సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీలో ముసలం ఏర్పడింది. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతపై బీజేపీ సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అనకాపల్లి, ఏలూరు ఎంపీ రేసులో టీడీపీ నుంచి వచ్చిన సీఎం రమేష్, సుజనా చౌదరి పేర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా రఘురామకృష్ణంరాజుని ప్రచారం చేస్తుండటంపైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
అరకుకి కొత్తపల్లి గీత, రాజమండ్రికి పురందేశ్వరి అంటూ ఎల్లో మీడియా లీకులు ఇస్తుండగా, ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతలు రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవడం పట్ల సీనియర్లు మండిపడుతున్నారు.
జీవీఎల్, సోము వీర్రాజు లాంటి సీనియర్ల పేర్లు లేకుండా టీడీపీ కుట్రలపై సీనియర్లు చర్చిస్తున్నారు. చంద్రబాబు కోసం పనిచేసే నేతలకి సీట్ల ప్రాధాన్యతపై కూడా చర్చిస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసేవారికి ప్రాధాన్యతనివ్వాలని సీనియర్లు అంటున్నారు.
ఇదీ చదవండి: బాబు కన్నింగ్.. ఏపీ బీజేపీ గగ్గోలు !
Comments
Please login to add a commentAdd a comment