ఈ మధ్యకాలంలో ఇంతలా ఏ కమర్షియల్ అడ్వర్‌టైజ్‌మెంట్‌లు ఇంతగా వివాదాస్పదం అయ్యి ఉండలేదేమో!. గుజరాత్‌కు చెందిన ప్రముఖ డియోడ్రంట్ బ్రాండ్ లేయర్స్.. దుమారం రేపిన తన ‘షాట్’ యాడ్స్‌పై ఎట్టకేలకు క్షమాపణలు తెలిపింది. క్రియేటివిటీ పేరిట రూపొందించిన రెండు యాడ్స్ కూడా వివాదాస్పదం కావడం తెలిసే ఉంటుంది.
మహిళలను అగౌరవపర్చడంతో పాటు అత్యాచార సంప్రదాయాల్ని ప్రొత్సహించేలా ఉన్నాయంటూ ఆ రెండు ‘షాట్’ యాడ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మహిళా కమిషన్‌తో పాటు ఇంటర్నెట్‌లోనూ పలువురు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కొరడా ఝులిపించిన కేంద్రం.. ఆ యాడ్స్‌ను తొలగించాలంటూ ట్విటర్, యూట్యూబ్‌లను ఆదేశించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం ట్విటర్‌లో లేయర్స్ షాట్ ఒక ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగతంగా, వర్గాలవారీగా ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించాలని వేడుకుంటున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది సదరు కంపెనీ. అంతేకాదు అన్ని ఫ్లాట్‌ఫామ్స్ నుంచి ఆ యాడ్‌లను తొలగిస్తున్నట్లు, మీడియా పార్ట్‌నర్స్‌కు కూడా ఆ యాడ్స్ టెలికాస్ట్‌ను ఆపేయాలని కోరినట్లు ప్రకటనలో తెలిపింది.
— Layer'r Shot (@layerr_shot) June 6, 2022
ఇదిలా ఉంటే.. కేంద్రం కూడా ఇలాంటి యాడ్స్‌ను తప్పనిసరి అనుమతులు మంజూరు అయిన తర్వాతే టెలికాస్ట్ చేయాలంటూ లేయర్స్ షాట్‌కు అక్షింతలు వేసింది.
Comments
Please login to add a commentAdd a comment