బ్యాంకింగ్‌ మోసాలు రూ. 1.17 లక్షల కోట్లు! | PSBs hit by fraud cases of Rs 1.17 lakh cr in Apr-Dec | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌ మోసాలు రూ. 1.17 లక్షల కోట్లు!

Published Fri, Feb 14 2020 6:16 AM | Last Updated on Fri, Feb 14 2020 6:16 AM

PSBs hit by fraud cases of Rs 1.17 lakh cr in Apr-Dec - Sakshi

ఇండోర్‌: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు సంబంధించి 2019 ఏప్రిల్‌– డిసెంబర్‌ మధ్య జరిగిన మోసాల విలువ రూ.1.17 లక్షల కోట్లు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వెల్లడైన అంశమిది.

బ్యాంకుల వారీగా చూస్తే...
► 9 నెలల్లో 4,769 కేసుల వల్ల రూ.30,300 కోట్ల నష్టాలు ఎస్‌బీఐకి ఎదురయ్యాయి.
► పీఎన్‌బీ విషయంలో కేసుల సంఖ్య 294 అయితే, నష్టం విలువ రూ.14,929 కోట్లు.  
► 250 కేసుల్లో రూ.11,166 కోట్ల మోసపూరిత నష్టాలను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎదుర్కొంది.  
► ఇక అలహాబాద్‌ బ్యాంక్‌ కేసుల సంఖ్య 860 అయితే, విలువ రూ.6,782 కోట్లు.  
► బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.6,626 కోట్లకు సంబంధించి 161 కేసులను ఎదుర్కొంది.  
► యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 292 కేసులను ఎదుర్కొంది. విలువ రూ.5,605 కోట్లు.  
► ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ 151 కేసులు (రూ.5,557 కోట్లు) ఎదుర్కొంటే, ఓబీసీ విషయంలో కేసుల సంఖ్య 282 అయితే, వీటి విలువ రూ.4,899 కోట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement