డాక్టర్ శ్రీధర్‌కు అంతర్జాతీయ పురస్కారం
సాక్షి, సిటీబ్యూరో: కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణుడు, సన్‌షైన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ శ్రీధర్ కస్తూరికి 2014 సంవత్సరానికి ప్రతిష్టాత్మాక అంతర్జాతీయ కార్డియాక్ ఫోరం పురస్కారం లభిచింది.
ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌కు చెందిన ప్రఖ్యాత కార్డియాక్ ఫోరం యూరో పీసీఆర్-14 బహూకరించే ఈ అవార్డు ఈసారి శ్రీధర్‌ను వరిచింది. ఇటీవల మెయిన్ ఎరీనాలో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు దేశవిదేశాల నుంచి 12257 మంది హృద్రోగ నిపుణులు హాజ రు కాగా, 60 దేశాల నుంచి 934 ప్రొసీజర్లు పోటీ పడ్డాయి.
ఇందులో శ్రీధర్ చేసిన ‘ఆర్థోప్లాస్టీ విత్ స్టెంటింగ్ ఆఫ్ లాంగ్ సెగ్మంట్ టోటల్ ఆక్లూషన్ ఆఫ్ డిసెండింగ్ థొరాసిక్ ఆర్ట్ అండ్ అబ్డామినల్ ఆర్టా తకాయాసు ఆర్టాయిటీస్ విత్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ- యాంజియోగ్రఫీ ఫాలో ఆప్’ (గుండె నుంచి కాలికి రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళానికి ఆపరేషన్ లేకుండా స్టెంట్‌తో రక్తనాళాన్ని పునరుద్ధరించడం) చికిత్స రెండో అత్యుత్తమ క్లినికల్ ప్రొసీజర్‌గా ఎంపికైనట్లు సన్‌షైన్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ గురువారెడ్డి శుక్రవారం విలేకరులకు చెప్పారు.