ఖాతాదారులకు చెందిన సేఫ్ డిపాజిట్ బాక్స్‌ల నుంచి ఒక బిలియన్ యెన్ (సుమారు 6.6 మిలియన్ డాలర్లు-రూ.558 కోట్లు) సొమ్మును బ్యాంకు ఉద్యోగి దొంగలించినట్లు జపాన్‌లోని ప్రముఖ బ్యాంకు మిత్సుబిషి యుఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్ తెలిపింది. అందుకుగాను అధికారికంగా కస్టమర్లకు క్షమాపణలు చెప్పింది. 60 మంది క్లయింట్‌ల్లో సుమారు 20 మంది ఖాతాల్లో నుంచే 300 మిలియన్ యెన్ (దాదాపు 2 మిలియన్ డాలర్లు-రూ.169 కోట్లు) వరకు దొంగతనాలు జరిగినట్లు ధృవీకరించింది. కస్టమర్లు కోల్పోయిన నగదు పరిహారం కోసం కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: కొత్త సార్ ముందున్న సవాళ్లు!
ఎంయూఎఫ్‌జీ ప్రెసిడెంట్, సీఈఓ జునిచి హంజావా విలేకరులతో మాట్లాడుతూ..‘టోక్యోలోని మిత్సుబిషి యుఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్ బ్యాంకు శాఖల్లో ఈ దొంగతనాలు జరిగాయి. ఏప్రిల్ 2020 నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు ఈమేరకు ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించాం. సేఫ్ డిపాజిట్ బాక్స్‌లను ఓ మహిళా ఉద్యోగి నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన కీ తనవద్దే ఉంటుంది. ఆ ఉద్యోగి డబ్బు తీసుకున్నట్లు, ఇతర పెట్టుబడులు, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లు అంగీకరించింది. వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించి విచారణ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశాం. జరిగిన దొంగతనానికి క్షమాపణలు కోరుతున్నాం. నగదు నష్టపోయిన కస్టమర్లకు పరిహారం చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment