జోగుళాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు  | International Award For Jogulamba Temple | Sakshi
Sakshi News home page

జోగుళాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు 

Published Fri, Dec 16 2022 9:26 AM | Last Updated on Fri, Dec 16 2022 5:40 PM

International Award For Jogulamba Temple - Sakshi

జోగుళాంబ శక్తిపీఠం(మహబూబ్‌నగర్‌ జిల్లా): తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠం అలంపూర్‌ జోగుళాంబ అమ్మవారి ఆలయానికి అరుదైన గౌరవం లభించింది. హిందుస్తాన్‌ గగన్‌గౌరవ్‌ జ్యోతిర్లింగ ఫౌండేషన్‌లు వరల్డ్‌ హెల్త్‌ డయాబెటిక్, క్యాన్సర్, ఎయిడ్స్‌ ఫౌండేషన్‌ కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని గాంధీభవన్‌లో సంయుక్తంగా నిర్వహించిన ఓ సదస్సులో జోగుళాంబ ఆలయానికి ‘హిందుస్తాన్‌ గగన్‌గౌరవ్‌ అంతర్జాతీయ పురస్కారం–2022’ప్రకటించారు.

కోవిడ్‌ సమయంలో వచ్చిన తుంగభద్ర నదీ పుష్కరాలకు లక్షలాది మంది వచ్చినా ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తకుండా నిర్వహించినందుకు గాను ఈ అవార్డును ఇస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఆలయ ఈఓ పురేందర్, ప్రధాన అర్చకుడు ఆనంద్‌ శర్మ, వేదపండితులు శ్యాంకుమార్‌ శర్మలను ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సత్కరించి వారికి అవార్డును ప్రదానం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement