bushra
-
పెళ్లి కేసులో ఇమ్రాన్‌కు ఊరట
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట. ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకంగా పెళ్లాడారన్న కేసులో ఇమ్రాన్ (71), బుష్రా బీబీ (49) దంపతులను న్యాయస్థానం నిర్దోషులుగా తేలి్చంది. వారిపై మోపిన అభియోగాలను ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు శనివారం తోసిపుచి్చంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను కొట్టేసింది. మత ప్రబోధకురాలైన బుష్రా తన మొదటి భర్త ఖవర్ ఫరీద్ మనేకాతో 28 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకుని ఇమ్రాన్‌ను పెళ్లా డారు. అయితే విడాకులకు, పునర్వివాహానికి మధ్య ముస్లిం మహిళ విధి గా పాటించాల్సిన 4 నెలల గడువు (ఇద్దత్)ను ఆమె ఉల్లంఘించిందంటూ ఫరీద్ కేసు పెట్టారు. ఈ కేసులో గత ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికల ముంగిట ఇమ్రాన్ దంపతులకు ఏడేళ్ల శిక్ష పడింది. ఇమ్రాన్‌కు జైలు శిక్ష పడ్డ మూడు కేసుల్లో ఇదొకటి. తోషా ఖానా కేసులో జైలు శిక్షను కోర్టు ని లుపుదల చేయగా, సిఫర్ కేసుల్లో నిర్దోíÙగా బయటపడ్డారు. దాంతో గత ఆగస్టు నుంచీ జైల్లోనే ఉన్న ఇమ్రాన్ విడుదలవుతారని భావించారు. కానీ తాజా తీర్పు వెలువడ్డ కాసేపటికే అల్లర్ల కేసులో ఆయన అరెస్టుకు ఉగ్ర వాద వ్యతిరేక కోర్టు అనుమతినిచ్చింది. దాంతో ఆయన జైల్లోనే ఉండనున్నారు. -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ భార్యపై విష ప్రయోగం?
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్కడి ఆర్మీ చీఫ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఒక కేసు విచారణకు హాజరైన ఆయన మాట్లాడుతూ గృహనిర్బంధంలోవున్న తన భార్య బుష్రా బీబీపై విషప్రయోగం జరిగిందని ఆరోపించారు. తన భార్యకు ఎటువంటి హాని జరిగినా అందుకు ఆర్మీ చీఫ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అడియాలా జైలులో 190 మిలియన్ పౌండ్ల తోషాఖానా అవినీతి కేసు విచారణ సందర్భంగా పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐఐ) నేత ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడుతూ తన భార్య బుష్రాకు విషమిచ్చి చంపే ప్రయత్నం జరిగిందని న్యాయమూర్తి నాసిర్ జావేద్ రాణా ఎదుట ఆరోపించారు. ఆమె శరీరంపై గాయాల ఆనవాళ్లు ఉన్నాయని, దీని వెనుక ఎవరి హస్తం ఉందో తనకు తెలుసని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. తన భార్య బుష్రాకు ఏదైనా హాని జరిగితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ బాధ్యత వహించాలని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. షౌకత్ ఖానుమ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అసిమ్ సాయంతో తన భార్యకు వైద్య పరీక్షలు చేయించాలని ఇమ్రాన్ ఖాన్ కోర్టును కోరారు. ఇంతకుముందు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యునిపై తనకు, తన పార్టీకి నమ్మకం లేదని ఇమ్రాన్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విజ్ఞప్తి మేరకు ఆయన భార్య బుష్రా వైద్య పరీక్షలకు సంబంధించి దరఖాస్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణ అనంతరం విలేకరులతో మాట్లాడిన బుష్రా తాను అమెరికన్ ఏజెంట్ అంటూ పార్టీలో వదంతులు వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. తన ఆహారంలో టాయిలెట్ క్లీనర్ చుక్కలు కలిశాయని ఆమె ఆరోపించారు. ఫలితంగా తన కళ్లు వాచిపోయాయని, ఛాతీ, కడుపులో నొప్పితో ఇబ్బంది పడుతున్నానని ఆమె వాపోయారు. బుష్రా బీబీ కస్టడీలో ఉన్నప్పుడు ఆమెపై విషప్రయోగం జరిగిందని పీటీఐ ప్రతినిధి ఒకరు మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేశారు. బుష్రా బీబీని కలుసుకోకూడదంటూ ఆమె కుటుంబ సభ్యులను నిర్బంధించారని, ఈ చర్య రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆయన ఆరోపించారు. -
Marriage law violation: ఇమ్రాన్, ఆయన భార్యకు ఏడేళ్ల జైలు
ఇస్లామాబాద్: అతి త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(71)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామ్ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్న ఆరోపణలపై ఇమ్రాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీ(49)కి ఓ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు పెళ్లిళ్ల మధ్య విరామం పాటించాలనే నిబంధనకు విరుద్ధంగా బుష్రా బీబీ ఇమ్రాన్ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకుందని ఆరోపిస్తూ ఆమె మాజీ భర్త ఖవార్ ఫరీద్ మనేకా కేసు పెట్టారు. వివాహానికి ముందు నుంచే వారిద్దరి మధ్య అక్రమ సంబంధం నడిచిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ కేసుపై ప్రస్తుతం ఇమ్రాన్, బుష్రా బీబీ ఉన్న అడియాలా జైలులోనే 14 గంటలపాటు విచారణ జరిపిన సీనియర్ సివిల్ జడ్జి ఖుద్రతుల్లా.. ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ శనివారం తీర్పు వెలువరించినట్లు జియో న్యూస్ పేర్కొంది. తోషఖానా కేసులో 14 ఏళ్లు, రహస్య పత్రాల కేసులో 10 ఏళ్ల జైలు శిక్షను ఇమ్రాన్‌కు విధిస్తూ ఇటీవలే కోర్టులు తీర్పిచి్చన విషయం తెలిసిందే. ఫెయిత్ హీలర్గా పేరున్న బుష్రాబీబీ వద్దకు తరచూ ఇమ్రాన్ వెళుతుండేవారు. అలా మొదలైన వారిద్దరి మధ్య పరిచయం పరిణయానికి దారి తీసింది. 2018 జనవరి ఒకటో తేదీన ఇమ్రాన్, బుష్రాబీబీల వివాహం ఘనంగా జరిగింది. -
‘నా భర్త ప్రధాని కావడం వాళ్ల అదృష్టం’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా తన భర్త ఎన్నికవడం పాక్ ప్రజల అదృష్టమని ఇమ్రాన్ ఖాన్ సతీమణి బుష్రా మనేకా అన్నారు. ఇమ్రాన్ పెళ్లి చేసుకున్న తర్వాత తొలిసారిగా పాక్ మీడియాతో మాట్లాడిన బుష్రా.. భర్తపై ప్రశంసలు కురిపించారు. పాక్ జాతి పిత మహ్మద్ అలీ జిన్నా, టర్కీ అధ్యక్షుడు రెసీప్ తయ్యీప్ ఎర్డోగన్‌ల వలె ఇమ్రాన్ కూడా గొప్ప నాయకుడని ఆమె వ్యాఖ్యానించారు. ‘ఒక జాతి తలరాతను మార్చాలని నిర్ణయించుకున్నప్పుడే ప్రజల కోసం నిస్వార్థంగా పని చేసేందుకు రాజకీయాలు చేసే వ్యక్తిని కాకుండా ఓ నాయకుడిని దేవుడు పంపిస్తాడు. మహ్మద్ అలీ జిన్నా, ఎర్డోగన్‌ల తర్వాత అలా ప్రజల కోసం జన్మించిన వ్యక్తి నా భర్త ఇమ్రాన్. ఈ ముగ్గురు మాత్రమే నిజమైన నాయకులు. ప్రపంచంలోని మిగలిన వ్యక్తులందరూ రాజకీయాలు చేసేందుకు మాత్రమే ఆసక్తి చూపుతారంటూ’ బుష్రా ఇమ్రాన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. తన దగ్గర మంత్రదండం లేదు! కేవలం ప్రజా సంక్షేమం కోసమే ఇమ్రాన్ ప్రధాని పదవి చేపట్టారన్న బుష్రా.. కేవలం నెలరోజుల్లోనే దేశ స్థితిగతులను మార్చే మంత్ర దండం ఆయన దగ్గర లేదని వ్యాఖ్యానించారు. పాక్ ప్రజలకు ఇప్పుడే శుభకాలం ప్రారంభమైందని.. ఇమ్రాన్ నిలదొక్కుకోవడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి ప్రజలంతా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. కాగా 1992లో పాక్ జట్టుకు క్రికెట్ ప్రపంచ కప్ సాధించిపెట్టిన తర్వాత విపరీతమైన క్రేజ్‌ను పొందిన ఇమ్రాన్.. తొలుత బ్రిటిష్ జర్నలిస్టు జెమీమాను పెళ్లాడారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయిన ఖాన్.. మరో జర్నలిస్టు రేహమ్‌ను(2015లో) రెండో పెళ్లి చేసుకున్నారు. పట్టుమని 10 నెలలైనా గడవకముందే ఆ బంధం కూడా తెగిపోయింది. తర్వాత మత గురువైన బుష్రాను మూడో పెళ్లి చేసుకున్నారు. -
‘ఇమ్రాన్ పచ్చి మోసగాడు, నా ముందే ఆమెతో..!’
లాహోర్ : మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లిపై రెండో భార్య రేహమ్ ఖాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇమ్రాన్ పచ్చి మోసగాడని, వివాహేతర సంబంధాల్లో ఆరితేరాడని ఆరోపించారు. ‘టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేహమ్ పలు సంచలన విషయాలు వెల్లడించారు. మూడో పెళ్లి ప్రకటన ఓ నాటకం : ‘‘నేను భార్యగా ఉన్నప్పుడే అతనికి బుష్రాతో వివాహేతర సంబంధం ఉంది. నా ముందే ఆమెతో చనువుగా ఉండేవాడు. అందుకే 10 నెలలు తిరక్కుండానే అతనికి విడాకులు ఇచ్చేశా. మొన్న ఆదివారం ఇమ్రాన్ మూడో పెళ్లి చేసుకున్నట్లు పీటీఐ పార్టీ ప్రకటించింది. కానీ నిజమేంటంటే.. ఆ తంతు నెలన్నర కిందటే జరిగింది. విచిత్రమేంటో తెలుసా? నా పెళ్లప్పుడు కూడా ఇలానే జరిగింది. మేం పెళ్లి చేసుకున్న రెండు నెలల తర్వాత ఆ ఫొటోలు, ప్రకటనను మీడియాకు ఇచ్చారు. ఇమ్రాన్ లాంటి నీతిమాలిన వ్యక్తిని నా జీవితంలో చూడలేదు’’ అని రేహమ్ వ్యాఖ్యానించారు. కౌంటర్ ఇవ్వబోయి అడ్డంగా బుక్కయ్యారు : రేహమ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలపై స్పందించిన ఇమ్రాన్ అభిమానులు.. కౌంటర్ ఇచ్చేందుకు విఫలయత్నం చేశారు. ‘రేహమ్ వ్యాఖ్యలు వాస్తవాలేనని నమ్ముతున్నారా?’ అని ట్విటర్లో పోల్ క్వశ్చన్ పెట్టారు. ప్రతిగా రేహమ్ సైతం తన దగ్గరున్న ఆధారాలను బయటపెట్టారు. గడిచిన మూడేళ్లుగా ఇమ్రాన్- బుష్రాలు కలిసే ఉంటున్నట్లు స్వయంగా బుష్రా మాజీ భర్తే చెప్పినట్లు పేర్కొన్నన్నారు. ‘ఇమ్రాన్-బుష్రాలు జనవరిలోనే పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం చాలా మందికి తెలుసు. కానీ మొన్ననే పెళ్లైనట్లు పార్టీ ప్రకటించడం దారుణం’ అని నెటిజన్లు సైతం వ్యాఖ్యానించారు. దీంతో ఖంగుతిన్న ఇమ్రాన్ వర్గీయులు ‘వంద మంది కుట్రదారులు వచ్చినా మా గెలుపును ఆపలేరు’అంటూ కవరింగ్ ఇచ్చారు. 1992లో పాక్ జట్టుకు క్రికెట్ ప్రపంచ కప్ సాధించిపెట్టిన తర్వాత విపరీతమైన క్రేజ్‌ను పొందిన ఇమ్రాన్.. తొలుత బ్రిటిష్ జర్నలిస్టు జెమీమాను పెళ్లాడారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయిన ఖాన్.. జర్నలిస్టే అయిన రేహమ్‌ను(2015లో) రెండోపెళ్లి చేసుకున్నారు. పట్టుమని 10 నెలలైనా గడవకముందే ఆ బంధం కూడా తెగిపోయింది. ఇప్పుడు తాజాగా మత గురువైన బుష్రాను మూడో పెళ్లి చేసుకురు. -
'నా భర్త చాలా అమాయకుడు'
బెంగళూరు: 'తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో ఇంట్లోకి వచ్చిన వ్యక్తులు నా భర్త తలకు గన్ పెట్టి బెదిరించారు. వారు మేం ఢిల్లీ పోలీసులం అని చెప్పారు కానీ ఎలాంటి ప్రూఫ్ చూపించనే లేదు. నన్నూ తుపాకితో బెదిరించి ఆయుధాలు ఎక్కడున్నాయ్ అని అడిగారు. ఎలాంటి అరెస్ట్ వారెంట్, సెర్చ్ వారెంట్ లేకుండానే ఇంట్లోకి వచ్చి నా భర్తను తీసుకెళ్లారు. నా భర్త చాలా చాలా అమాయకుడు' అని ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అరెస్టైన బెంగళూర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్.. అఫ్జల్ భార్య బష్రా మీడియాతో వాపోయింది. దేశ వ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న పలువురిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బెంగళూరులో అఫ్జల్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు విచారిస్తున్నారని కర్నాటక హోం మంత్రి పరమేశ్వర తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారం మేరకు దేశవ్యాప్తంగా భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.