Rural police
-
రూరల్ పోలీస్ కనుమరుగు
కమిషనరేట్ పరిధిలో హన్మకొండ, వరంగల్ జిల్లాలు సీనియర్లకు కొత్త జిల్లాల బాధ్యతలు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ సాక్షి, హన్మకొండ : జిల్లాల పునర్విభజనతో వరంగల్ రూరల్ పోలీసు విభాగం కనుమరుగు కానుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి రూరల్ విభాగాన్ని తీసుకురావాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. వరంగల్ పోలీస్ కమిషరేట్, వరంగల్ రూరల్ పోలీసు జిల్లాల పునర్విభజన ప్రక్రియను సోమవారం డీజీపీ అనుగార్‌శర్మ వీడి యో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. వరంగల్ డీ ఐజీ రవివర్మ, వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు, వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా ఇ తర పోలీసు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. విస్తరించనున్న కమిషనరేట్ వరంగల్ జిల్లాను వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా పునర్విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా పోలీసు శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించారు. ప్రస్తుతం ప్రతిపాదిత వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలో వరంగల్ కమిషనరేట్, వరంగల్ రూరల్ పోలీసు విభాగాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల పరిధిలో ఉన్న కమిషనరేట్ ప్రాంతా న్ని మినహాయించి మిగిలిన ప్రాంతాలకు రూరల్ విభాగాలు ఏర్పాటు చేయడం వల్ల ఆర్థిక భారంతో పాటు పాలన పరంగా చిక్కుముడులు ఎదురయ్యే ఆస్కారం ఉంది. దీంతో రూరల్ ప్రాంతం మొత్తాన్ని కమిషనరేట్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో 19 సాధారణ పోలీస్ స్టేషన్లు, మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ఒక మహిళా పోలీస్ స్టేషన్, ఒక క్రైం పోలీస్ స్టేషన్ ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో 41 సాధారణ పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్, క్రైం పోలీస్ స్టేషన్ ఉన్నాయి. త్వరలో ఈ రెండు విభాగాలు కలిసిపోనున్నాయి. అంతేకాకుండా కరీంనగర్ జిల్లాలోని ఐదు మండలాలు ప్రతిపాదిత హన్మకొండ జిల్లాలో కలుస్తున్నాయి. ఈ ఐదు మండలాల్లోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, హుజూరాబాద్ టౌన్, హుజూరాబాద్ రూరల్, జమ్మికుంట టౌన్, జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటికి కూడా వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో విలీనం కానున్నాయి. పోలీసుశాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం అమలైతే వరంగల్ రూరల్ పోలీసు విభాగం కనుమరుగు అవుతుంది. పోలీసు శాఖ తాజా నిర్ణయంతో వరంగల్ కమిషనరేట్ పరిధి విస్తరించనుంది. కమిషనరేట్ పరిధిలో 20 లక్షలకు పైగా జనాభా ఉంది. కొత్త స్టేషన్లు నాలుగు.. ప్రతిపాదిత వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలో కొత్తగా కాజీపేట, ఖిలావరంగల్, వేలేరు, చిల్పూరు, ఇల్లందకుంట, ఐనవోలు మండలాలు ఏర్పాటవుతున్నాయి. వీటిలో ఖిలావరంగల్, కాజీపేట ప్రాంతాల్లో ప్రస్తుతం పోలీసు స్టేషన్లు ఉన్నాయి. దీంతో స్టేషన్లు లేని నాలుగు మండలాల్లో దసరా నాటికి కొత్త స్టేషన్లు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు బాస్ ఆదేశాలు జారీ చేశారు. ఇవి ప్రారంభమైతే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి మొత్తం 76 పోలీసు స్టేషన్లు వస్తాయి. ఎస్పీ క్యాంపునకు ఇబ్బందులు మహబూబాబాద్, జయశంకర్ (భూపాలపల్లి) జిల్లాలకు కొత్తగా పోలీసు శాఖ పరంగా ప్రత్యేక కార్యాలయాలు, క్యాంపు ఆఫీసులకు సంబంధించిన భవనాల ఎంపిక, మౌలిక సదుపాయల కల్పనపై చర్చించారు. మహబూబాబాద్ ఎస్పీ ఆఫీసుగా ఐటీఐ భవనాన్ని, ఎస్పీ క్యాంపు ఆఫీసుగా పట్టణంలో ఓ అద్దె భవనాన్ని ఎంపిక చేశారు. ఇక జయశంకర్ జిల్లాలో మైనింగ్ ఓకేషనల్ సెంటర్ భవనాన్ని ఎస్పీ కార్యాలయంగా మార్చనున్నారు. ఎస్పీ క్యాంపు ఆఫీసుగా సింగరేణి అధికారులకు కేటాయించే ఎన్–ఏ టైపు క్వార్టర్‌ను ఇవ్వనున్నారు. సింగరేణి కమ్యూనిటీ హల్లో ఆర్ముడ్ రిజర్వ్ పోలీసు భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించగా రెవెన్యూ అధికారులు ఇదే భవనం కోసం పట్టుబడుతున్నారు. పాలనపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీలుగా ప్రస్తుతం ఎస్లాబ్లిష్మెంట్ విభాగంలో సీనియర్ సిబ్బందిని కొత్త జిల్లాలకు కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. -
పెళ్లి పేరుతో నమ్మించి బాలికపై అత్యాచారం
మండ్య : పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలిక(14)పై అత్యాచారానికి పాల్పడిన ఘటన నాగమంగల తాలూకా శికారిపురలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల సమాచారం మేరకు... గత ఏడాది డిసెంబర్ 25న శికారిపురకు చెందిన సంజయ్(28) అదే గ్రామానికి చెందిన బాలిక(14)ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఇటీవల ఆ బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో గ్రామీణ పోలీసులకు బాధిత కుటుంబసభ్యులు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తమం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సంజయ్‌ను అరెస్ట్ చేశారు. గతంలో సంజయ్‌కు ఓ యువతిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చినట్లు సమాచారం. -
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న4 ట్రాక్టర్లు సీజ్
ఖమ్మం: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది. భద్రాచలం మండలం గొమ్ముకొత్తగూడెం ఇసుక ర్యాంప్ నుంచి ఇసుక మాఫియా అక్రమ రవాణాకు పాల్పడుతోంది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. -
విశాఖ పోలీసులకు అంతర్జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రూరల్ పోలీసులకు అమెరికాలోని అంతర్జాతీయ పోలీసు అధిపతుల సంఘం(ఐఏసీపీ) ప్రకటించిన హోంల్యాం డ్ సెక్యూరిటీ ప్రత్యేక గుర్తింపు అవార్డు లభించింది. దీనిని ఆ జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎ.వెంకటరావులు సంయుక్తంగా అందుకున్నారు. అమెరికాలో గతవారం జరిగిన కార్యక్రమంలో వీరికి దీనిని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరినీ డీజీపీ జేవీ రాముడు బుధవారం అభినందించారు. విశాఖ జిల్లాలో మావోయిస్టుల్ని సమర్థంగా నియంత్రించడం, గిరిజనులకు ఉపాధి కల్పించి సేవలందించినందుకు రూరల్ పోలీసులకు ఈ అవార్డు లభించింది. -
వీడిన యువకుడి హత్య మిస్టరీవనపర్తి
