law violation
-
క్షమించే ఉదారగుణం మాకు లేదు
న్యూఢిల్లీ: తమ సంస్థ ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల విషయంలో మరోసారి ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడబోమంటూ యోగా గురు రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ తాజాగా సమరి్పంచిన బేషరతు క్షమాపణల అఫిడవిట్లపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తన అసంతృప్తిని వ్యక్తంచేసింది. మీ క్షమాపణలను అంగీకరించే ఉదారగుణం మాకు లేదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశంలో నాలుగైదేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ ఉద్దేశపూర్వకంగా కళ్లు మూసుకుందని కోర్టు ఆగ్రహంవ్యక్తంచేసింది. తమ క్లయింట్లు ఇద్దరూ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నారని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ చెబుతుండగా.. ‘ ఆ సారీలను మేం అంగీకరించట్లేము. కోర్టు ఆదేశాలను పాటిస్తామంటూ మీ క్లయింట్లు ఇచి్చన పాత అఫిడవిట్లకు మీ క్లయింట్లే ఏమాత్రం విలువ ఇవ్వనప్పుడు తాజా అఫిడవిట్లకు మేం మాత్రం ఎందుకు విలువ ఇవ్వాలి?. మేం కూడా అలాగే చేయొచ్చుకదా? అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. విదేశీప్రయాణం పేరు చెప్పి రామ్‌దేవ్, బాలకృష్ణ ఉద్దేశపూర్వకంగా కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకున్నారని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీనీ కోర్టు తలంటింది. జిల్లా ఆయుర్వేదిక్, యునానీ అధికారిని ఎందుకు సస్పెండ్ చేయకూడదని అథారిటీ జాయింట్ డైరెక్టర్‌ను ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 16వ తేదీకి వాయిదావేసింది. -
Marriage law violation: ఇమ్రాన్, ఆయన భార్యకు ఏడేళ్ల జైలు
ఇస్లామాబాద్: అతి త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(71)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామ్ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్న ఆరోపణలపై ఇమ్రాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీ(49)కి ఓ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు పెళ్లిళ్ల మధ్య విరామం పాటించాలనే నిబంధనకు విరుద్ధంగా బుష్రా బీబీ ఇమ్రాన్ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకుందని ఆరోపిస్తూ ఆమె మాజీ భర్త ఖవార్ ఫరీద్ మనేకా కేసు పెట్టారు. వివాహానికి ముందు నుంచే వారిద్దరి మధ్య అక్రమ సంబంధం నడిచిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ కేసుపై ప్రస్తుతం ఇమ్రాన్, బుష్రా బీబీ ఉన్న అడియాలా జైలులోనే 14 గంటలపాటు విచారణ జరిపిన సీనియర్ సివిల్ జడ్జి ఖుద్రతుల్లా.. ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ శనివారం తీర్పు వెలువరించినట్లు జియో న్యూస్ పేర్కొంది. తోషఖానా కేసులో 14 ఏళ్లు, రహస్య పత్రాల కేసులో 10 ఏళ్ల జైలు శిక్షను ఇమ్రాన్‌కు విధిస్తూ ఇటీవలే కోర్టులు తీర్పిచి్చన విషయం తెలిసిందే. ఫెయిత్ హీలర్గా పేరున్న బుష్రాబీబీ వద్దకు తరచూ ఇమ్రాన్ వెళుతుండేవారు. అలా మొదలైన వారిద్దరి మధ్య పరిచయం పరిణయానికి దారి తీసింది. 2018 జనవరి ఒకటో తేదీన ఇమ్రాన్, బుష్రాబీబీల వివాహం ఘనంగా జరిగింది. -
బీజేపీ జాతీయ కార్యదర్శికి గాయాలు
కోల్ కతా: పోలీసులతో జరిగిన ఘర్షణలో బీజేపీ నాయకులు గాయపడిన ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు సమీపంలో గురువారం చోటు చేసుకుంది. 'చట్ట అతిక్రమణ' కార్యక్రమంలో భాగంగా నార్త్ 24 పరగణ జిల్లాలోని బరసాత్ లో ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ నాథ్ సింగ్ సహా 15 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తోపులాటలో 10 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. పోలీసులు తమపై లాఠిచార్జి చేశారని సిద్ధార్థ నాథ్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం క్షీణించిందని విమర్శించారు. రాజకీయ నేతలను, కార్యకర్తలను నేరస్తులుగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. తీవ్రవాదులు, నేరస్తులను తృణమూల్ కాంగ్రెస్ అల్లుళ్ల మాదిరిగా చూస్తోందని మండిపడ్డారు. లాఠిచార్జి చేయలేదని, తోపులాటలో బీజేపీ నాయకులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, దుష్పరిపాలన సాగుతోందని ఆరోపిస్తూ బీజేపీ 'చట్ట అతిక్రమణ' ఆందోళనకు దిగింది.