misleading ads
-
మీరేమీ అమాయకులు కాదు.. బాబా రాందేవ్‌పై మళ్లీ సుప్రీంకోర్టు ఆగ్రహం
ఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో పతంజలి ఆయుర్వేద నిర్వాకులు బాబా రాందేవ్, బాలకృష్ణపై సుప్రీం కోర్టు మరోసారి మండిపడింది. బాబా రాందేవ్ అంత అమాయకుడు ఏం కాదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రాందేవ్ బాబాది బాధ్యత రాహిత్యమైన ప్రవర్తన అని సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పు పట్టింది. పతంజలి ఆయుర్వేద ఔషధాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసును మంగళవారం జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఏ అమానుల్లాతో కూడిన సుప్రీకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. బాబా రాందేవ్, బాలకృష్ణ ఇద్దరూ సుప్రీకోర్టు విచారణకు భౌతికంగా హాజరయ్యారు. ‘మేము చేసిన తప్పిదాలకు బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఆ సమయంలో మేము చేసింది సరైంది కాదు. మేము చేసిన తప్పును భవిష్యత్తులో కూడా మళ్లీ జగరకుండా గుర్తు పెట్టుకుంటాం’ అని బాబా రాందేవ్ కోర్టుకు విన్నవించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది. మీరు ఏమి చేసినా.. అది మీ బాధ్యత మాత్రమే. మా ఆదేశాలను అనుసరించి క్షమాపణలు చెప్పారు. నయం చేయలేని వ్యాధుల గురించి ప్రచారం చేయలేరని మీకు తెలియదా?’ అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దానికి రాందేవ్ స్పందిస్తూ.. తాము అనే పరీక్షలు చేశామని కోర్టుకు తెలిపారు. ‘మీది చాలా బాధ్యత రాహిత్యమైన ప్రవర్తన. మీ క్షమాపణలు ఆమోదించాలా? వద్దా? అనే అంశంపై మేము ఆలోచిస్తాం. మీరు పదేపదే మా ఆదేశాలు ఉల్లంఘించారు’ అని జస్టిస్ హిమా కోహ్లి సీరియస్ అయ్యారు. ‘మీ క్షమాపక్షణలు హృదయం నుంచి రావటం లేదు’ అని మరో న్యామమూర్తి జస్టిస్ ఏ అమానుల్లా అన్నారు. ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం ఏప్రిల్ 23కు వాయిదా వేసింది. చదవండి: మేమేం గుడ్డివాళ్లం కాదు.. బాబా రాందేవ్‌పై మళ్లీ సుప్రీంకోర్టు ఆగ్రహం -
క్షమించే ఉదారగుణం మాకు లేదు
న్యూఢిల్లీ: తమ సంస్థ ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల విషయంలో మరోసారి ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడబోమంటూ యోగా గురు రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ తాజాగా సమరి్పంచిన బేషరతు క్షమాపణల అఫిడవిట్లపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తన అసంతృప్తిని వ్యక్తంచేసింది. మీ క్షమాపణలను అంగీకరించే ఉదారగుణం మాకు లేదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశంలో నాలుగైదేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ ఉద్దేశపూర్వకంగా కళ్లు మూసుకుందని కోర్టు ఆగ్రహంవ్యక్తంచేసింది. తమ క్లయింట్లు ఇద్దరూ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నారని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ చెబుతుండగా.. ‘ ఆ సారీలను మేం అంగీకరించట్లేము. కోర్టు ఆదేశాలను పాటిస్తామంటూ మీ క్లయింట్లు ఇచి్చన పాత అఫిడవిట్లకు మీ క్లయింట్లే ఏమాత్రం విలువ ఇవ్వనప్పుడు తాజా అఫిడవిట్లకు మేం మాత్రం ఎందుకు విలువ ఇవ్వాలి?. మేం కూడా అలాగే చేయొచ్చుకదా? అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. విదేశీప్రయాణం పేరు చెప్పి రామ్‌దేవ్, బాలకృష్ణ ఉద్దేశపూర్వకంగా కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకున్నారని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీనీ కోర్టు తలంటింది. జిల్లా ఆయుర్వేదిక్, యునానీ అధికారిని ఎందుకు సస్పెండ్ చేయకూడదని అథారిటీ జాయింట్ డైరెక్టర్‌ను ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 16వ తేదీకి వాయిదావేసింది. -
బోర్నవిటాకు ఎన్సీపీసీఆర్ షాక్.. కారణం ఇదే!
బూస్ట్, బోర్నవిటా వంటి వాటికి భారతీయ మార్కెట్లో మంచి క్రేజు ఉంది. ఈ కారణంగానే వీటి అమ్మకాలు కూడా భారీగా ఉన్నాయి. ఇటీవల మాండెలెజ్ ఇండియాకు చెందిన బోర్నవిటా కొనుగోలుదారులను తప్పు దోవ పట్టించే వ్యాపార ప్రకటనలు, ప్యాకేజింగ్ లేబుళ్లను చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జాతీయ పిల్లల హక్కుల కమీషన్ (NCPCR) నివేదికల ప్రకారం, బోర్నవిటాను తప్పుదోవ పట్టించే ప్రకటనలు మాండెలెజ్ ఇండియా చేసినట్లు తెలిసింది. దీనిపైన సమగ్రమైన వివరణ ఇవ్వాలని NCPCR ఆదేశించింది. బోర్న్‌విటాలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉందని ఆరోపిస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీడియోను పోస్ట్ చేయడం ద్వారా వివాదానికి దారితీసిన తర్వాత నోటీసు వచ్చింది. పిల్లల ఎదుగుదలను అభివృద్ధి పరుస్తామంటూ ప్రచారం చేయబోయే బోర్నవిటాలో పిల్లల ఆరోగ్యానికి హానిచేసే చక్కర శాతం, ఇతర పదార్థాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. లీగల్ నోటీసు అందించిన తర్వాత వీడియోను అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించినప్పటికీ, ఇది ఇప్పటికే దాదాపు 12 మిలియన్స్ వ్యూవ్స్ పొంది బాగా పాపులర్ అయిపోయింది. మీ కంపెనీ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తూ ప్యాకేజింగ్, వ్యాపార ప్రకటనలు చేసినట్లు కమిషన్ గుర్తించిందని మాండెలెజ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్-ఇండియా 'దీపక్ అయ్యర్'కు జారీ చేసిన ప్రకటనలో ఎన్సీపీసీఆర్ వెల్లడించింది. (ఇదీ చదవండి: భారీగా పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధరలు - కొత్త ధరలు ఇలా!) పోషకాహార నిపుణులు, ఆహార శాస్త్రవేత్తలు మా ఉత్పత్తిని సమగ్రంగా టెస్ట్ చేయడం జరిగిందని. ఉత్పత్తిలో ఆహార పదార్థాలు అన్ని విధాలా సరైనవే అని నిర్దారించిన తరువాత మార్కెట్లో విక్రయిస్తున్నట్లు బోర్నవిటా ప్రతినిధి గతంలో వెల్లడించారు. దీనిపైనా ఇప్పుడు ఎటువంటి సమాధానం లభిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
తప్పుడు ప్రకటనలిస్తే...ఎడ్టెక్ కంపెనీలకు స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: తప్పుదారి పట్టించే ప్రకటనలు తదితర అక్రమ వ్యాపార విధానాలను అవలంబిస్తున్న ఎడ్టెక్ కంపెనీలకు ప్రభుత్వం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. పరిశ్రమలో ప్రధాన సంస్థలు స్వీయ నియంత్రణలు పాటించని పక్షంలో కఠిన మార్గదర్శకాలను తీసుకురావలసి ఉంటుందని హెచ్చరించింది. ఎడ్టెక్ విభాగంలో నకిలీ రివ్యూలు పెరగడంతో వీటిని అరికట్టేందుకున్న అవకాశాలపై వినియోగ వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఒక సమావేశంలో చర్చించారు. ఇండియా ఎడ్టెక్ కన్సార్షియం(ఐఈసీ), తదితర పరిశ్రమ సంబంధ సంస్థలతో రోహిత్ కుమార్ చర్చలు నిర్వహించారు. దేశీ ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్(ఐఏఎంఏఐ) ఆధ్వర్యంలో ఐఈసీ నడుస్తోంది. ఈ సమావేశానికి ఐఈసీ సభ్యులతోపాటు ఐఏఎంఏఐ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ జాబితాలో అప్‌గ్రేడ్, అన్అకాడమీ, వేదాంతు, గ్రేట్ లెర్నింగ్, వైట్‌హ్యాట్ జూనియర్, సన్‌స్టోన్ తదితరాలున్నాయి. -
230 కోట్ల యాడ్స్ నిషేధం
ఆన్లైన్ యూజర్లకు హానిచేస్తున్న తప్పుడు వ్యాపార ప్రకటనలపై గూగుల్ కొరడా ఝళిపిస్తూ వస్తోంది. ఈక్రమంలో గూగుల్ 2018 లో 2.3 బిలియన్ల (230 కోట్ల) ప్రకటనలను నిషేధించినట్టు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తాజాగా వెల్లడించింది. వినియోగదారులను మిస్ లీడ్ చేస్తున్న బ్యాడ్ యాడల్‌లను రోజుకు 6లక్షలకు పైగా బ్యాన్ చేసినట్టు తెలిపింది. 2018 బ్యాడ్‌యాడ్ రిపోర్టులో గూగుల్ ఈ వివరాలు అందించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలనుంచి వినియోగదారులను కాపాడి, మెరుగైన సేవలను అందించే లక్ష్యంగా కొత్త విధానాలను తీసుకొచ్చినట్టు తెలిపింది. ప్రధానంగా 31కొత్త విధానాలను ప్రవేశపెట్టామని గూగుల్ వెల్లడించింది. తమ సంస్థ ద్వారా ప్రతీ యూజర్‌కు ఆరోగ్యకరమైన స్థిరమైన ప్రకటనల ఎకోసిస్టంను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని సస్టైనబుల్ యాడ్స్ డైరెక్టర స్కాట్ స్పెన్సర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఎప్పటికపుడు తన పాలసీని అప్డేట్ చేస్తూ వస్తున్న గూగుల్ వినియోగదారుల భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న సుమారు 1.5 మిలియన్ల యాప్‌లను ఇప్పటికే తొలగించింది. అలాగే దాదాపు 734,000 మంది ప్రచురణకర్తలు, యాడ్ డెవలర్స్‌ను తన ప్రకటన నెట్వర్క్ నుండి రద్దు చేసింది. క్రిప్టోకరెన్సీలను ప్రమోట్ చేసే ఆన్లైన్ ప్రకటనలు, సంబంధిత కంటెంట్‌ను కూడా నిషేధించింది. 2017లో కూడా వ్యాపార ప్రకటన పాలసీ నిబంధనలు ఉల్లంఘించిన 3.2 బిలియన్ల ప్రకటనలను తొలగించిన సంగతి తెలిసిందే. -
బ్రాండ్ అంబాసిడర్లు జర జాగ్రత్త!
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ వివాదానంతరం ఉత్పత్తుల ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిర్వర్తించే ప్రముఖ ఎండాసర్లకు మరింత బాధ్యత పెరిగింది. తప్పుడు ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేసే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించింది. గరిష్టంగా ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా విధించాలని ప్రతిపాదిస్తూ కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. త్వరలోనే పార్లమెంట్‌కు ఈ నివేదికను అందించనుంది. ప్రైవేట్ కంపెనీలకు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా కాంట్రాక్టుపై సంతకం చేసేముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొంది. వినియోగదారుల రక్షణ బిల్లు కింద ఈ ప్రతిపాదనలను పార్లమెంటరీ కమిటీ సిద్ధంచేసింది. ఎప్పడినుంచైతే తప్పుడు ఉత్పత్తులకు ప్రచారం నిర్వర్తిస్తున్నారో, అప్పటినుంచి ఉత్తత్పిదారుడితో పాటు వారికి బాధ్యత ఉంటుందని, జరిమానా కచ్చితంగా చెల్లించాల్సిదేనని కమిటీ తెలిపింది. ఉత్పత్తుల అమ్మకాల బట్టి కూడా తప్పుడు ప్రకటనలకు జరిమానా విధిస్తామని పార్లమెంటరీ కమిటీ హెడ్, టీడీపీ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. చాలామంది సెలబ్రిటీలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటున్నారని చెప్పారు. తప్పుడు ప్రకటనలకు ఎండాసర్లుగా ఉన్నట్టు మొదటిసారి తేలితే రూ.10 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని, అదే రెండో సారి కూడా తప్పుడు ప్రకటనలు చేస్తే రూ. 50 లక్షల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా కమిటీ ప్రతిపాదించింది. ఉత్పత్తుల అమ్మకాల బట్టి కూడా జరిమానా పెంచేవిధంగా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. జాతీయ అవార్డు గ్రహీతలకు, సెలబ్రిటీలకు ఉన్న క్రేజ్ బట్టి, వారు తప్పుడు ప్రకటనలు చేస్తున్నా వినియోగదారులు గుడ్డిగా నమ్మేస్తున్నారని కమిటీ పేర్కొంది. కల్తి ఆహార పదార్థాలను మంచివిగా తప్పుడు ప్రకటనలు చేస్తే మాత్రం కఠినమైన తప్పవని కమిటీ హెచ్చరించింది. ఆ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని, వారికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా, రెండేళ్ల లైసెన్సులు సస్పెన్షన్ ఉంటాయని కమిటీ ప్రతిపాదించింది.