రూరల్: ఈనెల 17న మండలంలోని నాగవరం శివారులో వెలుగుచూసిన ఓ యువకుడి దారుణహత్య మిస్టరీని వనపర్తి రూరల్ పోలీసులు ఛేదించారు. హత్యకుగురైన మణ్యంను అతడి సోదరుడే(చిన్నాన కొడుకు)హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం సాయంత్రం వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ మధుసూదన్‌రెడ్డి వెల్లడించారు. మృతుడు మణ్యం, వనపర్తి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న రాఘవేందర్ వరుసకు అన్నదమ్ములు. రాఘవేందర్ సొంత తమ్ముడు భాస్కర్ గత మార్చిలో ఆత్మహత్యకు పాల్పడగా.. దీనికి మణ్యమే కారణమని అతని భావించాడు. దీంతో మణ్యంపై మరింత కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా హతమార్చాలని తలంచి తనభార్య తరఫు బంధువులు, కొత్తకోట మండలం మదనాపురం గ్రామానికి చెందిన వల్లెపు కురుమూర్తి, ద్యారంగుల మణికంఠ, కుంచెపు కురుమూర్తిలతో హత్యకు వ్యూహరచన చేశాడు. ఈనెల 16న రాత్రి మణ్యంతో కలిసి మద్యం సేవించారు. ఇంతలో పక్కనే ఉన్న మణ్యంను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. పట్టించిన ఫోన్‌కాల్ రంగంలోకి దిగిన పోలీసులు మణ్యం దారుణహత్య కంటే ముందు అతని ఫోన్‌కు వచ్చిన నంబర్లను సేకరించారు. పథకం ప్రకారం మణ్యంను లక్ష్యంగా చేసిన హోంగార్డు రాఘవేందర్ ముందస్తుగా తనఇంటి పక్కనే నివాసం ఉండే చెన్నమ్మ అనే మహిళగుర్తింపుకార్డుతో ఒక సిమ్‌కార్డును తీసుకున్నాడు. ఆ నంబర్ నుంచి కేవలం మణ్యంతో మాత్రమే మాట్లాడేవాడు. మణ్యం హత్య తరువాత ఈ నంబర్ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. చివరికి రాఘవేందరే నిందితుడని తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వాడిన కత్తులు, మద్యం సీసాలను పోలీసులు చూపించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. హత్యకేసును ఛేదించిన వనపర్తి రూరల్ ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి, రాయుడు, కృష్ణసాగర్, రాంచందర్‌కు వనపర్తి డీఎస్పీ జోగు చెన్నయ్య రికార్డు అందజేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
మంగళగిరి రూరల్: హత్య కేసులో ముగ్గురు నిందితులను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మకూరుపంచాయతీ పరిధి గుంటూరు చానల్లో గత నెల 18న గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతు డు పట్టణానికి చెందిన షేక్ ఖైరుల్లా అలి యాస్ కరిముల్లా (28)గా గుర్తించారు. విచారణలో హత్యగా తేలడమే కాకుండా ఈ కేసులో హతుని భార్య గౌసియా, ఆమె ప్రియుడు దామర్ల సాయి, సాయి స్నేహితుడు గుళ్లపల్లి ప్రవీణ్‌కుమార్‌లను అరెస్టుచేశారు. శనివారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ హరికృష్ణ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత నెల 18న గుంటూరు చానల్లో కుళ్లిపోయిన స్థితిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం బయటపడింది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించ గా.. గొంతువద్ద గాయాలు కనిపించడం తో అనుమానాస్పదమృతిగా కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో పట్టణానికి చెందిన జాన్‌సైదా, తన మరదలు గౌసియాతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన తమ్ముడు ఖైరుల్లా కనిపించడం లేదని తెలిపారు. పోలీసులు గుంటూరు చానల్లో దొరికిన యువకుడి మృతదేహం ఫొటోలు, దుస్తులు చూపించగా అవి తన తమ్ముడివిగా గుర్తించాడు. తమది లక్ష్మీనరసింహకాలనీ అని, తన తమ్ముడి భార్య గౌసియా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఖైరుల్లాను హత్యచేసి ఉంటుందని అనుమా నం వ్యక్తం చేశాడు. ఆ దిశగా విచారణ జరపగా.. ఖైరుల్లా తన ఇంట్లో వ్యభిచార వృత్తి నిర్వహించేవాడని తేలింది. అది నచ్చక గౌసియా భర్తతో గొడవ పడేది. భర్త వ్యవహారంతో విసుగుచెందిన గౌసి యా తన ఇంటికి అమ్మాయిల కోసం వచ్చే పట్టణంలోని వడ్లపూడి సెంటర్‌కు చెందిన దామర్ల సాయి అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. ఖైరుల్లాను తుదముట్టిస్తే తామిద్దరం హాయి గా ఉండవచ్చని గౌసియా, సాయిలు భావించారు. సాయి స్నేహితుడు గుళ్లపల్లి ప్రవీణ్‌కుమార్ సాయం తీసుకున్నారు. గత నెల 15వ తేదీ రాత్రి సాయి, ప్రవీణ్‌కుమార్‌లు ఖైరుల్లా ఇంటికి వెళ్లి అమ్మాయి కావాలని అడగడమేకాకుం డా, అయన్ను నమ్మించి మద్యం తాగుదామని తమ వాహనంపై ఎక్కించుకుని గుంటూరు చానల్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ మద్యం తాగి సర్జికల్ బ్లేడ్‌తో ఖైరుల్లా గొంతులో పొడిచి నీళ్లల్లో తొక్కిపెట్టి హత్యచేశారు. చేతికి ఉన్న వెం డి ఉంగరం తీసుకుపోయారు. సాయి ఇంటికి వెళ్లి తన అన్నయ్యకు చెందిన బ్రాస్లెట్, ఐదు బంగారు ఉంగరాలు, గొలుసు తీసుకుని ప్రియురాలు గౌసి యా, ఆమె ఇద్దరి పిల్లలతో పారిపోయి తెనాలిలో నివాసం ఉంటున్నాడు. కొన్ని బంగారు వస్తువులను విక్రయించి గౌసియాకు స్కూటీ కొనుగోలు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు తెనాలిలో వున్నట్లు తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి నిందితులను అరెస్టు చేసి వారి వద్ద సర్జికల్ బ్లేడ్, బ్రాస్లెట్, నాలుగు ఉంగరాలు, టీవీఎస్ ఎక్స్ఎల్ మోపెడ్, స్కూటీ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో రూరల్ ఎస్ఐలు అంకమ్మరావు, వై.సత్యనారాయణ, సిబ్బంది మోహనరావు, శాంతకుమార్, పోతురాజు, రాఘవ, శ్రీనివాసరావు విజయ్, ప్రకాష్, సుబ్బారావు తదితరులు వున్నారు. -
టీడీపీ శ్రేణుల బరితెగింపు
విజయోత్సవాలపేరిట కవ్వింపు చర్యలు వైఎస్సార్ సీపీ శ్రేణుల ఇళ్ల ఎదుట హంగామా బైక్‌లపై చక్కెర్లు కొడుతూ రగడ పోలీసులకు ఫిర్యాదుచేసిన ఎంపీటీసీ సభ్యుడు ఉయ్యూరు, న్యూస్‌లైన్ : టీడీపీ శ్రేణులు బరితెగిస్తున్నాయి. గెలుపు ఉత్సాహంతో వైఎస్సార్ సీపీ శ్రేణులను రెచ్చగొడుతూ కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. బైక్‌లపై చక్కెర్లు కొడుతూ, బాణ సంచా పేలుస్తూ పల్లె వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఈ దుందుడుకు చర్యలతో పెనమలూరు నియోజకవర్గంలో హింసా రాజకీయ వాతావరణం ఏర్పడుతుందేమోనని జనం బిక్కుబిక్కుమంటున్నారు. ముదునూరు, ఉయ్యూరులో రగడ పెనమలూరు నుంచి టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా ఎన్నికల నిబంధనల మేరకు విజయోత్సవాలు నిర్వహించరాదు. ఇందుకు భిన్నంగా బోడె అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఎక్కడబడితే అక్కడ బాణసంచా పేలుస్తూ, బైక్‌లపై చక్కెర్లు కొడుతూ హోరెత్తించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లు, కార్యాల యాలు, వ్యాపార సంస్థల ముందుగా పదేపదే పర్యటించి కవ్వింపులకు పాల్పడ్డారు. మండలంలోని ముదునూరులో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలు కగ్గా కోటేశ్వరమ్మ దుకాణం ఎదుట శుక్రవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు బైక్‌లపై తిరుగుతూ, కవ్వించారు. ఈ గోలను తట్టుకోలేక కోటేశ్వరమ్మ ఉయ్యూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉయ్యూరు దళితవాడలోనూ ఇదే పరిస్థితి. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అధికార పగ్గాలు చేపడుతున్న క్రమంలో బాధ్యతగా మెలగాల్సిన టీడీపీ నాయకులు అందుకు భిన్నంగా నడుచుకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీ శ్రేణులు తప్పు చేస్తే మందలించాల్సిన నాయకులు తిరిగి కౌంటర్ ఫిర్యాదులు చేయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తన దుకాణం ఎదుట హంగామా సృష్టించి, దూషించి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ముదునూరు ఎంపీటీసీ సభ్యురాలు కోటేశ్వరమ్మ దంపతులతో స్థాని కులు పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరితే.. తమను కోటేశ్వరమ్మ కులం పేరుతో దూషించారంటూ టీడీపీ కార్యకర్తలు కౌంటర్ ఫిర్యాదు చేశారు. టీడీపీ శ్రేణుల తీరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉందని స్థానికులు ఎద్దేవాచేస్తున్నారు. కార్యకర్తల జోలికెళితే ఖబడ్దార్ వైఎస్సార్ సీపీ కార్యకర్తల జోలికెళితే ఎవరినైనా ఊరుకునేది లేదని ఆ పార్టీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు హెచ్చరించారు. ఆయన శనివారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ప్రజాతీర్పును తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి స్వాగతించారని, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో నడుచుకుంటున్నారని తెలి పారు. టీడీపీ విజయోత్సవాలు జరుపుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల ఎదుట హంగామా సృష్టిస్తూ కవ్వింపు చర్యలకు దిగితే చూస్తూ ఊరుకోదని లేదని స్పష్టం చేశారు. -
నలుదిక్కులా నిఘా
కరీంనగర్ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలోని ప్రధాన రహదారులన్ని నిఘానేత్రం నీడలోకి వచ్చేశాయి. ప్రధాన రహదారుల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కరీంనగర్‌లోని ప్రధాన చౌరస్తాల్లో సీసీ కెమెరాలను అమర్చగా.. తాజాగా జిల్లాకేంద్రానికి నాలుగువైపుల ఉన్న రహదారుల్లో కెమెరాలను రూరల్ పోలీసులు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌కు వచ్చే వాహనాల రాకపోకల వివరాలను నమోదు చేసేందుకు వీలుగా పది సీసీ కెమెరాలను అమర్చారు. నేరాల నియంత్రణలో కీలకం.. సీసీ కెమెరాల ఏర్పాటుతో రహదారుల్లో జరిగే నేరాలను నియంత్రించే అవకాశముంది. రాజీవ్హ్రదారి, రాయపట్నం స్టేట్హైవేలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరిగి పలువురు దుర్మరణం చెందుతున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాలను గుర్తించే అవకాశం లేకపోవడంతో పోలీసులు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రస్తుతం ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రమాదాలు చేసి ఆగకుండా వెళ్తున్న వాహనాల డ్రైవర్లు, వివిధ ప్రాంతాల్లో నేరాలు చేసి తప్పించుకుంటున్న నేరస్తుల కదలికలను తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. రాత్రివేళల్లో జరిగే బంగారం, నకిలీనోట్లు, కలప, నకిలీమద్యం, బాలికల అక్రమ రవాణా కార్యకలపాలను పరిశీలించే వీలుంటుందని రూరల్ ఎస్సై సృజన్‌రెడ్డి తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా వీలైనంత త్వరలో నేరస్తులను పట్టుకునే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ఎస్పీ కార్యాలయానికి కనెక్షన్ ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన పది సీసీ కెమెరాలకు సంబంధించిన కనెక్షన్‌ను ఎస్పీ కార్యాలయానికి త్వరలో ఇవ్వడానికి రూరల్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోనే వీటిని ఆపరేటింగ్ చేస్తున్నారు. ఎస్పీ కార్యాలయానికి కనెక్షన్ ఇచ్చినట్లయితే అక్కడినుంచే నాలుగు రహదారుల్లోని వాహనాల రాకపోకలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశముంటుంది. జిల్లాకేంద్రంలోకి ప్రవేశించే నేరస్తులు, ఇతర అనుమానాస్పద వ్యక్తులను గమనించి పోలీసులను అప్రమత్తం చేయవచ్చు. తద్వారా నేరాలను నియంత్రించడానికి అవకాశం ఏర్పడుతుందని పోలీసులు భావిస్తున్నారు. -
బైక్‌ను అటకాయించి దంపతులపై దాడి
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: నగర శివారుల్లో దోపిడీ ముఠాలు విజృంభిస్తున్నాయి. ఒంటరి వ్యక్తులపై దాడులు చేయడం, వాహనదారులను అటకాయించి దోచుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా రూరల్ పరిధిలోని వడ్డుపల్లి సమీపంలో ద్విచక్ర వాహనంలో వెళుతున్న కృష్ణవేణి, బాలకృష్ణ దంపతులను అటకాయించి బంగారు నగలను దోచుకెళ్లారు. బాధితులు రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని కోణాపురానికి చెందిన దంపతులు, మంగళవారం వ్యక్తిగత పని నిమిత్తం నగరానికి వచ్చారు. బుధవారం సాయంత్రం బంధువుల ఇంటి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. వడ్డుపల్లి గ్రామ సమీపంలో వెళుతుండగా గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వారిని ఆపారు. వాహనం వేగాన్ని తగ్గించగానే దుండగులు ఆ దంపతులపై దాడి చేశారు. కృష్ణవేణి మెడలోని పుస్తెలతో పాటు బంగారు గొలుసులు(ఆరు తులాలు బంగారు) లాక్కుని ఉడాయించారు. నిర్మానుష్య ప్రదేశంలో వారి అరుపులు అరణ్య రోదనగానే మిగిలాయి. దుండగులు ద్విచక్ర వాహనాల్లో వెళ్లి పోయినట్లు బాధితులు తె లిపారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, అటుగా వెళుతున్న వాహనదారుల సాయంతో బాధిత దంపతులు నగరానికి చేరుకున్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసి స్వగ్రామానికి వెళ్లారు. ఇటీవల కక్కలపల్లి క్రాస్‌లో ద్విచక్ర వాహనదారుడిపై కత్తితో దాడి చేసి వాహనంతో సహా సెల్ ఫోన్, నగదు అపహరించుకు వెళ్లిన ఘటన మరవకనే, నేషనల్ పార్కు సమీపంలో జాతీయ రహ దారిపై దంపతులపై దాడి చేసిన జరగడం నగర వాసుల్ని ఆందోళనకు గురి చేసింది. తాజాగా వడ్డుపల్లి సమీపంలో దంపతులను దోచుకోవడంతో ఉలికి పడ్డారు. -
దాడి చేసి నగలు, నగదు అపహరణ
గూడూరు టౌన్, న్యూస్‌లైన్ : ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న తనపై అర్ధరాత్రి సమయంలో దాడి చేసి ఇంటిలోకి చొరబడి బంగారం, నగదును అపహరించారని మంగళవారం చెన్నూరు అరుధంతీయవాడకు చెందిన మేకా పెంచలమ్మ గూడూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. పెంచలమ్మ తమ్ముడు తూమాటి చిరంజీవి ఇంటిలో ఎవరూ లేకపోవడంతో సోమవారం రాత్రి కాపలాగా ఇంటి ఆవరణలో నిద్రిస్తోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన తూమాటి చిన్న, పెంచలయ్య, తులశమ్మ, అంకమ్మ, లక్ష్మమ్మతో పాటు మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులు పెంచలమ్మ వద్దకు వచ్చి నిద్రలేపి ‘నీ తమ్ముడు చిరంజీవి ఎక్కడ ఉన్నాడో చెప్పాలని’ కొట్టారన్నారు. భయపడి పారిపోతుండగా వెంటపడి తరిమారన్నారు. ఆ తర్వాత వారంతా ఇంటి తలుపులు పగులకొట్టి లోపలికి వెళ్లి ఇంట్లోని డబ్బులు, నగలు అపహరించుకుని వెళ్లారన్నారు. వారికి భయపడి రాత్రంతా ఇంటికి దూరంగా ఉండి, ఉదయం వెళ్లి చూడగా ఇంటిలోని వస్తువులంతా చిందరవందరగా పడి ఉన్నాయన్నారు. దీంతో తన తమ్ముడు చిరంజీవి భార్యకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో బీరువాలోని 6.50 సవర్ల నగలు, 120 గ్రాముల వెండి, రూ.32 వేలు నగదుతో పాటుగా ఏటీఎం కార్డు, ఎల్ఐసీ బాండులు ఉన్నాయో లేవో చూడాలని చెప్పిందన్నారు. ఇంటిలోని వస్తువులతో పాటు బీరువాలోని వస్తువులు ఏమి లేకపోవడంతో గూడూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.