
ఇస్లామాబాద్: అతి త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(71)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామ్ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్న ఆరోపణలపై ఇమ్రాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీ(49)కి ఓ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు పెళ్లిళ్ల మధ్య విరామం పాటించాలనే నిబంధనకు విరుద్ధంగా బుష్రా బీబీ ఇమ్రాన్ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకుందని ఆరోపిస్తూ ఆమె మాజీ భర్త ఖవార్ ఫరీద్ మనేకా కేసు పెట్టారు.
వివాహానికి ముందు నుంచే వారిద్దరి మధ్య అక్రమ సంబంధం నడిచిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ కేసుపై ప్రస్తుతం ఇమ్రాన్, బుష్రా బీబీ ఉన్న అడియాలా జైలులోనే 14 గంటలపాటు విచారణ జరిపిన సీనియర్ సివిల్ జడ్జి ఖుద్రతుల్లా.. ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ శనివారం తీర్పు వెలువరించినట్లు జియో న్యూస్ పేర్కొంది.
తోషఖానా కేసులో 14 ఏళ్లు, రహస్య పత్రాల కేసులో 10 ఏళ్ల జైలు శిక్షను ఇమ్రాన్‌కు విధిస్తూ ఇటీవలే కోర్టులు తీర్పిచి్చన విషయం తెలిసిందే. ఫెయిత్ హీలర్‌గా పేరున్న బుష్రాబీబీ వద్దకు తరచూ ఇమ్రాన్ వెళుతుండేవారు. అలా మొదలైన వారిద్దరి మధ్య పరిచయం పరిణయానికి దారి తీసింది. 2018 జనవరి ఒకటో తేదీన ఇమ్రాన్, బుష్రాబీబీల వివాహం ఘనంగా జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment