controversial ad
-
వివాదంలో జొమాటో యాడ్.. హృతిక్ రోషన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Hrithik Roshan Zomato Ad Get Angers Mahakaleshwar Temple Priests: బాలీవుడ్ హీరోలను చూస్తుంటే జాలి వేసే పరిస్థితి ఏర్పడింది. వాళ్లు ఏం ముట్టుకున్న, పట్టుకున్న పెద్ద వివాదమై కూర్చొంటుంది. ఇప్పటికే హిందీ హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు, దేవుళ్లపై నమ్మకం లేదు, బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఆ ట్రెండ్‌తో అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా', అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్', తాప్సీ 'దొబారా' కలెక్షన్లు రాక విలవిల్లాడాయి. విడుదలైన వాటిని పక్కన పెడితే రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాలు, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న చిత్రాలను సైతం బాయ్‌కాట్ అంటూ గొంతెత్తి అరుస్తున్నారు. ఈ చిత్రాల్లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ చిత్రం 'విక్రమ్-వేద' కూడా ఉంది. అయితే ఇప్పుడు హృతిక్ రోషన్ చేసిన పనితో ఈ బాయ్‌కాట్ ట్రెండ్ ఇంకా ఎక్కువ ప్రభావం చూపేలా ఉంది. ఇంతకీ హృతిక్ రోషన్ చేసిన పని ఏంటంటే? ప్రముఖ ఫుడ్ డెలీవరి యాప్ జొమాటో యాడ్‌లో నటించడమే. ఇటీవల జొమాటో ఫుడ్ డెలీవరి యాప్ హృతిక్ రోషన్‌తో ఒక యాడ్ షూట్ చేసి బయటకు వదిలింది. ఈ యాడ్‌లో హృతిక్ చెప్పిన డైలాగ్‌లు, చూపించిన పేర్లు వారి మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని సదరు మతస్థులు గగ్గోలు పెడుతున్నారు. చదవండి: ఒక్కరోజే 18 సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడో తెలుసా? ఈ యాడ్‌లో కమాండో అయిన ఆకలి వేసి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాడు. మిగతా కమాండోలు 'ఈ ఆర్డర్ ఎవరిచ్చారు?' అని అడగ్గా.. 'నేనే. నాకు ఆకలి వేసింది. మనం ఉజ్జయినిలో ఉన్నాం. అందేకే మహాకాల్ నుంచి తాలీ ఆర్డర్ చేశా' అని హృతిక్ రోషన్ అందరికీ చెబుతున్నట్లు ఉంటుంది. ఈ సంభాషణపై ఉజ్జయిని మహాకాళేశ్వరం ఆలయానికి చెందిన పూజారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఆలయం నుంచి భక్తులకు, యాత్రికులకు తాలీ అనే పేరుతో ప్రసాదాన్ని అందిస్తారు. అయితే అందులో మహాకాళేశ్వరం ఆలయాన్ని కాకుండా మహాకాల్ రెస్టారెంట్‌ను చూపించలేదు. చదవండి: తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం మహాకాల్ అనేది పరమ శివునికి మరో పేరు. హిందువులు పూజించే పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వరం ఆలయం అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. అలా ఎంతో పవిత్రంగా భావించే తాలీ ప్రసాదాన్ని ఫుడ్‌గా, అలాగే మహాకాళేశ్వరం ఆలయాన్ని రెస్టారెంట్‌గా పేర్కొని పంపిణీ చేసినట్లుగా చిత్రీకరించడం పట్ల ఆలయ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 'హృతిక్ రోషన్ క్షమాపణలు చెప్పాలి' అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు 'బాయ్‌కాట్ జొమాటో' అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పలువురు నెటిజన్లు సైతం ఈ యాడ్‌పై అసహనం వ్యక్తం చేశారు. వారికి (బాలీవుడ్ వాళ్లకు) సనాతన ధర్మాలపై గౌరవం లేదంటూ ఒకరు అంటే, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చిత్రీకరించిన ఆ ప్రకటనపై కఠిన చర్యలు తీసుకోవాలని మరొకరు డిమాండ్ చేశారు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు ఈ గొడవపై జొమాటో తాజాగా స్పందించింది. 'ఇదంతా లోకల్ రెస్టారెంట్లను ప్రమోట్ చేసే పాన్ ఇండియా క్యాంపెయిన్‌లో భాగం. ఉజ్జయినిలో జొమాటోకు మహాకాల్ రెస్టారెంట్ నుంచి తరచూ అత్యధిక ఆర్డర్లు వస్తాయి. అలాగే అక్కడి మెనూలో తాలీ పేరుతో ఫుడ్ ఐటమ్ కూడా ఉంది. ఆ ఫుడ్‌ను ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటారు' అని ట్విటర్ హ్యాండిల్లో పేర్కొంది జొమాటో. ఇదంతా చూస్తుంటే పాపం హృతిక్ రోషన్ అనిపిస్తుంది. ఎరక్కపోయి ఇరుక్కున్న హృతిక్ రోషన్ సినిమాలపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. చదవండి: నా వల్లే భారతీయ రైల్వేస్‌కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్ Logically looking at the biased history of @deepigoyal's @zomato, none can negate that @iHrithik's ad trivializing Bhagwan #Mahakal was a deliberate attempt to demean Hindu Dharma thereby hurting Hindus' sentiments. O Hindus, its high time to resort to financially #BoycottZomato pic.twitter.com/BgbATbiKcZ — Sanatan Prabhat (@SanatanPrabhat) August 21, 2022 -
డబుల్ మీనింగ్ యాడ్స్.. ఎట్టకేలకు క్షమాపణలు!
ఈ మధ్యకాలంలో ఇంతలా ఏ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లు ఇంతగా వివాదాస్పదం అయ్యి ఉండలేదేమో!. గుజరాత్‌కు చెందిన ప్రముఖ డియోడ్రంట్ బ్రాండ్ లేయర్స్.. దుమారం రేపిన తన ‘షాట్’ యాడ్స్‌పై ఎట్టకేలకు క్షమాపణలు తెలిపింది. క్రియేటివిటీ పేరిట రూపొందించిన రెండు యాడ్స్ కూడా వివాదాస్పదం కావడం తెలిసే ఉంటుంది. మహిళలను అగౌరవపర్చడంతో పాటు అత్యాచార సంప్రదాయాల్ని ప్రొత్సహించేలా ఉన్నాయంటూ ఆ రెండు ‘షాట్’ యాడ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మహిళా కమిషన్‌తో పాటు ఇంటర్నెట్లోనూ పలువురు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కొరడా ఝులిపించిన కేంద్రం.. ఆ యాడ్స్‌ను తొలగించాలంటూ ట్విటర్, యూట్యూబ్‌లను ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం ట్విటర్లో లేయర్స్ షాట్ ఒక ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగతంగా, వర్గాలవారీగా ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించాలని వేడుకుంటున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది సదరు కంపెనీ. అంతేకాదు అన్ని ఫ్లాట్‌ఫామ్స్ నుంచి ఆ యాడ్లను తొలగిస్తున్నట్లు, మీడియా పార్ట్నర్స్కు కూడా ఆ యాడ్స్ టెలికాస్ట్‌ను ఆపేయాలని కోరినట్లు ప్రకటనలో తెలిపింది. pic.twitter.com/6LfpVcBXuV — Layer'r Shot (@layerr_shot) June 6, 2022 ఇదిలా ఉంటే.. కేంద్రం కూడా ఇలాంటి యాడ్స్‌ను తప్పనిసరి అనుమతులు మంజూరు అయిన తర్వాతే టెలికాస్ట్ చేయాలంటూ లేయర్స్ షాట్‌కు అక్షింతలు వేసింది. చదవండి: ఇదెక్కడి ‘షాట్’.. ఇంతకీ యాడ్స్‌లో ఏముందంటే.. -
ఇదెక్కడి ‘షాట్’.. బాడీ స్ప్రే యాడ్స్‌పై దుమారం
వైరల్.. వివాదం: ప్రతీ అంశం ‘సెన్సిటివ్’ అయిపోయిన ఈరోజుల్లో.. జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. లేకుంటే వివాదంగా మారి.. విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తోంది. తాజాగా క్రియేటివిటీ పేరిట ఓ బాడీ స్ప్రే కంపెనీ రూపొందించిన యాడ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్‌కు చెందిన పర్ఫ్యూమ్, డియోడ్రంట్, స్ప్రే తయారీదారు కంపెనీ లేయర్స్.. తాజాగా రెండు యాడ్స్‌ను రూపొందించింది. ఈ రెండూ కూడా డబుల్ మీనింగ్ ఉద్దేశ్యంతో.. యువతులను అగౌరవపరిచేలా, పైగా అత్యాచార సంస్కృతిని పెంపొందించేలా ఉందనేది చాలామంది వాదన. షాపింగ్‌మాల్‌లో కొందరు స్నేహితులు-ఓ యువతి, గదిలో ఉన్న ఓ యువజంట- అతని స్నేహితుల మధ్య జరిగే సంభాషణల ఆధారంగా ఈ యాడ్స్‌ను రూపొందించారు. ఈ రెండు యాడ్స్ మెయిన్ థీమ్ కూడా ‘షాట్’ను ప్రమోట్ చేసేదే!. అయితే ప్రమోషన్ సంగతి ఎలా ఉన్నా.. దీని వెనుక డర్టీ ఆలోచనతో ఉందంటూ మండిపడుతున్నారు చాలామంది. ఈ యాడ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి. Can't find the ad online but here it is, apparently being played during the match. I didn't see it till @hitchwriter showed it to me Who are the people making these ads really? pic.twitter.com/zhXEaMqR3Q — Permanently Exhausted Pigeon (@monikamanchanda) June 3, 2022 How does this kind of ads get approved, sick and outright disgusting. Is @layerr_shot full of perverts? Second ad with such disgusting content from Shot.@monikamanchanda pic.twitter.com/hMEaJZcdmR — Rishita💝 (@RishitaPrusty_) June 3, 2022 ఈ వాణిజ్య ప్రకటన చిన్నవిషయం మాత్రమే కాదు, చాలా మంది మహిళలు రోజూ ఎదుర్కొనే భయాన్ని కూడా తమ స్వలాభం కోసం వాడుకుంటోందన్నది పలువురి వాదన. ఇంగ్లండ్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఈ యాడ్స్‌ను టెలికాస్ట్ చేసింది. నోటీసులు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ASCI).. సోషల్ మీడియాలో ఈ రెండు షాట్ యాడ్స్ దుమారంపై స్పందించింది. ఆ యాడ్స్‌ను తొలగించడంతో పాటు దర్యాప్తునకు ఆదేశించినట్లు ట్విటర్లో తెలిపింది. లేయర్స్ షాట్ డియోడ్రంట్ బ్రాండ్.. గుజరాత్ అహ్మదాబాద్ అడ్జావిస్ వెంచర్ లిమిటెడ్‌కు చెందింది. దేవేంద్ర ఎన్ పటేల్ దీనిని స్థాపించినట్లు కంపెనీ ప్రొఫైల్‌లో ఉంది. -
ఆమిర్ ఖాన్ యాడ్‌పై తీవ్ర దుమారం
Boycott CEAT Trending in Twitter: సినిమాలు, వెబ్ సిరీస్‌లను వివాదాస్పద కాన్సెప్ట్‌లు, సీక్వెన్స్‌లతో తెరకెక్కించడమే కాదు.. అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్ల రచ్చ ద్వారానూ వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్. ముఖ్యంగా సున్నితమైన అంశాల్ని టచ్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. ఈమధ్య వివాహ దుస్తులమ్మే ఓ బ్రాండ్ నటి అలియా భట్‌తో తీసిన ‘కన్యాదాన్’ అడ్వర్టైజ్మెంట్ తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ఆ వేడి చల్లారకముందే బాలీవుడ్ సీనియర్ హీరో ఆమిర్ ఖాన్ యాక్ట్ చేసిన ఓ యాడ్‌పై తీవ్ర దుమారం నడుస్తోంది. ఆమిర్ ఖాన్ నటించిన సీయట్ టైర్ల కంపెనీ యాడ్ ఒకటి ఈమధ్య రిలీజ్ అయ్యింది. ‘‘రోడ్లు ఉంది పటాసులు(టపాకులు) పేల్చడానికి కాదు’’ అంటూ తన ఎదురుగా ఉన్న జనాలకు క్లాస్ పీకుతూ.. సదరు టైర్ల యాడ్‌ను ప్రమోట్ చేశాడు. అయితే అమీర్ ఖాన్ ఈ యాడ్ చేయడం, పైగా తమ మతాన్ని కించపరిచేదిగా ఉందంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఆ అభ్యంతరాలు తారాస్థాయికి చేరగా.. సీయట్ను బాయ్‌కాట్ చేయాలంటూ Boycott_Hinduphobic_CEAT వేల ట్వీట్లు, రీట్వీట్లతో నింపేస్తున్నారు. ఈ యాడ్ చేసింనందుకు నటుడు ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని, యాడ్‌ను తొలగించాలని సీయట్ కంపెనీని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక కొందరైతే ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకాను ఇందులోకి తీసుకొస్తున్నారు. గతంలోనూ ఇలా సున్నితమైన అంశాలపై హర్ష గోయెంకా అనుచిత ట్వీట్లు వేశాడని, ఆ టైంలోనూ బాయ్‌కాట్ ఉద్యమం నడిచిందని కొందరు స్క్రీన్ షాట్లను రీట్వీట్లు చేస్తున్నారు. మతాన్ని, పండుగల్ని కించపరిచేలా సీయట్ కంపెనీ యాడ్స్ తీయాల్సిన అవసరం, అందులో ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ నటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు చాలామంది. Hello @CEATtyres The chairman of your parent company has such views on Hinduism and it's traditions We have many alternative tyre companies in India MRF, JK, Apollo So there won't be any problem for us if we #BoycottCEAT We need an unconditional apology from him ✌🏼 pic.twitter.com/Qr7UjGYDjC — Anish (@Aniiiiish) April 14, 2021 చదవండి: అండర్వేర్ యాడ్.. ఏం మెసేజ్ ఇద్దామని రష్మిక? -
మా కొబ్బరి నీళ్లు తాగితే.. ఓ మురికి యాడ్ వైరల్
బీజింగ్ : సెక్సీయెస్ట్ యాడ్లకు పెట్టింది పేరైన చైనా కంపెనీ కోకోనట్ మిల్క్ బ్రాండ్ కంపెనీ కోకోపామ్ మరోసారి వార్తల కెక్కింది. 2017లో కొబ్బరి నీళ్లు తాగితే అందమైన తెల్లని శరీరం మీ సొంతమంటూ ప్రకటన రూపొందించి వివాదాల్లో ఇరుక్కున్న సంస్థ తాజాగా మరో వివాదంలో వేలుపెట్టింది. ఈసారి మా కొబ్బరి నీళ్లు తాగితే బ్రెస్ట్ సైజ్ పెరిగిపోతుందంటూ అందమైన మోడల్స్‌తో ప్రకటనను మార్కెట్లో విడుదల చేసింది. ఇది తీవ్ర చర్చకు దారితీయడంతోపాటు చైనా సోషల్ మీడియాలో దుమారం రేగింది. వైబో యూజర్లు ఈ యాడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి నీళ్ల ప్రకటన నాకు వాంతి తెప్పిస్తోంది (కోకోనట్ మిల్క్ యాడ్ మేక్స్మి వామిట్) అనే హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ అవుతోంది. దీంతో కొబ్బరినీళ్లను అమ్మేందుకు ఇలాంటి ప్రచార వ్యూహాన్ని అనుసరిస్తుండటంతో చైనాలోని అధికారులు రంగంలోకి దిగారు. తప్పుడు ప్రకటనలపై దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు. మరోవైపు తమ ఉద్దేశం అది కాదంటూ సదరు కంపెనీ వివరణ ఇచ్చుకుంది. కాగా 1988లో తొలిసారిగా డ్రింక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది ఈ కంపెనీ. -
వివాదాస్పదమైన ‘విక్స్’ యాడ్
విక్స్‌ను ఉత్పత్తి చేస్తున్న ‘ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్’ సంస్థ రూపొందించిన ఓ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా వివాదాస్పదమైంది. సెక్స్ వర్కర్‌గా పనిచేస్తున్న తన స్నేహితురాలు ఎయిడ్స్‌తో చనిపోగా అనాథైన ఆమె ఆరేళ్ల కూతురును ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాడుతున్న ఓ హిజ్రా చేరదీయడం, ఆ పాపను ఆప్యాయంగా పెంచడమే యాడ్ ఇతివృత్తం. భారత్‌లో పిల్లలను దత్తత తీసుకునే హక్కు హిజ్రాలకు లేదు. సంప్రదాయబద్ధమైన కుటుంబాలకు విలువనిచ్చే భారతీయ సంస్కృతిలో హిజ్రాలను చూపించడం, వారి హక్కులను సమర్థించడం బాగోలేదని కొందరు విమర్శిస్తుండటంతో ఈ యాడ్ వివాదాస్పదమైంది. ఎన్నో కష్టనష్టాలకోర్చి అనాథైన ఓ పాపను హిజ్రా చేరదీయడం, వారిమధ్య నెలకొన్న మమతానుబంధాన్ని హృద్యంగా తీయడం తమను ఎంతో హత్తుకుందంటూ ఎక్కువ మంది యాడ్‌ను ప్రశంసిస్తున్నారు. హిజ్రా అయినా పాపను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో చెప్పడమే తమ ఉద్దేశమని, దాన్ని మనసుకు హత్తుకునేలా భిన్నంగా చెప్పడానికి ప్రయత్నించామని కంపెనీ వర్గాలు అంటున్నాయి. ‘టచ్ ఆఫ్ కేర్’ సిరీస్‌లో భాగంగా కంపెనీ ఈ యాడ్‌ను రూపొందించింది. ట్రాన్స్‌జెండర్ హక్కులకు సంబంధించి ఈ యాడ్ అద్భుతమైనదని కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ ట్విట్టర్లో స్పందించారు. ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్తలు కూడా ఈ యాడ్ పట్ల భిన్నంగా స్పందించారు. తాను ఒక సామాజిక కార్యకర్తగా ఏ విషయాన్నైనా ప్రజల దృక్పథం నుంచి చూస్తానని, ఈ యాడ్ వల్ల తమ కమ్యూనిటీకి ఏం లాభం చేకూరుతుందో తనకు అర్థం కావడం లేదని ట్రాన్స్జెండర్ల హక్కుల కార్యకర్త కల్కీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. 'సమాజంలో మాకు పౌరులుగా హక్కులున్నాయని చెప్పడం, తల్లులయ్యే హక్కు మాకూ ఉందని చెప్పడం వరకు నేను యాడ్‌ను సమర్థిస్తాను. కానీ సబ్జెక్ట్‌ను సంచలనం చేయడమే నాకు నచ్చలేదు' అని ఆమె అన్నారు. భారత్‌లో హిజ్రాలుగా పిలిచే ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ మూడు వేల సంవత్సరాల క్రితం నుంచే మనుగడలో ఉంది. భారత ఉప ఖండాన్ని పాలించిన మొగల్ రాజులు, హిజ్రాలకు అతీంద్రీయ శక్తులు ఉన్నాయని నమ్మేవాళ్లు. వారిని రాజ్యరక్షకులుగా గౌరవించేవారు. సలహాదారులుగా కూడా నియమించుకునేవారు. బ్రిటిష్ పాలకుల రాకతో హిజ్రాలకున్న ప్రాధాన్యం పూర్తి కాలగర్భంలో కలిసిపోయింది.