వాషింగ్టన్: భారత్‌లోని సమాచార హక్కు ఉద్యమంపై గత రెండు దశాబ్దాలుగా పోరాడుతూ, వ్యవస్థల్లో పారదర్శకత, జవాబు దారీతనం కోసం కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్‌కు అంతర్జాతీయ అవార్డు లభించింది. అగ్రరాజ్యం అమెరికా లోని జో బైడెన్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక చాంపియన్స్ అవార్డుకి ఆమె ఎంపికయ్యారు. అంజలి భరద్వాజ్‌తో పాటుగా మరో 12 మంది ఈ అవార్డుని అందుకోనున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో వ్యవస్థల్ని దారిలో పెట్టడానికి, అవినీతి వ్యతిరేక పోరా టంలో వ్యక్తిగతంగా భాగస్వాములవుతూ అలుపెరుగని కృషి చేసిన వారికి తగిన గుర్తిం పు ఇవ్వడానికే ఈ అవార్డుని ప్రవేశపెట్టినట్టు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి టోని బ్లింకెన్ చెప్పారు. అంతర్జాతీయంగా వచ్చే ఇలాంటి గుర్తింపులు తాను చేస్తున్న ఉద్యమానికి స్ఫూర్తినిస్తాయని అమెరికా అవార్డుకి ఎంపికైన అంజలి భరద్వాజ్ ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment