విశాఖ పోలీసులకు అంతర్జాతీయ అవార్డు | international award in visakhapatnam police | Sakshi
Sakshi News home page

విశాఖ పోలీసులకు అంతర్జాతీయ అవార్డు

Published Thu, Nov 6 2014 2:22 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

international award in visakhapatnam police

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రూరల్ పోలీసులకు అమెరికాలోని అంతర్జాతీయ పోలీసు అధిపతుల సంఘం(ఐఏసీపీ) ప్రకటించిన హోంల్యాం డ్ సెక్యూరిటీ ప్రత్యేక గుర్తింపు అవార్డు లభించింది. దీనిని ఆ జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ ఎ.వెంకటరావులు సంయుక్తంగా అందుకున్నారు. అమెరికాలో గతవారం జరిగిన కార్యక్రమంలో వీరికి దీనిని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరినీ డీజీపీ జేవీ రాముడు బుధవారం అభినందించారు. విశాఖ జిల్లాలో మావోయిస్టుల్ని సమర్థంగా నియంత్రించడం,  గిరిజనులకు ఉపాధి కల్పించి సేవలందించినందుకు రూరల్ పోలీసులకు ఈ అవార్డు లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement