బూస్ట్, బోర్నవిటా వంటి వాటికి భారతీయ మార్కెట్లో మంచి క్రేజు ఉంది. ఈ కారణంగానే వీటి అమ్మకాలు కూడా భారీగా ఉన్నాయి. ఇటీవల మాండెలెజ్ ఇండియాకు చెందిన బోర్నవిటా కొనుగోలుదారులను తప్పు దోవ పట్టించే వ్యాపార ప్రకటనలు, ప్యాకేజింగ్ లేబుళ్లను చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
జాతీయ పిల్లల హక్కుల కమీషన్ (NCPCR) నివేదికల ప్రకారం, బోర్నవిటాను తప్పుదోవ పట్టించే ప్రకటనలు మాండెలెజ్ ఇండియా చేసినట్లు తెలిసింది. దీనిపైన సమగ్రమైన వివరణ ఇవ్వాలని NCPCR ఆదేశించింది. బోర్న్‌విటాలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉందని ఆరోపిస్తూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియోను పోస్ట్ చేయడం ద్వారా వివాదానికి దారితీసిన తర్వాత నోటీసు వచ్చింది.
పిల్లల ఎదుగుదలను అభివృద్ధి పరుస్తామంటూ ప్రచారం చేయబోయే బోర్నవిటాలో పిల్లల ఆరోగ్యానికి హానిచేసే చక్కర శాతం, ఇతర పదార్థాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. లీగల్ నోటీసు అందించిన తర్వాత వీడియోను అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించినప్పటికీ, ఇది ఇప్పటికే దాదాపు 12 మిలియన్స్ వ్యూవ్స్ పొంది బాగా పాపులర్ అయిపోయింది. మీ కంపెనీ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తూ ప్యాకేజింగ్, వ్యాపార ప్రకటనలు చేసినట్లు కమిషన్ గుర్తించిందని మాండెలెజ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్-ఇండియా 'దీపక్ అయ్యర్'కు జారీ చేసిన ప్రకటనలో ఎన్‌సీపీసీఆర్ వెల్లడించింది.
(ఇదీ చదవండి: భారీగా పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరలు - కొత్త ధరలు ఇలా!)
పోషకాహార నిపుణులు, ఆహార శాస్త్రవేత్తలు మా ఉత్పత్తిని సమగ్రంగా టెస్ట్ చేయడం జరిగిందని. ఉత్పత్తిలో ఆహార పదార్థాలు అన్ని విధాలా సరైనవే అని నిర్దారించిన తరువాత మార్కెట్లో విక్రయిస్తున్నట్లు బోర్నవిటా ప్రతినిధి గతంలో వెల్లడించారు. దీనిపైనా ఇప్పుడు ఎటువంటి సమాధానం లభిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment