international award
-
ప్రధాని మోదీకి నైజీరియా అంతర్జాతీయ అవార్డు
అబుజా: ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాలలో పర్యటనలో ఉన్నారు. దీనిలో భాగంగా నేడు(ఆదివారం) నైజీరియా చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం నైజీరియా అత్యున్నత పురస్కారం "ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్"తో ప్రధాని మోదీని సత్కరించారు. ప్రధాని నరేంద్రమోదీ అందుకున్న 17వ అంతర్జాతీయ అవార్డు ఇది. ప్రధాని మోదీ ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకున్న ప్రపంచంలోనే రెండవ నేతగా నిలవనున్నారు. దీనికి ముందు 1969లో నైజీరియా నుంచి ఈ గౌరవాన్ని బ్రిటన్ రాణి ఎలిజబెత్ అందుకున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ అవార్డును అందుకున్నారు. గతంలో ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు కూడా ప్రధాని మోదీని తమ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించాయి.Nigeria to honour Prime Minister Narendra Modi with its award- The Grand Commander of The Order of the Niger (GCON). Queen Elizabeth is the only foreign dignitary who has been awarded GCON in 1969. This will be the 17th such international award being conferred to PM Modi by a… pic.twitter.com/nOVKGyJr0a— ANI (@ANI) November 17, 2024ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌పై 60 మిసైళ్లతో రష్యా భీకర దాడి -
చక్కని బొమ్మా.. నిను చెక్కిన చేతులకు సలాం
సాక్షి, అనకాపల్లి: ఏడు దశాబ్దాల కిందట అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో నాలుగు విశ్వకర్మ కుటుంబాలు జీవనోపాధి కోసం లక్కబోమ్మల తయారీ ప్రారంభించాయి. నాడు అవసరం కోసం బీజం పడిన ఈ కళ ఇప్పుడు ఆ గ్రామానికి ప్రపంచపటంలో ఒక గుర్తింపు తీసుకువచ్చిం ది. అంకుడు కర్రలతో లక్కబోమ్మలు తయారు చేసే హస్తకళాకార కుటుంబాలు ఈ గ్రామంలో దాదాపు 150 వరకూ వున్నాయి. మారుతున్న కాలానికి, సాంకేతికతకు అనుగుణంగా ఇక్కడి కళాకారులు కూడా విశేష నైపుణ్యంతో అపురూప కళాఖండాలను తమ మునివేళ్లతో సృష్టించి అబ్బురపరుస్తున్నారు. జార్ఖండ్ నుంచి లక్క దిగుమతి రసాయన రంగులతో పోలిస్తే సహజ రంగులే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే లక్కకి సహజమైన రంగులను కలిపి ఇక్కడి కళాకారులు అనేక ప్రయోగాలు చేస్తుంటారు. చుట్టుపక్కల లభించే ఉసిరి, కరక్కాయ, వేప వంటి వాటితో సహజ రంగులను తయారు చేస్తారు. సహజమైన లక్కను ఎక్కువగా జార్ఖండ్‌లోని రాంచీ నుంచి దిగుమతిచేసుకుంటారు. అక్కడ ఒక రకమైన సూక్ష్మజీవి విసర్జితాల నుంచి ఇది లభిస్తుంది. స్థానిక గిరిజనులు దాన్ని సేకరించి అమ్ముతారు.ఆ లక్కకి తూర్పుకనుమల్లో దొరికే వివిధ రకాల మొక్కలు, వాటి విత్తనాలు, ఆకులు, వేళ్లు, కాండం నుంచి వచ్చే సహజ సిద్ధమైన రంగులను కలుపుతారు. 100 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద లక్కని వేడిచేసి, రంగుని కలిపి... దాన్ని బొమ్మలకు అద్దుతారు. గది ఉష్ణోగ్రతవద్ద వద్ద ఈ రంగులు ఎంత కాలమైనా పాడవకుండా ఉంటాయి. 1990 వరకు ఏటికొప్పాక బొమ్మలకు రసాయన రంగులే పూసేవారు. గ్రామానికి చెందిన సీవీ రాజు (చింతలపాటి వెంకటపతిరాజు) రసాయన రంగుల స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడటం మొదలుపెట్టారు. క్రమంగా గ్రామంలోని కళాకారులందరూ సహజరంగులు వినియోగించడం ప్రారంభించారు. బొమ్మల తయారీలో మహిళలే ఎక్కువ..ఏటికొప్పాకలో దాదాపు ప్రతి ఇంటిలోనూ బొమ్మల తయారీ కళాకారులుంటారు. ఇందులో మహిళలే అధిక సంఖ్యలో ఉంటారు. ఇంటి పనులు చూసుకుంటూ వీలు దొరికినప్పుడల్లా వీరు బొమ్మలు తయారు చేస్తుంటారు. మరికొందరు దీన్నే వృత్తిగా తీసుకుంటారు. కుంకుమ భరిణెలు, ఆభరణాలు దాచుకునే డబ్బాలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, మహిళలు ధరించే గాజులు, కీచైన్లు, ఫ్లవర్‌వాజ్‌లు, దేవతామూర్తుల బొమ్మలు మొదలుకుని గ్రామీణ వాతావరణం, శ్రీ వేంకటేశ్వరస్వామి, రామాంజనేయ యుద్ధ సన్నివేశాలు,పెళ్లి తంతు, పెళ్లి సారె ఇలా ఎన్నో రకాల బొమ్మలు ఇక్కడి కళాకారుల చేతిలో రూపుదిద్దుకుంటాయి. పొట్టకూటి కోసం తయారుచేసిన లక్క బొమ్మ.. కాలాంతరంలో ఆ గ్రామానికి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిపెట్టింది. వంట చెరకుగా కూడా పనికిరాని అంకుడు కర్ర మూలవస్తువుగా, ఆకులూ అలములే సహజ రంగులుగా, కళాకారుడి సృజనాత్మకతే అతిపెద్ద పెట్టుబడిగా తయారవుతున్న ఏటికొప్పాక లక్కబొమ్మ ప్రపంచం నలుమూలలా గొప్ప ఆదరణ పొందుతోంది. వరాహనది ఒడ్డున ఉన్న ఈ ప్రశాంత గ్రామంలో నిరంతరం ఉలి శబ్ధం వినిపిస్తూనే ఉంటుంది. వైవిధ్యమైన బొమ్మల తయారీ కోసం కళాకారులు తమ సృజనకు పదును పెడుతూనే ఉంటారు. చేయితిరిగిన ఇక్కడి కళాకారుడి ఉలి నుంచి జాలువారిన ఒక్కో బొమ్మా ఒక్కో కళాఖండమే.. వందలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న ఏటికొప్పాక బొమ్మ రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు సైతం అందుకుంది. ఏటికొప్పాక హస్తకళా నైపుణ్యంపై ‘సాగా ఆఫ్ ది విమెన్’ పేరిట ప్రొఫెసర్ బొగాది నీలిమ తీసిన డాక్యుమెంటరీ ప్రపంచ స్థాయిలో రెండో స్థానం దక్కించుకుంది. విదేశాలకు ఎగుమతి ఏటికొప్పాక లక్కబొమ్మలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. సహజసిద్ధమైన రంగులతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించడం ఎన్నాళ్లయినా ఈ రంగులు సహజత్వాన్ని కోల్పోకుండా ఉండటంతో విదేశీయులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా తెప్పించుకునే వెసులుబాటు ఉండటం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో అందుబాటులో ఉండటంతో అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా, ఆ్రస్టేలియా, పోలెండ్, హాలెండ్, స్విట్జర్లాండ్, బ్రిటన్, జర్మనీ, శ్రీలంక, నేపాల్ దేశాలకు ఏటికొప్పాక బొమ్మలు ఎగుమతవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఏటికొప్పాక లక్కబోమ్మలను వినూత్న రీతిలో తయారు చేసిన పలువురు కళాకారులకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ప్రధాని మోదీ “మన్ కీ బాత్ఙ్ కార్యక్రమంలో లక్క బొమ్మల విశిష్టత గురించి ప్రస్తావించారు. భారత నౌకాదళం విశాఖలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2016లో ఏర్పాటు చేసిన ఏటికొప్పాక బొమ్మల స్టాల్‌ని ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ తన ఫొటోతో తయారు చేసిన లక్క డబ్బాని చూసి ముచ్చటపడి దాని మీద సంతకం కూడా చేశారు.సహజసిద్ధమైన రంగులతో ప్రయోగాలు చేసి, ఏటికొప్పాక బొమ్మకి కొత్త కళను తెచ్చినందుకు సీవీ రాజుకి 2002లో రాష్ట్రపతి అవార్డు, 2012 లో నేషనల్ ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఏటికొప్పాకకు చెందిన మరో కళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి మైక్రో ఆర్ట్స్‌లో నిపుణుడు. 2003లో జాతీయ హస్త కళల పోటీలో ఇతను తయారు చేసిన బొమ్మకు ప్రథమ బహుమతి లభించింది. అలాగే బియ్యపు గింజమీద పట్టేంత వీణ, గుండుసూది మీద పట్టేంత తాజ్ మహల్, ఏనుగు, బుద్ధుడు, ఎడ్లబండి, శ్రీరామ పట్టాభిషేకం, తల వెంట్రుక మీద నిలబెట్టగలిగే పక్షులు... ఇలా అనేక మినీయేచర్ ఆర్టులను చిన్నయాచారి తయారుచేసి అవార్డులు పొందారు.కళ అంతరించిపోకూడదనే.. ఒకప్పుడు రూ.400కు దొరికే అంకుడు కర్రల మోపు.. ఇప్పుడు రూ.4వేలకు పెరిగింది. ఇది కళాకారులకు భారంగా మారింది. స్థానికంగా అంకుడు కర్ర డిపో ఏర్పాటు చేస్తే కళాకారులకు ఉపయుక్తంగా ఉంటుంది. అద్భుతమైన లక్కబోమ్మల తయారీ కళ అంతరించిపోకూడదు. ఇది మా పూర్వీకుల నుంచి మాకు వచ్చిన అరుదైన కళ. బొమ్మల తయారీ గిట్టుబాటు కావడం లేదని గతంలో చాలా మంది కళాకారులు ప్రత్యామ్నాయ పనులకు వెళ్లిపోయారు. దీనిని కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు గ్రామంలో సుమారు 100 మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చాం. ప్రస్తుతం వారికి ఇది ఉపాధినిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే మరింత మందికి ఉపాధి దొరుకుతుంది. – శ్రీశైలపు చిన్నయాచారి, కళాకారుడు, జాతీయ అవార్డు గ్రహీత -
Picture of the Year award: అమానుష ఫొటోకు అవార్డా!
వాషింగ్టన్: ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలపై హమాస్ మిలిటెంట్ల మెరుపుదాడి ఘటనలో ఒక యువతిని అపహరించి అర్ధనగ్నంగా ఊరేగించిన ఫొటోకు అంతర్జాతీయ అవార్డ్ ఇవ్వడం వివాదాస్పదమైంది. ఫొటోలో యువతిని బ్లర్ చేయకుండానే ఇంటర్నెట్లో పెట్టడంతో అవార్డుల సంస్థపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న సంగీత విభావరిపై హమాస్ మిలిటెంట్లు దాడి చేయడం, దాదాపు 360 మందిని చంపేయడం తెలిసిందే. జర్మనీకి చెందిన 22 ఏళ్ల పర్యాటకురాలు షానీ లౌక్తో పాటు పలువురిని కిడ్నాప్ చేశారు. ఆమెను అపహరించి అర్ధనగ్నంగా గాజా వీధుల్లో ఊరేగిస్తుండగా ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ వార్తాసంస్థ పలు ఫొటోలు తీసింది. నాటి దారుణానికి సజీవ సాక్ష్యంగా నిలిచిందంటూ ఈ ఫొటోకు ‘ టీమ్ పిక్చర్ స్టోరీ ఆఫ్ ది ఇయర్’ కేటగిరీ కింద ప్రథమ బహుమతి ప్రకటించారు. అమెరికాలోని కొలంబియాలో ఉన్న మిస్సోరీ స్కూల్ ఆఫ్ జర్నలిజం విభాగమైన డొనాల్డ్ రేనాల్డ్స్ జర్నలిజం ఇన్స్టిట్యూట్ ఈ అవార్డును ప్రకటించింది. ఊరేగింపు ఘటన జరిగిన కొద్ది రోజులకు గాజాలో షానీ లౌక్ పుర్రె భాగం ఇజ్రాయెల్ బలగాలకు దొరికింది. దీంతో హమాస్ మూకలు ఈమెను చిత్రవధ చేసి చంపేశాయని ఇజ్రాయెల్ అక్టోబర్ 30న ప్రకటించింది. ఆమె మృతదేహం ఇంకా గాజాలోనే ఉంది. నాటి నరమేధానికి బలైన అభాగ్యురాలిని ఇలా అవార్డు పేరిట అవమానిస్తారా? అంటూ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ ఫొటోలను అసోసియేటెడ్ ప్రెస్ తీయలేదని, హమాస్ మిలిటెంట్లలో ఒకరు తీసిన ఫొటోలను అసోసియేటెడ్ ప్రెస్ సంపాదించిందని కొందరు వ్యాఖ్యానించారు. -
మెగాహీరో రామ్ చరణ్‌కు మరో గ్లోబల్ అవార్డ్
మెగాహీరో రామ్ చరణ్ మరో ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు తెచ్చుకున్న చరణ్.. ఆ తర్వాత కూడా పలు పురస్కారాలు దక్కించుకున్నాడు. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట చరణ్ ని అవార్డులు వరిస్తూనే ఉన్నాయి. తాజాగా అలా అమెరికాలో నిర్వహించే ఓ క్రేజీ అవార్డు ఇప్పుడీ మెగాహీరోకి దక్కింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: తెగించేసిన శోభాశెట్టి.. ఆ నిజాలన్నీ ఒప్పేసుకుంది కానీ!) అంతర్జాతీయ స్థాయిలో రామ్ చరణ్‌కి మరో గుర్తింపు దక్కింది. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డుల్లో భాగంగా ఈసారి రామ్ చరణ్.. గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నాడు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్.. 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా వచ్చేలోపు చరణ్‌ని ఇంకెన్ని అవార్డులు వరిస్తాయనేది చూడాలి. (ఇదీ చదవండి: సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ!) #POPGOLDENAWARDS2023 GOLDEN BOLLYWOOD ACTOR OF THE YEAR AWARD WINNER REVEALED!! CONGRATULATIONS TO #RAMCHARAN For the well deserved honor!! pic.twitter.com/nzfZG1BxDS — POP GOLDEN AWARDS (@popgoldenawards) December 8, 2023 -
రమణీయం.. ఛాయాచిత్రం
గుంటూరు మెడికల్: నాడి పట్టి రోగాలను నయం చేయటంలో నిత్యం బిజీగా ఉండే గుంటూరుకు చెందిన ఓ వైద్యుడు వైల్డ్ ఫొటోగ్రఫీలో అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకుని గుంటూరు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఒకపక్క జనరల్ ఫిజీషియన్‌గా రోగుల ప్రాణాలు కాపాడుతూ.. మరో పక్క అడవుల్లో సంచరించే క్రూర మృగాల కదలికలను తన కెమెరాతో క్లిక్‌మనిపించి బ్రిటిష్ రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ వారి ఏఆర్పీఎస్ ఫెలోషిప్‌ను అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 22 ఎంట్రీలు ఈ ఫెలోషిప్‌కు పోటీపడగా కేవలం నాలుగు మాత్రమే సొసైటీ ఆమోదం పొందాయి. వాటిలో భారత దేశం నుంచి ఫెలోషిప్ పొందిన ఏకైక వ్యక్తిగా డాక్టర్ నరేంద్ర వెంకటరమణ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఏఆర్పీఎస్ ఫెలోషిప్ అందుకున్న ఏకైక వ్యక్తిగా డాక్టర్ వెంకటరమణ రికార్డు సృష్టించారు. ఏడేళ్లుగా కెమెరాతో గురి.. డాక్టర్ నరేంద్ర వెంకటరమణ మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అడవుల్లో రాయల్ బెంగాల్ టైగర్‌పై చిత్రీకరించిన డాక్యుమెంటరీకి అంతర్జాతీయ అవార్డు లభించింది. డాక్టర్ వెంకటరమణ ఏడు సంవత్సరాలు మూడు తరాలకు చెందిన 80 పులుల ఫొటోలు తీసి అంతర్జాతీయ పోటీలకు పంపించగా, న్యాయ నిర్ణేతలు ఆ ఫొటోలకు మంత్ర ముగ్ధులై ఆయనకు సాహస ఫొటోగ్రఫీకి అవార్డు ప్రకటించారు. డాక్టర్ వెంకటరమణ గత 15 ఏళ్లుగా వన్య ప్రాణుల చాయాచిత్రాలు తీసేందుకు ఆఫ్రికా, కెన్యా, టాంజానియా దేశాలతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోని వన్య ప్రాణుల కేంద్రాలను సందర్శించి, జంతువుల జీవన విధానం, వివిధ దశల్లో వాటి పెరుగుదల, కలిసి మెలిసి జీవించే దృశ్యాలు, వేటాడే దృశ్యాలు తీశారు. చిన్ననాటి నుంచే ఆసక్తి.. డాక్టర్ నరేంద్ర వెంకటరమణ తండ్రి డాక్టర్ గోపాలరావు రైల్వేలో మెడికల్ సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. దీంతో ఒక పక్క తండ్రి మాదిరిగా వైద్యుడు అవ్వాలనే లక్ష్యంతో డాక్టర్ కోర్సు అభ్యసిస్తూనే 2000 సంవత్సరం నుంచి ఫొటోగ్రఫీలో సైతం మెలకువలు నేర్చుకున్నారు. కర్నాటకు చెందిన డీఎన్ఏ పెరుమాళ్, కేరళ రాష్ట్రానికి చెందిన ప్రవీణ్ మోహన్‌దాస్‌ల వద్ద శిష్యుడిగా చేరి వైల్డ్ ఫొటోగ్రఫీలో మెలకువలు నేర్చుకున్నాడు. ఏడాదికి ఒకసారి ప్రకృతితో మమేకం అయ్యేందుకు అడవులకు వెళ్లి జంతువులు, పక్షుల ఫొటోలను తన కెమెరా కళ్లతో బంధిస్తున్నారు. చేతితో చిత్రాలు గీసే కల్చర్ ఆర్ట్‌లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు. గిటారు, కీబోర్డు, డ్రమ్స్, వాయించడంతోపాటు ఫ్లూట్తో పలు గీతాలను ఆలపించడంతో సైతం నైపుణ్యం ఉంది. అందుకున్న డిగ్రీలు, అవార్డులు... ఫొటోగ్రఫీలో డాక్టర్ వెంకటరమణ నైపుణ్యాన్ని గుర్తించిన అమెరికా దేశంలోని పలు సంస్థలు డిగ్రీలను అందజేశాయి. ఇంగ్లండ్‌కు చెందిన ఏఆర్పీఎస్, అమెరికాకు చెందిన ఎంఐఐసీఎస్, ఈయూఎస్పీఏ, ఆ్రస్టేలియాకు చెందిన ఏఏపీఎస్, ఇండియాకు చెందిన ఏఐఐపీసీ సంస్థలు, అసోసియేట్ ఆఫ్ ఇంటర్నేషన్ కొలీగ్స్ సొసైటీ, అసోసియేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్ ఫొటోగ్రఫీ అకాడమీ, ఫెలో ఆఫ్ ఇంటర్నేషనల్ కొలీగ్స్ సొసైటీ ఫొటోగ్రఫీలో మాస్టర్ డిగ్రీలను, ఫెలోషిఫ్లను అందించాయి. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫొటోగ్రఫీ కౌన్సిల్ ఢిల్లీ, కేరళ సొసైటీ బెటర్ ఆర్ట్ ఫౌండేషన్, ఏపీ ఫొటోగ్రఫీ అకాడమీ, పలు జాతీయ సంస్థల నుంచి 15కు పైగా అవార్డులను, ఇంటర్నేషనల్ యాక్సిటెన్సీ 200లకు డాక్టర్ వెంకటరమణ అవార్డు అందుకున్నారు. -
‘బలగం’ దూకుడు.. ఉత్తమ దర్శకుడిగా వేణుకి అంతర్జాతీయ అవార్డు
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకున్న ఈ మూవీ అంతర్జాతీయ వేదికలపై అవార్డులు కొల్లగొడుతుంది. ఈ మూవీ డైరెక్టర్ ఓ హాస్యనటుడు కావడం విశేషం. వెండితెర, బుల్లితెరపై కమెడియన్‌గా అలరించిన వేణు యెల్డండిలీ చిత్రంతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. తెలంగాణ సంస్కృతి, ప్రజల అనుబంధాల కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కేవలం మౌత్ టాక్‌తోనే బలగం మంచి వసూళ్లు చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఒక సినిమా మంచి విజయం సాధించాలన్న, ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే భారీ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదని, కథ ఉంటే చాలని మరోసారి బలగం నిరూపించింది. కేవలం రూ. 2 కోట్లతో రూపొందిన ఈ మూవీ రూ. 25 కోట్లపైనే కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు ఈ మూవీ వరుసగా అవార్డులను అందుకుంటోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఈ మూవీ తాజాగా మరో అవార్డును గెలుచుకుంది. ఈ మూవీ డైరెక్టర్ వేణు తొలిప్రయత్నంలోనే ఉత్తమ దర్శకుడిగా అంతర్జాతీయ అవార్డును సాధించాడు. ఉత్తమ దర్శకుడిగా వేణు ఆమ్ స్టర్ డామ్ ఇంటర్నేషనల్ అవార్డుకు అందుకున్నాడు. కాగా ఇప్పటికే బలగం లాస్ ఏంజెలెస్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉక్రెయిన్ కు చెందిన ఒనికో ఫిల్మ్ అవార్డ్స్ నుంచి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డును గెలుచుకుంది. డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో ఏకంగా నాలుగు అవార్డులు అందుకున్న ఈ మూవీకి మరో ఇంటర్నేషనల్ అవార్డు దక్కడం విశేషం. -
Shelma Sahayam: రెండు ప్రపంచాల మధ్య...
రెండు ప్రపంచాల మధ్య సంచరించే షెల్మకు... మొదటి ప్రపంచంలో కనిపించే సాంకేతిక అద్భుతాలు అంటే ఎంత ఇష్టమో రెండో ప్రపంచంలో కనిపించే కాల్పనిక కథలు అంతే ఇష్టం. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ షెల్మ సహాయం రాసిన పుస్తకం ‘ది ల్యాండ్ ఆఫ్ అటరాక్సియా: జెనిసిస్’ గత నెల గోల్డెన్ బుక్ అవార్డ్(ఉరుగ్వే) గెలుచుకుంది. తాజాగా గ్లోబల్ పబ్లిషింగ్ హౌజ్, ఎక్స్సెల్లర్ ఎక్స్‌లెన్స్ ఇంటర్నేషనల్ అవార్డ్ (ఇండియా)కు ఎంపికైంది... చెన్నైలో... చిన్న వయసులోనే కలం పట్టింది షెల్మ. ప్రైమరీ స్కూల్లో గాంధీజీపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. షెల్మ ఈ పోటీలో పాల్గొంది. అయితే తనకు ఆ మహాత్ముడి గురించి పెద్దగా తెలియదు ‘రకరకాల ఆయుధాలు ఉపయోగించి, బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడారు’ అని రాసింది. ఇది గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఇబ్బందిగా ఉండడం మాట ఎలా ఉన్నా... ఆ వ్యాసరచనే తన తొలి రచన! అయితే ఆ తరువాత కాలంలో ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవడంతోపాటు రచనలు చేయడంపై ఆసక్తి పెరిగింది. ‘నేను భవిష్యత్‌లో రచయిత్రిని కావాలనుకుంటున్నాను’ అని షెల్మ అన్నప్పుడు చాలాముంది ముఖం మీదే నవ్వారు. ‘ఇంజినీర్ కావాలనేది నా కల’ అన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే. ఇలాంటి సమయాల్లో బాబీ ఆంటీ తనకు ఎంతో శక్తి ఇచ్చేది. షెల్మ దృష్టిలో తాను పవర్ఫుల్ ఉమెన్. ‘వారు నీ గురించి ఏం అనుకుంటున్నారనేది ముఖ్యం కాదు. నీకు నీ మీద ఎంత నమ్మకం ఉందనేది ముఖ్యం’ అని చెప్పేది. ఆంటీ ఇచ్చిన ఆత్మవిశ్వాస బలంతో చిన్న చిన్న రచనలు చేసి ఇంట్లో వినిపించేది. తండ్రి మెర్సిలిన్బాబు, తల్లి మేరీ శాంతి, చెల్లెళ్లు స్నేహ, రీతూలు ప్రోత్సాహకంగా మాట్లాడేవారు. ‘నాకు డిప్రెషన్‌గా అనిపించినప్పుడు పేపర్, పెన్ను అందుకొని ఏదో ఒకటి రాస్తుంటాను. అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది’ అంటున్న షెల్మ ‘ఎస్ఎస్ మెర్సె’ కలం పేరుతో ‘ది ల్యాండ్ ఆఫ్ ఆటరాక్సియా: జెనిసిస్’ అనే తొలి ఫాంటసీ థ్రిల్లింగ్ నవల రాసింది. దీనికి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. వీడియోగేమ్స్ ఇష్టపడే యువతరాన్ని కూడా ఈ నవల ఆకట్టుకుంది. తాను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు ఈ నవలకు బీజం పడింది. అయితే అక్షరాల్లో కాకుండా తన మనసులోనే రాసుకుంటూ వస్తోంది. ఎడిట్ చేసుకుంటూ వస్తుంది. తాను చిన్నప్పుడు విన్న ఎన్నో జానపదకథలు, చదివిన పుస్తకాలు ఈ పుస్తకం రాయడానికి స్ఫూర్తిని ఇచ్చాయి. తప్పిపోయిన తమ ఫ్రెండ్ సినన్ను వెదుక్కుంటూ కెప్టెన్ మెగెలాన్ అతని బృందం చేసిన ప్రయాణమే ఈ నవల. కెప్టెన్ బృందం చివరికి ఒక మాంత్రిక ప్రపంచంలోకి వెళుతుంది. అక్కడ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది నవల సారాంశం. ‘ద ల్యాండ్ ఆఫ్ అటరాక్సియా’ ఇచ్చిన ఉత్సాహంతో షెల్మ సహాయం మరిన్ని రచనలు చేయాలనుకుంటోంది. -
అవతార్ 2ను వెనక్కి నెట్టి అగ్ర స్థానంలో ఆర్ఆర్ఆర్
జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్న ఈ సినిమా ఆస్కార్‌కు చేరువలో ఉంది. ఇందులోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్‌గా సాంగ్‌గా ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు మోత మోగిస్తున్న ఈ మూవీ తాజాగా మరో అంతర్జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకుంది. రోటెన్ టొమాటోస్ వారి గోల్డెన్ టమోటో అవార్డును ఆర్ఆర్ఆర్ గెలుచుకుంది. చదవండి: తొలిసారిగా కూతురి ఫోటోలు రివీల్ చేసిన ప్రియాంక చోప్రా రోటెన్ టొమాటోస్ సంస్థ ఈ ఏడాది నిర్వహించిన ఫ్యాన్స్ ఫేవరేట్ 2022 చిత్రాల జాబితాలో ఆర్ఆర్ఆర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాదికి గాను గోల్డెన్ టమోటో అవార్డుకు ‘అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్, టాప్ గన్, బ్యాట్‌మెన్’ వంటి పలు హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడిన ఆర్ఆర్ఆర్ మూవీ వాటిన్నింటిని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుని ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ ఫేవరేట్ మూవీ 2022గా నిలిచినట్లు తాజాగా రోటెన్ టొమాటోస్ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. దీంతో 2022 ఫ్యాన్స్ ఫేవరేట్ మూవీ గోల్డెన్ టమోటో అవార్డుకు ఆర్ఆర్ఆర్ ఎన్నికైనట్లు ఈ సందర్భంగా సదరు సంస్థ వెల్లడిచింది. కాగా హాలీవుడ్‌కు చెందిన ఈ రోటెన్ టొమాటోస్ వెబ్ సైట్ ప్రతి సినిమాకు ప్రేక్షకుల రేటింగ్ ఇస్తుంటుంది. అలాగే ప్రతి ఏటా మంచి సినిమాలకు గోల్డెన్ టొమాటో అవార్డులను ప్రకటిస్తుంది. అలాగే ఈ ఏడాది ఎంతో ఆదరణ పొందిన అవతార్: ద వే ఆఫ్ వాటర్, ది బ్యాట్‌మెన్, టాప్ గన్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ వంటి చిత్రాలతో పాటు ఆర్ఆర్ఆర్ మూవీకి జనవరి 12న ఓటింగ్ నిర్వహించింది. మొదటి వారం కాస్తా తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్ రెండో వారానికి అత్యధిక ఓట్లు అందుకుని అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత స్థానాల్లో టాప్ గన్: మావేరిక్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆన్ ఎట్ వన్స్, ది బ్యాట్‌మెన్, అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చదవండి: అప్పుడే ఓటీటీలోకి ‘హంట్’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..? Our fans voted #RRR as the #GoldenTomato Award winner for Fan Favorite Movie of 2022! https://t.co/gSJnmq1buz pic.twitter.com/tHtk5q4dn4 — Rotten Tomatoes (@RottenTomatoes) January 30, 2023 -
జోగుళాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు
జోగుళాంబ శక్తిపీఠం(మహబూబ్‌నగర్ జిల్లా): తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠం అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయానికి అరుదైన గౌరవం లభించింది. హిందుస్తాన్ గగన్‌గౌరవ్ జ్యోతిర్లింగ ఫౌండేషన్లు వరల్డ్ హెల్త్ డయాబెటిక్, క్యాన్సర్, ఎయిడ్స్ ఫౌండేషన్ కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని గాంధీభవన్‌లో సంయుక్తంగా నిర్వహించిన ఓ సదస్సులో జోగుళాంబ ఆలయానికి ‘హిందుస్తాన్ గగన్‌గౌరవ్ అంతర్జాతీయ పురస్కారం–2022’ప్రకటించారు. కోవిడ్ సమయంలో వచ్చిన తుంగభద్ర నదీ పుష్కరాలకు లక్షలాది మంది వచ్చినా ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తకుండా నిర్వహించినందుకు గాను ఈ అవార్డును ఇస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఆలయ ఈఓ పురేందర్, ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, వేదపండితులు శ్యాంకుమార్ శర్మలను ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సత్కరించి వారికి అవార్డును ప్రదానం చేశారు. -
పురస్కారం..: పచ్చనాకు సాక్షిగా...
చేనులోని గోధుమను ఎప్పుడైనా పలకరించారా? అది తన గోడు వెళ్లబుచ్చుకోదు. మన గోడు ఏమిటో శ్రద్ధగా వింటుంది. మన ఆకలి తీరుస్తుంది... అందుకే గోధుమ అంటే నార్మన్ బోర్లాగ్‌కు అంత ఇష్టం. మన దేశం కరువు కోరల్లో చిక్కుకుపోయిన ఒకానొక సమయంలో ఆయన సృష్టించిన గోధుమ వంగడాలు అద్భుతాన్ని సృష్టించాయి. రైతు కంట్లో వెలుగులు నింపాయి. అందుకే ఆయన ఫోటో మన రైతుల ఇండ్లలో కనిపిస్తుంది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న బోర్లాగ్ గ్లోబల్ రస్ట్ ఇనిషియేటివ్ (బీజీఆర్‌ఐ) అంతర్జాతీయ అవార్డ్‌కు ఎంపికైన డా.పర్వీన్, మెంటర్ విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపికైన తొలిభారతీయ శాస్త్రవేత్త... నార్మన్ బోర్లాగ్ అనే పేరు వినబడగానే అమెరికన్ పేరులా అనిపించదు. ఆత్మీయనేస్తంలా ధ్వనిస్తుంది. మెక్సికోలో ఇంటర్నేషనల్ మైజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్‌గా పనిచేసిన బోర్లాగ్ రోగనిరోధక శక్తితో కూడిన, అధిక దిగుబడి ఇచ్చే డ్వార్ఫ్(చిన్న) గోధుమ వంగడాలను సృష్టించి రైతునేస్తం అయ్యాడు. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. మన దేశం కరువు కోరల్లో చిక్కుకున్న విషాదకాలంలో ఆయన సృష్టించిన గోధుమ వంగడాలు మనకు ఎంతో ఉపయోగపడ్డాయి. కరువు కోరల నుంచి రక్షించాయి. గోధుమ ఉత్పత్తిలో మన రైతులు స్వయంసమృద్ధి సాధించేలా చేశాయి. అందుకే ఉత్తరభారతంలోని రైతుల ఇండ్లలో ఆయన ఫోటో కనిపిస్తుంది. బోర్లాగ్ కుమార్తె జీని బోర్లాగ్ తండ్రి కృషిని ముందుకు తీసుకెళుతోంది. గ్లోబల్ వీట్ కమ్యూనిటీని బలోపేతం చేయడంలో విశేషమైన కృషి చేస్తున్న జీని బోర్లాగ్ ‘సూపర్ ఉమెన్ ఆఫ్ వీట్’ గా పేరుగాంచింది. బోర్లాగ్ గ్లోబల్ రస్ట్ ఇన్షియేటివ్(బీజిఆర్‌ఐ) చైర్‌పర్సన్‌గా గోధుమ రంగానికి సంబంధించిన పరిశోధన ఫలితాలను రైతుల దగ్గరికి తీసుకెళుతుంది. 2010లో ఏర్పాటు చేసిన జీని బోర్లాగ్ లాబ్ వుమెన్ ఇన్ ట్రిటికమ్ మెంటర్ అవార్డ్‌ను గోధుమరంగంలో విశిష్ట కృషి చేసిన వారికి, కొత్తతరాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఈ ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ అవార్డ్‌కు గానూ పంజాబ్‌కు చెందిన శాస్త్రవేత్త డా.పర్వీన్ చూనెజ ఎంపికైంది. లుథియానాలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పర్వీన్ యువ మహిళా శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో చేసిన కృషికి ఈ అవార్డ్ లభించింది. ఇప్పటివరకు 30 మంది మహిళా యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించింది. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖస్థానాలలో పనిచేస్తున్నారు. గతంలో మన దేశం నుంచి డా.మిథాలీ బన్సాల్, డా.సాను ఆరోరా ఎర్లీ కెరీర్ విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపియ్యారు. పర్వీన్ ఆధ్వర్యంలోనే ఈ ఇద్దరు పీహెచ్డీ చేయడం విశేషం. వివిధ దేశాల నుంచి ఎర్లీ కెరీర్ విన్నర్స్‌తో పాటు మెంటర్స్‌ను కూడా ఎంపిక చేస్తుంది బీజిఆర్‌ఐ. మెంటర్ విభాగంలో ఈ అవార్డ్ అందుకోనుంది పర్వీన్. మన దేశం నుంచి ఈ విభాగంలో ఎంపికైన తొలి భారతీయ సైంటిస్ట్‌గా ప్రత్యేకత సాధించింది పర్వీన్. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో జన్మించిన పర్వీన్ కెఎన్ జైన్ గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకుంది. చదువులో ఎప్పుడూ ముందుండేది. సందేహాలను తీర్చుకోవడంలో ఎప్పుడూ సంశయించేది కాదు. లుథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్విటీలో బీఎస్సీ చేసింది. 1992లో పీహెచ్డీ పూర్తి చేసింది. 1996లో డీఎస్టీ యంగ్ సైంటిస్ట్ అవార్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్, న్యూ దిల్లీ ‘ఔట్‌స్టాండింగ్ ఉమెన్ సైంటిస్ట్’ అవార్డ్‌తో సహా ఎన్నో అవార్డ్లు అందుకుంది. ఇంటర్నేషనల్ వీట్ కాంగ్రెస్ సభ్యురాలిగా ఉంది. ‘పర్వీన్లో మార్గదర్శక నైపుణ్యాలే కాదు, గొప్ప స్నేహలక్షణాలు ఉన్నాయి. ఆమె దగ్గర పనిచేయడం అంటే ఎన్నో కొత్తవిషయాలను తెలుసుకునే అవకాశమే కాదు, క్రమశిక్షణ కూడా అలవడుతుంది’ అంటున్నారు పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ సర్వ్‌జీత్ సింగ్. లుథియానాలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పర్వీన్ యువ మహిళా శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో చేసిన కృషికి ఈ అవార్డ్ లభించింది. ఇప్పటివరకు 30 మంది మహిళా యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించింది. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖస్థానాలలో పనిచేస్తున్నారు. -
అనంతపురం జిల్లా వాసికి అంతర్జాతీయ అవార్డు
ధర్మవరం రూరల్(అనంతపురం జిల్లా): నిమ్మలకుంటకు చెందిన దళవాయి కుళ్లాయప్పకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. తోలుతో అతను చేసిన హనుమంతుడి చిత్రాన్ని పరిశీలించిన అనంతరం అవార్డుకు ఇంటర్నేషనల్ క్రాప్ట్ సంస్థ జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రాప్ట్ సంస్థ తెలియజేసింది. త్వరలో ఢిల్లీ వేదికగా జరిగే ఇండియా క్రాప్ట్ వీక్ కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. -
వైల్డ్ ఇన్నొవేటర్ అడవి కూన
అడవిలో జాడలైన వాళ్లకు, అన్వేషణలో అడుగులు వీడని వాళ్లకు ‘వైల్డ్ ఇన్నొవేటర్ అవార్డు’ వస్తుంది! వన్య పరిశోధకుల వినూత్న దృష్టికి గొప్ప అభినందన వంటి ఈ అంతర్జాతీయ అవార్డుకు తొలిసారి ఒక భారతీయ మహిళ ఎంపికయ్యారు. యు.ఎస్. నుంచి ముగ్గురు, కెన్యా నుంచి ఇద్దరు, యు.కె., ఆస్ట్రేలియా కొలంబియా, మొజాంబిక్ నుంచి ఒక్కొక్కరు ఈ అవార్డును గెలుపొందగా.. ఇండియా నుంచి డాక్టర్ కృతి కారంత్ విజేత అయ్యారు. బహుమతి 75 లక్షల రూపాయలు. గౌరవం గగనమంత. విలువ భూగోళమంత. కృతి మాత్రం పుట్టినప్పటి నుంచీ అడవి కూనే! అరణ్యంలో వృక్షాలెన్నో, కృతి కెరీర్లో అవార్డులు అన్ని. అయితే ఇప్పుడొచ్చింది ప్రత్యేకమైన అవార్డు. ఒక విలక్షణమైన వృక్షంతో పోల్చదగిన పురస్కారం. యు.ఎస్. లోని ‘వైల్డ్ ఎలిమెంట్స్ ఫౌండేషన్’ ఈ అవార్డు ఇస్తుంది. బెంగళూరులోని ‘సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్’ (సి.డబ్లు్య.ఎస్.)లో కృతి చీఫ్ కన్సర్వేషన్ సైంటిస్ట్. వన్యప్రాణుల జీవనాన్ని అధ్యయనం చేసి, పరిశోధించి వాటి సంరక్షణకు వినూత్న విధానాలను కనిపెడుతుంటే శాస్త్రవేత్త. 42 ఏళ్ల కృతి ఎప్పటికప్పుడు అప్పుడే కొత్తగా అడవిని, అడవిలో పులులు, సింహాలను చూస్తున్నంత ఉల్లాసంగా ఉంటారు. నిజానికి ఆమె తనకు ఊహ తెలుస్తున్నప్పుడే అరణ్యమార్గంలోకి వచ్చేశారు! నాగర్హోల్ నేషనల్ పార్క్‌లో ఒక సాయంత్రం తాతగారి తెల్ల అంబాసిడర్ కారులో తండ్రి పక్కన కూర్చొని మెల్లిగా వెళుతున్నప్పుడు ఒక కందకంలో పులి ఆ చిన్నారి కంట పడింది. ఆ కొద్దిసేపటికే చిరుత దర్శనమిచ్చింది. ‘‘నాకది ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది’’ అంటారు కృతి. క్రమంగా కర్ణాటక లోని అటవీ ప్రాంతాలన్నీ ఆమె ఆట మైదానాలు అయ్యాయి. అందుకు తగిన కారణమే ఉంది. తండ్రి డాక్టర్ ఉల్లాస్.. టైగర్ బయాలజిస్ట్! తాతగారు డాక్టర్ శివరామ్ కారంత్ ప్రసిద్ధ రచయిత, పర్యావరణవేత్త. అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల వారితో కలిసి కృతి వన్య జీవన అధ్యయనం తర్వాతి కాలంలో జ్ఞానపీuŠ‡ అవార్డు గ్రహీత. ప్రకృతిని ప్రేమించే ఇద్దరు వ్యక్తుల దగ్గర పెరిగిన అమ్మాయి ప్రకృతినే కదా ప్రేమిస్తుంది. అయితే వన్యప్రాణుల సంరక్షణ శాస్త్రవేత్త అవుతానని అప్పుడు ఆమెక్కూడా తెలీదు. తల్లిలా, తండ్రిలా, తాతయ్యలా పీహెచ్డీ చేయాలని మాత్రమే అనుకుంది. నార్త్ కరోలీనా వెళ్లి అక్కడి డ్యూక్ యూనివర్శిటీలో పర్యావరణంపై పీహెచ్.డీ చేశారు కృతి. ఆ ముందు వరకు, ఆ తర్వాతా ఆమె చదివిన చదువులు, జరిపిన పరిశోధనలు, చేసిన ఉద్యోగాలు.. దేశంలో, విదేశాల్లో.. అన్నీ కూడా వన్యప్రాణి సంరక్షణకు సంబంధించినవే. చివరికి తను పుట్టిన రాష్ట్రంలోనే పెద్ద సైంటిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడీ అవార్డు! 2011లో ‘నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ వాళ్ల రిసెర్చ్ గ్రాంట్ రావడం, తర్వాతి ఏడాదే ‘ఎమర్జింగ్ ఎక్స్‌ప్లోరర్’గా గుర్తింపు పొందడం కృతి కెరీర్‌ని విస్తృతం చేశాయి. పది దేశాలు తిరిగి, పది సంస్కృతుల మనుషులతో కలిసిమెలిసి తిరగడం సాధ్యం అయింది. సాధారణంగా సైంటిస్టులు మనుషులతో కలవడానికి ఇష్టపడరు. కృతి మాత్రం ఎక్కడి మనుషులతో అక్కడి మనిషిలా కలిసిపోయారు. కర్ణాటక అరణ్య ప్రాంతాల చుట్టూ కనీసం రెండు వేల ఇళ్లకైనా వెళ్లి వాళ్లతో మాట్లాడి ఉంటారు కృతి! మాట వరకు పైన పది దేశాలను అన్నాం కానీ.. 40 దేశాలకు పైగానే ఆమె పర్యటించారు. అన్ని దేశాలు తిరిగిన ఆమె ఇండియా మొత్తం తిరగకుండా ఉంటారా! దేశంలోని అభయారణ్యాలన్నిటిలో ఒక అడుగు వేసి వచ్చారు. పరిశోధన అవసరమైన చోట అక్కడే కొన్నాళ్లు నివాసం ఉన్నారు. ఆమె పరిశోధనలు బి.బి.సి.లో, ఇంకా అనేక ప్రసిద్ధ చానళ్లలో సీరీస్‌గా వచ్చాయి. కృతి రియల్ లైఫ్ హీరోలు తండ్రి, తాత, తల్లి ప్రతిభ. ఇప్పుడు ఆమె తన కుటుంబంలోని ముగ్గురికి హీరో అయ్యారు. భర్త అవినాశ్ సొసలే, ఇద్దరు కూతుళ్లు.. ఆమె సెలవు రోజుల్లో ఆమెతో పాటు అడవిలో విహరించే వన్యప్రాణులు అయిపోతారు! వాళ్లతో పాటు ఇంట్లో నల, బఘీర అనే రెండు పిల్లులు వినిపించీ వినిపించనంతగా మ్యావ్ మ్యావ్ మంటూ పులుల్లా సోఫాలు ఎక్కి దిగుతుంటాయి. కృతి సాధించిన పరిశోధనల్లో ఒకటి.. ధ్వని, వాయు కాలుష్యాల నుంచి వన్య జీవులను సంరక్షించడం. -
ఆర్టీఐ కార్యకర్త అంజలికి అంతర్జాతీయ గుర్తింపు
వాషింగ్టన్: భారత్‌లోని సమాచార హక్కు ఉద్యమంపై గత రెండు దశాబ్దాలుగా పోరాడుతూ, వ్యవస్థల్లో పారదర్శకత, జవాబు దారీతనం కోసం కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్‌కు అంతర్జాతీయ అవార్డు లభించింది. అగ్రరాజ్యం అమెరికా లోని జో బైడెన్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక చాంపియన్స్ అవార్డుకి ఆమె ఎంపికయ్యారు. అంజలి భరద్వాజ్‌తో పాటుగా మరో 12 మంది ఈ అవార్డుని అందుకోనున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో వ్యవస్థల్ని దారిలో పెట్టడానికి, అవినీతి వ్యతిరేక పోరా టంలో వ్యక్తిగతంగా భాగస్వాములవుతూ అలుపెరుగని కృషి చేసిన వారికి తగిన గుర్తిం పు ఇవ్వడానికే ఈ అవార్డుని ప్రవేశపెట్టినట్టు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి టోని బ్లింకెన్ చెప్పారు. అంతర్జాతీయంగా వచ్చే ఇలాంటి గుర్తింపులు తాను చేస్తున్న ఉద్యమానికి స్ఫూర్తినిస్తాయని అమెరికా అవార్డుకి ఎంపికైన అంజలి భరద్వాజ్ ఆనందం వ్యక్తం చేశారు. -
విశాఖకు అంతర్జాతీయ ఘనత
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ అవార్డు రేసులో విశాఖ మహానగరం మూడో స్థానాన్ని దక్కించుకుంది. స్పెయిన్‌లో జరిగిన స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్–2020లో విశాఖ స్మార్ట్ సిటీ ప్రపంచ నగరాలతో పోటీ పడింది. ‘లివింగ్ అండ్ ఇన్‌క్లూజన్ అవార్డు’ కేటగిరీలో మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ సక్సెస్ఫుల్ ప్రాజెక్టులతో ప్రపంచంలోని 20 నగరాలు పోటీ పడగా.. విశాఖ మూడో స్థానంలో నిలిచింది. బీచ్ రోడ్డులో రూ.3.50 కోట్లతో నిర్మించిన ‘ఆల్ ఎబిలిటీ పార్క్’ లివింగ్ అండ్ ఇన్‌క్లూజన్ అవార్డుకు పోటీ పడింది. ఏడు కేటగిరీల్లో ఈ అవార్డులు ప్రకటించారు. మొత్తం ఈ ఎక్స్‌పోలో ప్రపంచం నలుమూలల నుంచి 46 నగరాలు పాల్గొనగా.. భారత్ నుంచి కేవలం విశాఖపట్నం మాత్రమే అర్హత పొందడం విశేషం. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ ఎక్స్‌పోలో బుధవారం ఆయా కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు. తొలి స్థానంలో మురికివాడల అభివృద్ధి ప్రాజెక్టుతో బ్రెజిల్ విజేతగా నిలవగా, అంతర్జాతీయ విరాళాల ద్వారా పేదలకు సంబంధించిన వివిధ రకాల బిల్లుల్ని చెల్లించేప్రాజెక్టుతో టరీ్క దేశంలోని ఇస్తాంబుల్ సిటీ రెండో స్థానంలో నిలిచింది. దేశంలోనే తొలి ఎబిలిటీ పార్క్ బీచ్ రోడ్డులో వైఎంసీఏ ఎదురుగా రూ.3.50 కోట్లతో ఆల్ ఎబిలిటీ పార్క్ తీర్చిదిద్దారు. సాధారణ ప్రజలు, పిల్లలతో పాటు విభిన్న ప్రతిభావంతులు కూడా ఈ పార్కులో ఆటలాడుకొని ఎంజాయ్ చేసేలా పార్కు నిర్మించారు. పార్కులో క్లైంబింగ్ నెట్, పిల్లలు ఆటలాడుకునే ఎక్విప్మెంట్, షిప్ డెక్, మ్యూజికల్ పోల్స్, ప్లే గ్రౌండ్ డ్రమ్స్‌తో పాటు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణతో తీర్చిదిద్దే ల్యాండ్ స్కేప్‌లు ఉన్నాయి. విభిన్న ప్రతిభావంతుల కోసం మూడు సీట్ల మేరీ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు. దివ్యాంగులు కూడా ఎంజాయ్ చేసేలా దేశంలో రూపొందిన తొలి ఎబిలిటీ పార్క్ ఇదే కావడం విశేషం. ప్రజల ఆనందానికి, ఆహ్లాదానికి వినియోగించుకునేలా.. ముఖ్యంగా చిన్నారులకు సరికొత్త అనుభూతిని పంచుతున్న ఈ పార్కుని యూకే అంబాసిడర్‌తో పాటు అమెరికన్ల ప్రశంసలందుకుంది. వచ్చే ఏడాది మొదటి స్థానం ఖాయం స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్–2020లో జీవీఎంసీ ప్రాజెక్ట్ మొదటి స్థానం సాధించలేకపోయినందుకు బాధగా ఉన్నా.. దేశం నుంచి ఎంపికైన ఏకైక ప్రాజెక్ట్ ఆల్ ఎబిలిటీ పార్క్ కావడం గమనార్హం. అవార్డు కోసం ప్రపంచంలోని అతి పెద్ద ప్రముఖ నగరాలతో విశాఖ పోటీ పడటం గర్వంగా ఉంది. వచ్చే ఏడాది బార్సిలోనాలో జరిగే స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్–2021లో విశాఖ ఒక కేటగిరీలో అయినా మొదటి స్థానంలో నిలిచి అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకుంటుంది. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
సాక్షి, శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(ఆర్జీఐఏ) మరో అంతర్జాతీయ పురస్కారం లభించింది. పర్యావరణహితమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఆసియా విభాగంలో ఏటా 15 నుంచి 35 మిలియన్ ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విమానాశ్రయాల్లో ఆర్జీఐఏ 2020 సంవత్సరానికి గాను పసిఫిక్ గ్రీన్ ఎయిర్‌పోర్టు ప్లాటినం పురస్కారాన్ని దక్కించుకుంది. ఆ పురస్కారాన్ని ఆర్జీఐఏకు అంతర్జాతీయ విమానాశ్రయ మండలి ఇటీవల అందజేసింది. ఆర్జీఐఏలో తీసుకుంటున్న పర్యావరణ హితమైన చర్యలు బాగున్నాయని ఏసీఐ డైరెక్టర్ స్టెఫానో బారోన్కీ పేర్కొన్నట్లు ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సీఈఓ ఎస్జీకే కిశోర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో నీటి వినియోగాన్ని తగ్గించడం, నీటిని రీసైక్లింగ్ ద్వారా వాడుకోవడం, నీటిని ఒడిసిపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం విమానాశ్రయంలో 925 కేఎల్డీ సామర్థ్యం కలిగిన ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ డ్రిప్ సిస్టం ద్వారా ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్‌ను ఏర్పాటు చేశారు. ఈ నీటి నిర్వహణను ఏసీఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఎయిర్‌పోర్టు కమిటీ గుర్తించడం హర్షణీయమని ఎయిర్ పోర్టు వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: మేయర్ దంపతులకు కరోనా పాజిటివ్ -
హైదరాబాద్ షార్ట్‌ఫిల్మ్‌కు అంతర్జాతీయ అవార్డు
సాక్షి, మణికొండ: చెరువులు తమ ఆవేదనను ఓ మూగ బాలికతో పంచుకునే ఇతివృత్తంతో తీసిన షార్ట్‌ఫిల్‌్మకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. అమెరికాలోని న్యూయార్క్‌లో అక్కడి కాలమానం ప్రకారం గురువారం జరిగిన అంతర్జాతీయ లాంపా ఫిల్మ్ ఫెస్టివల్లో మొదటి బహుమతి దక్కించుకుంది. గత డిసెంబర్లో హైదరాబాద్ ఫోయనెక్స్ అరేనాలో జరిగిన జాతీయ షార్ట్‌ఫిల్మ్ విభాగంలోనూ మొదటి స్థానాన్ని దక్కించుకున్న వీడియో శనివారం అంతర్జాతీయ వేదికపైనా అదే స్థానాన్ని దక్కించుకుంది. ఓ చెరువు తన గోడును ఓ మూగ బాలికతో పంచుకోవటం ఇతివృత్తంగా మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్ పెద్ద చెరువు వద్ద ఈ వీడియోను చెరువు పరిరక్షణ కమిటీ సభ్యుడు సునీల్ సత్యవోలు నిరి్మంచగా అన్షుల్ దర్శకత్వం వహించారు. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ప్రస్తుతం పర్యావరణ, చెరువుల పరిరక్షణ, వాతావరణ సమతుల్యత వాస్తవాలను చెరువు ఓ పదేళ్ల మూగ బాలికకు చెప్పుకోవటం, ఆ బాలిక చెరువును ఊరడించటం అనే ఇతివృత్తంతో ‘సైలెంట్ వాయిస్’ అనే పేరుతో తీసినట్టు నిర్మాత తెలిపారు. మనుషులు తమ జీవనానికి ఉపయోగపడే చెరువులు, పర్యావరణం, వాతావరణ సమతుల్యతలను ఎలా దెబ్బ తీస్తున్నారనే అనే అంశం అందరి గుండెలకు హత్తుకునేలా ఉండటంతో అంతర్జాతీయ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్లో నిర్వాహకులను కదలించిందని ఆయన పేర్కొన్నారు. కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సంస్థ ప్రతి ఏటా ఇలాంటి షార్ట్‌ఫిల్మ్ పోటీలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇతర షార్ట్ఫిల్్మల కన్నా అధికంగా 17 గోల్స్ సాధించటంతో తమ ఫిల్మ్‌కు ప్రథమ బహుమతి దక్కిందని ఆయన వివరించారు. అవార్డును లంప ఇంటర్నేషనల్ ఫెస్టివల్ చైర్పర్సన్ ఓల్గా జుబ్కొవా, యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, సోషల్ అఫైర్స్ సెక్రటరీ జనరల్ లియూ జెన్మిన్, రష్యా మొదటి డిప్యూటీ శాశ్వత ప్రతినిధి డ్మిట్రై పోల్యానస్కై చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్టు సునీల్ వివరించారు. -
ప్రధాని మోదీకి ‘జాయెద్ మెడల్’
దుబాయ్: ప్రధాని మోదీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం అత్యున్నత జాయెద్ పురస్కారాన్ని ప్రకటించింది. ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి విశేషంగా కృషి చేసినందుకు గుర్తింపుగా మోదీని ఈ పురస్కారంతో గౌరవిస్తున్నట్లు యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా జాయెద్ అల్ నహ్యాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘భారత్‌తో మాకున్న చారిత్రక, సమగ్ర వ్యూహాత్మక సంబంధాలను మా ప్రియ స్నేహితుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయికి చేర్చారు. ఆయన కృషికి గుర్తింపుగా యూఏఈ అధ్యక్షుడు జాయెద్ పురస్కారాన్ని ప్రకటించారు’ అని అబూధాబీ యువరాజు, యూఏఈ సైనిక దళాల డిప్యూటీ కమాండర్ మొహమ్మద్ బిన్ జాయెద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘రెండు దేశాల మధ్య ఎంతోకాలంగా ఉన్న మైత్రిని, ఉమ్మడి వ్యూహాత్మక సహకారాన్ని ఉన్నతస్థాయికి చేర్చడంలో ప్రధాని మోదీ పాత్రకు ఈ పురస్కారమే గుర్తింపు’ అని ఖలీజ్ టైమ్స్ పత్రిక పేర్కొంది. -
మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం అందించే ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ను మోదీకి ప్రకటించింది. భారత్- యూఏఈ దేశాల మధ్య సంబంధాల్ని మెరుగుపరచినందుకు ఈ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనున్నట్టు తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ గతంలో ఈ పురస్కారం అందుకున్నారు. అబుదాబీ యువరాజు, యూఏఈ ఆర్మీ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఈ అవార్డును నరేంద్ర మోదీకి బహూకరించనున్నారు. ‘‘భారత్‌తో చరిత్రాత్మక, సమగ్ర, వ్యూహాత్మక సంబంధాలు మెరుగుపడటంలో నా ప్రియ మిత్రుడు నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారు. మోదీ కృషి ఫలితంగానే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయి. రెండు దేశాల మధ్య సత్సంబంధాల కోసం పాటుపడిన మోదీకి జాయేద్ అవార్డు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నామ’’ని యువరాజు షేక్ మహమ్మద్ ట్వీట్ చేశారు. -
సాక్షి’ కార్టూనిస్ట్ శంకర్‌కు అంతర్జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’కార్టూనిస్ట్ పామర్తి శంకర్‌ను మరో అంతర్జాతీయ పురస్కారం వరించింది. ‘ఎండ్ ఆఫ్ టెర్రరిజం’ పేరిట ఇరాన్లో జరిగిన కార్టూన్ల పోటీలో ద్వితీయ బహుమతి లభించింది. ఈ పోటీలో 65 దేశాలకు చెందిన వ్యంగ్య చిత్రకారులు పాల్గొన్నారు. మన దేశం నుంచి 18 మంది తమ ఎంట్రీలను పంపారు. మయన్మార్‌లో రోహింగ్యాలపై జరిగిన దాడిని ఉద్దేశించి ఆయన గీసిన ఆంగ్‌సాన్ సూకీ క్యారికేచర్ పురస్కారం గెలుచుకుంది. బహుమతిగా 1,500 డాలర్ల ప్రైజ్‌మనీతోపాటు జ్ఞాపిక, సర్టిఫికేట్, పబ్లిష్‌డే ఆల్బంను అందజేస్తారు. ఇప్పటికే ప్రతిష్టాత్మక వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ అవార్డు(2015)తోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలను శంకర్ అందుకున్నారు -
బత్తుల సంజీవరాయుడికి అంతర్జాతీయ గౌరవం
కర్నూలు (ఆర్యూ): తనకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ కొలాబరేషన్ కౌన్సెల్లో మెంబర్షిప్ దక్కిందని జాతీయ పర్యావరణ అవార్డు గ్రహీత బత్తుల సంజీవరాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్విడ్జర్లాండ్లోని జనీవా నుంచి సంస్థ చైర్ పర్సన్ ఏజే మహమ్మద్ ద్వారా తనకు మెయిల్లో సమాచారం అందిందన్నారు. కాగా బత్తుల సంజీవరాయుడు 30ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు, జంతు, వికలాంగుల సంక్షేమం, విద్య, ఆరోగ్య రంగాల్లో చేసిన సేవలకు పలు పురస్కారాలు అందుకున్నారు. -
పులివెందుల డాక్టర్‌కు అంతర్జాతీయ పురస్కారం
సాక్షి, కడప : పులివెందులలోని భాకరాపురంలోనున్న దినేష్ మెడికల్ సెంటర్లో ఎముకల, కీళ్ల శస్త్ర చికిత్స నిపుణులుగా పని చేస్తున్న డాక్టర్ రణధీర్‌రెడ్డికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. రణధీర్‌రెడ్డి పరిశోధించి ఆపరేషన్ నిర్వహించిన ఒక రిపోర్టుకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అడ్వాన్స్ ఇన్ కేస్ రిపోర్టుకు ఇంటర్నేషనల్ జర్నల్స్‌లో ప్రచురించారు. వివరాల్లోకి వెళితే...హైదరాబాదుకు చెందిన అమర్నాథ్ అనే వ్యక్తికి మోచేయి కీలు దగ్గర గాయమై.. రేడియల్ హెడ్ అనే ఎముక పూర్తిగా దెబ్బతింది. దాంతోపాటు అదే ఎముక మణికట్టు వద్ద విరిగినట్లు గుర్తించారు. దీనివల్ల ఎముక రెండు వైపుల విరుగుట వల్ల ఎముకకు రెండు వైపుల ఉన్న జాయింట్ దెబ్బతింది. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. పులివెందులలోని దినేష్ మెడికల్ సెంటర్‌కు అమర్నాథ్ వచ్చి ఎముకల కీళ్ల శస్త్ర చికిత్స నిపుణుడు, డాక్టర్ రణధీర్‌రెడ్డిని సంప్రదించారు. వెంటనే అందుకు అవసరమైన పరిశీలన చేసి టైటానియంతో తయారు చేసిన కృత్రిమ రేడియల్ హెడ్‌ను అమర్చడంలో సఫలీకృతులయ్యారు. ఇలాంటి ఆపరేషన్లు దేశంలోనే అరుదుగా జరుగుతాయని డాక్టర్ రణధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆపరేషన్ తర్వాత ఎముకకు ఇరువైపుల ఉన్న జాయింట్ కూడా సక్రమంగా పని చేస్తుండడంతో ఒక గొప్ప విజయంగా వారు అభివర్ణించారు. గతంలో కూడా పులివెందుల దినేష్ మెడికల్ సెంటర్లో డాక్టర్ రణధీర్‌రెడ్డి జాయింట్ మార్పిడి ఆపరేషన్లు, వెన్నపూస ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. అంతేకాకుండా అతి తక్కువ ఖర్చుతో దినేష్ మెడికల్ సెంటర్లో ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అరుదైన ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ రణధీర్‌రెడ్డిని ఆస్పత్రి ఎండీ, ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి అభినందించారు. -
విశాఖ పోలీసులకు అంతర్జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రూరల్ పోలీసులకు అమెరికాలోని అంతర్జాతీయ పోలీసు అధిపతుల సంఘం(ఐఏసీపీ) ప్రకటించిన హోంల్యాం డ్ సెక్యూరిటీ ప్రత్యేక గుర్తింపు అవార్డు లభించింది. దీనిని ఆ జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎ.వెంకటరావులు సంయుక్తంగా అందుకున్నారు. అమెరికాలో గతవారం జరిగిన కార్యక్రమంలో వీరికి దీనిని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరినీ డీజీపీ జేవీ రాముడు బుధవారం అభినందించారు. విశాఖ జిల్లాలో మావోయిస్టుల్ని సమర్థంగా నియంత్రించడం, గిరిజనులకు ఉపాధి కల్పించి సేవలందించినందుకు రూరల్ పోలీసులకు ఈ అవార్డు లభించింది. -
కార్టూనిస్టు శంకర్‌కు కేసీఆర్ అభినందనలు
'సాక్షి' కార్టూనిస్టు శంకర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. కార్టూనిస్ట్ శంకర్‌కు ప్రపంచ ప్రఖ్యాత అవార్డు రావడం చాలా అభినందనీయమని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన కార్టూనిస్టు అంతర్జాతీయ అవార్డు పొందడం పట్ల తనకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. పోర్చుగల్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ఏటా ప్రపంచ స్థాయిలో ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు ప్రకటించే గ్రాండ్ ప్రి అవార్డు ఈ ఏడాది శంకర్‌ను వరించిన విషయం తెలిసిందే. 2014 సంవత్సరానికి దాదాపు 64 దేశాల నుంచి పోటీకి వచ్చిన ఎంట్రీల్లో శంకర్ గీసిన హక్కుల పోరాటయోధుడు నెల్సన్ మండేలా క్యారికేచర్ ఉత్తమ ఎంట్రీగా ఎంపికైంది. -
గ్రామీణ భారతానికి లండన్ బాబుల ఫిదా
గత స్మృతుల్లోకి తీసుకువెళ్లి, మనసు పులకింపజేసే శక్తి అందమైన ఒక్క ఛాయా చిత్రానికే ఉంటుంది. వంద మాటలు చెప్పలేని భావాన్ని ఒక ఫొటో సులువుగా తెలియజేస్తుంది. మదిని దోచే అపురూపమైన ఫొటోలను తీస్తూ అంతర్జాతీయ ఖ్యాతిని ఆరించారు పిక్టోరియల్ ఫొటోగ్రాఫర్ తుమ్మలపల్లి వీరభద్రరావు. 2014 గానూ ‘అసోసియేట్ ఆఫ్ రాయల్‌ఫొటోగ్రాఫిక్ సొసైటీ’ అవార్డును అందుకున్నారు. అంతర్జాతీయ అవార్డుతో అరుదైన గౌరవం ఫొటోగ్రఫీలో రాణిస్తున్న వీరభద్రం కాకినాడ కల్చరల్ :పల్లె అందాలు ఆయన ఫొటోల్లో ఒదిగిపోయాయి. చలిమంటల సరదాలు, వరి ధాన్యపురాశుల ఎగరబోతలు, జోడెడ్ల బళ్లు, గుంపులుగా వెళ్లే ఆవులు..ఇలా ఒక్కటి కాదు గ్రామీణ భారతాన్ని మొత్తం ఆయన తన ఫొటోల్లో బంధించారు. ఈ అందాలకు పరవశించిన లండన్‌లోని అంతర్జాతీయ సంస్థ ‘రాయల్ ఫొటోగ్రాఫర్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్’ అత్యున్నత ‘అసోసియేట్ ఆఫ్ రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ’ అవార్డుతో వీరభద్రాన్ని సత్కరించింది. 2014 సంవత్సరానికి గానూ ఆయన ఈ అవార్డు అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి మంది ఫొటోగ్రఫీ కళాకారులు పాల్గొన్నారు. వీరిలో 40 మందిని పోటీలో నిలబడగా.... ఏడుగురు ఫైనల్ జడ్జిమెంట్‌కు మిగిలారు. అందులో వీరభద్రం ప్రథమ స్థానంలో నిలిచి అవార్డుకు ఎంపికయ్యారు. రాజారవివర్మ ప్రేరణతో... ద్రాక్షారామ గ్రామంలో 1971లో జన్మించిన వీరభద్రం.. చిన్నతనంలో రాజారవివర్మ పెయింటింగ్స్ చూసి ప్రేరణ పొంది చిత్రకళా రంగంపై ఆసక్తిని పెంచుకున్నారు. ఈ ఆసక్తితోనే 1993 సంవత్సరం నుంచి పిక్టోరియల్ ఫొటోగ్రఫీలో శిక్షణ తీసుకున్నారు. అప్పట్నుంచి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్నారు. ఇప్పటివరకు పిక్టోరియల్ రంగంలో జాతీయ, అంతర్జాతీయంగా 800 చిత్రాలకు అనుమతులు లభించగా, సుమారు 110 అవార్డులు, సర్టిఫికెట్లను సాధించారు. ప్రస్తుతం ‘గ్రామీణ భారతం’ భావనతో తీసిన ఫొటోలు ప్రపంచ ప్రఖ్యాతి సాధించిపెట్టాయి. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో కాకినాడ కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ ఫోటోగ్రాఫర్లు కె.పేర్రాజు, రవీంద్రనాథ్, ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో మన దేశం నుంచి వీరభద్రం అరుదైన గౌరవం దక్కించుకోవడం ఆనందంగా ఉందని అభినందించారు. కార్యక్రమంలో అరున్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. -
డాక్టర్ శ్రీధర్‌కు అంతర్జాతీయ పురస్కారం
సాక్షి, సిటీబ్యూరో: కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణుడు, సన్‌షైన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ శ్రీధర్ కస్తూరికి 2014 సంవత్సరానికి ప్రతిష్టాత్మాక అంతర్జాతీయ కార్డియాక్ ఫోరం పురస్కారం లభిచింది. ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌కు చెందిన ప్రఖ్యాత కార్డియాక్ ఫోరం యూరో పీసీఆర్-14 బహూకరించే ఈ అవార్డు ఈసారి శ్రీధర్‌ను వరిచింది. ఇటీవల మెయిన్ ఎరీనాలో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు దేశవిదేశాల నుంచి 12257 మంది హృద్రోగ నిపుణులు హాజ రు కాగా, 60 దేశాల నుంచి 934 ప్రొసీజర్లు పోటీ పడ్డాయి. ఇందులో శ్రీధర్ చేసిన ‘ఆర్థోప్లాస్టీ విత్ స్టెంటింగ్ ఆఫ్ లాంగ్ సెగ్మంట్ టోటల్ ఆక్లూషన్ ఆఫ్ డిసెండింగ్ థొరాసిక్ ఆర్ట్ అండ్ అబ్డామినల్ ఆర్టా తకాయాసు ఆర్టాయిటీస్ విత్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ- యాంజియోగ్రఫీ ఫాలో ఆప్’ (గుండె నుంచి కాలికి రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళానికి ఆపరేషన్ లేకుండా స్టెంట్‌తో రక్తనాళాన్ని పునరుద్ధరించడం) చికిత్స రెండో అత్యుత్తమ క్లినికల్ ప్రొసీజర్‌గా ఎంపికైనట్లు సన్‌షైన్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ గురువారెడ్డి శుక్రవారం విలేకరులకు చెప్పారు.