న్యూఢిల్లీ: విదేశీ మారక నిర్వహణ చట్ట (ఫెమా) నిబంధనల ఉల్లంఘనకు గాను చైనా మొబైల్ తయారీ దిగ్గజం షావోమీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షోకాజ్‌నోటీసులు జారీ చేసింది.
రాయల్టీ ముసుగులో అనధికారికంగా రూ. 5,551.27 కోట్ల విలువ చేసే మొత్తాన్ని విదేశాలకు బదలాయించడానికి సంబంధించి ఈడీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. సదరు మొత్తాన్ని జప్తు చేస్తూ.. షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీర్ రావు, మాజీ ఎండీ మను జైన్‌తో పాటు సిటీ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్, డాయిష్ బ్యాంక్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment