రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణ క్షమాపణ అఫిడవిట్లపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తమ సంస్థ ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల విషయంలో మరోసారి ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడబోమంటూ యోగా గురు రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ తాజాగా సమరి్పంచిన బేషరతు క్షమాపణల అఫిడవిట్లపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తన అసంతృప్తిని వ్యక్తంచేసింది. మీ క్షమాపణలను అంగీకరించే ఉదారగుణం మాకు లేదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాల ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ అంశంలో నాలుగైదేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ ఉద్దేశపూర్వకంగా కళ్లు మూసుకుందని కోర్టు ఆగ్రహంవ్యక్తంచేసింది. తమ క్లయింట్లు ఇద్దరూ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నారని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ చెబుతుండగా.. ‘ ఆ సారీలను మేం అంగీకరించట్లేము.
కోర్టు ఆదేశాలను పాటిస్తామంటూ మీ క్లయింట్లు ఇచి్చన పాత అఫిడవిట్లకు మీ క్లయింట్లే ఏమాత్రం విలువ ఇవ్వనప్పుడు తాజా అఫిడవిట్లకు మేం మాత్రం ఎందుకు విలువ ఇవ్వాలి?. మేం కూడా అలాగే చేయొచ్చుకదా? అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు.
విదేశీప్రయాణం పేరు చెప్పి రామ్‌దేవ్, బాలకృష్ణ ఉద్దేశపూర్వకంగా కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకున్నారని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీనీ కోర్టు తలంటింది. జిల్లా ఆయుర్వేదిక్, యునానీ అధికారిని ఎందుకు సస్పెండ్ చేయకూడదని అథారిటీ జాయింట్ డైరెక్టర్‌ను ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 16వ తేదీకి వాయిదావేసింది.
Comments
Please login to add a commentAdd a comment