
విజయవాడ: వైఎస్సార్ సీపీ నేత వల్లభనేని వంశీ కేసులో టీడీపీ-పోలీసుల పన్నాగం బట్టబయలైంది. వంశీ కేసులో తప్పుడు సాక్ష్యం ఇచ్చానని కోర్టుకు చెప్పిన సత్యవర్థన్ పై కేసు నమోదు చేయడంతో టీడీపీ కుట్ర తేటతెల్లమైంది. తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదని సత్యవర్థన్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజే అతనిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో టీడీపీ కుట్ర పూరిత రాజకీయం మరొకసారి బట్టబయలైంది. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు సత్యవర్థన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. సత్యవర్థన్ని బెదిరించేందుకు కేసు నమోదు చేశారు.
ఈ నెల 11వ తేదీన వంశీ, సత్యవర్దన్ సహా ఐదుగురిపై ఎఫ్ఐఆర్ రిజస్టర్ చేశారు పోలీసులు. 84/2025 కేసులో సత్యవర్థన్ ఏ5గా ఉన్నారు. గన్నవరం టీడీపీ నేత మేడేపల్లి రమ ఇచ్చిన ఫిర్యాదుపై కొమ్మాకోట్టు, భీమవరపు రామకృష్ణ, రాజు, సత్యవర్థన్లపై కేసు నమోదు చేశారు. 232, 351(3), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు విజయవాడ పటమట పోలీసులు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ తాజాగా వంశీ బ్యాచ్ బెదిరింపులకు లొంగి 5 లక్షలు తీసుకుని కేసు వాపస్ తీసుకున్నారని రమాదేవి ఫిర్యాదు చేశారు. పార్టీ తరపున అండగా ఉంటామని చెప్పినా సత్యవర్థన్ వినకుండా కేసు వాపస్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. సత్యవర్థన్ పై కేసు పెట్టి మరుసటి రోజు అన్న తో ఫిర్యాదు చేయించారు పోలీసులు. ఆ ఫిర్యాదు ఆధారంగా వల్లభనేని వంశీ ని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో వంశీపై కుట్ర పూరితంగా టీడీపీ కేసు పెట్టించిందనే విషయం బహిర్గతమైంది.