిల్ దేవ్ వ్యాఖ్యానించారు. ఇది చట్టాన్ని పూర్తిగా నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నమేనని ఆయన విమర్శించారు. ఈ సవరణల వల్ల ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్న సహకార సమాఖ్య వ్యవస్థ విధానం కూడా దెబ్బతింటుందని కామన్వెల్త్ మానవ హక్కుల కార్యకర్త వెంకటేశ్ నాయక్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన, ఇతర సమాచార కమిషనర్ల జీత భత్యాలను కేంద్రమే నిర్ణయిస్తుందంటే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హక్కులను కాలరాయడమే అవుతుందని ఆయన అన్నారు. కేంద్రం ఏ చట్టం, ఏ సవరణ బిల్లును తీసుకురావాలన్నా వాటిలోని ప్రతిపాదనలను ప్రజల ముందు విధిగా ఉంచాలని ‘ప్రీ లెజిస్లేటివ్ కన్సల్టెన్సీ పాలసీ–2014’ నిర్దేశిస్తోంది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం బిల్లులోని ప్రతిపాదనలను ఎంపీలకు మాత్రమే సర్కులేట్ చేసింది. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్ల జీత భత్యాలను చట్టమే నిర్దేశిస్తూ వచ్చింది. అందుకని వారు స్వతంత్య్రంగా వ్యవహరించేందుకు వీలు పడింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ వేతనం, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో సమానంగా ఉంటుందని, ఇతర సమాచార కమిషనర్ల వేతనం, ఇతర ఎన్నికల కమిషనర్లతో సమానంగా ఉంటుందని సమాచార చట్టం నిర్దేశిస్తోంది. అలాగే రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనరల్ వేతనం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో సమానం, ఇతర రాష్ట్ర సమాచార కమిషనర్ల వేతనం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేతనంతో సమానంగా ఉంటుందని చట్టం చెబుతోంది. అలాగే పదవీ కాలాన్ని ఐదేళ్లు, పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లు నిర్దేశించింది. 2005 నాటి సమాచార హక్కు చట్టంలో సవరణ తీసుకరావడం ఇది రెండోసారని, దీని వల్ల చట్టం పూర్తిగా నీరుగారి పోతుందని ‘నేషనల్ కాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్’ సంస్థకు చెందిన అంజలి భరద్వాజ్ ఆరోపించారు. సమాచార చట్టం నుంచి రాజకీయ పార్టీలను మినహాయిస్తూ 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తొలిసారి సవరణ తీసుకొచ్చింది. ఆ సవరణ వల్ల రాజకీయ పార్టీలకు ఎక్కడి నుంచి నిధులు లేదా విరాళాలు వస్తున్నాయో, ఏ మొత్తంలో వస్తున్నాయో ప్రజలు తెలుసుకోవడానికి వీల్లేకుండా పోయింది. -
తాంతియా కుమారి సంచలన వ్యాఖ్యలు
విజయవాడ : సమాచార కమిషనర్ తాంతియా కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు సిండికేట్లుగా ఏర్పడి సమాచార చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఆమె శనివారమిక్కడ అన్నారు. సమాచార హక్కు చట్ట పరిధిలోకి రాకుండా కొన్ని ఆర్థిక బిల్లులను అడ్డదారిలో ఆమోదింపచేయించుకుంటున్నారని తాంతియా కుమారి పేర్కొన్నారు. ఈ అడ్డగోలు వ్యవహారాన్ని న్యాయపరంగా అడ్డుకుంటామని ఆమె తెలిపారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని తాంతియా కుమారి వెల్లడించారు.