Commercial advertisements
-
క్షమించే ఉదారగుణం మాకు లేదు
న్యూఢిల్లీ: తమ సంస్థ ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల విషయంలో మరోసారి ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడబోమంటూ యోగా గురు రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ తాజాగా సమరి్పంచిన బేషరతు క్షమాపణల అఫిడవిట్లపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తన అసంతృప్తిని వ్యక్తంచేసింది. మీ క్షమాపణలను అంగీకరించే ఉదారగుణం మాకు లేదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశంలో నాలుగైదేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ ఉద్దేశపూర్వకంగా కళ్లు మూసుకుందని కోర్టు ఆగ్రహంవ్యక్తంచేసింది. తమ క్లయింట్లు ఇద్దరూ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నారని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ చెబుతుండగా.. ‘ ఆ సారీలను మేం అంగీకరించట్లేము. కోర్టు ఆదేశాలను పాటిస్తామంటూ మీ క్లయింట్లు ఇచి్చన పాత అఫిడవిట్లకు మీ క్లయింట్లే ఏమాత్రం విలువ ఇవ్వనప్పుడు తాజా అఫిడవిట్లకు మేం మాత్రం ఎందుకు విలువ ఇవ్వాలి?. మేం కూడా అలాగే చేయొచ్చుకదా? అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. విదేశీప్రయాణం పేరు చెప్పి రామ్‌దేవ్, బాలకృష్ణ ఉద్దేశపూర్వకంగా కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకున్నారని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీనీ కోర్టు తలంటింది. జిల్లా ఆయుర్వేదిక్, యునానీ అధికారిని ఎందుకు సస్పెండ్ చేయకూడదని అథారిటీ జాయింట్ డైరెక్టర్‌ను ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 16వ తేదీకి వాయిదావేసింది. -
మాటల వెనుక మూటలున్నాయ్!
ఏం కొనాలి? ఎక్కడ తినాలి? ఎందులో డబ్బులు పెట్టాలి? పెరిగిన సోషల్ మీడియా పుణ్యమా అని కంపెనీల నుంచి కాసుల కోసమో, కానుకల కోసమో ఇవన్నీ చెబుతున్న అపర డిజిటల్ ఆర్థిక మేధావులకు ఇక కళ్ళెం పడనుంది. సామాన్యుల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియా ప్రజాభిప్రాయ పరికల్పకులకు సర్కార్ మార్గదర్శకాలు ప్రకటించింది. అమాయకులను తప్పుదోవ పట్టిస్తున్న వాణిజ్య ప్రకటనలకు అడ్డుకట్ట వేయడానికీ, సోషల్ మీడియా ప్రభావిత మార్కెట్ విస్తరిస్తున్న వేళ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికీ ఇది మరో ముందడుగు. సోషల్ మీడియా ప్రభావశీలురలో ఎక్కువ మంది ఆన్లైన్లో తమకున్న అనుచరగణమే పెట్టు బడిగా, సంస్థల నుంచి భారీ రుసుము తీసుకుంటూ, అడ్డమైనవాటినీ కొనుక్కోమని సిఫార్సులు చేస్తున్నారు. రోజువారీ వినియోగ వస్తువుల నుంచి క్రిప్టోకరెన్సీలు, నాన్–ఫంగిబుల్ టోకెన్లు, క్రిప్టో డిపాజిట్ల దాకా అన్నిటికీ ఈ జాడ్యం సోకింది. వారికి పోయేదేమీ లేదు కానీ, వారి మాట నమ్మి డబ్బులు పెట్టిన అమాయకులకే నష్టం. అందుకే, ఎలాంటి కానుకలు, హోటల్ బసలు, ఈక్విటీలు, రాయితీలు, అవార్డులందుకొని ఈ ఉత్పత్తులు, సేవలు, పథకాలను సిఫార్సు చేస్తున్నదీ ఈ మిడి మేలపు మేధావులు వెల్లడించాలని సర్కారు షరతు పెట్టింది. ఈ చర్య సహేతుకం, స్వాగతనీయం. ఇవాళ ప్రపంచమంతా స్థానిక నుంచి బహుళజాతి సంస్థల వరకు అన్నీ తమ బ్రాండ్లు, ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను చురుకుగా వాడడం తాజా ధోరణి. సదరు వ్యక్తుల అడ్డగోలు సమర్థనలు, మరీ ముఖ్యంగా ఆర్థిక ఉత్పత్తులు, మదుపులకు సంబంధించినవి బాగా పెరిగాయి. వీటికి సర్కార్ పగ్గాలు వేయనున్నట్టు గత సెప్టెంబర్ నుంచి వార్తలొస్తూనే ఉన్నాయి. ఈ జనవరి 20న అవి నిజమయ్యాయి. సోషల్ మీడియాలో వివిధ ఉత్పత్తుల్ని సమర్థిస్తూ ప్రకటనలిస్తున్నప్పుడు ప్రముఖులు, ప్రభావశీలురు, వర్చ్యువల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు (అవ తార్ లాంటి కంప్యూటర్ పాత్రలు) ఎలాంటి విధివిధానాల్ని పాటించాలనేది సర్కార్ తేల్చేసింది. నిరుడు రూ. 1275 కోట్లున్న సోషల్ మీడియా ప్రభావశీలుర విపణి ఏటా 20 శాతం వంతున పెరగనుంది. 2025 నాటికి అది రూ. 2800 కోట్లకు ఎగబాకుతుందని తాజా అంచనా. అందుకే, సోషల్ మీడియాను సందుగా చేసుకొన్న నవతరం ప్రసిద్ధులు బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి మార్గదర్శకాలు పెట్టడం మంచి పని. ఈ పండితమ్మన్యులు సదరు ఉత్పత్తుల్ని వాడకుండానే, స్వీయ లబ్ధికై వాటిని ప్రోత్సహిస్తున్నారని తెలుసుకోక సామాన్యులు ఉచ్చులో పడిపోవడం సహజం. ఇప్పుడు సదరు బ్రాండ్లతో తమకున్న బంధాన్ని ఇన్ఫ్లుయెన్సర్లు సామాన్య భాషలో, ఫోటోలతో సహా ఎలా బయటపెట్టాలో నిర్దేశించారు. అవి జనం దృష్టిని తప్పించుకోలేవన్నది లాభం. ఈ సరి కొత్త పారదర్శకతతో, తుది కొనుగోలు నిర్ణయం వినియోగదారుల విచక్షణకు వదిలేసినట్టవుతుంది. స్వీయ నియంత్రణ సంస్థ అయిన అడ్వరై్టజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2021లోనే పెయిడ్ ప్రమోషన్‌ను స్పష్టంగా పేర్కొనాలంది. కానీ, ఆ సంస్థ వద్దకు వస్తున్న ఉల్లంఘనల్లో మూడో వంతు ఈ ఇన్ఫ్లుయెన్సర్లవే. సోషల్ మీడియాతో ఎవరైనా రాత్రికి రాత్రి ఫేమసవుతున్న వేళ పెరుగుతున్న తప్పుడు ప్రకటనలపై కొరడా తీస్తూ, వినియోగదారుల వ్యవహారాల విభాగం పక్షాన ఈ తాజా నిబంధనలు వచ్చాయి. వీటిని ఉల్లంఘిస్తే, వినియోగదారుల పరిరక్షణ చట్టం– 2019 కింద జరిమానా తప్పదు. అది కాక ఉత్పత్తిదారులు, ప్రకటనకర్తలు, సమర్థకులకు రూ. 10 లక్షల దాకా కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ జుల్మానా వేస్తుంది. మళ్ళీ తప్పు చేస్తే, 50 లక్షలు. తప్పుదోవ పట్టిస్తూ ఒక ఉత్పత్తిని సమర్థిస్తే, ఏడాది పాటు ఆ వ్యక్తిపై నిషేధం. మరోసారి గీత దాటితే, ఆ వేటును మూడేళ్ళు పొడిగించవచ్చు. యూ ట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాలలో కంటికి నదురుగా కనిపిస్తూ, మాటలతో బుట్టలో వేసే ప్రభావశీలురకు చేతిలో పైసలు, సమాజంలో ప్రాచుర్యం, సక్సెస్‌లకు కొదవ ఉండదు. కానీ, ఫలానా ఉత్పత్తిని సమర్థించడానికీ, సిఫార్సు చేయడానికీ వారికి ఉన్న అర్హత, అపరిమిత జ్ఞానం ఏమిటంటే ప్రశ్నార్థకమే. ఒకప్పుడు ప్రభావశీలురంటే– అనుభవం గడించి, ఆలోచనల్ని ఆచరణలో పెట్టిన మేధావులు, సామాజిక కార్యకర్తలు, పరిణామ చోదకులు. వారి మాటకెంతో విలువ. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో లైకులు, షేర్లు చేసే అనుచరులు కనీసం లక్ష మంది ఉన్న కాలేజీ కుర్ర కారు, చదువులో డింకీ కొట్టినవాళ్ళూ ఇన్ఫ్లుయెన్సర్లే. పుస్తకాలు, సిన్మాలు, ఉత్పత్తుల రివ్యూల నుంచి ఆర్థికసలహాల దాకా ఎవరైనా, ఏదైనా చెప్పచ్చు. లేని మేధావితనం చూపచ్చు. అదే పెద్ద చిక్కు. చేతిలో స్మార్ట్ఫోన్లు, చేతి నిండా ఇంటర్నెట్తో డబ్బులెలా మదుపు చేయాలన్న ఆర్థిక పరిజ్ఞానం కోసం సాధారణంగా యువతరం సోషల్ మీడియా వేదికలను ఆశ్రయిస్తోంది. మదుపరుల్లో చైతన్యం పెంచే అధికారిక సెమినార్లు, వ్యాసాల కన్నా ఆకర్షణీయంగా ఈ వేదికలు సమాచారాన్ని అందించడమే అందుకు ప్రధాన కారణం. 25 లక్షల మంది కంటెంట్ క్రియేటర్లున్న మార్కెట్లో నూటికి 60 సంస్థలు దీన్ని ఆసరాగా చేసుకొని ఎదుగుతున్నాయట. అందుకే, జనం తేలిగ్గా మోసపోకుండా ఉండాలంటే, ఇన్ఫ్లుయెన్సర్లకు మార్గదర్శకాలిస్తే చాలదు. మదుపరుల్ని ఆర్థిక విద్యావంతుల్ని చేసి, పరిజ్ఞానంతో పాటు చైతన్యం పెంచే ప్రణాళికలను చేపట్టాలి. ప్రముఖులెవరో చెప్పారు కదా అని అడ్డమైన మాటల్నీ అతిగా నమ్మితే అసలుకే మోసమని అందరూ గ్రహించాలి. ఎందుకంటే, ఒక ప్రకటనలో ఓ పెద్దమనిషి నిత్యం చెబుతున్నట్టు డబ్బులు ఎవరికీ ఊరికే రావు! -
తొలిసారి కమర్షియల్ యాడ్ చేసిన బాలయ్య.. రెమ్యునరేషన్ ఎంతంటే..
సినీ సెలబ్రెటీలు ఒక పక్క సినిమాలు చేస్తునే మరో పక్క ప్రకటనల్లో నటిస్తుంటారు. పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే కొంతమంది నటులు మాత్రం కమర్షియల్ యాడ్స్‌కి దూరంగా ఉంటారు. అలాంటి వాళ్లలో నందమూరి బాలకృష్ణ కూడా ఇన్నాళ్లు ఉండేవాడు. కానీ తాజాగా ఆయన కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. ఎలాంటి వ్యాపార సంస్థల ఉత్పత్తుల ప్రకటనల్లో నటించకూడదు, బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించకూదని నియమం పెట్టుకున్న బాలయ్య, దాన్ని బ్రేక్ చేస్తూ ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. ఆ యాడ్‌లో కూడా బాలయ్య తనదైన స్టైల్లో డైలాగ్స్ చెబుతూ అదరగొట్టేశాడు. బాలయ్య కెరీర్లో ఇది తొలి కమర్షియల్ యాడ్ కావడంతో.. సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ భారీ మొత్తంలో పారితోషికం చెల్లించిందట. ఈ యాడ్ కోసం బాలయ్య ఏకంగా రూ.15 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల అంచనా. ఆ లెక్కన చూస్తే బాలకృష్ణ ఒక సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా అందుకున్నారు. మార్కెట్లో బాలకృష్ణకు ఉన్న క్రేజీ దృష్ట్యా అంత భారీ మొత్తంలో చెల్లించారట. ఏదేమైనా సినిమాల్లోనే కాకుండా.. ప్రకటనల్లో కూడా నందమూరి నటసింహం అందరగొట్టేసిందని బాలయ్య ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలయ్య ‘వీరసింహా రెడ్డి’అనే సినిమాలో నటిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. -
బెట్టింగ్ సైట్ల ప్రకటనలొద్దు టీవీ చానళ్లకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: బెట్టింగ్ సైట్లకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల ప్రసారంపై కేంద్రం సోమవారం మార్గదర్శకాలను విడుదలచేసింది. ‘ఆన్లైన్ బెట్టింగ్ సైట్లను వాటికి సంబంధించిన వార్త వెబ్సైట్లను, వాటి ఉత్పత్తులు/సేవల సంబంధ అంశాలను చూపే వాణిజ్య ప్రకటనల ప్రసారం మానుకోండి’ అని న్యూస్ వెబ్సైట్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ప్రైవేట్ శాటిలైట్ చానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సోమవారం సూచించింది. ఈ మార్గదర్శకాలు, చట్టాన్ని అతిక్రమిస్తే తీవ్ర స్థాయిలో చర్యలు ఉంటాయని ప్రైవేట్ శాటిలైట్ చానళ్లను కేంద్రం హెచ్చరించింది. వార్తలను ప్రచురించే పబ్లిషర్లకు, డిజిటల్ మీడియాకూ ఇదే తరహా సూచనలిస్తూ విడిగా మార్గదర్శకాలను పంపింది. ‘సొంత న్యూస్ వెబ్సైట్ల మాటున కొన్ని బెట్టింగ్ సంస్థలు తమను తాము అడ్వర్టైజ్ చేసుకుంటున్నాయి. బెట్టింగ్ సంస్థల లోగోలే ఆ న్యూస్ వెబ్సైట్లకూ ఉంటున్నాయి. ఈ వెబ్సైట్లు ఏవీ భారత చట్టాలకు లోబడి అధీకృత యంత్రాంగం వద్ద రిజిస్టర్ కాలేదు. తప్పుడు వాణిజ్య ప్రకటనలు, వార్తలు ప్రసారం చేస్తూ బెట్టింగ్, గ్యాబ్లింగ్‌కు పాల్పడుతున్నాయి. వీటిలో కొన్ని ప్రొఫెషనల్ స్పోర్ట్స్ బ్లాగ్లు, క్రీడా వార్తల వెబ్సైట్లుగా చెలామణి అవుతున్న విషయంపై వినియోగదారుల వ్యవహారాల విభాగాన్ని అప్రమత్తం చేశాం’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. -
GenderNext: ప్రకటనల్లో నేటి మహిళ
కురులకు షాంపూలు.. మేనికి సబ్బులు.. వంటింట్లో కుకర్, మిక్సీలకే కాదు పురుషులు వాడే షేవింగ్ క్రీములకూ మహిళలను చూపించనిదే ఏ ప్రకటనా ఉండదనే విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రకటనల్లో మహిళా శక్తిని ఏ విధంగా చూపుతున్నారనే అంశం మీద అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆస్కీ), ఫ్యూచర్ బ్రాండ్స్ ఆధ్వర్యంలో జెండర్ నెక్ట్స్ పేరిట ఓ స్టడీ నిర్వహించింది. ‘నేటి ఆధునిక రోజుల్లోనూ వాణిజ్య ప్రకటనల్లో చాలా వరకు మహిళల్ని ఇంకా మూస పద్ధతిలోనే చూపిస్తున్నారు’ అనేది ఈ స్టడీలో తేలింది. ప్రకటనల రంగంలో మహిళల ప్రాతినిధ్యంపై చేసిన లోతైన పరిశీలన ఇది. దాదాపు 600 ప్రకటనల్ని పరిశీలించిన అనంతరం మహిళల శక్తిని తక్కువ చేసి చూపుతున్నట్టు జెండర్ నెక్ట్స్ స్టడీ నిరూపించింది. ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న నేటి మహిళను ఆంక్షల్లో చూపెట్టడం సరికాదన్న విషయాన్ని స్పష్టం చేసింది. సంధించిన బాణాలు పర్సనల్ కేర్, ఫ్యాషన్, బ్యూటీ, హెల్త్, గాడ్జెట్స్, వీల్స్, విద్య, మనీ... సంబంధిత ప్రకటనలపై స్టడీ చేసిన అనంతరం కొన్ని ప్రశ్నలను రూపొందించి, వాటిని ఆన్లైన్ వేదిక ద్వారా ‘నేటి కాలంలో ప్రకటనలు మహిళల్ని ఎలా చూపిస్తున్నాయి? మహిళలు తమను తాము ఎలా భావిస్తున్నారు? తమను ఎలా చూపాలనుకుంటున్నారు?’ అనే ప్రశ్నలకు వృత్తి ఉద్యోగాలలో ఉన్న మహిళల నుంచి సమాధానాలు రాబట్టింది. ఈ పరిశోధనలో భాగంగా అన్ని రకాల ప్రకటనలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం జెండర్ నెక్ట్స్ స్టడీకి ప్రధాన ఆథర్ గా వ్యవహరించిన లిపికా కుమరన్ మాట్లాడుతూ ‘ప్రకటనల్లో సానుకూల అంశాలున్నప్పటికీ, మెయిన్ స్ట్రీమ్ అడ్వర్టయిజింగ్‌లో కొన్ని హానికరమైన స్టీరియో టైప్స్ పాత్రలున్నాయ’న్నారు. మహిళలకు సవాల్! మహిళలు ఆహారం తీసుకునే అలవాటును అత్యంత సున్నితంగా చూపడం పట్ల స్టడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే మిగిలిన వారంతా విశ్రాంతిగా కూర్చుని ఉండగా మహిళలు ఆపసోపాలు పడుతూ ఇంట్లో పనులు చేస్తున్నట్టు చూపడం, షాపింగ్‌లో అధికంగా ఖర్చు చేసేవారన్నట్టు, బ్యూటీ యాడ్స్‌లో మగవాళ్ల చూపులకు నచ్చే విధంగా ఉండేలా చూపడం, టెక్నాలజీ, గాడ్జెట్స్ వాడకంలో మహిళల శక్తి తక్కువ అన్నట్టు చూపడంతో పాటు మగ సెలబ్రిటీలు మహిళలకు సవాళ్లు విసురుతుండడం, ఆదేశాలు ఇస్తుండడం.. వంటివి అభ్యంతరకరంగా తేల్చారు. డిటర్జెంట్, ఫుడ్‌కు సంబంధించినవన్నీ మహిళల చేత మహిళలకోసమే రూపొందించినట్టుగా ఉండటం కూడా ఇందులో ప్రధానంగా గుర్తించారు. అంగీకరించని నేటి తరం ప్రకటనలపై విభిన్న వర్గాల మహిళలు సైతం ఈ అభ్యంతరాల్ని సమర్థించారు. స్వయం సమృద్ధి దిశగా తమ ప్రయాణానికి ప్రకటనలు నేస్తాలు కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఇంట్లో పనంతా నెత్తినేసుకునేలా చూపడాన్ని నవ యువ వధువులు అంగీకరించడం లేదు. అలాగే మహిళా దినోత్సవం రోజున ఇచ్చే ప్రకటనల్లో... ఎన్నో కష్టాల తర్వాత మహిళలు విజేతలు అయినట్టుగా చూపడం కూడా ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ పరిశోధన ఫలితాల అనంతరం ప్రకటనల్లో మహిళల పాత్ర మెరుగుదలకు గాను అస్కీ పలు ప్రతిపాదనలు చేసింది. ఈ అధ్యయనం కోసం జాతీయ, ప్రాంతీయ ప్రకటనదారులు, ఏజెన్సీ, విధాన నిర్ణేతలు, న్యాయవాదులు .. ఇలా అందరు నిపుణులు సంప్రదించారు. ‘ప్రకటనలలో మహిళలను హానికరమైన మూసపద్ధతుల్లో చూపడం వల్ల యువతుల మానసిక స్థితిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, వీటి వల్ల వారు సమాజంలో తమ విలువను ఏ విధంగా చూస్తారు’ అనే అంశాన్ని ఈ స్టడీ వెలుగులోకి తీసుకువచ్చింది. ఇటీవల ఒక పాల ఆధారిత ఉత్పత్తి కంపెనీ తన యానివర్సరీ వేడుకల్లో భాగంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో భార్య, అమ్మ, అత్త, అమ్మమ్మ స్థానంలో ఉన్న ఆడవాళ్లందరూ మగవాళ్లకు రుచికరమైన వంటలు చేసి పెట్టేవారిగానే చూపారన్న అభియోగాలను సోషల్‌మీడియా వేదికగా ఎదుర్కొంటోంది. -
ఆన్లైన్ ట్రేడింగ్: మోసాల నుంచి తప్పించుకోండి ఇలా..
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను స్క్రోల్ చేస్తున్నప్పుడు అనేక ప్రకటనలు పాప్ అప్ అవుతూ ఉంటాయి. కానీ, అవి ఎలాంటి రిజిస్టర్ కాని వాణిజ్య పోర్టల్స్. ఎవరైనా నమ్మి వీటిలో మెంబర్స్‌గా చేరితే, అధిక మొత్తంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. గృహిణులను లక్ష్యం చేసుకునే ఈ మోసాలు జరుగుతుంటాయి. ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు కోసం చూస్తున్న వ్యక్తులను మోసం చేయడానికి స్కామర్లు కొత్తమార్గాలను ఎంచుకుంటుంటారు. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తప్పక తెలిసుండాలి. అప్పుడే మోసాల బారిన పడకుండా ఉండగలం. ఇంటర్నెట్ ఆధారిత సమాచారం రోజు రోజుకూ పెరుగుతున్న ఈ కాలంలో ఎక్కువ మంది వ్యక్తులు తమ పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవడానికి ఆన్లైన్, సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నారు. ఎందుకంటే ప్రతిదీ ఫింగర్ టిప్స్ మీద లభిస్తుండటమే కారణం. అందుకే, స్కామర్లు కూడా ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల కోసం చూస్తున్న వ్యక్తులను మోసం చేయడానికి వేగవంతంగా కొత్త మార్గాలను అమలు చేస్తుంటారు. ► ఫ్యాన్సీ ప్రకటనలు చాలావరకు ఆన్లైన్ ప్రకటనలన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ల ద్వారా సమాచారం కోసం స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు అనేక ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. అవి అలా కుప్పలు తెప్పలుగా ఆన్‌లైన్‌లోకి రావడం కూడా బ్రోకరేజీ రహితంగా ఉండటం, సులభమైన వాణిజ్య పోర్టల్, తక్షణ పరిష్కారాలు ఉండటం వల్లనే. వీటిలో చాలా ఏజెన్సీలు రిజిస్టర్ చేసి ఉండవు. కానీ ప్రముఖ అధికారిక కార్పొరేట్ ట్రేడింగ్ కంపెనీల కంటే మరింత శక్తిమంతమైన ఫ్యాన్సీ ప్రకటనలను ఉంచుతుంటారు. స్కామర్లు ఆకర్షణీయంగా ఉన్న ప్రకటనలను ఎర వేసి ఈ బోగస్ యాప్‌లు, వెబ్సైట్లలో తమ వివరాలతో రిజిస్టర్ చేసుకున్న వారికి మొదట్లో కొంత మొత్తంలో డబ్బులు జమ చేస్తుంటారు. ఈ విధానం ద్వారా డబ్బు సంపాదించినట్లు చెప్పుకునే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వీరు అనుసరిస్తారు. పాయింట్లకు బదులుగా వారు యాప్ వాలెట్లో డబ్బును డిపాజిట్ చేయమని అడుగుతారు, అది తర్వాత ట్రేడింగ్ కోసం ఉపయోగిస్తారు. మోసగాళ్లు ఉపయోగించే కొన్ని పథకాలు ► పోంజీ పథకం ఇది కొత్త పెట్టుబడిదారుల నుండి సేకరించిన డబ్బుతో చేసే మోసం. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులకు కొంత మొత్తం చెల్లిస్తూ వారి ద్వారా మరిన్ని పెట్టుబడులను రాబట్టడం. ► పంప్, డంప్ స్కీమ్ ఇది ఒక పెట్టుబడి మోసం. ఇక్కడ సలహాదారులు పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించేలా సమాచారాన్ని అందించి, షేర్ల ధరను బంప్ చేయడానికి (పెంచడానికి) ప్రయత్నిస్తారు. అప్పుడు ఈ పెట్టుబడిదారులు సలహాదారులను నమ్మి తమ షేర్లను (అవి మంచి విలువ కలిగినప్పుడు) అమ్మేస్తారు. ► యాప్ ఆధారిత స్కీమ్‌లు పెట్టుబడిదారులకు మోసగాళ్లు తరచు వాలెట్ బ్యాలెన్స్‌ల నకిలీ చిత్రాలను చూపుతూ ఫిషింగ్ ఇ–మెయిల్స్‌ను పంపుతారు. సాధారణంగా క్రిప్టో కరెన్సీలు స్టాక్‌లు లేదా ఈ కామర్స్ ఉత్పత్తులు.. వీటిలో భాగంగా ఉంటాయి. ► తప్పుదారి పట్టించడానికి.. పెట్టుబడి పోకడలు, పరిశోధన స్టాక్‌లపై సమాచారాన్ని సేకరించడానికి, ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా వేగవంతంగా ఆదాయ అవకాశాలను చర్చించడానికి పెట్టుబడిదారులు ఫేస్బుక్, ట్విటర్, టీమ్ వ్యూవర్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తారు. స్కామర్లు నకిలీ సిఫారసులు చేస్తారు. అయాచిత పెట్టుబడి చిట్కాలు ఇస్తారు. వీటిలో నకిలీ గుర్తింపు లేదా తప్పుదారి పట్టించే సమాచారం ద్వారా పెట్టుబడిదారులను ఒప్పించే కొన్ని పద్ధతులు ఉంటాయి. ► పెట్టుబడిని ఎరగా వేస్తారు చాలా మంది పెట్టుబడిదారులు మొదట్లో సంస్థ నుండి కొంత రాబడిని పొందుతారు. దీంతో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ విజయవంతమైందని స్కామర్లు అనుకుంటారు. స్కామర్లు ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి శిష్యుడిని లేదా స్నేహితుడిని పరిచయం చేయడానికి మరింత ప్రోత్సహిస్తారు. డబ్బులు వస్తాయి కదా అని తమకు తెలిసినవారికి సదరు యాప్ లేదా వెబ్సైట్ వివరాలు ఇచ్చి వారిని కూడా చేరమని అంటారు. అయితే, చివరికి రిటర్న్‌లు ఆగిపోతాయి, కస్టమర్ ఖాతా సస్పెండ్ చేయబడుతుంది. డబ్బు వాలెట్లో ఇరుక్కుపోయి ఉంటుంది. సంస్థతో తదుపరి ఎలాంటి పరిచయం ఉండకపోవడంతో తాము పెట్టిన పెట్టుబడిని ఎలా పొందాలో తెలియక చాలా ఇబ్బంది పడతారు. ► అవకాశాల కోసం 7 రకాల వలలు దశ 1: ముందుగా బాధితులను వాట్సాప్ / టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరమని అభ్యర్థిస్తారు. దశ 2: లింక్‌ల ద్వారా యాప్‌లను డౌన్లోడ్ చేయమని అడుగుతారు. ఈ కొత్త సభ్యులందరికీ మొదట్లో జాయినింగ్ బోనస్ లభిస్తుంది. అయితే అది వారి వాలెట్లో మాత్రమే కనిపిస్తుంది. దశ 3: ట్రేడింగ్ జరుగుతుంది (బాధితులు విధులు నిర్వర్తించమని అడుగుతారు), అంటే, షేర్ల అమ్మకం/కొనుగోలు, లేదా కొన్నిసార్లు బాధితులు ఇ–కామర్స్ ఉత్పత్తులను కొనుగోలు చేయమని లేదా విక్రయించమని అడుగుతారు. దశ 4: బాధితులను సిస్టమ్‌కి కొత్త వ్యక్తులను పరిచయం చేయమని అడుగుతారు. ఇది నిజమని, తమకూ కొంత పెట్టుబడి చేరుతుందన్న ఆశతో మంచి పార్టీలను పరిచయం చేస్తారు. అలా పరిచయం చేసిన వ్యక్తి ద్వారా స్కామర్లు వారి వాలెట్‌కి డబ్బు చేరేలా చేస్తారు. దశ 5: చేసిన పనుల ఆధారంగా వాలెట్ డబ్బును కూడగట్టుకుంటుంది. దశ 6: బాధితుడు వారి వాలెట్ల నుండి తమ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు వీలుపడదు. ఒక్కోసారి వీలున్నా ఆదాయపు పన్ను, ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ రుసుము మొదలైనవి చెల్లించాల్సి ఉంటుంది. దశ 7: కోరిన ఫీజు చెల్లించిన తర్వాత, యాప్‌లు పని చేయవు. అవి ఏదో ఒక సాంకేతిక లోపాన్ని చూపుతాయి. కస్టమర్ సేవను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలూ ఫలించవు. మోసానికి మార్గాలు ► స్కామర్లు తాము విజయవంతమైన వ్యాపారులుగా, గ్యారెంటీ రిటర్న్ ఇస్తున్నట్టుగా, ట్రేడింగ్ సలహాలను అందిస్తున్నట్లు క్లెయిమ్ చేసుకుంటారు ∙ఇందుకోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన ఫోనీ టెస్టిమోనియల్ యూట్యూబ్ వీడియోలను ఉపయోగిస్తారు ∙‘పంప్ అండ్ డంప్‘ కార్యకలాపాలను నిరోధించడానికి ట్విట్టర్, ఫేస్బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు ∙నకిలీ సమాచారంతో ఆన్లైన్ పెట్టుబడి చిట్కాలు, నకిలీ ఎండార్స్మెంట్లను పంపుతుంటారు ∙స్టాక్ సిఫార్సులు లేదా పెట్టుబడి సలహాలకు బదులుగా సబ్స్క్రిప్షన్ రుసుమును సేకరించేందుకు ఉద్దేశించిన స్టాక్ పోర్ట్ ఫోలియో స్క్రీన్షాట్లను ప్రదర్శిస్తుంది ∙పెట్టుబడిదారులను టెక్నికల్ అనలిస్ట్‌లు లేదా ట్రేడింగ్ నిపుణులను చేస్తానని నమ్మబలికి స్కామర్లు వర్క్‌షాప్‌ల కోసం రిజిస్ట్రేషన్ ఫీజులను తీసుకుంటారు కానీ వారికి హోస్ట్ చేయరు. పెట్టుబడులకు డేంజర్ సిగ్నల్స్ బాధితుల ఆశను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన విభిన్న పద్ధతులతో మోసగాళ్లు వారి లక్ష్యాన్ని ఛేదిస్తారు. అలా కాకుండా మనల్ని మనం కాపాడుకోవా లంటే.. ► అసాధారణంగా అధిక హామీతో కూడిన రాబడిని వాగ్దానం చేస్తారు, గమనించాలి. ► అధిక ప్రారంభ పెట్టుబడిని అభ్యర్థిస్తారు. ► సంక్లిష్టమైన, నిలకడలేని వ్యాపార నమూనా ఉంటుంది. ► నష్టాలను తిరిగి చెల్లిస్తామని వాగ్దానం చేస్తారు. ► వెంటనే డబ్బు పెట్టుబడిగా పెట్టమని ఒత్తిడి చేయచ్చు. ► యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్లలో లిస్ట్‌లో లేని యాప్‌లలో పెట్టుబడి పెట్టమని కోరతారు. ► అధిక రాబడిని పొందినట్లు పేర్కొంటూ సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మద్దతును కోరుతారు. ► స్కామర్ల కార్యాలయాలు మన దేశం లోపల ఉన్నాయా, వెబ్సైట్, యాప్‌లలో ఉండే చిరునామాలను చూపుతున్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
డబుల్ మీనింగ్ యాడ్స్.. ఎట్టకేలకు క్షమాపణలు!
ఈ మధ్యకాలంలో ఇంతలా ఏ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లు ఇంతగా వివాదాస్పదం అయ్యి ఉండలేదేమో!. గుజరాత్‌కు చెందిన ప్రముఖ డియోడ్రంట్ బ్రాండ్ లేయర్స్.. దుమారం రేపిన తన ‘షాట్’ యాడ్స్‌పై ఎట్టకేలకు క్షమాపణలు తెలిపింది. క్రియేటివిటీ పేరిట రూపొందించిన రెండు యాడ్స్ కూడా వివాదాస్పదం కావడం తెలిసే ఉంటుంది. మహిళలను అగౌరవపర్చడంతో పాటు అత్యాచార సంప్రదాయాల్ని ప్రొత్సహించేలా ఉన్నాయంటూ ఆ రెండు ‘షాట్’ యాడ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మహిళా కమిషన్‌తో పాటు ఇంటర్నెట్లోనూ పలువురు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కొరడా ఝులిపించిన కేంద్రం.. ఆ యాడ్స్‌ను తొలగించాలంటూ ట్విటర్, యూట్యూబ్‌లను ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం ట్విటర్లో లేయర్స్ షాట్ ఒక ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగతంగా, వర్గాలవారీగా ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించాలని వేడుకుంటున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది సదరు కంపెనీ. అంతేకాదు అన్ని ఫ్లాట్‌ఫామ్స్ నుంచి ఆ యాడ్లను తొలగిస్తున్నట్లు, మీడియా పార్ట్నర్స్కు కూడా ఆ యాడ్స్ టెలికాస్ట్‌ను ఆపేయాలని కోరినట్లు ప్రకటనలో తెలిపింది. pic.twitter.com/6LfpVcBXuV — Layer'r Shot (@layerr_shot) June 6, 2022 ఇదిలా ఉంటే.. కేంద్రం కూడా ఇలాంటి యాడ్స్‌ను తప్పనిసరి అనుమతులు మంజూరు అయిన తర్వాతే టెలికాస్ట్ చేయాలంటూ లేయర్స్ షాట్‌కు అక్షింతలు వేసింది. చదవండి: ఇదెక్కడి ‘షాట్’.. ఇంతకీ యాడ్స్‌లో ఏముందంటే.. -
ఇదెక్కడి ‘షాట్’.. బాడీ స్ప్రే యాడ్స్‌పై దుమారం
వైరల్.. వివాదం: ప్రతీ అంశం ‘సెన్సిటివ్’ అయిపోయిన ఈరోజుల్లో.. జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. లేకుంటే వివాదంగా మారి.. విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తోంది. తాజాగా క్రియేటివిటీ పేరిట ఓ బాడీ స్ప్రే కంపెనీ రూపొందించిన యాడ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్‌కు చెందిన పర్ఫ్యూమ్, డియోడ్రంట్, స్ప్రే తయారీదారు కంపెనీ లేయర్స్.. తాజాగా రెండు యాడ్స్‌ను రూపొందించింది. ఈ రెండూ కూడా డబుల్ మీనింగ్ ఉద్దేశ్యంతో.. యువతులను అగౌరవపరిచేలా, పైగా అత్యాచార సంస్కృతిని పెంపొందించేలా ఉందనేది చాలామంది వాదన. షాపింగ్‌మాల్‌లో కొందరు స్నేహితులు-ఓ యువతి, గదిలో ఉన్న ఓ యువజంట- అతని స్నేహితుల మధ్య జరిగే సంభాషణల ఆధారంగా ఈ యాడ్స్‌ను రూపొందించారు. ఈ రెండు యాడ్స్ మెయిన్ థీమ్ కూడా ‘షాట్’ను ప్రమోట్ చేసేదే!. అయితే ప్రమోషన్ సంగతి ఎలా ఉన్నా.. దీని వెనుక డర్టీ ఆలోచనతో ఉందంటూ మండిపడుతున్నారు చాలామంది. ఈ యాడ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి. Can't find the ad online but here it is, apparently being played during the match. I didn't see it till @hitchwriter showed it to me Who are the people making these ads really? pic.twitter.com/zhXEaMqR3Q — Permanently Exhausted Pigeon (@monikamanchanda) June 3, 2022 How does this kind of ads get approved, sick and outright disgusting. Is @layerr_shot full of perverts? Second ad with such disgusting content from Shot.@monikamanchanda pic.twitter.com/hMEaJZcdmR — Rishita💝 (@RishitaPrusty_) June 3, 2022 ఈ వాణిజ్య ప్రకటన చిన్నవిషయం మాత్రమే కాదు, చాలా మంది మహిళలు రోజూ ఎదుర్కొనే భయాన్ని కూడా తమ స్వలాభం కోసం వాడుకుంటోందన్నది పలువురి వాదన. ఇంగ్లండ్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఈ యాడ్స్‌ను టెలికాస్ట్ చేసింది. నోటీసులు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ASCI).. సోషల్ మీడియాలో ఈ రెండు షాట్ యాడ్స్ దుమారంపై స్పందించింది. ఆ యాడ్స్‌ను తొలగించడంతో పాటు దర్యాప్తునకు ఆదేశించినట్లు ట్విటర్లో తెలిపింది. లేయర్స్ షాట్ డియోడ్రంట్ బ్రాండ్.. గుజరాత్ అహ్మదాబాద్ అడ్జావిస్ వెంచర్ లిమిటెడ్‌కు చెందింది. దేవేంద్ర ఎన్ పటేల్ దీనిని స్థాపించినట్లు కంపెనీ ప్రొఫైల్‌లో ఉంది. -
13 ఏళ్ల గ్యాప్ తర్వాత అందులో నటించనున్న మెగాస్టార్
ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇటు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేయడానికి సిద్దమైనట్టు సమాచారం. చిరంజీవికి కమర్షియల్ యాడ్స్‌లో నటించడం కొత్తేమీ కాదు. గతంలో థమ్స్ అప్, నవరత్న ఆయిల్ వంటి బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే చివరిగా 13 ఏళ్ల క్రితం మెగాస్టార్ కమర్షియల్ యాడ్‌లో కనిపించారు. ఇక ఆ తర్వాత ఆయన మరే యాడ్లోనూ నటించలేదు. అయితే తాజా సమాచారం మేరకు చిరంజీవి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే చిరంజీవి నటించిన ‘ఆచార్య’ షూటింగ్ కంప్లీటైన విషయం తెలిసిందే. రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ చిత్రంలో తొలిసారిగా పూర్తి స్థాయిలో రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు చిరు. -
గూగుల్, వాట్సాప్‌తో ప్రైవసీకి భంగం
న్యూఢిల్లీ: సెర్చి ఇంజిన్ గూగుల్, సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్‌బుక్‌తో పాటు వాట్సాప్ మొదలైనవి తమ యూజర్లపై నిఘా పెడుతున్నాయని, వారి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ అవాస్ట్ సీఈవో విన్సెంట్ స్టెక్లర్ ఆరోపించారు. యూజర్ల ఇష్టాఇష్టాల గురించి తెలుసుకుని, వారికి వాణిజ్య ప్రకటనలు పంపిస్తుంటాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీకి మరింత ప్రాధాన్యం పెరుగుతోందని పేర్కొన్నారు.