న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎంత నత్తనడకన వ్యవహరించిందో సమాచార హక్కు చట్టం కింద బట్టబయలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్‌లో ఆర్భాటంగా ప్రారంభించిన టీకా ఉత్సవ్ సమయంలో ప్రభుత్వం కేవలం 18.60 కోట్ల డోసుల్ని మాత్రమే కొనుగోలు చేసింది. రిటైర్డ్ కమాండర్ లోకేష్ బాత్రా టీకా డోసులపై సమగ్ర వివరాలను సమాచార హక్కు చట్టం కింద అడిగి తెలుసుకున్నారు.
దీనికి సమాధానమిచ్చిన కేంద్రం జనవరి 11, 2021న మొట్టమొదటి కొనుగోలు ఆర్డర్ పంపినట్టు తెలిపింది. జూన్ 8, 2021 నాటికి మొత్తంగా 78.6 కోట్ల డోసులకి ఆర్డర్లు పంపినట్టు వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 18 ఏళ్ల వయసుకి పైబడిన వారు 90– 95 కోట్ల మంది ఉన్నారు. వీరందరికీ 190 కోట్ల టీకా డోసులు అవసరమవుతాయి. అంటే ఇంకా 111.4 కోట్ల డోసులు తక్కువున్నట్టు ఈ వివరాలను బట్టి తెలుస్తోంది.
మందకొడిగా వ్యాక్సినేషన్‌దా
కోవిన్ పోర్టల్ డేటా ప్రకారం 5 నుంచి 10 జులై మధ్య కాలంలో వ్యాక్సినేషన్ సగటున రోజుకి 37.2 లక్షలు మాత్రమే జరిగింది. అంతకు ముందు వారం రోజుకు సగటున 42 లక్షల డోసులు ఇచ్చారు. జూలైలో రోజుకు 40–45 లక్షల డోసుల్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలా జరగాలంటే 12 కోట్ల డోసులు చేయాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రాలు, ప్రైవేటు ఆస్పత్రుల వద్ద 1.54 కోట్ల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment